Search
  • Follow NativePlanet
Share
» »ఈ ‘నాగరాజ ఆలయం’లో ఊయల కడితే మీ కడుపు పంట పండినట్లే, ఎందుకంటే

ఈ ‘నాగరాజ ఆలయం’లో ఊయల కడితే మీ కడుపు పంట పండినట్లే, ఎందుకంటే

నాగర్ కోయిల్ లోని నాగరాజ దేవాలయం గురించి కథనం.

నాగపంచమి దగ్గరకు వస్తోంది. దీంతో దేశంలో నాగరాజు ప్రధాన దైవంగా ఉన్న దేవాలయాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వెళ్లి తమ కోర్కెలు తీర్చమని పూజిస్తుంటారు. ఈ నాగరాజు దేవాలయాలు అటు ఉత్తర
భారత దేశంతో పాటు ఇటు దక్షణ భారత దేశంలోనూ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అయితే ఇందులో అత్యంత ప్రాచూర్యం పొందిన దేవాలయాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.

అందులోనూ సంతాన సాఫల్యం కలిగించే నాగరాజు ఆలయాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వెలుతుంటారు. అందులో ఒకటి మన పొరుగు రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడ గర్భగుడికి పక్కన ఉండే చెట్టుకు ఊయల ముడుపుగా కడితే సంతానం కలుగుతుందని నమ్ముతారు.

అందుకే నాగపంచమి సందర్భంగా సంతానలేమితో బాధపడేవారు ఎక్కువ సంఖ్యలో అక్కడకు వెలుతుంటారు. ఈ నేపథ్యంలో ఆ ఆలయ విశేషాలకు సంబంధించిన కథనం మీ కోసం....

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ ఆలయం

P.C: You Tube
తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కన్యాకుమారికి కేవలం 21 కిలోమీటర్ల దూరంలోనే నాగర్ కోయిల్ పట్టణం ఉంది. ఈ పట్టణంలో అత్యంత ప్రాచీనమైన నాగరాజ దేవాలయం ఉంది.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం నిర్మాణం ఎప్పుడు జరిగిందనడానికి సరైన ఆధారాలు లేవు. అయితే అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చేర, చోళ, పాండ్య రాజ్య వంశానికి చెందిన వారందరూ ఈ దేవాలయం అభివ`ద్ధికి ఎంతో క`షి చేశారు.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం అనేక అద్భుతాలకు నిలయం. ఇక్కడ ముఖ్యంగా ఇద్దరు దేవతలు ఉంటారు. ఒకరు శ్రీ క`ష్ణుడు కాగా మరొకరు నాగరాజు. శ్రీ క`ష్ణుడిని ఆనంద క`ష్ణుడి పేరుతో కొలుస్తారు.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

ఇక నాగరాజును సర్పరాజు వాసుకిగా భావిస్తారు. వీరిద్దరే కాకుండా ఈ దేవాలయంలో శివుడు, సుబ్రహ్మణ్యస్వామి, వినాయకుడు, దేవి తదితరుల ఉపాలయాలు కూడా చూడవచ్చు.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

నాగరాజ గుడి ముందు భాగంలో పెద్ద కోనేరు ఉంది. ఇందులో భక్తులు స్నానాలు చేసి నాగరాజును దర్శించుకొంటారు. కోనేరు పక్కనే పెద్ద అశ్వర్థకట్ట ఉంది.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

ఈ కట్ట పై ఎక్కువ సంఖ్యలో నాగరాజ ప్రతిమలు ఉన్నాయి. కేవలం ఈ అశ్వర్థ కట్ట పైనే కాకుండా ఆలయం మొత్తం మీద ఎన్నో నాగరాజు ప్రతిమలు ఉన్నాయి.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

ఇక్కడ నాగరాజ ప్రతిమను ప్రతిష్టచేసి, ఆలయంలోని చెట్టుకు ఊయల ముడుపుగా చెల్లిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని స్థానిక భక్తుల నమ్మకం.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

అందుకే ఈ దేవాలయాన్ని సందర్శించడానికి కేవలం తమిళనాడు ప్రజలే కాకుండా దక్షిణాదికి చెందిన వివిధ రాష్ట్రాల భక్తులు ఇక్కడికి నిత్యం వస్తుంటారు.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

నాగరాజ గర్భాలయంలో ఊటనీటిని భక్తులకు తీర్థంగా ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. ఈ నీటి ఊటలోని ఇసుక ఏడాదిలో సగభాగం తెల్లగా మిగిలిన సగభాగం నల్లగా ఉంటుంది.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయంలో తరతరాలుగా నంబూద్రీ బ్రాహ్మణులే అర్చకులుగా విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. ఈ దేవాలయం ప్రతి రోజూ తెల్లవారుజాము 4 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 వరకూ సందర్శించుకోవచ్చు. అటు పై సాయంత్రం 5 గంటల నుంచి 8.30 గంటల వరకూ సందర్శించుకోవచ్చు.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం నిర్మాణం వెనుక ఉన్న కథనం ప్రకారం ఒకరోజు ఒక బాలిక ప్రస్తుతం దేవాలయం ఉన్న చోట గడ్డి కోస్తూ ఉంటుంది. అప్పుడు కొడవలికి రక్తం అంటుకుంటుంది.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

ఆశ్చర్యంతో చూడగా ఐదు పడగల పాము విగ్రహం కలనిపిస్తుంది. భయంతో దగ్గర్లోని ఊరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. దీంతో గ్రామస్తులు వచ్చి చూడగా వారికి నిజమైన ఐదు పడగల పాము కనిపిస్తుంది.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

దీంతో భక్తిశ్రద్ధలతో అక్కడ చిన్న గుడి కట్టి ఆ దేవతలను పూజించడం మొదలుపెడుతారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు కుష్టువ్యాధితో బాధపడుతున్న స్థానిక రాజు ఈ ప్రాంతం వద్దకు వచ్చి తన బాధను చెప్పుకొన్నాడు.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

ఆశ్చర్యంగా ఆయన వ్యాధి మొత్తం అప్పటికప్పుడు తగ్గిపోయింది. దీంతో రాజు నాగరాజుకు పరమ భక్తుడైపోయాడు. అటు పై ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించాడని చెబుతురు.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

నాగర్ కోయిల్ పట్టణంలో ఏలాకులు, లవంగాల తోటలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఈ తోటల ప్రాంతానికి చేరుకోగానే ఏలకుల సువాసన గుబాళిస్తుంది.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

నాగర్ కోయిల్ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒలకరువి జలపాతాలు ప్రసిద్ధి చెందినవి. ఈ జలపాతాలు దివ్య ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు. ముఖ్యంగా చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఇక్కడ స్నానం చేస్తే ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు.

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

నాగర్ కోయిల్ నాగరాజ దేవాలయం

P.C: You Tube

త్రివేండ్రం ఎయిర్ పోర్ట్ నుంచి నాగర్ కోయిల్ కు 80కిలోమీటర్లు. అదే విధంగా కన్యాకుమారి రైల్వేస్టేషన్ నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్లు, త్రివేండ్రం, కన్యాకుమారి, తిరునల్వేలి పట్టణాల నుంచి రోడ్డు మార్గం ద్వారా సులభంగా నాగర్ కోయిల్ కు చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X