Search
  • Follow NativePlanet
Share
» »వెల్లూర్ లో గోల్డెన్ టెంపుల్ తో పాటు ఈ ప్రదేశాలు చూడటం మిస్ చేసుకోకండి..!

వెల్లూర్ లో గోల్డెన్ టెంపుల్ తో పాటు ఈ ప్రదేశాలు చూడటం మిస్ చేసుకోకండి..!

దక్షిణ భారతదేశంలోనే ప్రయాణికులకు ''వెల్లూర్'' ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో పురాతనకాలం నుంచి వున్న కట్టడాలు, దేవాలయాలు, ద్రావిడ నాగరికతలను సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు ఇక్కడ వున్నాయి. హిందూ సంస్కృతీ, సంప్రదాయాలను వెదజల్లే అద్భుతమైన నగరంగా దీనిని పేర్కొంటారు. ఈ ప్రాంతానికి 'ఫోర్ట్ సిటీ ఆప్ తమిళనాడు' (తమిళనాడు కోట నగరం) అని పేరు కూడా వుంది.

తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. బ్రిటీస్ కాలంలో సౌత్ ఆర్కాటు జిల్లాగా పిలువబడేది, ఇప్పుడు వెల్లూరు జిల్లాగా పిలువబడుతోంది. వెల్లూరు చరిత్రలోకి వెళితే వెల్లూరు చోళ, పల్లవ, రాష్ట్రకూట, విజయనగర, మరాట, కర్నాటక నవాబుల పరిపాలనలో ఉండి బ్రిటీష్ వారి చేతులలోకి వెళ్లింది.

బెంగళూరు నుంచి 211 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం అటు ఆధ్యాత్మికతకు ఆలవాలమైన దేవాలయాలు, చర్చ్ లకు నిలయం. అంతేకాకుండా చరిత్రకు సాక్షీభూతమైన ఈ వెల్లూరులో సందర్శించదగిన కోటలు ప్యాలెస్ లు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రకతి ప్రేమికులు ఇష్టపడే ఉద్యానవనాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం

అమిర్తి జూలాజికల్ పార్క్

అమిర్తి జూలాజికల్ పార్క్

పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరికి ఎంతో ఇష్టమైన పర్యాటక కేంద్రం ఈ జూలాజికల్ పార్క్. ఇది అమిర్తి నది సమీపంలో జవాడు కొండల దగ్గర వుంది. అందువల్ల దీన్ని అమిర్తి జూలాజికల్ పార్క్ గా పేరొందింది.ఇక్కడ వివిధ రకాల పక్షులు మరియు జంతువులు మరియు ఒక అందమైన జలపాతం ఉన్నాయి. ఈ ప్రదేశం జంతువులకు నివాస ప్రాంతాలుగా పేరుగాంచింది. పక్షులు మరియు కోతి వంటి జంతువులు, మచ్చల జింక, ముళ్ల పంది, ఫాక్స్, నెమలి, బాతు, అడవి చిలుకలు, మొసలి, అడవి పిల్లి మరియు డేగ వంటి వాటిని చూడవచ్చు. అనేక జాతుల మూలికా మొక్కలను మరియు చెట్లను ఈ పార్క్ లో చూడవచ్చు.

PC-Owais

పలమతి హిల్స్

పలమతి హిల్స్

పలమతి హిల్స్ లాంటి పర్వత ప్రాంతాలు పర్వతారోహణ లాంటి ఇతర దర్శనీయ ప్రదేశాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుండి పచ్చటి లోయలను చూస్తే... కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేనిది. ట్రెక్కింగ్ చేసే వారికి ఇది ఎంతో అనువైన ప్రదేశం. ఇక్కడ సహజమైన పార్కులు ప్రభుత్వ హెర్బల్, ఫ్రూట్స్ గార్డెన్స్ ప్రకృతి ప్రేమికులను అలరిస్తాయి

రోమన్ కాథలిక్ డియోసెస్

రోమన్ కాథలిక్ డియోసెస్

రోమన్ కాథలిక్ డియోసెస్ వెల్లూర్ నగరంలో బిషప్ యొక్క హౌస్ పక్కన ఉంది. కేథడ్రల్ చరిత్ర 18 ముఖ్యమైన సంఘటనలు, ప్రార్థన మరియు 15 మిస్టరీల గాజు చిత్రాలు ఉన్నాయి. పర్యాటకులు రోమన్ కాథలిక్ డియోసెస్ ను దాని చారిత్రక వారసత్వం కోసం వెల్లూర్ ను సందర్శించాలి. రోమన్ కాథలిక్ డియోసెస్ వెల్లూర్ నగరంలో బిషప్ యొక్క హౌస్ పక్కన ఉంది. ఈ చర్చి ని 2001 లో పునరుద్ధరించారు మరియు ఒక ప్రఖ్యాత మత కేంద్రం గా ఉంది. ఇక్కడ ఒక గంటగోపురం ఉంది. రోమన్ కాథలిక్ డియోసెస్ లోఉన్న గంటగోపురం దేశంలోనే ఎత్తైన గంటగోపురంగా భావిస్తున్నారు.

PC- Maydinaselvan Durairaj

రత్నగిరి ఆలయం

రత్నగిరి ఆలయం

రత్నగిరి ఆలయం రత్నగిరి ఆలయం బాలమురుగన్ కు అంకితం చేయబడింది. ఇది వెల్లూర్ కొండ పైన ఉన్న ఒక పురాతన ఆలయం.ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు,సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. బాలమురుగన్ అడిమైగళ్ కమ్యూనిటీ ప్రమేయం సహాయంతో ఈ కొండ ఆలయం అభివృద్ధి మరియు ఆసుపత్రి మరియు ఒక పాఠశాల స్థాపించాడు.

PC: Manomi M

మహదేవ్ మలై టెంపుల్ :

మహదేవ్ మలై టెంపుల్ :

ఇది హిందు పుణ్యక్షేత్రం. ఈ దేవాలయంను శివుడికి అంకితం చేయబడినది. ఇది తమిళనాడులో కనకుప్పం విలేజ్ లో ఉంది. ఇది కాడ్పాడికి పశ్చిమ భాగంలో ఉంది. ఈ దేవాలయం సుమారు 500 ఏళ్ళనాటిది, ఈ దేవాలయంను పాండ్య రాజుల కాలంలో నిర్మించబడినది.

పుంగనూర్‌ లేక్‌:

పుంగనూర్‌ లేక్‌:

పుంగనూర్‌ లేక్‌కు అతి దగ్గరలోనే నేచర్‌ పార్క్‌ ఉంది. ఈ పార్క్‌లో మ్యూజికల్‌ పౌంటైన్‌ ఏర్పాటు చేశారు. ఇది సాయంత్రం 7 నుండి ప్రారంభం అవుతుంది. ఈ పార్క్‌లో వివహరించాలంటే దీనికి కూడా సపరేట్‌ గా ప్రవేశ రుసుము చెల్లించాలి.

ఆర్కియాలజీ మ్యూజియం ఆఫ్ ఇండియా:

ఆర్కియాలజీ మ్యూజియం ఆఫ్ ఇండియా:

వెల్లూరులో ఉండే రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియం ఎంతో ఆకర్షితమైనది. ఇక్కడ పురాతన కాలంలో రాజులు ఉపయోగించిన వస్త్రాభరణాలు, వస్తువులు, అరుదైన చిత్రపటాలు, నాగరికతకు సంబందించిన కళలు, ప్రాచీన ఆయుధాలూ నాణేలూ ఇక్కడ భద్రపరిచారు. ఇక్కడ ఉన్న ఫ్రెంచ్ బంగ్లా ఒక స్మారక చిహ్నం. దీనినే పెర్ల్ ప్యాలెస్ లేదా ముతుమండపం అని కూడా అంటారు.

PC-Maydinaselvan Durairaj

విరింజిపురం టెంపుల్

విరింజిపురం టెంపుల్

విరిచిపురం వెల్లూర్ జిల్లాలో అనైసుట్ తాలూకా లో ఉన్న ఒక చిన్న గ్రామము. విరిచిపురం అత్యంత శిల్పకళాపరంగా మర్గాబందేస్వరార్ ఆలయం ఉన్నది. ఇది 1300 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం మరియు దాని గంభీరమైన రాజగోపురాలు మరియు రాతి శిల్పాలలో ప్రసిద్ధి చెందింది.

PC- Ssriram mt

వల్లిమలై సుబ్రహ్మణ్య టెంపుల్ :

వల్లిమలై సుబ్రహ్మణ్య టెంపుల్ :

కొండపైన ఉన్న వల్లిమలై మురుగన్‌ ఆలయంలో వల్లీసమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తాడు.వల్లిమలై, త్రువళం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉత్తరంగా ఉంది. మురుగన్ స్వామి ఇద్దరు భార్యలలో ఒకరు వల్లీ ఇక్కడ జన్మించింది . ఈ ఆలయం మురుగన్ అంకితం చేయబడింది. ఈ దేవాలయంలో, శ్రీ మహావిష్ణువు యొక్క ఇద్దరు కుమార్తెలు అయిన వల్లీ మరియు దేవయాని ఇద్దరు కూడా తమ భర్తల కోసం దేవుడిని ప్రార్థించి మురుగన్ ప్రేమలో పడ్డారని నమ్ముతారు. వల్లిమలై ప్రారంభ మధ్యయుగ కాలంలో అత్యంత ముఖ్యమైన జైన కేంద్రాల్లో ఒకటిగా ఉంది మరియు సహజ గుహలు కన్నడ శాసనాలు ప్రకారం జైన్ నిలయాలుగా మారింది.

PC-Raja Ravi Varma

వెల్లూర్ ఫోర్ట్:

వెల్లూర్ ఫోర్ట్:

ఈ కోటకు కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. విజయనగర రాజుల కాలంలో అంటే సుమారు 1520లలో కోట నిర్మాణం జరిగింది. సుమారు 17వ శతాబ్దంలో జరిగిన కర్నాటక యుద్ధంలో ఈ కోటను అత్యంత పటిష్టమైనదిగా గుర్తించారు. బ్రిటీష్ పాలనలో కూడా ఈ కోట అత్యంత ప్రాధాన్యత పొందినది. ఇది పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మింపబడిన ఒక కళాత్మకమైన కట్టడం.

PC- Fahad Faisal

శ్రీపురం గోల్డెన్ టెంపుల్:

శ్రీపురం గోల్డెన్ టెంపుల్:

ప్రస్తుత కాలంలో భారత దేశంలో పేరుగాంచిన దేవాలయాలలో ది గోల్డెన్ టెంపుల్ ఒకటి. మలైకొడి అనే ప్రాంతంలోని శ్రీపురం మహాలక్ష్మీ స్వర్ణ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. బంగారు రేకులతో నిర్మించిన ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయాన్ని పై నుండి చూస్తే నక్షత్రం ఆకారంలో ఉంటుంది. ఇది మొత్తం 1500కిలోల బంగారంతో నిర్మించారు. ఈ ఆలయం శ్రీ శక్తి అమ్మ పేరుతో కట్టించారు. ఇది మొత్తం 1.8 కిలోమీటర్ల వరకు విస్తీర్ణంలో వ్యాపించి వుంది. దీనిని ది గోల్డెన్ టెంపుల్ ఆఫ్ వెల్లూరు అని పిలుస్తారు. ఈ ప్రాంతం చుట్టుపక్కల సందర్శించడానికి హిందూ దేవాలయాలు, మఠాలు చాలానే ఉన్నాయి.

PC- Ag1707

జలకందేశ్వర స్వామి టెంపుల్ :

జలకందేశ్వర స్వామి టెంపుల్ :

ఈ కోటలోనే జలకంఠేశ్వర ఆలయం ఉంది. ఈ దేవాలయంలో అడుగడుగునా ప్రాచీన శిల్పకళ ఉట్టిపడుతుంటుంది. ఇక్కడ శివుడను జలకందేస్వరార్ గా పూజిస్తారు. ఒక గోపురం ఉన్నది . ఆలయంనకు రెండు ప్రాంగణాలు ఉన్నాయి, మరియు చుట్టూ సంవృత మార్గం మరియు ఉప ఆలయాలలో గర్భగుడి కలిగి ఉంది. ప్రధాన ద్వారం వద్ద అత్యంత శిల్పాలతో అలంకరించిన స్తంభాలను చూడవచ్చు. అలనాటి శిల్పకళకు ప్రతి రూపంగా నిలుస్తుంది. చాలా సంవత్సరాలు దేవాలయాన్ని ఆయుధాగారంగా వాడినందువల్ల ఇక్కడ మూలవిరాట్టు లేదట. కొంతకాలం క్రితమే శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట.

జవది హిల్స్:

జవది హిల్స్:

ట్రెక్కింగ్ ఎక్కువగా ఇష్టపడే వారు జవది హిల్స్ వెళ్ళవచ్చు. జవది హిల్స్ చుట్టు పక్కల ప్రదేశాలు చాలా అదంగా కనబడుతుంది. జవది హిల్స్ ను వెల్లూర్ నగరం లోని అందాలను చాలా అద్భుతంగా చూడవచ్చు. ఇక్కద వివిధ రకాల చెట్లు, జంతువులు, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. దట్టమైన అడివి అంతే కాదు పండ్ల మరియు వెజిటేబుల్స్, మెడికల్ ప్లానిటేషన్ కు చాలా ప్రసిద్ది చెందినది. కాబట్టి, వెల్లూర్ వెళ్లినప్పుడు జవది హిల్స్ తప్పక సందర్శించండి.

ఏలగిరి :

ఏలగిరి :

తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉన్న చిన్న పర్వత కేంద్రం ఏలగిరి. ఇది పర్యాటకుల స్వర్గ్ధామం. పూర్వం ఈ ప్రాంతం అంతా ఏలగిరి జమీందార్లది. ఇప్పటికీ రెడ్డియూర్‌లో వాళ్ల ఇల్లు ఉంది. 1950లలో ఏలగిరి భారత సంస్థానంలో విలీనమైంది. సముద్ర మట్టానికి 1048 మీటర్ల ఎత్తున ఉన్న ఏలగిరి- గిరిజనులు నివసించే 14 గ్రామాల సమూహం. వివిధ గిరిజన తెగలు ఉండే ఏలగిరి, ఊటీ, కొడైకెనాల్ వంటి ఇతర పర్వత కేంద్రాల్లా అభివృద్ధి చెందలేదు. అయితే ఇటీవలే ఏలగిరి జిల్లా యంత్రాంగం ఈ ప్రాంతంలో పారా గ్లైడింగ్, పర్వతారోహణం లాంటి సాహస క్రీడలను అభివృద్ధి చేసింది. ఏలగిరిలో ప్రవేశించగానే నిశ్శబ్దమైన, ప్రశాంతమైన పరిసరాలు, పచ్చటి లోయలు, గులాబీ తోటలు, చల్లటి గాలులు, పళ్ళ తోటలు, తాజా పళ్ళ ఘుమఘుమలు.. ఇలా మేనంతా ఒకవిధమైన పరవశంతో నిండిపోతుంది. ఈ మైదానాల గుండా ప్రయాణించడం గొప్ప అనుభూతి.
సాహసాన్ని ఇష్టపడేవారు ఏలగిరి కొండలకు తప్పకుండా వస్తారు. ఇటీవల దీన్ని మహారాష్టల్రోని పంచగని తరువాత రెండో ఉత్తమ సహజ క్రీడా ప్రాంతంగా గుర్తించారు. ఏలగిరిలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అన్ని వయసుల వారికి ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా ఉంటుంది. ఎలగిరి అడ్వెంచర్‌ యాక్టివిటీస్‌కు పెట్టింది పేరు. ఇక్కడి వాతావరణం రాక్‌ క్లైంబింగ్‌, పారాగ్లైడింగ్‌, ట్రెక్కింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎలగిరి అడ్వెంచర్‌ క్యాంప్‌లో రోప్‌ యాక్టివిటీస్‌, క్లైంబింగ్‌, డార్ట్‌ గేమ్‌ మొదలగునవి అనేక క్రీడలు కూడా ఆడవచ్చు.

వెల్లూరు ఎలా చేరుకోవాలి ?

వెల్లూరు ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం : ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో వెల్లూరు చక్కగా కనెక్ట్ చేయబడింది. చిత్తూరు, బెంగళూరు, చెన్నై, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, నెల్లూరు ఇలా అన్ని ప్రధాన నగరాల నుండి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు వెల్లూరు కు వెళుతుంటాయి.
రైలు మార్గం : వెల్లూరు హైదరాబాద్ వలె మూడు జంక్షన్ లను కలిగి ఉన్నది. అందులో కట్పడి జంక్షన్ ప్రధానమైనది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి వెల్లూరు కు రైళ్ళు కలవు.
విమాన మార్గం : వెల్లూరు సమీప విమానాశ్రయాలు తిరుపతి - 120 కి.మీ., చెన్నై - 130 కి.మీ., బెంగళూరు - 224 కి.మీ.
PC: Shyamsharai

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X