Search
  • Follow NativePlanet
Share
» »అందాల అనంతగిరి హిల్ స్టేషన్ !!

అందాల అనంతగిరి హిల్ స్టేషన్ !!

ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరం లోనే మంత్ర ముగ్ధుల్ని చేసే అందమైన ప్రదేశం అనంతగిరి హిల్స్. వికారాబాద్ నుండి 10 కిలో మీటర్ల దూరం లో ఈ ప్రాంతం ఉంది. హైదరాబాద్ లో గబ్బు పట్టిపోయిన మూసీ నది జన్మస్థానం ఇదే. ఇది అటవీ ప్రాంతం అయినందున చుట్టూ పచ్చటి కొండలు పర్యాటకులని అమితంగా భలే ఆకర్షిస్తాయి. ఏడాది పొడవునా ఈ ప్రాంతం పర్యాటకులని ఆహ్లాదకరమైన వాతావరణం మరియు ప్రశాంతమైన పరిసరాలతో ఆకట్టుకుంటుంది కనుక ఇది నా దృష్టి లో ఒక హిల్ స్టేషన్ అని పేర్కొన్నాను.

గోఐబిబో కూపన్లు : హోటల్ బుకింగ్ ల మీద రూ. 6000 ఆఫర్ సాధించండి త్వరగా !!

సూర్యోదయం

సూర్యోదయం

సరిగ్గా సాయంత్రం స్కూల్ బెల్ కొట్టినట్టు 4 మరియు 5 గంటల సమయమప్పుడు సూర్యాస్తమయ సమయం కావడం వల్ల సూర్యుని బంగారపు కిరణాలు పచ్చని ప్రకృతి తో కలిసి అద్భుతమైన దృశ్యంగా పర్యాటకులకి కనువిందు కలిగిస్తుంది. అలాగే ఇక్కడ ఉదయాన్నే సూర్యోదయం చూడటం ఒక మరుపురాని జ్ఞాపకం.

Photo Courtesy: Syam Prasad

హాయి

హాయి

ఈ ప్రాంతం పర్యాటకులకి రోజు వారీ బిజీ లైఫ్ స్టైల్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అనంతగిరి లో అనంత పద్మనాభ స్వామి ఆలయం కలదు. వారాంతంలోని ఈ ఆలయం భక్తుల రాకతో కిటకిటలాడుతుంది.

Photo Courtesy: rammohan kandlakunta

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

అనంతగిరి హిల్స్ మొదటి సారి ట్రెక్కింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారికి అనువైన ప్రదేశం. ట్రెక్కింగ్ లో అందమైన ప్రకృతి పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. అనంతగిరి ప్రాంతం లో ఎన్నో చిన్న చిన్న కొండలు ఉన్నాయి. ఇవి అన్నీ ట్రెక్కింగ్ లో సందర్శించే అవకాశం కలదు.

Photo Courtesy: telangana tourism

జాగ్రత్త

జాగ్రత్త

అనంతగిరి మరీ దట్టమైన అడవి కాకపోవడం వల్ల అడవి లో దారి తప్పి పోయే అవకాశాలు తక్కువ. చాలా మంది ఈ ప్రాంతానికి ట్రెక్కింగ్ కోసమే ప్రత్యేకంగా వస్తారు. అయితే, అడవి లోపలకి వెళ్ళాలని అనుకునే వారు ఒక పెద్ద గ్రూప్ గా వెళ్తే మంచిది.

Photo Courtesy: telangana tourism

అడవిలో సాహసం

అడవిలో సాహసం

అనంతగిరి లో ఎన్నో ట్రెక్కింగ్ మరియు కామ్పింగ్ అవకాశాలు కలవు. ఈ అటవీ ప్రాంతంలో రెండు ట్రెక్కింగ్ ట్రైల్స్ ఉన్నాయి. ఒకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వద్ద మరొకటి ఈ ఆలయం నుండి అర కిలోమీటరు దూరం లో కెరెల్లి వద్ద ప్రారంభం అవుతుంది. అనంతగిరి హిల్స్ లో ఉన్న కామ్పింగ్ సైట్ ని 'డెక్కన్ హిల్స్' అని అంటారు. ఇక్కడ అటవీ ప్రాంతం లో విహారం చాలా బాగుంటుంది.

Photo Courtesy: telangana tourism

ఇవికూడానా

ఇవికూడానా

వీటితో పాటు, పర్యాటకులు ఇక్కడ 'రాక్ క్లైమ్బింగ్', 'బర్మా బ్రిడ్జి', 'స్పైడర్స్ వెబ్' మరియు టార్జాన్ స్వింగ్ వంటి ఎన్నో ఆక్టివిటీస్ లో పాల్గొని ఆనందించవచ్చు.

Photo Courtesy: telangana tourism

నాగసముద్రం లేక్ లేదా కోటిపల్లి రిజర్వాయర్

నాగసముద్రం లేక్ లేదా కోటిపల్లి రిజర్వాయర్

అనంతగిరి హిల్స్ నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరం లో కోటిపల్లి రిజర్వాయర్ లేదా నాగసముద్రం లేక్ ఉంది. ఈ సరస్సు చాలా పెద్దది. వర్షాకాలం లో ఈ సరస్సు, నీళ్ళు సమృద్దిగా కలిగి ఉండటం వల్ల ఎంతో ఆకట్టుకుంటుంది.

Photo Courtesy: telangana tourism

అనంత పద్మనాభ స్వామి టెంపుల్

అనంత పద్మనాభ స్వామి టెంపుల్

దట్టమైన అనంతగిరి హిల్స్ లోని మరొక ప్రధాన ఆకర్షణ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం. ఇది దాదాపు 400 ఏళ్ళ క్రితానికి చెందినది. మహారుషి ముచికుందునికి శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభుని రూపంలో దర్శన మిచ్చిన ప్రదేశమిది. పద్మనాభుడు లింగాకృతిలో ఉన్న దేవాలయం జగత్తులో ఇదొక్కటేనని పండితులు చెబుతుంటారు. మూసీ నది దేవాలయానికి సమీపంలోనే పుట్టింది. చాలా మంది మొదటగా ఈ ఆలయాన్ని సందర్శించిన తరువాత ట్రెక్కింగ్ కి బయలుదేరతారు.

Photo Courtesy:Belur Ashok

రవాణా మార్గం

రవాణా మార్గం

అనంతగిరి హిల్స్ కి చేరే రోడ్డు మార్గం చక్కగా ఉండడం వల్ల 100 కిలోమీటర్ల ప్రయాణంలో అలసట అస్సలు తెలియదు. కేవలం రెండు గంటల సమయం లో నే ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. అదే సొంత వాహనం ద్వారా లేదా ప్రైవేటు ట్రావెలర్స్ వాహనాల చేరుకోవడం మరింత సౌకర్యం. పబ్లిక్ రవాణా సౌకర్యం అంతగా అందుబాటులో లేకపోవడం ఒక కారణం. ఆహారాన్ని ఇంటి నుండి తీసుకువెళ్ళడం మంచిది. ట్రెక్కింగ్ సమయం లో కూడా తినే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా, అనంతగిరి లోని భోజన సదుపాయాలు అంతంత మాత్రమే కావడం మరొక ముఖ్య విషయం.

Photo Courtesy: Prapulla Chandra D

ఒక్క మాటలో

ఒక్క మాటలో

అనంతగిరి గురించి ఒక్క వాక్యం లో చెప్పాలంటే ప్రకృతి ఒడిలో సేద దీరాలనుకునే వారికి హైదరాబాద్ కి సమీపం లో ఉన్న అందమైన ప్రదేశం అని అనవచ్చు.

Photo Courtesy: Maheshwar Rao

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X