Search
  • Follow NativePlanet
Share
» »చూపు లేనివారికి చూపును ప్రసాధించే శ్రీ కంఠ మల్లేశ్వరుడు!

చూపు లేనివారికి చూపును ప్రసాధించే శ్రీ కంఠ మల్లేశ్వరుడు!

ప్రసిద్ధి చెందిన కృష్ణ జన్మ భూమి టెంపుల్ హిందువులకు ఎంతో పవిత్రమైనది. ఈ టెంపుల్ లోని చెరసాల వంటి నిర్మాణంలో కృష్ణుడు జన్మించాడని చెపుతారు. జహంగీర్ పాలనలో ఈ టెంపుల్ ను రాజ వీర్ సింగ్ బుందేలా నిర్మించాడ

ఆ పరమేశ్వరుడు లీలా విశేషాలు అర్థం చేసుకోవడం మునులు, మహర్షుల వల్లనే కాదు, ఇక సాధారణ మనష్సులకు ఏం అర్థం అవుతుంది. అనంతమైన ఆ పరమేశ్వరుడి మాయలో భాగంగానే ఆయా పుణ్యక్షేత్రాలు ఆవిర్భవించాయి. అపారమైన భక్తజనకోటిచే నిత్య నీరాజనాలు అందుకుంటున్నాయి. అలాంటి ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా 'నంజన్ గూడ్ 'దర్శనమిస్తున్నది.

కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ఇటు చారిత్రక నేపథ్యాన్ని...అటు పురాణపరమైన విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. మైసూరుకు దక్షిణంగా సుమారు 18 కి.మీ. దూరంలో సంజనగూడ్ లో అతి పురాతనమైన శ్రీ కంటేశ్వర ఆలయం ఉన్నది. కంబిని నది తీరంలో గల శ్రీ కంటేశ్వర దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. ఏ దేవాలయాన్ని సంజనగూడ్ దేవాలయం అని కూడా పిలుస్తారు.

సంజనగూడ్ దేవాలయం అని ఇలా పిలవడం వెనుక కారణం

సంజనగూడ్ దేవాలయం అని ఇలా పిలవడం వెనుక కారణం

సంజనగూడ్ దేవాలయం అని ఇలా పిలవడం వెనుక కారణం ఏంటంటే, పాలసముద్రంలో ఉధ్బవించిన హాలాహలాన్ని శివుడు తన కంఠంలో నిలుపుకొనుటచే శివుడికి నంజుండేశ్వర అనే పేరు వచ్చింది. ఆ స్వామి పేరు మీదుగానే ఈ పట్టణానికి నంజన్ గూడ్ అనే పేరు ఏర్పడినట్లు చెబుతారు. ఈ ఆలయం చిన్నదైనప్పటికీ, అతి ప్రాచీన కాలం నుండి గొప్ప మహామాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది.

గోపురం ఎత్తు - 120 అడుగులు

గోపురం ఎత్తు - 120 అడుగులు

గోపురం ఎత్తు - 120 అడుగులు ప్రధాన దైవం - శ్రీకంఠేశ్వర స్వామి (శివుడు) నంజన్ గుడ్ లో ఉన్న శ్రీకంఠేశ్వర గుడిని సందర్శిస్తే చూపు లేనివారికి చూపు వస్తుందని భక్తుల నమ్మకం. టిప్పు సుల్తాన్ తన పట్టపుటేనుగు చూపు కోల్పోతే, ఈ స్వామిని ప్రార్ధించాడని దాంతో ఏనుగుకు చూపు వచ్చిందని స్థానిక కధనం.

PC: Naveen

ఆలయ నిర్మాణశైలి ఆనాటి శిల్పకళా వైభవాన్ని అద్భుతమైన రీతిలో

ఆలయ నిర్మాణశైలి ఆనాటి శిల్పకళా వైభవాన్ని అద్భుతమైన రీతిలో

ఇక ఆలయ నిర్మాణశైలి ఆనాటి శిల్పకళా వైభవాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరిస్తూ ఉంటుంది. గాలిగోపురం ప్రాకారాలు..మంటపాలు...పరివార దేవతలు...నాయననారులు మందిరాలు ఆనాటి భారీతనానికి నిదర్శనంగా ఉన్నాయి.

PC:Dineshkannambadi

ఇవి 11 వ శతాబ్దంలో స్థాపించినట్లుగా

ఇవి 11 వ శతాబ్దంలో స్థాపించినట్లుగా

ఇవి 11 వ శతాబ్దంలో స్థాపించినట్లుగా తెలియుచున్నది. ఈ ప్రాంగణంలో రాతిపై శివలీలలు అధ్బుతమైన దృశ్యాలతో చెక్కబడినాయి.

 నాగేంద్రస్వామి సుబ్రహ్మణ్యస్వామి తలపై పడగవిప్పిన శిల్పం అధ్బుతంగా ఉంటుంది.

నాగేంద్రస్వామి సుబ్రహ్మణ్యస్వామి తలపై పడగవిప్పిన శిల్పం అధ్బుతంగా ఉంటుంది.

ఇంకా ఈ ఆలయంలో శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారు నెమలివాహనంపై కూర్చొని ఉండగా, నాగేంద్రస్వామి సుబ్రహ్మణ్యస్వామి తలపై పడగవిప్పిన శిల్పం అధ్బుతంగా ఉంటుంది.

నాటి రాజుల నుంచి నేటి సామాన్యుల వరకూ అందరికీ కూడా స్వామివారి మహిమలు

నాటి రాజుల నుంచి నేటి సామాన్యుల వరకూ అందరికీ కూడా స్వామివారి మహిమలు

ఎంతో మంది రాజులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని, కానుకలు సమర్పించుకున్నారు. మరికొందరు రాజులు స్వామిని తమ ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తూ, ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు.

PC: Nayvik

సామాన్యుల వరకూ అందరికీ కూడా స్వామివారి మహిమలు అనుభవంలోకి

సామాన్యుల వరకూ అందరికీ కూడా స్వామివారి మహిమలు అనుభవంలోకి

అడుగడుగునా ఉట్టిపడే ఆలయ సౌందర్యం ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంటుంది. నాటి రాజుల నుంచి నేటి సామాన్యుల వరకూ అందరికీ కూడా స్వామివారి మహిమలు అనుభవంలోకి వచ్చాయి.

PC: Apoorva Ramesh

నిరంతరం నీలకంఠ స్వామి వారి సేవలో తరిస్తుంటారు

నిరంతరం నీలకంఠ స్వామి వారి సేవలో తరిస్తుంటారు

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జరిగే రథోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది. వేలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొని ముక్కులు చెల్లిస్తూ..నిరంతరం నీలకంఠ స్వామి వారి సేవలో తరిస్తుంటారు. సంవత్సరానికి రెండు సార్లు జరిగే రధోత్సవ సమయంలో యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు. దీనిని దొడ్డ జాతర అంటారు. రధాలలో గణపతి, పార్వతి, శ్రీకంఠేశ్వర, సుబ్రహ్మణ్య మరియు చండికేశ్వర విగ్రహాలను పెట్టి ఊరేగిస్తారు.
నంజన్ గూడ్ లోని నీలకంఠేశ్వర స్వామి వారి ఆయలంతో పాటు చూడవల్సిన మరికొన్ని ఇతర దర్శనీయ ప్రదేశాలు కూడా ఉన్నాయి

PC : Barry Silver

పరశురామ క్షేత్రం:

పరశురామ క్షేత్రం:

నంజన్ గూడ్ కి దగ్గరలో పరశురామ క్షేత్రం ఉంది. ముందుగా శివుడిని దర్శించి, తరువాత ఈ దేవాలయాన్ని దర్శిస్తే కానీ తీర్థయాత్ర పూర్తికాదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పరశురామ దేవాలయం కౌండిన్య నది గుట్టపైన ఉన్నది. ఇక్కడ పరశురాముడు మాతృ హత్యాదోషం పోగొట్టుకోవడానికి తపస్సు చేసాడని ప్రతీతి. ఈ స్వామిని దర్శించినవారికి తెలిసి తెలియక చేసిన పాపాలు, దీర్ఘరోగాలు నివారించబడతాయని భక్తుల నమ్మకం. ఇచటి మృత్తికా ఔషధంతో సమానమంటారు. అనేక చర్మ రోగాలకు ఈ మృత్తికను ఉపయోగిస్తారు

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం

రాఘవేంద్ర మఠాన్ని ప్రీతికా సన్నిధి అని కూడా పిలుస్తారు. ప్రపంచం మొత్తం మీద రాఘవేంద్ర స్వామి విగ్రహం ఉన్న ఏకైక మఠం ఇదొక్కటే. మిగితా అన్ని చోట్ల ఆయనను బృందావనం గానే చూస్తారు. క్రీ. శ. 18 వ శతాబ్దంలో మఠాన్ని శ్రీమదాచార్య పరంపరలో శ్రీ సుజనానేంద్ర తీర్థరు స్థాపించారు. అప్పటి నుండి వేలాది మంది యాత్రికులు సంవత్సరం పొడవునా మఠాన్ని దర్శించుకుంటున్నారు.

PC: indiaforyou.in

నంజన్ గూడ్ బ్రిడ్జి

నంజన్ గూడ్ బ్రిడ్జి

నంజన్ గూడ్ బ్రిడ్జి అతి పురాతనమైనది. పర్యాటకులు తప్పక చూడదగినది దీనిని షుమారు 1735 లో నిర్మించారు. దీనిపై రైలు మరియు ఇతర వాహనాలు కూడా కలసి ప్రయాణిస్తాయి. ఈ వంతెనను భారత ప్రభుత్వం వారసత్వ కట్టడంగా ప్రకటించింది.

PC: Suraj T S

నంజన్ గూడ్ ఎలా చేరుకోవాలి ?

నంజన్ గూడ్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం : నంజన్ గూడ్ కు 160 KM ల దూరంలో ఉన్న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో నంజన్ గూడ్ చేరుకోవచ్చు.
రైలు మార్గం : నంజన్ గూడ్ లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది మైసూర్ రైల్వే స్టేషన్ తో అనుసంధానించబడినది. స్టేషన్ బయట ఆటో రిక్షాల సదుపాయం కలదు.
రోడ్డు / బస్సు మార్గం : బెంగళూరు, మైసూర్ ల నుండి ప్రతి రోజూ నంజన్ గూడ్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

PC: Prof tpms


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X