Search
  • Follow NativePlanet
Share
» »భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ రహస్యాలు..అవశేషాలు..!

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ రహస్యాలు..అవశేషాలు..!

భీమునిపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. భారతదేశంలో రెండవ పురపాలక సంఘం (మునిసిపాలిటీ) ఆంధ్ర ప్రదేశ్‌లోని మొట్టమొదటి మునిసిపాలిటీ.

By Venkatakarunasri

భీమునిపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. భారతదేశంలో రెండవ పురపాలక సంఘం (మునిసిపాలిటీ) ఆంధ్ర ప్రదేశ్‌లోని మొట్టమొదటి మునిసిపాలిటీ (భారత దేశంలో మొట్టమొదటి మునిసిపాలిటీ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం). ఇప్పటికి కుడా మునిసిపాలిటీ కార్యాలయం పెంకులతో నిర్మించబడి ఉంటుంది. ప్రాంతీయులు ఈ గ్రామాన్ని భీమిలి అని పిలుస్తారు. భీమిలి విశాఖపట్టణానికి 24 కి.మీ. దూరంలో విశాఖ-భీమిలి బీచ్ రోడ్డుపై చివరిన ఉంది. భీముని పట్టణం పశ్చిమం వైపు ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపు సముద్రతీరానికి వచ్చేటప్పటికి పల్లం కావడం వల్ల భీమిలి పట్టణం పశ్చిమం నుండి తూర్పుకు సముద్రతీరం వైపు చూస్తే కనిపించే ప్రకృతి దృశ్యం అత్యంత రమణీయంగా ఉంటుంది.

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

ఈ పట్టణంలోని లాటిరైటు శిలలపై ప్రాచీనమైన బౌద్ధకేత్రం పావురాళ్ళకొండ ఉంది. ఈ కొండ దిగువన తూర్పునకు నరసింహ స్వామి దేవాలయం ఉంది. ఇంకో విశేషం ఇక్కడ ఇప్పటికీ డచ్ వారి వలస స్థావర అవశేషాలు ఉన్నాయి. భీమిలి బీచ్ లోతు ఉండదు కాబట్టి ఈత కొట్టడం క్షేమదాయకం.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

బుద్ధుని అవశేషాలలోని ఎనిమిదవ భాగం భీమిలి సమీపంలోని తిమ్మాపురం బావికొండ బౌద్ధకేత్రంలో లభ్యమైందట.1641వ సంవత్సరంలో హైదరాబాదు నవాబు అబ్దుల్లా కులీకుతుబ్‌ షా నుండి అనుమతి పొందారు డచ్‌ దేశస్థులు.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

1754లో జరిగిన మరాఠీ దాడుల్లోనూ, 1781 లో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ల మధ్య జరిగిన యుద్ధంలోనూ డచ్‌కోట పాక్షికంగా ధ్వంసమైంది. 1825 లో భీమిలి రేవు పట్టణం బ్రిటిష్‌వారి వశమైంది. 1854లో రిప్పన్‌ కంపెనీని ప్రారంభించారు.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలిలో చూడదగ్గ ప్రదేశాలు

పావురాళ్ళకొండ లేదా పావురాళ్ళబోడు భీమునిపట్నం వద్ద నరసింహస్వామి కొండగా ప్రసిద్ధమైన కొండ యొక్క స్థానికనామం. ఈ కొండ సముద్రమట్టానికి 150 మీటర్ల ఎత్తున ఉంది. పావురాళ్ళకొండ, ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల దొరికిన ముఖ్య క్షేత్రం, ఇక్కడ బౌద్ధ విహారం యొక్క శిథిలాలు ఉన్నాయి.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

ఇక్కడ క్రీ.పూ మూడవ శతాబ్దం నుండి క్రీ.శ రెండవ శతాబ్దం వరకు జనవాసాలు ఉండి ఉండవచ్చని అంచనా. ఉత్తర తీరాంధ్రలోని అతిపెద్ద బౌద్ధ విహార క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ కొండపై నున్న క్షేత్రంలో హీనయాన బౌద్ధం ప్రభవించి ఉండవచ్చు.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

కాకినాడకు శ్రీకాకుళానికి మధ్య నిర్మించబడిన ఎనిమిది దీప స్తంభాలలో (లైటు హౌసు) ఇది ఒకటి. ఈ దీప స్తంభం 18 వ శతాబ్దపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్ని తెలుపుతుంది. సముద్రతీరమందు భీముని పట్టణమున్నది. ఇందులో మునసబు వగైరాల ఖచేరీలున్నవి. దొరలు సైతమున్నారు. రేవుస్థలమైనందున ధనిక వర్తక భూయిష్టమైయున్నది. ఇది కొండదిగువనున్నందున నిమ్నోన్నతముగా నున్నది.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలి ఆకర్షణలు

పావురాళ్ళకొండ లేదా పావురాళ్ళబోడు భీమునిపట్నం వద్ద నరసింహస్వామి కొండగా ప్రసిద్ధమైన కొండ యొక్క స్థానికనామం. ఈ కొండ సముద్రమట్టానికి 150 మీటర్ల ఎత్తున ఉంది. పావురాళ్ళకొండ, ఆంధ్ర ప్రదేశ్
బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల దొరికిన ముఖ్య క్షేత్రం, ఇక్కడ బౌద్ధ విహారం యొక్క శిథిలాలు ఉన్నాయి.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

ఇక్కడ క్రీ.పూ మూడవ శతాబ్దం నుండి క్రీ.శ రెండవ శతాబ్దం వరకు జనవాసాలు ఉండి ఉండవచ్చని అంచనా. ఉత్తర తీరాంధ్రలోని అతిపెద్ద బౌద్ధ విహార క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ కొండపై నున్న క్షేత్రంలో హీనయాన బౌద్ధం ప్రభవించి ఉండవచ్చు.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

పావురాళ్లకొండపైన ఉన్న భీమిలి నరసింహస్వామి ఆలయం

1226 శాలివాహన శకంలో ఈ దేవస్థాన పునరుద్ధరణ మింది రామ రమజోగి చేత జరిగింది. ఆ తరువాత ముగుగప్ప శెట్టి, అలగప్ప శెట్టి స్వామి వారికి కాంస్య కవచాన్ని బహుకరించారు. నారాయణుని దశావతారాలలో నర, మృగ మిశ్రమ రూప అవతారం ఇదొక్కటే.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

మన రాష్ట్రంలో నారసింహ మూలక్షేత్రాలు, 32 క్షేత్రాల పరంపరలో, చివరిదిగా విరాజిల్లుతున్న క్షేత్రం, భీమునిపట్నంలోని ప్రహ్లాద వరద శ్రీకాంత నృసింహస్వామి దివ్యసన్నిధి. లక్ష్మీనారాయణ స్వరూపంగా నృసింహుడు అలరారే ఈ దేవస్థానంతోపాటు, భీమసేన ప్రతిష్ఠిత భీమేశ్వరాలయం గూడా ఇక్కడే ఉంది.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

16-18 శతాబ్ధాల మధ్య ఐరోపా ఖండం వారు భారతదేశానికి వర్తకం చేసుకోవడానికి వచ్చిన భాగంగా భీమిలిలో డచ్ వారు దిగారు. 1624 డచ్ వారు ఇక్కడ మొదట వలస వచ్చినప్పుడు ప్రాంతీయులకు డచ్ వారికి మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలలో 101 మంది డచ్ సైనికులు 200 మంది ప్రాంతీయులు మరణించారు (విశాఖ శాసనాల వల్ల తెలుస్తోంది).

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

ఆ తరువాత ప్రాంతీయులకు డచ్ వారికి సంధి కుదిరి వర్తకం చేసుకోవడానికి 1661లో 4 కొమంలతో ఒక కోట 234*400 వైశాల్యంతో నిర్మించుకొన్నారు. ఈ కోట ఇప్పుడు శిథిలమై పోయి అవశేషాలు మిగిలాయి. ఈ కోటలో గడియార స్తంభం, టంకశాల ఉన్నాయి. పట్టణ మధ్యలో ఉన్న ఈ గడియార స్థంబాన్ని ప్రతి పర్యాటకుడు దర్శించి తీరాలి.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

1855-1864 సంవత్సరాల మధ్య ఈ చర్చి నిర్మాణం రాయి రెవరెండు జాన్ గ్రిఫిన్స్ ద్వారా అప్పటి జిల్లా కలక్టరు మరియు జిల్లా మెజిస్ట్రేటు రాబర్ట్ రీడ్ ఆధ్వర్యంలో జరిగింది. తరువాత 17-3-1864 న భిషప్ గెల్ చేత ఈ చర్చి తెరువబడింది.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

ఈ చర్చి నిర్మాణ శైలి, లోపలి వస్తువులు, తూర్పు కిటికి మీద ఏసుక్రీస్తుని శిలువ వేస్తున్న సంఘటను చిత్రించిన విధానం చాల విశేషంగా ఉంటుంది. ఈ చర్చిలో ఎంతో కాలం ముందు నిర్మించిన పాలరాతి శిల్పాలు నేత్రానందాన్ని అందిస్తాయి.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

పట్టణానికి పశ్చిమంగా నిర్మించబడిన ఈ శ్మశానవాటిక డచ్ వారి ఈ పట్టణంలో నివసించారని చెప్పడానికి, వారి జీవితం ఇక్కడే పూర్తి చేసారని చెప్పడానికి ఋజువు. ఈ శ్మశానంలో వారిని ఖననం చేసిన ప్రదేశంలో వారి మరణానికి కారణాలను తెలుపుతూ రాతి ఫలకాలు ఉన్నాయి.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

అతిథి గృహం

ఈ అతిథి గృహం చిట్టివలస జూట్ కర్మాగారం ఆధీనంలో ఉంది. పూర్వం ఈ అతిథి గృహంలో ఇంపీరియల్ బ్యాంకు ఉండేది. ఆ తరువాత ఈ గృహాన్ని చిట్టివలస ఝూట్ మిల్లు వారు దత్తత తీసుకొని ఈ గృహం చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

ఈ పట్టణ వైభవాన్ని చెప్పడానికి ఈ అతిథి గృహం ఒక తార్కాణం. భీమిలి దర్శించడానికి వచ్చిన ప్రతి సందర్శకుడు ఈ అతిథి గృహాని చూసి తీరవలసిందే. మునిసిపాలిటీ సత్రం రెండు రాళ్లపై మద్రాసు పెంకులతో కట్టబడింది.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

పురపాలక సంఘ కార్యలయము మరియు నౌకాశ్రయ రవాణా కార్యాలయం ఒకే సముదాయములో ఉన్న ఈ రెండు భవనాలు ఇక్కడి నౌకాశ్రయము యొక్క ఎగుమతులు మరియు దిగుమతుల పూర్వవైభవాన్ని గుర్తు చేస్తాయి. ఈ విశాల భవనాలలో ఎత్తైన పైకప్పుతో ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలి దీపస్తంభం

కాకినాడకు శ్రీకాకుళానికి మధ్య నిర్మించబడిన ఎనిమిది దీప స్తంభాలలో (లైటు హౌసు) ఇది ఒకటి. ఈ దీప స్తంభం 18 వ శతాబ్దపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్ని తెలుపుతుంది. పట్టణ ముఖ్య రహదారిపై ఉన్న దేవాలయ సముదాయంలో ఉన్న ప్రాచీన దేవాలయం 1170 శాలివాహన శకంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దీనికి అనుబంధంగా చోళేశ్వరాలయం చోళులచే నిర్మించబడింది.

pc:youtube

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

భీమిలీ పావురాళ్ళ కొండలో బయటపడ్డ అవశేషాలు !

ఎలా వెళ్ళాలి?

భీమిలీ నుండి విశాఖకు తరచూ ఆర్.టి.సి. సిటి బస్సులు 999 మరియు 900Tమరియు 900k నడుస్తుంటాయి. 24 కి.మీ.ల పొడవున్న ఈ బీచ్ రోడ్డు భారతదేశంలోని పెద్ద బీచ్ రోడ్డులలో ఒకటిగా చెబుతారు. ద్విచక్రవాహనాల పైన కూడా విశాఖ నుండి భీమిలికి చేరు కొవచ్చు. విశాఖ నుండి తరచు అద్దె కారులు అందుబాటులోవుంటాయి.

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X