Search
  • Follow NativePlanet
Share
» » నంజంగుడ్ లో ...శివ మహిమలు !

నంజంగుడ్ లో ...శివ మహిమలు !

కర్నాటక రాష్ట్రంలోని నంజంగుడ్ లో కల విగ్రహాలలో ఒకటి, శివుడి విగ్రహం కిరాత అర్జున - శాబర శంకర విగ్రహం. కిరాత అర్జున పాత్ర మహాభారతంలోని అరణ్య పర్వంలో ప్రవేశ పెట్టబడింది. పాండవులు అరణ్యంలో వున్న కాలంలో, ఒకసారి వారు మహర్షి వేదవ్యాసుడిని కలవటం జరిగింది. అపుడు ఆ రుషి ధర్మరాజుకు మహా శివుడి గొప్పతనం వివరించాడు. అర్జునుడిని శివుడి కొరకు తపస్సు చేసి "పాశుపత అస్త్రం " సంపాదించమని వివరిస్తాడు. ఈ అస్త్రంతో వారు కౌరవులను యుద్ధంలో గెలుపు పొందవచ్చని చెపుతాడు.

ధర్మరాజు, అపుడు అర్జునుడికి రుషి బోధించిన బీజ మంత్రం చెప్పి దానిని తపము ఆచరిన్చవలసినదిగా అర్జునిడికి బోధిస్తాడు. అర్జునుడు ఇంద్ర కీల పర్వతం చేరి తపస్సు చేస్తాడు. ఆయన గాఢ తపో మహిమ అక్కడ కల ఇతర ఋషులకు, మునులకు బాధ కలిగిస్తుంది. వెంటనే ఆ మునులు శివుడిని చేరి ఎవరో తెలియని యువకుడు అక్కడ తపస్సు చేస్తున్నాడని దాని ప్రభావంచే అక్కడ ఎదో తెలియని శక్తి ఆవిర్భావిస్తోందని అది వారికి బాధ కలిగిస్తోందని ఆ బాధను తీర్చమని కోరతారు. శివుడు తన మనో దృష్టితో విషయం అర్ధం చేసుకొని అతడిని అర్జునిడిగా గ్రహించి ఆర్జునుడిని పరీక్షించే నిమిత్తం ఒకవేటకాడైన కిరాతకుడి వేషం ధరించి తన సహచరిణి పార్వతి తో వస్తాడు.

గణేశుడు, నంది, సమేతముగా మరియు ఇతర గణాలు కూడా వేటగాళ్ళ వేషాలు ధరించి మేళ తాళాలతో ఇంద్రకీల పర్వతానికి వస్తారు. అక్కడ నివసిస్తున్న మూక దానవ అనే రాక్షసుడు ఈ శబ్డాన్ని విని కోపిస్తాడు. ఒక అడవి పంది గా మారి వీరిని ఆకర్షిస్తాడు. శివుడు తన బాణంతో అడవి పందిని వేటాడగా, అది గాయపడి తపస్సు చేసుకొంటున్నఅర్జునుడి వద్దకు వెళుతుంది. తన తపస్సుకు భంగం వాటిల్లిన అర్జునుడు తన గాండీ వంతో తక్షణమే దానిని వధిస్తాడు.

పాశుపత అస్త్రం పొందిన అర్జునుడు !

అయితే, శివుడు అతని అనుచరులు వచ్చి ఆ అడవి పంది తన బాణం చే మరణించినదని ఆ పంది తమకు చేరుతుందని వాదిస్తారు. కాని అర్జునుడు దానిని తాను చంపానని వాదిస్తాడు. వాదోపవాదాలు పెరిగి చివరకు శివ అర్జునుల మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. అర్జునుడు తన బలమైన మంత్రాలతో వేసే బాణాలను శివుడు తిప్పి కొడతాడు. అర్జునుడు దేవతలను ఓడించ గల తన బాణాలను ఒక సాధారణ వేటగాడు ఓడించటం చూసి ఆశ్చర్యపడి చివరకు ఆ కిరాతుడు శివుడుగా గ్రహించి తనను క్షమించమని వేడుకుంటాడు.

శివుడి ఆర్జునుడిని ఆశీర్వదించి "పాశుపత అస్త్రం" ఇస్తాడు. పార్వతి తాను కూడా ఆశీర్వదించి "అంజనా అస్త్రం" ప్రసాదిస్తుంది. గణేశుడు, షణ్ముఖుడు కూడా ఒక్కొక్కరూ అర్జునిడికి ఒక అస్త్రం ఇచ్చి ఆశీర్వదించి మాయం అవుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X