» »ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు !

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు !

Posted By: Staff

LATEST: గోవా గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు !

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలైన తెలుగు రాష్ట్రాలలో ట్రెక్కింగ్ స్థావరాలు లేదా ట్రెక్కింగ్ కి పేరుగాంచిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. పర్యాటకులు ముఖ్యంగా సాహస యాత్రలు చేసేవారికి ట్రెక్కింగ్ సర్వసాధారణం. ట్రెక్కింగ్ ను అమితంగా ఇష్టపడే తెలుగు ప్రజలు దేశంలో ఎక్కడో వెళ్ళి ట్రెక్కింగ్ చేయటం కంటే మన రాష్ట్రంలోనే ట్రెక్కింగ్ చేసుకోవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఫ్యామిలీతో వెళ్ళి చూసొచ్చే పర్యాటక ప్రదేశాలు !!

ట్రెక్కింగ్ చేయటం ప్రస్తుత సమాజంలో ఒక రకమైన అనుభూతి. ట్రెక్కింగ్ చేసుకుంటూ గమ్యాన్ని చేరుకోవడం అంటే ట్రెక్కర్లకు ఎంతో ఆనందం, హుషారు. మరి ఇటువంటి ఆనందాన్ని, ఉల్లాసాన్ని తెలుగు ప్రజలు సైతం అనుభవించాలి అంటే ఇక్కడున్న కొన్ని పేరుగాంచిన ట్రెక్కింగ్ ప్రదేశాలతో ఆ సరదాల్ని, సంతోషాల్ని మీకిష్టమైన వారితో పంచుకోండి...

ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ ఏమీ తినాలి ??

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

గుత్తి కోట

గుత్తి కోట

రాయలసీమలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన కోట గుత్తికోట. ఈ కోట హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో గుత్తి పట్టణం సమీపాన కలదు. 300 మీటర్ల ఎత్తున్న కొండ మీద నిర్మించిన గుత్తికోట కు శతాబ్ధాల చరిత్ర ఉన్నది. క్రీస్తు పూర్వమే ఇక్కడ జనావాసం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. అశ్వాలు, ఏనుగులు నీరు తాగటానికి పెద్ద బావి కూడా ఉన్నది. ప్రజల తాగునీటి అవసరాలను గమనించిన రాజులు దుర్గంలో 101 బావులను తవ్వించారు. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ యాత్రలకు చేసేవారికి ఒక చక్కని అనుభూతిని ఇస్తుంది.

అనంతపురం పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Imrx100

ఎలగందల్ కోట

ఎలగందల్ కోట

కరీంనగర్ కి 15 కి. మీ. దూరంలో ఉన్న ఎలగందల్ గ్రామంలో పురాతనమైన కోట ఉంది. దీనిని ఎలాగందల్ కోట అని పిలుస్తారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. మానేరు నదీతీరంలో తాటిచెట్ల మధ్య సుందరమైన ప్రకృతి నడుమ ఎత్తైన కొండ మీద ఎలగందల్ కోట నిర్మించబడి ఉంది. ఇక్కడి చారిత్రాత్మకమైన కొండపై గల కోటలో శ్రీనరసింహస్వామి ఆలయం ఉంది.

కరీంనగర్ లో గల పురాతన జలపాతాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Naveen Gujje

కోయిలకొండ కోట మరియు కోయిలసాగర్ డ్యామ్

కోయిలకొండ కోట మరియు కోయిలసాగర్ డ్యామ్

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దుర్గాలలో కోయిలకొండ గిరిదుర్గం ఒకటి. గచ్చు గాని, మట్టి గాని వాడకుండా కోట గోడలను నిర్మించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అశ్వశాలలు, గజశాలలు, ధాన్యాగారాలు, నివాస గృహాలు అన్ని కూడా కొండమీదనే నిర్మించినారు. కోటలోని రెండతస్తుల రాణిమహల్, రాజు నీటి వినియోగానికి ఉపయోగించే గది తో పాటుగా కోట పై భాగంలో ఆంజనేయస్వామి ఆలయం, వీరభద్రస్వామి ఆలయం ఇంకా దర్గాలను చూడవచ్చు. కోట పై భాగానికి చేరుకోవడానికి విశాలమైన మెట్లు కూడా ఉన్నాయి. ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండ మీదికి చేరుకోవడం ఒక మాధురానుభూతి. ఇదే కాక ఇక్కడికి సమీపంలో గల కోయిలసాగర్ డ్యామ్ కూడా చూడవచ్చు.

మహబూబ్‌నగర్ పర్యాటక ప్రదేశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: telangana tourism

మెదక్ కోట

మెదక్ కోట

మెదక్ కోట తెలంగాణ రాష్ట్రం లోని మెదక్ జిల్లా లో కలదు. ఇది రాష్ట్ర ముఖ్య పట్టనమైన హైదరాబాదు నగరానికి 100 కి.మీ దూరంలో ఉంటుంది. మెదక్ నగరానికి ఉత్తరాన మూడు వందల అడుగుల ఎత్తైన కొండపై 400 ఎకరాల్లో విస్తరించింది మెదక్ కోట. ఈ కోటను క్రీ.శ. 12 వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు కాలంలో నిర్మించారని ప్రతీతి. ప్రస్తుతం ఈ కోటలో 17వ శతాబ్దానికి చెందిన 3.2 మీటర్ల పొడవైన ఒక ఫిరంగి ఉంది. ట్రెక్కింగ్ చేసుకుంటూ కోట పై భాగానికి చేరితే, అక్కడి నుండి పర్యాటకులు సుందర దృశ్యాలతో పాటు పూర్తి పట్టణాన్ని స్పష్టంగా చూడవచ్చు.

మెదక్ లోని మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Varshabhargavi

కౌలాస్ కోట

కౌలాస్ కోట

కౌలాస్, నిజామాబాదు జిల్లాకు చెందిన గ్రామము. ఈ కౌలస్ హైదరాబాదు నుండి 180 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి - నాందేడ్ రహదారిపై ఉన్నది. చుట్టూ దట్టమైన అడవి, క్రింద నది ఉండటంతో ఇక్కడి ప్రకృతిదృశ్యం అమెజాన్ అడవిని తలపిస్తుంది. కౌలాస్ కోటకు 57 బురుజులున్నాయి. కోట లోపల అనేక ఆలయాలు, దర్గాలు ఉన్నాయి. కోట ద్వారాలపై చెక్కిన అలంకరణలు, హృద్యంగా చెక్కబడిన హిందూ దేవతాశిల్పాలు కోట యొక్క ఆకర్షణలు. 500 మీటర్ల మేరకు విస్తరించి ఉన్న తామరపూల చెరువు మరో ఆకర్షణ. ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళితే ఇటువంటి ఆకర్షణలు, ప్రకృతి దృశ్యాలు తారసపడతాయి.

నిజామాబాద్ లోని మరిన్ని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: telangana tourism

దేవరకొండ కోట

దేవరకొండ కోట

దేవరకొండ, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాలో ఒక ముఖ్య పట్టణం. ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక ప్రాచీన కోట కలదు. ఈ దుర్గము ఏడుకొండల మధ్యన ఉన్నది. నల్గొండ, మహబూబ్ నగర్, మిర్యాలగూడ మరియు హైదరాబాదు నుండి రోడ్డు మార్గమున ఇక్కడ చేరవచ్చును. ఐదువందల ఎకరాల పైగా విస్తీర్ణం కలిగిన ఈ కోటలో కాలువలు, బావులు, సెలయేళ్ళు, కోనేరులు అందమైన భవనాలు, ఉద్యానవనాలు వున్నాయి. ధాన్యాగారము, సైనిక శిబిరాలు, ఆలయాలు వున్నాయి. ఈ కోట మీదికి చేరుకోవాలంటే సాహస యాత్ర చేయకతప్పదు ...!

ఖమ్మం లోని పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Talk2experts

చంద్రఘడ్ కోట

చంద్రఘడ్ కోట

మహబూబ్ నగర్ జిల్లాలో ఉన చంద్రఘడ్ గ్రామంలో ఎత్తైన కొండ మీద రెండంచెలుగా చంద్రఘడ్ కోటను నిర్మించినారు. చుట్టుప్రక్కల పది కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ నుంచి చూసిన కొండ మరియు కొండ మీద ఉన్న కోట కనిపిస్తుంది. కోట మొత్తం కూడా రాళ్లతో నిర్మించడం విశేషం. కొండమీద ఉన్న 8 నీటి ఊటలు ఇప్పటికీ స్వచ్ఛమైన నీటిని కలిగి ఉండి, సమీప గ్రామాలకు త్రాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి.

సంగమేశ్వర ఆలయ సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Naidugari Jayanna

భువనగిరి కోట

భువనగిరి కోట

తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన భువనగిరి కోట ఉంది. ఇది ఏకశిల రాతి గుట్టపై విక్రమాదిత్యచే నిర్మించబడింది. ట్రెక్కింగ్ ద్వారా కొండ పై భాగానికి చేరుకుంటే రాజభవనాలు, అంతఃపురాలు కనిపిస్తాయి. ఎత్తైన గోడలు, విశాలమైన గదులు ఇస్లాం సంస్కృతి నిర్మాణ శైలిలో ఉన్నాయి. నల్లని నంది విగ్రహం, ఆంజనేయుని శిల్పం, అంతు తెలియని రహస్య శిలాగర్భ మార్గాలు ఉన్నాయి.

నాగార్జునసాగర్ పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Nikhilb239

అహోబిలం

అహోబిలం

అహోబిలం కర్నూలు జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ నరసింహస్వామి పుణ్య క్షేత్రం. ఈ క్షేత్రం కర్నూలు నుండి 150 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ క్షేత్రానికి గల మరొక పేరు నవ నరసింహ క్షేత్ర ఎందుకంటే ఇక్కడ నరసింహ స్వామి 9 రూపాలలో కొలవబడతాడు. అహోబిలం చాలా వరకు నల్లమల్ల అడవుల లోనే విస్తరించి ఉన్నది. ఈ క్షేత్రం ట్రెక్కింగ్ కి అనువైనది. ఎగువ అహోబిలం మరియు దిగువ అహోబిలం అని రెండు భాగాలుగా ఉండి, దట్టమైన అడవుల గుండా, మట్టి రోడ్ల మీదుగా సాగే యాత్ర అనిర్వచనీయం. చాలా మంది పర్యాటకులు అహోబిలంలో ట్రెక్కింగ్ యాత్రలు చేయటానికి ఇష్టపడతారు.

నల్లమల్ల అడవులలో 3 రోజుల యాత్రల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Adityamadhav83

గండికోట

గండికోట

కడప జిల్లాకే తలమానికం గండికోట. మూడువైపులా చుట్టూ కొండలు, మరోవైపున లోయలో ప్రవహించే పెన్నా నది. ఇటువంటి అపురూప, అద్భుత దృశ్యకావ్యం గండికోట సొంతం. 40 అడుగుల సింహ ద్వారం, ఏనుగులతో సైతం ఢీ కొట్టించిన చెక్కుచెదరని తలుపులు, దానికున్న ఉక్కు కావచాలు కోట పటిష్టతకు నిలువుటద్దాలు. ట్రెక్కింగ్ ద్వారా చేరుకొనే ఈ కోట మార్గం మిమ్మలను ఎంతగానో మైమరిపిస్తుంది. కోటలో రెండు ప్రధాన ఆలయాలు అలాగే కత్తుల కోనేరు తప్పక చూడాలి.

కడప లో గల పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Harish Aluru

కడలివనం గుహలు

కడలివనం గుహలు

అక్క మహాదేవి గుహలు, కడలి గుహలు నల్లమల్ల శ్రేణులలోని కొండలపై శ్రీశైలం కు సుమారు 10 కి. మీ. ల దూరం లో కలవు. అక్క మహాదేవి గుహలు కృష్ణా నది కి ఎగువ భాగంలో సహజంగా ఏర్పడిన గుహలు. ఈ గుహల లో కల రాళ్ళు ఎపుడో భూమి పుట్టిన నాటివి, పురాతనమైనవి కనుక ఒక మంచి ఆకర్షణగా వుంటాయి. ఈ గుహలకు కృష్ణా నది గుండా బోట్ లో వెళ్ళడం ఒక మంచి అనుభవం. సుమారు 150 అడుగుల పొడవు వుండే ఈ గుహల సందర్శన మరింత మంచి అనుభవం గా కూడా వుంటుంది.

శ్రీశైలం లో గల పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Anupam Bhattacharyya

కొండవీడు కోట

కొండవీడు కోట

గుంటూరు జిల్లా కొండవీడులో ఒక పురాతన కోట కలదు. దీనినే కొండవీడు కోట గా అభివర్ణిస్తారు. కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న వేణునాథస్వామి దేవాలయం, శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా వంటివి ఉన్నాయి. ఇటువంటి చారిత్రక సంపదను మీరు కొండమీదికి ట్రెక్కింగ్ చేసుకుంటూ చూడవచ్చు.

గుంటూరు పర్యాటక ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Raja Shakher Intha

టైడ నేచర్ క్యాంప్ (అరకు వ్యాలీ దగ్గర)

టైడ నేచర్ క్యాంప్ (అరకు వ్యాలీ దగ్గర)

టైడ నేచర్ క్యాంప్ అరకు కు 40 కి. మీ. దూరంలో, వైజాగ్ కు 70 కి. మీ. దూరంలో ఉన్నది. తూర్పు కనుమలలో ఉన్న ఈ ప్రదేశం ఒక గిరిజన గ్రామాన్ని తలపిస్తుంది. ఇల్లులు అన్ని చెక్కతో, చెట్ల మొద్దులతో తయారుచేసి, వచ్చే యాత్రికులకు ఉండటానికి విడిది గా ఉపయోగిస్తారు. ఈ నేచర్ క్యాంప్ ఎన్నో చిత్ర విచిత్రమైన సాహస క్రీడలను అందిస్తుంది. అందులో రాళ్లు,గుట్టలు ఎక్కడం, ట్రెక్కింగ్,పక్షులను చూడటం, గురి చూసి షూటింగ్ చేయడం(విల్లు మరియు బాణాలు ఉపయోగించి) లు కొన్ని. వివిధ రకాలైన పక్షులకు, జంతువులకు ఈ యొక్క ఎకో - టూరిజం ప్రదేశం స్థావరంగా ఉంది. ఇలా ఆ గుడారాలలో బస చేయటానికి అయ్యే ఖర్చు రూ. 800 నుంచి రూ. 1800 వరకు ఉంటుంది.

అరకు లోయ మారుపురాని పర్యటన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: SHIBA 007

ఉబ్బలమడుగు జలపాతం / తడ జలపాతం

ఉబ్బలమడుగు జలపాతం / తడ జలపాతం

ఉబ్బల మడుగు జలపాతం శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో సిద్దుల కోన అని పిలువ బడే అడవిలో వున్నది. ఇది ప్రధాన వర్షాకాల సమయంలో అనగా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ జలపాతం జలకళతో కళకళలాడుతూ ఉంటుంది. టెక్కింగ్ మరియు విహార యాత్రలకు ఇది చాల అందమైన ప్రదేశము. ఈ జలపాతాన్ని వీక్షించడానికి స్థానికులే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.

శ్రీకాళహస్తి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: McKay Savage

ఖిల్లా ఘనపూర్

ఖిల్లా ఘనపూర్

ఘనపూర్(గణపురం)మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఘనపూర్ కోట. దీనినే ఖిల్లా ఘనపూర్ అని అంటారు. ఘనపూర్ ప్రాంతాన్ని 800 ఏళ్ళ క్రితం కాకతీయుల సామంతులు పాలించినట్లు తెలుస్తుంది. 'గోన' వంశానికి చెందిన గణపరెడ్డి ఈ గ్రామానికి ఈశాన్యంలో తొమ్మిది గుట్టలలో దృఢంగా ఉన్న ఎత్తైన రెండు గుట్టలను కలుపుతూ కోటను నిర్మించాడు. అలాగే మట్టితో గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏడు కోట లను నిర్మించినాడు. ఈ కోటలను ట్రెక్కింగ్ చేస్తూ కలియతిరగటం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.

యాదగిరిగుట్ట గురించి మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: telangana tourism

Please Wait while comments are loading...