Search
  • Follow NativePlanet
Share
» »6 నెలలు భక్తులకు మిగిలిన 6 నెలలు దేవునికి మరియు ఋషులకు మాత్రమే ప్రవేశం.......

6 నెలలు భక్తులకు మిగిలిన 6 నెలలు దేవునికి మరియు ఋషులకు మాత్రమే ప్రవేశం.......

నెల్లి తీర్థం సోమేశ్వర గుహ దేవాలయం కర్ణాటకలోని ప్రసిద్ధిచెందిన దేవాలయాలలో ఒకటి. ఇదొక గుహ దేవాలయమైనా మహా శివుడు లింగ రూపంలో ఇక్కడ వెలసియున్నాడు.

By Venkatakarunasri

నెల్లి తీర్థం సోమేశ్వర గుహ దేవాలయం కర్ణాటకలోని ప్రసిద్ధిచెందిన దేవాలయాలలో ఒకటి. ఇదొక గుహ దేవాలయమైనా మహా శివుడు లింగ రూపంలో ఇక్కడ వెలసియున్నాడు. ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైనది అంటే సుమారు 1487 కంటే ముందటి పవిత్ర దేవాలయం.

ఈ మహిమాన్వితదేవాలయానికి ఒక స్థలపురాణం కూడా వుంది. ఈ దేవాలయానికి కుడి వైపున నైసర్గికంగా ఒక సహజమైన గుహ ఉంది. ఇది సుమారు 200 మీటర్ల (660 అడుగులు) పొడవు వుంది. ఈ గుహ దేవాలయంలో పవిత్రమైన సరోవరం మరియు శివలింగం వున్నాయి.ఈ పవిత్రమైన దేవాలయముండేది కర్ణాటక మంగళూరులో.

ఈ గుహ దేవాలయం యొక్క స్థల పురాణం అత్యంత పవిత్రమైనది ఈ వ్యాసం మూలంగా నెల్లి తీర్థం గురించి తెలుసుకుందాం.

6 నెలలు భక్తులకు మిగిలిన 6 నెలలు దేవునికి మరియు ఋషులకు మాత్రమే ప్రవేశం.......

 నెల్లి తీర్థం

నెల్లి తీర్థం

దేవాలయం ఇతిహాసం 1487 కంటే పూర్వానికి చెందినది. ఈ గుహ దేవాలయానికి నెల్లి తీర్థం అనే పేరు రావటానికి కారణమేమంటే గుహ లోపల నీటి బిందువుల సరస్సు ఏర్పడటానికి యాసిడ్ ఆకారంలో నీరు ప్రవహిస్తుంది. అందువల్ల నెల్లి తీర్థం అని ఈ గుహ దేవాలయానికి పేరు వచ్చింది.

అరుణాసురుడు, రాక్షసుడు

అరుణాసురుడు, రాక్షసుడు

ఈ దేవాలయం స్థల పురాణమేమంటే అది అరుణాసురుడు అనే రాక్షసుడు జాబాలి అనే ఋషి మునీశ్వరుల దగ్గర పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని పఠిస్తుండేవాడు. శక్తిని పొందిన అరుణాసురుడు గాయత్రి మంత్రాన్ని దురుపయోగం చేయడం ప్రారంభించాడు.

వేధింపులు

వేధింపులు

గాయత్రి మంత్రాన్ని దురుపయోగం చేసిన అరుణాసురుడు మొత్తం ప్రపంచాన్నే వేధింపులకు గురిచేయటం ప్రారంభించాడు. ఈవిధంగా అరుణాసురుడు గాయత్రి మంత్రాన్ని దురుపయోగం చేస్తుండటం తపస్సులో లీనమైన జాబాలి ఋషికి తెలీదు.

నారద మహర్షి

నారద మహర్షి

అరుణాసురుడు చేస్తున్న అన్ని దౌర్జన్యాలను నారదమహర్షి జాబాలి ఋషికి తెలియజెప్పెను. విషయాన్ని తెలుసుకున్న ఋషి తక్షణమే అరుణాసురుడి చేస్తున్న దౌర్జన్యాలను అంతమొందించాలని నిర్దారించుకునెను.

దుర్గా పరమేశ్వరి

దుర్గా పరమేశ్వరి

దీని గురించి ఋషి మునీశ్వరులు దుర్గా పరమేశ్వరి తల్లిని జ్ఞాపకం చేసుకొని తపస్సు చేయుటకు తరలివెళ్లెను. తన తపస్సుకు మెచ్చిన దుర్గా పరమేశ్వరి జాబాలి ఋషి ముందు ప్రత్యక్షమయ్యెను. అంతట దుర్గా పరమేశ్వరి తల్లి ఋషి మునీశ్వరులని వరం కోరుకోమనెను. అంతట ఋషి అరుణాసురుడి గురించి వివరించెను. అంతట ఆ తల్లి అరుణాసురుడును సంహరిస్తానని వాగ్దానం చేసెను. ఆ స్థలమే నెల్లి తీర్థం గుహ అయినది.

సంహారం

సంహారం

పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని దురుపయోగం చేస్తున్న అరుణాసురుడిని దుర్గా పరమేశ్వరి నందిని అనే నదీ తీరంలో కణజాల ఆకారంలో అరుణాసురుడిని సంహారం చేసింది.

దుర్గా పరమేశ్వరి దేవాలయం

దుర్గా పరమేశ్వరి దేవాలయం

అందువలన ఈ స్థలంలో సాక్షాత్ దుర్గా పరమేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని ఇక్కడ నెలకొనటం జరిగింది. ఈ దేవాలయాన్ని కటిల్ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం మంగళూరిలో అత్యంత ప్రసిద్ధమైన దేవాలయంగా ప్రఖ్యాతిపొందింది.

దేవాలయాలు

దేవాలయాలు

ఇక్కడ శివుడు, విష్ణువు మరియు దుర్గా దేవాలయాలు చూడవచ్చును. కొమ్పుటువా అని పిలువబడే ప్రదేశంలో నెల్లి తీర్థా వద్ద ఒక విష్ణు ఆలయం కూడా ఉంది. కుంపాదవు అనే స్థలంలో నెల్లి తీర్థం సమీపంలో విష్ణు దేవాలయం కూడా కలదు. మచ్చూర్ అనే స్థలంలో కూడ దుర్గాదేవిని ఆరాధిస్తారు.

గుహ దేవాలయం

గుహ దేవాలయం

ఈ నెల్లి తీర్థం గుహ దేవాలయంలో శివుడు సోమేశ్వరుడి రూపంలో వెలసియున్నాడు. ఇక్కడ మహాగణపతి మరియు జబలి మహర్షి దేవతావిగ్రహాన్ని కూడా చూడవచ్చును.

సాలిగ్రామం

సాలిగ్రామం

సోమనాథేశ్వరుని లింగం స్వచ్చమైన సాలిగ్రామం నుంచి తయారుచేయబడినది. ఇక్కడ లింగం అర్థనారీశ్వరుని పేరుతో పూజలందుకొనుచున్నది. దేవాలయంలో అత్యంత సుందరమైన అంశమేమంటే గుహ.

నాగప్ప కొలను

నాగప్ప కొలను

నాగప్ప కొలను అనేది దేవాలయం యొక్క ఉత్తరభాగంలో వున్న అతిచిన్న కొలను. ఈ నైసర్గికమైన కొలను అత్యంత పవిత్రమైనది. గుహలో ప్రవేశించటానికి ముందే అందరుభక్తులూ ఈ నాగప్ప కొలనులో స్నానం తప్పకుండా చేయాలి.

అరసోల మంచ

అరసోల మంచ

అరసోల మంచ అనే రాజు దేవాలయంలోని ముఖ్య ప్రవేశ ద్వారం యొక్క ఉత్తరదిక్కులో కూర్చొనిఉంటాడని ఐతిహాసిక పురాణాలు సూచిస్తున్నవి. అయితే......

 ఆత్మ

ఆత్మ

అయితే రాత్రి సమయంలో ఎవరూకూడా ఈ స్థలంలో ప్రవేశించరంట.ఎందుకంటే ఆ అరసోల మంచుని ఆత్మ ఆ స్థలంలో సంచరిస్తూవుంటుంది అందువలన సాయంత్రం తరువాత ఆ స్థలానికి వెళ్ళకూడదని నమ్ముతారు.

విశేషం

విశేషం

విశేషమేమంటే ఈ నెల్లి తీర్థం సోమనాతేశ్వర గుహ దేవాలయానికి జాతి,కుల,మత,ప్రాంతబేధం లేకుండా ప్రతిఒక్కరూ వెళ్లి ఈ గుహను దర్శించుకోవచ్చును.ఈ దేవాలయంలో మరొక విశేషమేమంటే సంవత్సరానికి 6 నెలలు మాత్రం ఈ గుహ దేవాలయం తెరుస్తారు.

6 నెలలు మాత్రం

6 నెలలు మాత్రం

ఈ పవిత్రమైన గుహ దేవాలయం కేవలం అక్టోబర్ నెలనుంచి ఏప్రెల్ నెలల మధ్య మాత్రం అంటే 6 నెలలు మాత్రం తెరుస్తారు.ఎందువలనంటే మిగిలిన 6 నెలల కాలం దేవునికి మరియు ఋషి మునులకు మాత్రం వర్తిస్తుంది.

ప్రాణులు

ప్రాణులు

ఆశ్చర్యం ఏమంటే ఈ గుహ దేవాలయంలో అనేక ప్రాణులను చూడవచ్చును. అవి ఏవంటే తేళ్ళు, ముళ్ళ పందులు, పెద్ద సంఖ్యలో గబ్బిలాలు మరియు పాములు చూడవచ్చును.గుహలో ప్రాణులను హింసించుట లేదా బాధించుట నిషేదించబడినది.

గుహ

గుహ

దేవాలయం యొక్క ముఖ్య ఆకర్షణ ఏమంటే అది ఈ గుహ. గుహ ఎడమ వైపున దేవాలయ ప్రవేశద్వారం వున్నది.ఈ పెద్దదైన గుహ ప్రకృతిలోని అద్భుతాలలో ఒకటిగా వుంది.గుహ లోపలభాగంలో భక్తుల పవిత్ర మరియు ఆధ్యాత్మికమైన అనుభవాన్ని పొందుతారు.

 ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

మంగళూరునుంచి మూడాబిద్రియ ప్రదేశంనుంచి బయల్దేరితే మొదట గురుపురం, కైకంబ దారిలో ప్రయాణించి యదపదవుకి వెళ్ళండి.అక్కడినుంచి కేవలం 8 కి.మీ దూరంలో నెల్లి తీర్థానికి వెళ్ళవచ్చును.

మంగళూరునుంచి కటేలుకి వెళ్ళండి. అనంతరం కటేలునుంచి సుమారు 5 కిమీ దూరంలో నెల్లి తీర్థం వుంటుంది.

బెంగుళూరు నుంచి ప్రయాణించినట్లయితే మొదట బి.సి. రోడ్ మూలంగా ప్రయాణించినట్లైతే కైగొండు పోలాలి మరియు కైకంబ మూలంగా నెల్లి తీర్థానికి వెళ్ళండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X