Search
  • Follow NativePlanet
Share
» »సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే మహిమాన్విత సర్ప దేవాలయం

సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే మహిమాన్విత సర్ప దేవాలయం

మన భారతదేశంలో ఒక్కొక్క దేవాలయం దానికదే మహిమకలిగి వుంది. అయితే సంవత్సరానికి కొన్ని రోజులు మాత్రమే దేవాలయం యొక్క ద్వారాన్ని తెరుస్తారు అని అనేక దేవాలయాల గురించి మీరు ఇంతకు ముందే తెలుసుకుని వున్నారు.

By Venkatakarunasri

మన భారతదేశంలో ఒక్కొక్క దేవాలయం దానికదే మహిమకలిగి వుంది. అయితే సంవత్సరానికి కొన్ని రోజులు మాత్రమే దేవాలయం యొక్క ద్వారాన్ని తెరుస్తారు అని అనేక దేవాలయాల గురించి మీరు ఇంతకు ముందే తెలుసుకుని వున్నారు.అయితే సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే దేవాలయాలు తెరవటం గురించి మీకెంత తెలుసు.

ఆశ్చర్యం ఏమంటే అటువంటి దేవాలయాలు కర్ణాటక రాష్టంలో కూడా వున్నాయి. అదేవిధంగా ఇంకొక దేవాలయం ఏదంటే ఉజ్జయినిలో వున్న ఒక సర్ప దేవాలయం. అట్లయితే వ్యాసం మూలంగా ఆ 2 దేవాలయాల గురించి సమాచారాన్ని పొందండి.

సంవత్సరానికి కేవలం ఒక రోజు మాత్రమే తెరిచే ఆ దేవాలయానికి ఏమైనా విశేషం వుండేవుండాలి కదా?అట్లయితే ఆ విశేషం ఏమిటి?అనే దాని గురించి తెలుసుకోండి.

ఉజ్జయిని దేవాలయం

ఉజ్జయిని దేవాలయం

ఈ ఉజ్జయినిలో వున్న నాగచంద్రేశ్వర దేవాలయం సంవత్సరంలో ఒక రోజు మాత్రం తెరిచివుంచుతారు. ఆ దేవాలయం విశిష్టతను ఒక్కసారి తెలుసుకుందాం. పేరులో సూచించినట్లే ఇక్కడ వుండేది నాగ సర్పాలు. మన హిందూధర్మంలో నాగులకు దాని స్వంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. భక్తులు అత్యంత శ్రద్ధ, భక్తితో నాగదేవతలను పూజిస్తారు.

PC:youtube

ఉజ్జయిని దేవాలయం

ఉజ్జయిని దేవాలయం

నాగులను మన హిందూ దేవతలకు ఆభరణాలుగా అలంకరిస్తారు. మన భారతదేశంలో అనేక నాగాదేవతలయొక్క పుణ్య క్షేత్రాలు వున్నాయి. వాటిలో ముఖ్యమైనది మరియు విభిన్నమైనది ఏదంటే ఉజ్జయినిలోని నాగాచంద్రేశ్వర దేవాలయం. ఉజ్జయినిలోని మహాకాలమందిరంలో వున్న 3 వ అంతస్తులో నాగచంద్రేశ్వర దేవాలయం ఉంది.

PC:youtube

ఉజ్జయిని దేవాలయం

ఉజ్జయిని దేవాలయం

ఈ విభిన్నమైన మరియు విశేషమైన దేవాలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరవబడుతుంది. ఆ రోజు ఏదంటే శ్రావణ శుక్ల పంచమి రోజున మాత్రమే. ఆ ఒక్క రోజు మాత్రం భక్తులకు దేవాలయంలో ప్రవేశం వుంటుంది. ఆ ఒక్క రోజు సర్పరాజుగా భావించే తక్షకా ఆ ఆలయంలో ఉంటాడని భక్తుల నమ్మకం.

PC:youtube

ఉజ్జయిని దేవాలయం

ఉజ్జయిని దేవాలయం

నాగచంద్రేశ్వర దేవాలయంలో 11వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన విగ్రహం ఉంది. ఇందులో పడగ ఎత్తిన పాము విగ్రహం మీద కూర్చున్న శివుడు, పార్వతీ విగ్రహాలను చూడవచ్చును.ఈ విగ్రహాన్ని నేపాల్ నుండి తీసుకురాబడిందని చెప్పవచ్చును.

PC:youtube

ఉజ్జయిని దేవాలయం

ఉజ్జయిని దేవాలయం

ఉజ్జయిని వదిలితే ఇలాంటి విగ్రహం ప్రపంచంలోనే వేరెక్కడా లేదు. సాధారణంగా నాగ సర్పం మీద శ్రీ మహా విష్ణువు మాత్రం పవళిస్తారు. అయితే పరమశివుడు పవళించిన దాఖలాలు ఎక్కడా, ఎప్పుడూ వినివుండం. అయితే ఉజ్జయినిలో ప్రపంచంలో వేరెక్కడా చూడనటువంటి విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చును.

PC:youtube

ఉజ్జయిని దేవాలయం

ఉజ్జయిని దేవాలయం

నాగ సర్పం యొక్క ఆసనం మీద కేవలం శివపార్వతులే కాక ముద్దుల కొడుకు గణపతి కూడా వుండటాన్ని చూడవచ్చును. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి 2కళ్ళు చాలవు.

PC:youtube

ఉజ్జయిని దేవాలయం

ఉజ్జయిని దేవాలయం

నాగ సర్పం మీద మహాశివుడు పవళించటం వెనక ఒక అందమైన కథ కూడా ప్రచారంలో వుంది.అదేమంటే సర్పాకారంలో వున్న తక్షకుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం కఠినమైన తపస్సును ఆచరించెను. ప్రత్యక్షమైన మహాశివుడు తక్షకునికి అమరత్వాన్ని ప్రసాదించెను.

PC:youtube

ఉజ్జయిని దేవాలయం

ఉజ్జయిని దేవాలయం

అప్పటి నుండి తక్షకుడు శివుని సమక్షంలోనే ఉన్నాడని చెప్తాడు.1050 వ సంలో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించెను. తదనంతరం సింధియావంశానికి చెందిన రాణోజీమహారాజ్ దేవాలయాన్ని జీర్ణోద్ధారణ చేసెను. ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శించుకునే భాగ్యం కలిగితే చాలు సర్పదోషాలన్నీ తొలగిపోతాయి.

PC:youtube

ఉజ్జయిని దేవాలయం

ఉజ్జయిని దేవాలయం

అదే విధంగా నాగపంచమిరోజున ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. నాగచంద్రేశ్వరుని దర్శించి పునీతులవుతారు.ఈ ఒక్కరోజే సుమారు 2లక్షలకన్నా ఎక్కువ మంది దేవాలయాన్ని సందర్శిస్తారు.

PC:youtube

ఉజ్జయిని దేవాలయం

ఉజ్జయిని దేవాలయం

ఎక్కడ వుంది?

ఈ మహిమాన్విత దేవాలయం మధ్యప్రదేశ్ లో వుంది.సమీప విమానాశ్రయం ఇండోర్ విమానాశ్రయం. ఇక్కడ నుంచి దేవాలయానికి కేవలం 55కిమీ ల దూరంలో వుంది.భోపాల్ విమానాశ్రయం 172కిమీ దూరంలో వుంది.

PC:youtube

కర్ణాటకలోని హాసనాంభ దేవాలయం

కర్ణాటకలోని హాసనాంభ దేవాలయం

సంవత్సరానికి ఒక్క సారి తెరిచే మహిమాన్విత దేవాలయం కర్ణాటకలోని హసన్ జిల్లాలో కూడా వుంది. ఆ మహిమాన్విత దేవాలయం హాసనాంభ దేవాలయం.బెంగుళూరి నుంచి ఈ దేవాలయానికి సుమారు 185కిమీ దూరంవుంది.సుమారు 3గంలు కాలం ప్రయాణించవలసి వుంటుంది.

PC:youtube

కర్ణాటకలోని హాసనాంభ దేవాలయం

కర్ణాటకలోని హాసనాంభ దేవాలయం

ఈ హాసనాంభ దేవాలయాన్ని క్రీశ 12వ శతాబ్దంలో నిర్మించారు.అత్యంత ప్రాచీనమైనది అని చెప్పవచ్చును.ఇక్కడి గర్భగుడిలో హాసనాంభ అనే దేవతను భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ దేవాలయాన్ని సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. ఆ విశేషమైన రోజు ఏదంటే దీపావళి పండుగ రోజు.దీపావళి పండుగ సమయంలో ఒక రోజు మాత్రం దేవాలయాన్ని తెరుస్తారు.

PC:youtube

కర్ణాటకలోని హాసనాంభ దేవాలయం

కర్ణాటకలోని హాసనాంభ దేవాలయం

దీపావళి రోజు మాత్రం తెరిచే ఈ దేవాలయం సంవత్సరమంతా మూసివుంటుంది.ఆశ్చర్యం ఏమంటే ఈ దేవాలయంలో దీపం వెలిగేది.ఇందులో ఏమి విశేషం అని అనుకుంటున్నారా?ఇక్కడి ఆశ్చర్యకరమైన సంగతి ఏమంటే హాసనాంభ దేవాలయ గర్భగుడిలో దీపాన్ని వెలిగించి అక్కడినుంచి పూజారులు వెళ్ళిపోతారు.

PC:youtube

కర్ణాటకలోని హాసనాంభ దేవాలయం

కర్ణాటకలోని హాసనాంభ దేవాలయం

దీపాన్ని వెలిగించిన ఒక్క సంవత్సరానికి అంటే మరొక దీపావళి రోజున దేవాలయ గర్భ గుడి వాకిలిని తెరవగానే గత సంవత్సరం వెలిగించిన దీపం ఇంకా అలాగే వెలుగుతూనే వుంటుంది. నూనెలో వెలిగించిన దీపం తల్లి గర్భగుడిలో ఒక సంవత్సరకాలం వెలుగుతూనేవుండటానికి ఏ శక్తి సహాయం చేసిందనేది ఆ హాసనాంభదేవికి ఒక్కరికే తెలుసు.

PC:youtube

కర్ణాటకలోని హాసనాంభ దేవాలయం

కర్ణాటకలోని హాసనాంభ దేవాలయం

రైలు మార్గం

హాసనాంభ దేవాలయానికి సమీప స్టేషన్ ఏదంటే హరసికెరె రైల్వే స్టేషన్.ఇక్కడి నుండి 38 కి.మీ దూరంలోవుంది.

రహదారిమార్గం

బెంగుళూరు నుంచి హాసన్ కి నేరుగా ప్రైవేట్ మరియు ప్రభుత్వబస్సు సౌకర్యం వుంది.మైసూరు నుంచి 115కి.మీ ల దూరం, బెంగుళూరు నుంచి 172కి.మీ ల దూరంలోవుంది.

విమాన మార్గం

సమీపంలోని విమానాశ్రం ఏదంటే అది మైసూరు విమానాశ్రం.ఇక్కడనుండి హాసన్ కి హాసన్ కి సుమారు 136కి.మీ దూరం వుంది.

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

మీ జీవితంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విభిన్నమైన శివలింగాలు !మీ జీవితంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విభిన్నమైన శివలింగాలు !

దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి ఇది ఒక మంచి నిదర్శనం.....దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి ఇది ఒక మంచి నిదర్శనం.....

చనిపోయిన వారిని బ్రతికించే పవిత్రమైన స్థలమిది...చనిపోయిన వారిని బ్రతికించే పవిత్రమైన స్థలమిది...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X