Search
  • Follow NativePlanet
Share
» »అక్కడి అమ్మవారికి ఒక్క ఎర్రని వస్త్రం సమర్పిస్తే చాలు మనస్సులోని కోరికలు నెరవేరుతాయి

అక్కడి అమ్మవారికి ఒక్క ఎర్రని వస్త్రం సమర్పిస్తే చాలు మనస్సులోని కోరికలు నెరవేరుతాయి

అక్కడి అమ్మవారికి ఎర్రనివస్త్రం సమర్పిస్తే చాలు మనోభీష్టం తప్పక నెరవేరుతుంది.

వెండిలా తళతళా మెరిసిపోయే హిమాలయాల పర్వత శ్రేణులను సందర్శించడానికి అటు ఆధ్యాత్మిక భక్తులతో పాటు ఇటు పర్యాటక ప్రియులు కూడా ఉవ్విళూరుతుంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బహుశా అందుకే కాబోలు, దేశానికి పర్యాటకరంగం నుంచి ఆదాయం చేకూర్చే రాష్ట్రాలలో హిమాచల్‌ ప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. వివిధ క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడగల ఆచారవ్యవహారాలు తెలుసుకోవడం పర్యాటకులు అమితాసక్తి. అక్కడి ప్రధాన దైవాన్ని విశ్వసించే భక్తులు మొక్కుకునే తీరు ... మొక్కుబడులు చెల్లించుకునే పద్ధతులు మిగతా ప్రాంతాలవారికి కాస్త కొత్తగా అనిపిస్తుంటాయి ... ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి అనుభూతిని కలిగించే క్షేత్రంగా మనకి 'నైనితాల్' కనిపిస్తుంది. నైనితాల్ ను లేక్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ ఇండియా' అని పిలుస్తారు.

దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం హిమాచల్ ప్రదేశ్ లోని నయనాదేవి ఆలయం. నయనాదేవి ఆలయం భారత దేశంలో ఉన్న ప్రసిద్ధ సతీదేవి పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ' బిలాస్ పూర్ ' జిల్లాలో రాష్ట్ర రాజ్యమార్గం 21 మీద ఆనందపూర్ సాహెబ్ కు ఉత్తరంగా 15 కి.మీ. దూరంలో ఈ నైనాదేవి ఆలయం ఒక చిన్న పర్వతశిఖరంపై ఉంది. కొండ క్రింద నైనాదేవి అనే పేరుతోనే ఒక చిన్న గ్రామం కూడా ఉంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం సతీదేవి యొక్క కళ్ళు ఈ ప్రదేశంలోనే పడటం వల్ల ఇక్కడ ఉన్న ఈ అమ్మవారి పేరు నయనాదేవి అని పిలువబడుతుంది. ఈ దేవి కండ్లకి స్వస్థత కలిగించే దేవిగా ప్రసిద్ధిచెందింది. మరి ఈ ఆలయ ప్రత్యేకత గురించి, అమ్మవారి కళ్ళు ఈ పర్వత శిఖరంపై ఎందుకు పడ్డాయో తెలుసుకుందాం...

 ఆలయం వెనుక పురాణగాథ

ఆలయం వెనుక పురాణగాథ

ఆ ఆలయం వెనుక పురాణగాథ ఉంది. నయనా దేవి తండ్రి దక్షుడు ఆచరిస్తున్న దక్షయజ్ఞంలో తన భర్త పరమేశ్వరుడికి జరిగిన అవమానాన్ని భరించలేక యజ్ఞం గుండంలో దూకి సతి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ విషయం తెలిసి ఆగ్రహావేశాలకు లోనై, ఆవేదన భరించలేని ఆ పరమేశ్వరుడు సతి మృతదేహంతో తాండవం చేస్తాడు. ఆ పరమ శివుడి కోపాగ్ని నుంచి భూమిని కాపాడేందుకు... విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతి భౌతిక కాయాన్ని ముక్కలుగా ఖండన చేస్తాడు. సతీదేవి శరీరంలో ఒక్కో ముక్క ఒక్కో ప్రదేశంలో పడ్డాయని, అవన్నీ శక్తి పీఠాలుగా మారాయని పురాణ గాథ. 52 శక్తిపీఠాల్లో ఒకటిగా నైనితాల్ చెప్పబడుతోంది. బిలాస్ పూర్ ' జిల్లాలో రాష్ట్ర రాజ్యమార్గం 21 మీద ఆనందపూర్ సాహెబ్ కు ఉత్తరంగా 15 కి.మీ. దూరంలో సతి కళ్లు పడటంవల్లే ఇక్కడి దేవికి ‘నయనా దేవి' క్షేత్రం అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది.

Photo Courtesy:Ekabhishek

సతీ దేవీ కళ్ళు పడిన ప్రదేశం

సతీ దేవీ కళ్ళు పడిన ప్రదేశం

సతీ దేవీ కళ్ళు పడిన ప్రదేశంలోనే అప్పటి నుండి రాయిగా పడి వున్న అమ్మవారు కలియుగంలో రాజా బీర్చంద్ రాజ్యంలో ఓ పశువుల కాపరి తన గోవులను అడవికి తీసుకెళ్ళి మేపేవాడు. అయితే ఒక గోవు పాలు ఇవ్వడం తగ్గించింది, ప్రతి నిత్యం క్షీరాన్ని ఓ రాతి మీద విడవడం చూస్తాడు కాని గోవు యెందుకు అలా చేస్తున్నది తెలియక కలవరపడగా ఓ రాత్రి అతని స్వప్నము లో అమ్మవారు కనిపించి తన ఉనికి తెలియజేస్తుంది . పశువులకాపరి తన స్వప్న వృత్తాంతమును రాజుకు వివరంచగా అతను కూడా స్వయంగా వచ్చి చూసి ఆ లింగాకారములో అమ్మవారు కొలువున్నదని తెలుసుకొని అక్కడే మందిర నిర్మాణం చేసేడు . 15 వ శతాబ్దం లో రాజా బీర్ సింగ్ యీ మందిర నిర్మాణం చేసేడని చరిత్ర .

P.C: You Tube

అమ్మవారికి ' నయనాదేవి ' గా స్తుతిస్తారు

అమ్మవారికి ' నయనాదేవి ' గా స్తుతిస్తారు

సతీదేవి కన్ను పడ్డ ప్రదేశం కావడం వల్ల అమ్మవారిని ' నయనాదేవి ' గా స్తుతిస్తారు. సాధారణంగా అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్న భక్తులు, తాము అనుకున్నది నెరవేరగానే కృతజ్ఞతా పూర్వకంగా ఆ తల్లికి వెండి .. బంగారు నేత్రాలను సమర్పిస్తుంటారు. ఇక చాలామంది భక్తులు తమ మనసులోని కోరికను అమ్మవారికి చెప్పుకుని అది నెరవేరడం కోసం, అమ్మవారి మందిరానికి ఎదురుగా గల చెట్టుకి 'ఎర్రని వస్త్రం' కడుతుంటారు. తరతరాలుగా ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ గుడిలో ఉండే రావిచెట్టు నింగికి నేలకు నిచ్చెనవేసినట్టుగా ఎత్తుగా ఉంటుంది. ఇలా అమ్మవారికి ఎదురుగా గల ఈ చెట్టుకి ఎర్రని వస్త్రాన్ని కట్టడం వలన మనోభీష్టం తప్పక నెరవేరుతుందని అంటారు. అమ్మవారి సన్నిధిలో గల చెట్టుకి ఎర్రని వస్త్రాన్ని సమర్పించే భక్తుల సంఖ్యను చూస్తే, అమ్మవారి పట్ల ... ఆచారం పట్ల వారికి గల విశ్వాసం ఎంత బలమైనదనే విషయం స్పష్టమవుతుంది.

P.C: You Tube

నయనాదేవి కోవెల హిందువులకే కాదు సిక్కులు కూడా

నయనాదేవి కోవెల హిందువులకే కాదు సిక్కులు కూడా

నయనాదేవి కోవెల హిందువులకే కాదు సిక్కులు కూడా పవిత్రమైనదే, యెలా అంటే సిక్కుల పదవ గురువైన ' గురు గోవిందసింగు ' మొగలులతో యుధ్దానికి వెళ్లేటప్పుడు నయనా దేవి మందిరంలో యజ్ఞం చేసుకొని వెళ్లి విజయుడై వచ్చేడు , అప్పటినుంచి ముఖ్య మైన పనులమీద వెళ్లేటప్పుడు సిక్కులు నయనాదేవికి మొక్కుకొని వెళ్లడం అలవాటు , విజయం పొందిన తరువాత అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడం వీరి అలవాటు .

P.C: You Tube

నైనా దేవి మందిర పరిసరాలలో దర్శనీయ స్థలాలు

నైనా దేవి మందిర పరిసరాలలో దర్శనీయ స్థలాలు

నైనిటాల్ సరోవరం-మానస సరోవరం: గోవింద సాగర్ సరస్సు:
గోవిందసాగర్ సరస్సు:కొండ పైనుంచి చూస్తే దిగువున వున్న గోవిందసాగర్ కనువిందు చేస్తుంది . అమ్మవారిని దర్శించుకున్న తరువాత ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. నైనా దేవి మందిరం నుంచి సుమారు 17 కిలో మీటర్లదూరంలో వున్న మానవనిర్మిత మంచి నీటి సరస్సు యిది . సెట్లజ్ నది పైన ప్రపంచంలో అతి యెత్తైన ఆనకట్ట యైన బాక్రా నంగల్ ని నిర్మించేటప్పుడు ఆనకట్ట లోకి చేరే నీటిని నియత్రించేందుకు నిర్మించిన సరస్సు యిది . దీని పొడవు సుమారు56 కిలో మీటర్ల పొడవు 3 కిలో మీటర్ల వెడల్పు కలిగి సెట్లజ్ మరియు బియాస్ నదులను కలుపుతూ వున్న సరస్సు . పదవ సిక్కు గురువైన గురుగోవింద్ గౌరవార్ధం ఈ సరస్సును ' గోవింద సాగర్ ' అనే పేరు పెట్టేరు . ఈ సరస్సు హిమాచల్ లోని బిలాస్పూర్ , ఊనా రెండు జిల్లాలను కలుపుతూ వుంది .

Photo Courtesy : wikimedia.org

స్నో వ్యూ

స్నో వ్యూ

నైనిటాల్ టౌన్‌కు 2.5 కి.మీ. దూరంలో స్నో వ్యూ ఏరియా ఉంటుంది. ఇక్కడికి చేరడానికి కూడా రోప్‌వే ఉంది. షేర్ కా దండ అనే కొండ మీద ఈ వ్యూ పాయింట్ ఉంది. స్నో వ్యూ నుండి హిమాలయాల అందాలు అద్భుతంగా కనపడతాయి. నైనా శిఖరాని చైనా శిఖరం అని కూడా అంటారు. ఇది నైనిటాల్ లో ఎత్తైన శిఖరం. ఇది సముద్ర మట్టానికి 2611 మీ. ల ఎత్తున కలదు.

Photo Courtesy : nainital.nic.in

ఎత్తైన శిఖరం -టిపిన్‌టాప్

ఎత్తైన శిఖరం -టిపిన్‌టాప్

నైనా నైనిటాల్ లో ఎత్తైన శిఖరం. ఇది సముద్ర మట్టానికి 2611 మీ. ల ఎత్తున కలదు. దీనిని చేరాలంటే, గుర్రం పై వెళ్ళాలి .టిఫిన్ టాప్ లేదా డొరొతి సీట్ అనేది ఒక పిక్నిక్ ప్రదేశం ఇక్కడ టూరిస్టులు ఎంతో వినోదంతో సమయం గడపవచ్చు. డొరొతి అనేది ఒక ఇంగ్లీషు ఆర్టిస్ట్ భార్య పేరు. ఈమె విమాన ప్రమాదంలో మరణించినందున ఆమె జ్ఞాపకార్థం ఈ డొరొతిసీట్‌ను ఏర్పాటుచేశారు.

Photo Courtesy: Nainital Tourism

ఇకొకేవ్ గార్డెన్

ఇకొకేవ్ గార్డెన్

పర్యావరణ ప్రేమికులను అమితంగా ఆకర్షించే ఇకొకేవ్ గార్డెన్ ఉంది. పారాగ్లైడింగ్, బోట్ హౌస్‌క్లబ్ మరో ఆకర్షణ. ఇక్కడ జరిగే యాచింగ్ చూడడానికి,పాల్గొనడానికి ఎందరో ఔత్సాహికులు ఉర్రూతలూగుతుంటారు. ఇక్కడ ఉన్న కొండ ప్రాంతాలలో ట్రెకింగ్ చేయడానికి సదుపాయాలున్నాయి. ఆసక్తిగలవారు వాటిని వినియోగించుకోవచ్చు.

Photo Courtesy: Nainital Tourism

 కాలా జోహార్ -

కాలా జోహార్ -

మహిషాసురుని సైన్యాధికారి చికాసురుడు మరణించిన ప్రదేశం లో ఏర్పడ్డ సరస్సు . యీ సరస్సు నీటికి చర్మ రోగాలు పోగొట్టే శక్తి వుందని స్థానికులు నమ్ముతారు . సంతానము లేని వారు యీ సరస్సులో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనేది యిక్కడి వారి నమ్మకం . యీ మందిర సమీపం లో పెద్ద మర్రి చెట్టు వుంది .కొన్ని వందల సంవత్సరాలుగా యీ చెట్టు వుందని అంటారు .నైనాదేవి మందిరం లో శ్రావణ అష్ఠమి రోజు ప్రత్యెక ఉత్సవం నిర్వహిస్తారు . దసరా నవరాత్రులు , వసంత నవరాత్రులు విశేషం గా జరుపుతారు . నవరాత్రులలో దేశం నలుమూలలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించు కుంటారు .

P.C: You Tube

ఖర్పతాల్ లేక్:

ఖర్పతాల్ లేక్:

ఇక్కడ ఉన్న పర్యాటక ఆకర్షణలలో మొదటగా చెప్పుకోవాల్సింది ఖర్పతాల్ లేక్. ఈ ప్రాంతాన్ని ల్యాండ్ ఎండ్ ప్రదేశం అని పిలుస్తారు. ఇక్కడి ఆకుపచ్చని శోభకుతోడు పరిసరాలలో నిండి ఉన్న కొండలు, కోనలు, కనుమలు హృదయాన్ని ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతానికి చేరడానికి రోప్‌వే ఉంది. 705 మీటర్ల దూరం కవర్ చేస్తుంది. 300 మీటర్ల ఎత్తున ఈ ప్రయాణం సాగుతుంది. 12 మందిని తీసుకువెళ్ళే ఈ కార్ సెకనుకు 6 మీటర్ల దూరం కదులుతుంది. అద్భుతాలు చూడాలంటే ఈ రోప్‌వేలో ఒకసారి ప్రయాణించాలి.

Photo Courtesy: Abhishek gaur70

కృపాలి కుండం

కృపాలి కుండం

మహిషాసురుని వధించేటప్పుడు దుర్గాదేవి మహిషాసురుని రెండుకళ్ళు పీకి విసిరివేయగా అవి నైనా పర్వతానికి సుమారు రెండు కిమీ దూరంలో పడి రెండు సరస్సులుగా మారేయి అవి 1) బమ్ కి బావడి లేక జీరా కి బావరడి , 2) భుభక్ బావడి . నైనా దేవి దర్శనానికి ముందు యీ సరస్సులో భక్తులు స్నానం చేస్తారు . మహిషాసురుని శిరస్సు పడ్డ ప్రదేశంలో బ్రహ్మ మహిషాసురుని కోరిక మేరకు యీ సరస్సుని సృష్ఠించేడు .

Photo Courtesy : wikimedia.org

గుహ

గుహ

కోవేలకి ఎదురుగా 70 అడుగుల పొడవైన నైనా గుహ చూడదగ్గది .ఇకోగుహ గార్డెన్ తప్పక చూడదగ్గది. ఇవి సహజంగా ఏర్పడిన ఆరు అండర్‌గ్రౌండ్ గుహలు. ఈ గుహలను కలిపే మార్గాలు బాగా ఇరుకుగా ఉంటాయి. కొన్నిచోట్ల పాకితే తప్ప లోనికి చేరుకునే పరిస్థితి ఉండదు.

Photo Courtesy : Vipin Vasudeva

పర్యాటకులకు బోటింగ్ , ఫెర్రీ

పర్యాటకులకు బోటింగ్ , ఫెర్రీ

సాధారణ పర్యాటకులకు బోటింగ్ , ఫెర్రీ మొదలయినవి అందుబాటులో వున్నాయి . ఈ సరస్సులో ఎక్కువగా ఫిషింగ్ చేస్తూవుంటారు . సుమారుగా ఈ సరస్సులో 51 రకాలయిన చేపలు వున్నాయి . ప్రశాంతమైన పరిసరాలలో , పచ్చని అడవుల మధ్య వున్న సరస్సు మనస్సును ప్రశాంతంగా మార్చుతుంది. నిజ జీవితంలో వుండే ఒత్తిడిలను మరచి పోయేట్టు చేసి కొత్త జన్మ యెత్తినట్లు అనుభూతిని కలిగించే ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించండి.

PC: lensnmatter

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

హైదరాబాద్ నుంచి నైనిటాల్‌కు 1,637కి.మీ దూరం. ఇక్కడికి చేరుకోడానికి నేరుగా రైళ్ళుగానీ, విమా నాలుకానీ, బస్సులుగానీ లేవు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వస్తే అక్కడి నుంచి బస్సులో నైనిటాల్‌కు చేరుకోవచ్చు.

రైల్లో చేరుకోవాలనుకునే వారు ఢిల్లీకి మొదలు చేరుకుని అక్కడి నుంచి బస్సులో నైనిటాల్‌కు చేరుకోవచ్చు.

PC: Vipin8169

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X