• Follow NativePlanet
Share
» »కాకినాడ సమీపాన సముద్రంలో అద్బుతమైన ద్వీపం !

కాకినాడ సమీపాన సముద్రంలో అద్బుతమైన ద్వీపం !

కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం. కాకినాడ తీర ప్రాంతం అంతా హోప్ ఐలాండ్ చేత పరిరక్షింపబడుతున్నది. సముద్రపు (బంగాళా ఖాతము) ఆటుపోట్ల నుండి తీరము కోత కొయ్యబడకుండా ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఈ హోప్ ఐలాండ్ ఏర్పడిందని తెలుస్తున్నది. ఈ హోప్ ఐలాండ్ తీరం వెంబడి 23 కి.మీల మేర విస్తరించి ఉంది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ హోప్ ఐలాండ్ వల్ల ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉండగల్గుతున్నాయి.

కాకినాడ పేరు మొదట కాకి నందివాడ అని ఉండేదని, అది కాలక్రమముగా కాకినాడగా నామాంతరం చెందిందని చెబుతారు. స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం కాకినాడ పేరు కొకనాడగా చలామణి అయ్యింది. త్రేతాయుగంలో ఇది పెద్ద అరణ్యం దీన్నీ కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు.

ఇది కూడా చదవండి:కష్టాలు తొలగించే అయినవిల్లి గణపతి !!

వనవాసం చేస్తున్న సీతను కాకి రూపంలో వేధించినపుడు రాముడు అతనిని సంహరించాడు, అతని పేరున ఈ వనం వెలిసినది. ఇక్కడకి మొదట డచ్ వారు వర్తకం చేసుకొనడానికి వచ్చి వారి స్థావరం ఏర్పరచుకొన్నారు. వారి తరువాత ఆంగ్లేయులు వారి స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు.తరువాత కెనడియన్‌ బాప్తిస్టు క్రైస్తవ మిషనరీలు ఇక్కడకి వచ్చారు. వారు కాకినాడ నగరాన్ని చూసి ఇది అచ్చు వారి కెనడ నగరాన్ని తలపించడంతో వారు ఈ నగరాన్ని కోకెనడ అని పిలిచెవారు అది కాలక్రమంగా కాకినాడగా వాడుకలోకి వచ్చింది.

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

హోప్ ఐలాండ్

హోప్ ఐలాండ్

కాకినాడ తీరం నుండి 5 కి.మీ ల దూరంలో ఉన్న హోప్ ఐలాండ్, వలన కాకినాడ సహజసిద్ధమైన ఓడరేవు అయ్యింది. ప్రస్తుతం కాకినాడలో రెండు ఓడరేవులు పనిచేస్తున్నాయి. కాకినాడ లంగరు రేవు,కాకినాడ డీప్ వాటర్ రేవు.

pc:youtube

రెండవ పెద్ద ఓడరేవు

రెండవ పెద్ద ఓడరేవు

కాకినాడ డీప్ వాటర్ రేవు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ఓడరేవు తర్వాత రెండవ పెద్ద ఓడరేవు మరియు ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించిన మొదటి ఓడరేవు. ఇది కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా నిర్వహింపబడుతోంది.

అన్నవరం - సత్యనారాయణ స్వామి కొలువుదీరిన క్షేత్రం !!

pc:youtube

ఐలాండ్

ఐలాండ్

ఐలాండ్ అంటే ద్వీపం. చుట్టూ నీరు వుంది మధ్యలో భూభాగం వుండే ప్రదేశం ద్వీపం. అయితే వీటిలో వుండే రెండు రకాలు 1.నదీ ద్వీపాలు, 2. సముద్రద్వీపాలు. ఇలాంటి ద్వీపమే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సముద్రం మధ్యలో వుంది.

pc:youtube

కాకినాడ బీచ్

కాకినాడ బీచ్

కాకినాడ బీచ్ నుండి సముద్రం మీదుగా వెళ్లి ఈ ద్వీపాన్ని చూడటానికి అన్ని వసతులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. హోప్ ఐలాండ్ గా పిలిచే ఈ ద్వీపానికి వచ్చే పర్యాటకులు కాకినాడ బీచ్ కి చేరుకొని అక్కడి నుండి స్టీమర్స్ లో హోప్ ఐలాండ్ కు చేరుకొని ద్వీపం మొత్తం చూసిరావాలంటే టూరిజం వారి స్టీమర్ పోర్ట్ మార్కెట్ యాడ్ నుండి బయలుదేరుతుంది. కాబట్టి అక్కడికి చేరుకోవాలి.

pc:youtube

స్టీమర్స్

స్టీమర్స్

మరి ఒకళ్ళో,ఇద్దరో కాకుండా పది మంది పైనే వుంటే సరదాగా ఎంజాయ్ చేయటానికి బాగుంటుంది. స్టీమర్స్ నడిపే యాజమాన్యం కూడా మినిమం పది మంది వుండాలని చెప్తారు. ఒక వేళ తక్కువ మంది వున్నా అక్కడికొచ్చే మిగిలినవారితో కలిసి వెళ్ళీ ఏర్పాటుచేస్తారు. వసతులతో కూడిన ఈ ప్రయాణానికి ఒక్కరికి 250రు ఛార్జి చేస్తారు.

pc:youtube

పర్యాటకులని అలరించే ప్రదేశం

పర్యాటకులని అలరించే ప్రదేశం

వెళ్ళటానికి తిరిగి రావటానికి హోప్ ఐలాండ్ లో కాసేపు గడపటానికి అన్నింటికీ కలిపి 2గంటల టైం పడుతుంది. నిజానికి సముద్రమట్టం కంటే ఎత్తులో వున్న ఈ హోప్ ఐలాండ్ పర్యాటకులని అలరించే ప్రదేశం ఒక్కటే కాదు. కాకినాడ తీరప్రాంతమంతా ఈ హోప్ ఐలాండ్ చేత రక్షింపబడుతోంది అంటే నమ్మితీరాలి.

pc:youtube

సముద్రతీరం

సముద్రతీరం

బంగాళాఖాతం ఆటుపోట్ల నుండి సముద్రతీరం కోతకి గురి కాకుండా 500 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ హోప్ ఐలాండ్ కాపాడుతోంది. ఈ ఐలాండ్ కాకినాడ తీరం వెంబడి 25కి.మీ ల దూరం విస్తరించబడివుంది. కాకినాడ సముద్రతీరంలో ఓడలని నిలిపినపుడు కేవలం ఈ హోప్ ఐలాండ్ వల్ల ఓడలు లంగరు వేసినపుడు స్థిరంగా వుంటుంది.

pc:youtube

చక్కగా ఎంజాయ్ చేసి రండి

చక్కగా ఎంజాయ్ చేసి రండి

ఇన్ని ప్రయోజనాలు వున్నహోప్ ఐలాండ్ కాకినాడ సముద్రంలో మధ్యలోవున్న మంచి సురక్షితమైన పర్యాటక ప్రదేశం. కాబట్టి మీరంతా మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్లి చక్కగా ఎంజాయ్ చేసి రండి.

pc:youtube

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం

214 నెంబరు జాతీయ రహదారి నగరం గుండా పోతుంది. రాజమండ్రి, జిల్లాలోని ఇతర పట్టణలను కలుపుతూ రాష్ట్ర రహదారులు ఉన్నాయి.

pc:youtube

రైలు మార్గం

రైలు మార్గం

కాకినాడ మిగిలిన పట్టణాలతో సామర్లకోట -కాకినాడ లూప్-లైన్ ద్వారా కలుపబడి ఉంది. కాకినాడ స్టేషనులలో రైలుబళ్ళన్నీ కాకినాడ నుండే బయలుదేరుతాయి. కాకినాడ నగరంలో నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాకినాడ పోర్ట్, కాకినాడ న్యూపోర్ట్, కాకినాడ టౌన్, సర్పవరం. ఇందులో కాకినాడ పోర్ట్ స్టేషను పూర్తిగా గూడ్స్ బళ్ళకు కేటాయించబడింది.

pc:youtube

రైలు మార్గం

రైలు మార్గం

కాకినాడ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి 564 కి మీ ల దూరంలో ఉంది. చెన్నై - కోల్కతా రైలు మార్గంలో సామర్లకోట దగ్గర బండి మారాలి. ఈ మార్గంలో వెళ్లే బళ్ళలో సుమారుగా అన్నీ సామర్లకోట వద్ద ఆగుతాయి.

pc:youtube

ఆం.ప్ర.రా.రో.ర.సం బస్సులు

ఆం.ప్ర.రా.రో.ర.సం బస్సులు

సామర్లకోట నుండి కాకినాడ ప్రధాన బస్టాండ్ కి ఆం.ప్ర.రా.రో.ర.సం బస్సులు అన్ని వేళలా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాదు, చెన్నై (మద్రాసు), షిర్ది, ముంబాయి, బెంగుళూరులకు నేరుగా రైలు సదుపాయముంది.

pc:youtube

విమాన మార్గం

విమాన మార్గం

కాకినాడకు 65 కి మీ దూరంలో రాజమండ్రి విమానాశ్రయం ఉంది. ఇది చెన్నై, హైదరాబాద్, విజయవాడ, బెంగుళూర్ లకు విమానయాన సేవలను కలిగి ఉంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, జెట్ ఎయిర్ వేస్ మరియు స్పైస్ జెట్ ఇక్కడ ఆపరేటింగ్ ఎయిర్ లైన్స్. ఇతర సమీప ప్రధాన విమానాశ్రయం కాకినాడ నుండి 145 కి మీ దూరంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

ఇది కూడా చదవండి:ఒకప్పటి ఫ్రెంచ్ కాలనీ... నేటి యానాం !!

pc:youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి