» »ఫణిగిరి - తెలంగాణ బౌద్ధ క్షేత్రం !

ఫణిగిరి - తెలంగాణ బౌద్ధ క్షేత్రం !

Written By: Venkatakarunasri

ఫణిగిరి, నల్గొండ పట్టణం నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బౌద్ధ ప్రాంతం. ఆంద్ర ప్రదేశ్ పురావస్తు, మ్యూజియాల శాఖ వారు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన తర్వాత ఈ మధ్య కాలంలో కనుగొనబడింది.ఫణిగిరి లో ఒక పెద్ద స్తూపం ఉన్న ఒక పెద్ద సముదాయం, స్తూపాలు నిర్మించిన రెండు పెద్ద సభామందిరాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

ఈ ప్రాంతపు పరిమాణాన్ని బట్టే ఈ ప్రాంతం బౌద్ధ కేంద్రంగా ఎంత ప్రాముఖ్యత కల్గిందో తెలుసుకోవచ్చు. ఈ సముదాయంలో నేల మీద ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉన్న పెద్ద పాదముద్రలు బుద్ధనివిగా భావిస్తున్నారు. ఈ సముదాయంలో బౌద్ధ సన్యాసులకు చెందిన విహారాలు అనే నివాస ప్రదేశాలు మూడు ఉన్నాయి. ఫణిగిరి బౌద్ధ ప్రాంతం పాము పడగ కొండగా ప్రసిద్ది చెందిన ఒక కొండ పైన ఉంది. ఈ కొండ ఆకారం పాము పడగను పోలి ఉండటం వలన దీనికా పేరు వచ్చింది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో తప్పక చూడవలసిన 25 ప్రదేశాలు !

ఫణిగిరి - తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదుకు 140కిమీల దూరంలో వున్న ఒక బౌద్ధ ప్రాంతం. ఫణి అనగా పాము, గిరి అనగా కొండ పాము పడగ ఆకారంలో వున్న కొండ కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఈ ఫణి గిరికి 2000 ఏళ్ల నాటి ఘనచరిత్ర వుంది. ఈ ప్రాంతపు పరిమాణాన్ని బట్టి ఇది ఒకప్పుడు బౌద్ధకేంద్రంగా విరాజిల్లిందని చెప్పుకోవచ్చును.

ఇది కూడా చదవండి: తెలంగాణలోని నల్గొండలో అంతుచిక్కని మిస్టరీ చెట్టు !!

ఈ సముదాయంలో నేల మీద ఒక ప్రత్యేక ప్రాంతంలో వున్న పాద ముద్రలు బుద్ధునివిగా భావిస్తున్నారు. 2001 నుంచి 2007 వరకు ఆరేళ్ళ పాటు జరిగిన త్రవ్వకాలలో మహాస్తూపం, చైత్య గృహాలు,ఉద్దేశిక స్తూపాలు, బుద్ధుని ప్రతిమలు, బౌద్ధుని చిహ్నాలు, జాతక కథలు, సిద్ధార్థ గౌతముని జీవిత ఘట్టాలు మలచిన అపురూప శిల్పాలు, శాతవాహనుల క్షేత్రాలు, ఇక్ష్వాకుల,మహావీరుల నాణేలు,మట్టి, సున్నపు బొమ్మలు,పూసలు లభించాయి.

ఇది కూడా చదవండి: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు !

ఉత్తరభారతదేశాన్ని దక్షిణాపథంతో కలిపే ఒకప్పటి జాతీయరహదారిపై వెలసిన ఫణిగిరి హీనయాన, మహాయాన బౌద్ధశాఖలకు నిలయమై ప్రసిద్ధ బౌద్దాచారుల ఆవాసాలకు నిలయమై ప్రసిద్ధ బౌద్దాచార్యులకు ఆవాసంగా ఉన్నట్లు తెలిపే ఆధారాలు దొరికాయి. ఈ మధ్య చేపట్టిన తవ్వకాలలో తొలిసారిగా 7వ రోమన్ చక్రవర్తి నిర్వ క్రీ.శ.96 - 98 మధ్యకాలంలో ,మధ్యకాలంలో విడుదల చేసిన 7.3గ్రాముల బంగారు నాణెం బయటపడింది. ప్రస్తుతం ఫణిగిరి గ్రామంలోని ఒక ఇంట్లో భద్రపరచటం జరిగింది.

టాప్ ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

రెండవ భద్రాద్రి

రెండవ భద్రాద్రి

రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఈ కొండకు దిగువున వున్న మెలిక ప్రదేశంలో వుంది. ఇది కాకతీయుల కాలంలో ఎంతో పేరుప్రతిష్టలతో నిత్య ధూప, నైవేద్యాలతో విరాజిల్లుతూ వుండేది. ఇక్కడ జాతరలు కూడా నిర్వహించేవారు. చుట్టుప్రక్కల ఇంత పెద్ద ఆలయం మరొకటి లేదు.

pc:youtube

మూడు నిర్మాణాలు

మూడు నిర్మాణాలు

ఆలయం చుట్టూ రాతికట్టడాలు, పెద్దపెద్ద రాతి స్థంభాలు, కళ్యాణ మండపం, కోనేరు,ద్వారపాలకులు, ఆంజనేయస్వామి విగ్రహం,శివలింగం, నాగదేవత చుట్టూ చెట్లు పచ్చని ప్రకృతితో ఒకనాడు అద్భుతంగా వుండేది. ఫణిగిరి కొండకు దిగువన ఒక కి.మీ దూరంలో మనకు 3 నిర్మాణాలు కనిపిస్తాయి.

pc:youtube

ఆధారాల ప్రకారం

ఆధారాల ప్రకారం

ఫణిగిరి వాస్తవ్యులైన ఆనాటి పెద్దలు చెప్పిన ఆధారాల ప్రకారం ఈ నిర్మాణాలు బ్రిటీష్ వారు నిర్వహించిన జైలు గదులుగా ఆ తర్వాత నిజాం ప్రభుత్వ కాలంలో బందిఖానాలుగా భావించటమైనది.

pc:youtube

పాము పడగ కొండగా

పాము పడగ కొండగా

ఫణిగిరి బౌద్ధ ప్రాంతం పాము పడగ కొండగా ప్రసిద్ధి చెందిన ఒక కొండ పైన ఉంది. ఈ కొండ ఆకారం పాము పడగను పోలి ఉండటం వలన దీనికా పేరు వచ్చింది

హైదరాబాద్ కు 50 KM దూరంలో మొసళ్ళ శాంక్చురి చూసొద్దామా !!

pc:youtube

రెండో భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం

రెండో భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం

తెలంగాణ రాష్ట్రంలో రెండో భద్రాద్రిగా పేరు గాంచిన మండలంలోని ఫణిగిరి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. ఇది కాకతీయుల కాలంలో ఎంతో పేరు ప్రతిష్ఠలతో, నిత్య దూపదీప నైవేద్యాలతో విరజిల్లుతూ జాతరలు కూడా నిర్వహించేవారు.

pc:youtube

అద్భుతమైన పచ్చని ప్రకృతి

అద్భుతమైన పచ్చని ప్రకృతి

చుట్టు ప్రక్కల ఇంత పెద్ద ఆలయం మరోకటి లేదు. ఆలయం చుట్టూ రాతి కట్టడాలు, పెద్ద పెద్ద రాతిస్తంభాలు, కల్యాణమండపం, కోనేరు, ద్వారా పాలకులు, తేరు, ఆంజనేయ స్వామి విగ్రహాం, శివలింగం, నాగదేవత, చుట్టూ చెట్లు, పచ్చని ప్రకృతితో అద్భుతంగా ఉండేది.

pc:youtube

బౌద్ధం ఆనవాళ్ళు

బౌద్ధం ఆనవాళ్ళు

2001 నుంచి 2007 వరకు ఆరేళ్ళ పాటు జరిపిన తవ్వకాల్లో మహాస్తూపం, చైత్యగృహాలు, ఉద్దేశిక స్తూపాలు, బుద్ధుని ప్రతిమలు, బౌద్ధచిహ్నాలు, జాతక కథలు, సిద్ధార్థ, గౌతముని జీవిత ఘటాలు మలిచిన అపురూప శిల్పాలు, శాత వాహన క్షేత్రాలు, ఇక్ష్వాకుల, మహావీరుల నాణలు, మట్టి, సున్నపు బొమ్మలు పూసలు లభించాయి.

pc:youtube

హీన యాన, మహాయాన బౌద్ధ శాఖలు

హీన యాన, మహాయాన బౌద్ధ శాఖలు

ఉత్తర భారత దేశాన్ని దక్షణ పథంతో కలిపే ఒకప్పటి జాతీయ రహదారిపై విలసిల్లిన ఫణిగిరి, హీన యాన, మహాయాన బౌద్ధ శాఖలకు నిలయమై ప్రసిద్ధ బౌద్ధాచార్యుల ఆవాసంగా ఉన్నట్లు తెలిపే ఆధారాలు దొరికాయి.

pc:youtube

బంగారు నాణం

బంగారు నాణం

ఈ మధ్య చేపట్టిన తవ్వకాల్లో తొలిసారిగా ఏడవ రోమన్‌ చక్రవర్తి నెర్వ క్రీ.శ 96-98 విడుదల చేసిన 7.3 గ్రాముల బరువు గల బంగారు నాణం బయటపడింది.

pc:youtube

శాసనాలూ, ఆధారాలూ

శాసనాలూ, ఆధారాలూ

శ్రీ పర్వత, విజయపురిలను పాలించిన ఇక్షాక రాజు ఎహువల శాంతమూలుని 18 వ పాలన కాలానికి సంబంధించిన శాసనాలు ఇక్కడ లభించాయి. ఇంత వరకు ఆ రాజు 11 సంవత్సరాలు మాత్రమే పాలించిన ఆధారాలు లభించగా 18 ఏళ్లు ఆ రాజు పాలించాడని తెలిపే శాసనం ఇక్కడ లభించింది అదే శాసనంలో శ్రీ కృష్ణుని ప్రస్తావన కూడా ఉంది ఇలా కృష్ణుని పేర్కొన్న తొలి శాసనం కూడా ఫణిగిరి దగ్గర దొరకడం మరో ప్రత్యేకత

pc:youtube

పర్యాటక కేంద్రం

పర్యాటక కేంద్రం

ఈ బౌద్ధారామాన్ని సందర్శించడానికి చైనా, భూపాల్, భూటాన్, శ్రీలంక, బ్రిటన్ తదితర దేశాలనుండి బుద్ధుని చరిత్ర పై పరిశోధనలు చేయడానికి వేలాదిమంది విద్యార్థులు, పరిశోధకులు, బౌద్ధ్ద సన్యాసులు, పర్యాటకులు ఇక్కడ వస్తుంటారు.

pc:youtube

తవ్వకాలలో బంగారునాణెం

తవ్వకాలలో బంగారునాణెం

సాధారణంగా బౌద్దరామాల్లో బంగారానికి సంబంధించిన వస్తువులు లభించవు. కాని ఇక్కడ 7వ రోమన్ చక్రవర్తి నెర్వి (క్రీ.శ. 96-98) విడుదల చేసిన 7.3 గ్రాముల బరువుగల బంగారునాణెం బయటపడింది. అంటే ఇక్కడ నుంచి బౌద్ధులు రోమ్‌కు వ్యాపారలావాదేవీలు జరిపారనేది తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: యాదగిరి దర్శనం - వారాంతపు విహారం !

pc:youtube

కొండ పక్కనే చెరువు

కొండ పక్కనే చెరువు

ఫణిగిరి కొండపైన బౌద్ధారామం కింద కోదండరామ స్వామి అలయం పక్కనే పెద్ద చెరువు రాతిగుట్టల మధ్య ఉండడం గొప్ప విశేషం. నిజానికి ఇది మూడు చెరువుల కలయిక. ఒక చెరువు పై నుండి ఎస్సారెస్పి కాలువ వెలుతుండడంతో ప్రతి యేటా ఈ చెరువు నీటితో కళకళలాడుతుంది. ఈ చెరువును అభివృద్ది చేస్తే పర్యాటకులు ఇందులో బోటింగ్ చేసే అవకాశం లభిస్తుంది.

pc:youtube

బౌద్ధారామాలు

బౌద్ధారామాలు

బౌద్ధ సన్యాసులకు చెందిన విహారాలు అనే నివాస ప్రదేశాలు మూడు ఉన్నాయి. ఫణిగిరి బౌద్ధ ప్రాంతం పాము పడగ కొండగా ప్రసిద్ధి చెందిన ఒక కొండ పైన ఉంది. ఈ కొండ ఆకారం పాము పడగను పోలి ఉండటం వలన దీనికా పేరు వచ్చింది ఈ ఫణిగిరికి రెండువేల ఏళ్ల నాటి ఘనచరిత్ర ఉంది. అలనాటి ఫణిగిరి వైభవాన్ని ఇక్కడ ఉన్న బౌద్ధ అవశేషాల ద్వారా, చైతన్య గృహాల ద్వారా, స్థూపాల ద్వారా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఆలయం దర్శించదగినది. ఇక్కడ కట్టడాలన్నీ బలంగా, గట్టిగా ఎంతో ప్రామాణికంగా ఉండేవి.

pc:youtube

రక్షణలేని సంపద

రక్షణలేని సంపద

కొండ పై జరిగిన తవ్వకాలలో బయల్పడిన బౌద్ధ శిల్పాలు, సీసపు నాణేలు లాంటి ఎన్నో విలువైన వస్తుసంపదకు ప్రత్యేక మ్యూజియం లేకపోవడంతో వీటి కి రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ దొరికిన విగ్రహాలను కొన్నింటిని పానగల్లు మ్యూజియంలో మరికొన్నింటిని హైదరాబాద్‌లోని మ్యూజియంకు తరలించారు.

pc:youtube

పర్యాటక శాఖ

పర్యాటక శాఖ

మిగిలిన వాటిని గ్రామంలోని ఓ పాత భవనంలో వుంచారు. ఘనమైన చరిత్ర వున్నా అటు ఆర్కియాలజీ శాఖ కాని, ఇటు దేవదాయ శాఖ, పర్యాటక శాఖగాని పట్టించుకోకపోవడంతో భావితరాలకు నాటి సంస్కృతి అందకుండా శిథిలమైపోతున్నదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు

pc:youtube

ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

ఈ గ్రామానికి సమీపములో వున్న గ్రామము సూర్యాపేట. ఇది 40కి.మీ. దూరములో ఉంది. ఇక్కడి నుండి పరిసర గ్రామాలకు రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది. ఈ గ్రామానికి 10 కి.మీ. సమీపములో రైలు వసతి లేదు. కాని ఖాజీపేట రైల్వే స్టేషను 62 కి.మీ దూరములో ఉంది. ఇక్కడి నుండి ఇతర సుదూర ప్రాంతాలకు రైలు రవాణ వసతి ఉంది. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫణిగిరికి రోడ్డుమార్గాన చేరుకోవచ్చు. సూర్యాపేట నుంచి 40 కిలోమీటర్ల దూరం, వరంగల్ నుంచి 82 కిలోమీటర్లు, నల్గొండ నుంచి 84 కిలోమీటర్లు దూరం ఉంది. సమీప రైల్వే స్టేషన్ నల్గొండ

PV: google maps