Search
  • Follow NativePlanet
Share
» »తెలంగాణ జైల్లో ఒకరోజు ... కేవలం రూ.500/- మాత్రమే!

తెలంగాణ జైల్లో ఒకరోజు ... కేవలం రూ.500/- మాత్రమే!

By Staff

జైలు .. ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది ఖైదీలు. పైన తెల్లని చొక్కా, దాని మీద నెంబరు, కింద తెల్ల నిక్కర, నెత్తిన తెల్ల టోపీ ఇంతేనా .. ఇంకేమైనా మరిచిపోయామా ? (వీఐపీలకు ఇవి వర్తించవులెండీ..!) వీరి జైలు జీవితం వర్ణణాతీతం. సినిమాల్లో ఖైదీల జీవితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కానీ ... నిజ జీవితంలో ఎలా ఉంటుందో, వారి బ్రతుకులు ఎలా ఉంటాయో చాలా మందికి తెలీవు.

జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం, ఆసక్తి చాలా మందికి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం స్వయంగా గడిపి తెలుసుకుంటే పోలా ? అవునండీ మీరు విన్నది నిజమే! స్వయంగా జైలు జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ నడుంబిగించింది.

రాజమండ్రి సెంట్రల్ జైలు తరువాత అంతటి గొప్ప చరిత్ర సంగారెడ్డి జైలుదే ! దేశంలోనే మొదటి మ్యూజియం కమ్ జైలు ఇదే. ఇది పురాతనమైనది. దీనిని నిజాం నవాబులు కట్టించారు. దీని చరిత్రలోకి ఒకసారి తొంగి చూస్తే ...

సంగారెడ్డి కేంద్ర కారాగారం

సంగారెడ్డి కారాగారం

చిత్ర కృప : oneindia telugu

చరిత్ర

నిజాం నవాబులు క్రీ. శ.1798 లో దీనిని ఒక గుర్రపుశాల కోసం నిర్మించగా, ఆతర్వాత బ్రిటీష్ వారు దీనిని జైలుగా మార్చారు. ఇది మొత్తం 4 ఎకరాల విస్తరించగా, జైలు ను ఒకటిన్నర ఎకరాల్లో నిర్మించారు. 2010 లోనే మ్యూజియం గా మార్చాలనుకున్నప్పటికీ, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంతో కల సాకారం అయ్యింది.

మ్యూజియం లో ఇలా ...

సంగారెడ్డి కారాగారం లో పదుల సంఖ్యలో బ్యారక్ లు ఉన్నాయి. ఒక్కోక్కింటిలో తెలంగాణ చరిత్ర, మొఘల్ చరిత్ర, నిజాం చరిత్ర, భారత స్వాతంత్య్ర ఉద్యమ సంఘటనలు పెయింటింగ్ వేయించారు. బ్రిటీష్ కాలం నాటి ఫోటోలు కూడా గదులలో చూడవచ్చు. టైపు రైటర్ లు, అప్పటి రేడియోలు, పెన్నులు, వాల్ క్లాక్ లు, గంటలు .. ఇలా ప్రతి వస్తువు ప్రదర్శనకై ఉంచారు.

మ్యూజియంలో పదర్శనకై ఉంచిన కళాత్మక వస్తువులు

మ్యూజియంలో పదర్శనకై ఉంచిన కళాత్మక వస్తువులు

చిత్ర కృప : Indian Eagle

జైల్లో ఒకరోజు ఇలా గడపండి

ఈ జైలు కేవలం మ్యూజియం మాత్రమే కాదు, జైలు జీవితాన్ని దగ్గర నుండి చూడాలనుకొనేవారికి ఒక చక్కటి ఉదాహరణ. దీనికి రోజుకు అద్దె రూ. 500/-. టికెట్ తీసుకొని లోనికి వెళ్ళాలి. సాధారణ ఖైదీలలాగే మీకూ ఖాదీ దుస్తులు, చొక్కా, నిక్కర లేదా ప్యాంట్, ప్లేట్, గ్లాస్, మగ్గు, సబ్బు మొదలైనవి ఇస్తారు.

జైల్లో టైం అంటే టైమే !

సంగారెడ్డి మ్యూజియం జైలులో ఒకరోజు ఖైదీలుగా ఉండేందుకు వచ్చే వారికి మంచి భోజనం, శుభ్రమైన జైలు గది, నిద్రించేందుకు దుప్పట్లను ఇస్తారు. టీ, టిఫిన్‌తో పాటు సాధారణ ఖైదీల మాదిరిగా యోగా, క్రమశిక్షణ, ఆసక్తిని బట్టి ఇతర విద్యాబుద్ధులు నేర్పిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాకప్‌లో ఉంచుతారు.

జైలు లోపలి భాగం

జైలు లోపలి భాగం

చిత్ర కృప : Hyderabad And Global ..

దినచర్య

ఉదయం 6.30 గంటల నుంచి వ్యాయామం, యోగా శిక్షణ ప్రారంభమవుతుంది.

7.30 గంటలకు టీ తో పాటు టిఫిన్ (చపాతీ/ చిత్రన్నాం) ఇస్తారు. ఆతర్వాత పరేడ్ నిర్వహిస్తారు.

8 :00 నుంచి 9.30 గంటల వరకు విద్యాదానం కార్యక్రమం, 9.30 గంటలకు మ్యూజియం పర్యవేక్షణ అధికారి రౌండ్‌కు వస్తారు.

ఉదయం 10:30 నుంచి 11:00 గంటల వరకు మధ్యాన భోజన సమయం (పప్పు, సాంబార్/ రసం, అన్నం వడ్డిస్తారు).

11:00 గంటల నుంచి తిరిగి విద్యాదానం కార్యక్రమం కొనసాగుతుంది.

శిక్షించే గది

శిక్షించే గది

మధ్యాహ్నం 12.30 గంటలకు టీ, 12.35 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి.

1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరిగి విద్యాదానంలో భాగంగా ఖైదీల ఆసక్తిని బట్టి కంప్యూటర్ విద్య, ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తారు.

సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు యోగా, 4.30 గంటల నుంచి బ్యారక్‌ను శుభ్రం చేసుకోవడం వంటి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి.

సాయంత్రం 5.30 గంటలకు భోజనం (అన్నం, రసం, ఒక కూర, పెరుగు వడ్డిస్తారు) ముగిసిన తర్వాత తిరిగి 6 గంటలకు లాకప్ చేస్తారు.

ఇక్కడి వచ్చేవారు యాత్రికులు/పర్యాటకులు కనుక ఖైదీలులా పనిచేయనక్కర్లేదు వారికి గుర్తుగా మొత్తను నాటితే చాలు.

జైలు గోడలు

జైలు గోడలు

ఎలా చేరుకోవాలి ?

హైదరాబాద్ సమీప ఎయిర్ పోర్ట్. అక్కడి నుండి బస్సులలో సంగారెడ్డి చేరుకోవచ్చు. తెలంగాణ లోని ప్రధాన పట్టణాల నుండి సంగారెడ్డి కి ప్రభుత్వ బస్సులు నడుస్తాయి. కామారెడ్డి, కాచిగూడ, సికింద్రాబాద్ లు సమీప రైల్వే స్టేషన్ లుగా కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X