Search
  • Follow NativePlanet
Share
» »మీరు తెల్ల పులుల్ని చూడాలనుకుంటే ఈ 6 నేషనల్ పార్క్స్ వెళ్ళండి

మీరు తెల్ల పులుల్ని చూడాలనుకుంటే ఈ 6 నేషనల్ పార్క్స్ వెళ్ళండి

ప్రకృతి ఒడిలో సంచరించే వన్యజీవుల్ని దగ్గర నుంచి తిలకించడం ఇక్కడ ప్రత్యేకత. స్వేచ్ఛగా అడవుల్లో తిరిగే వన్య ప్రాణులను మీరు ఎప్పుడైనా దగ్గర నుంచి చూశారా? అలా చూడాలీ అనుకుంటే.. తప్పకుండా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అంటే నేషనల్ పార్క్స్ గురించి తెలుసుకోవల్సిందే. ముఖ్యంగా తెల్లపులులు ఉన్న జాతీయ పార్క్ గురించి తెలుసుకోవాలి.

పులులు, సింహాలు వంటి క్రూరమగాలను నేరుగానే కాదు జూలల్లోనూ చూడాలన్నా ఇప్పటికీ చాలా మందికి భయమే అయితే ఈ భయం వెనుక ఒక ఉత్సాహం కూడా దాగి ఉంటుంది. క్రూరమగాలు వాటి జీవన శైలిని తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అలాంటివారికి సరైన గమ్యం అంటే అభయారణ్యం. ఇందులో కేవలం పులులు, సింహాలు వంటి క్రూరమగాలే కాకుండా అనేక వన్య ప్రాణులను తిలకించేందుకు అవకాశం ఉంది.

మీరు ఎప్పుడైనా..ఎక్కడైనా తెల్ల పులుల్ని చూశారా? మామూలు పులిని చూడడమే గగనమనుకుంటే.. మళ్లీ తెల్ల పులి ఏమిటనుకుంటున్నారా? అవును చూడటానికి డిఫరెంట్ గా ఉండే తెల్ల పులుల సంరక్షణ కేంద్రాలు కూడా మన ఇండియాలో ఉన్నాయి. ముఖ్యంగా రేవల స్టేట్, సుందర్బన్స్ మరియు నీలగిరి బయోస్పియర్ రిసర్వ్ . మన దేశంలో తెల్లపులలను చాలా అరుదుగా చూస్తుంటాము. అలాంటి వైట్ టైగర్స్ ఉన్న కొన్ని జూలాజికల్ పార్క్ ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కుంద్‌పూర్‌, మధ్యప్రదేశ్

కుంద్‌పూర్‌, మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా ముకుంద్‌పూర్‌ అటవీ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే తెల్లపులులు కలిగిన ఏకైక ప్రదేశంగా దీనికి గుర్తింపు ఉంది. 1951లో ఈ తెల్లపులుల సంరక్షణకు రేవా మహారాజు మార్తాండ్‌ సింగ్‌ శ్రీకారం చుట్టారు. వేటలో భాగంగా దొరికిన ఓ తెల్లపులి పిల్ల సంరక్షణ కోసం గోవింద్‌గఢ్‌లో బాగ్‌మహల్‌ను ఆయన ప్రారంభించారు. ఆ పులి పిల్లకు మోహన్‌ అని పేరు పెట్టారు. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న తెల్ల పులులన్నీ మోహన్‌ వారసులే. మార్తండ్‌ సింగ్‌ కృషితోనే తెల్లపులుల మనుగడ దేశంలో సాధ్యమైంది. మహారాజు స్ఫూర్తితో ముకుంద్‌పూర్‌లో తెల్లపులుల సంరక్షణ కేంద్రాన్ని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీనికి మోహన్‌ సంరక్షణ కేంద్రంగా పేరు పెట్టింది. ఈ సంరక్షణ కేంద్రంలో వింద్యన్‌, రఘు అనే రెండు తెల్ల పులులు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో ఉన్న తెల్ల పులులన్నీంటికీ తల్లి వింద్యన్‌. తెల్లపులులు ఉన్న ఈ సఫారీని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దేశంలోని మిగతా సఫారీలతో పోలిస్తే ముకుంద్‌పూర్‌ను ప్రత్యేకంగా నిలిపేవి ఈ తెల్లపులులే. రహదారి పక్కనే వీటిని దగ్గరగా వీక్షించడం పర్యాటకులకు అమితానందాన్ని కలిగిస్తోంది.

టైగ‌ర్ కంట్రీ.. బంధ్వా‌గ‌ఢ్‌, మధ్యప్రదేశ్

టైగ‌ర్ కంట్రీ.. బంధ్వా‌గ‌ఢ్‌, మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌ పచ్చదనంతో కూడిన అటవీ ప్రాంతం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. ఇలాంటి ప్రకృతి సిద్ధమైన వారసత్వ సంపద భారతదేశంలో మరెక్కడా లేదు. 1973లో భారత ప్రభుత్వం, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ (వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌) భారతదేశంలో అంతరించిపోతున్న వైల్డ్‌ జాతులను కాపాడటానికి ఓ అడుగు ముందుకు వేసింది. దాని మొదటి అడుగు మధ్యప్రదేశ్‌ నుంచి మొదలైంది. ఇక్కడ తొమ్మిది అటవీ ప్రాంతాలను పులుల సంరక్షణల కోసం ఏర్పాటుచేశారు. ప్రసుత్తం ఇక్కడ కన్హా, పన్నా, బంధ్వాగఢ్‌, పెంచ్‌, సత్పుర అనే ఐదు పులల పరిరక్షణ ప్రాంతాలు ఉన్నాయి. పులుల సంరక్షణ కోసం చేసిన ఈ ప్రయత్నాల కారణంగానే నేడు భారతదేశం పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పాలి. అందుకే మధ్యప్రదేశ్‌ని 'టైగర్‌ కంట్రీ' అని పిలుస్తుంటారు.

సుందర్బన్, వెస్ట్ బెంగాల్

సుందర్బన్, వెస్ట్ బెంగాల్

పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఈ వన్యప్రాణుల కేంద్రం గంగ డెల్టా ప్రాంతంలో ఉంది. బంగ్లాదేశ్ మరియు భారతదేశం.. రెండు దేశాలలో విస్తరించడం ఈ జాతీయ ఉద్యానవనం ప్రత్యేకత. ఇక్కడ ప్రకృతి అందాలతో పాటు బెంగాల్ టైగర్లు, సముద్ర మొసళ్లు, డాల్ఫిన్లు, పెద్ద తాబేళ్లు, చిరుతలు, నక్కలు తదితర వన్యప్రాణులను ఇక్కడ చూడొచ్చు. సుందర్బన్ నేషనల్ పార్క్‌కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. దట్టమైన మడ అడవులలో మీరు అడవి పిల్లులు, మొసళ్ళు, పాములు, నక్కలు, అడవి పందులు, పాంగోలిన్స్ వంటి వాటిని చూసేందుకు అవకాశం ఉంటుంది. రాయల్ బెంగాల్ టైగర్ కోసం అతిపెద్ద రిజర్వులలో ఇది ఒకటి. రోర్, టైగర్ ఆఫ్ ది సుందర్బన్ వైట్ టైగర్స్ కు ప్రసిద్ది. జంతుజాలాల వైవిధ్యం ద్వారా అందరినీ ఆశ్చర్యచకితులను చేసే ప్రాంతం ఇది.

నీలగిరి హిల్స్, తమిళనాడు

నీలగిరి హిల్స్, తమిళనాడు

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం "ఊటీ". దీని అధికారిక నామం "ఉదక మండలం" కాగా, "క్వీన్ ఆఫ్ హిల్‌స్టేషన్‌"గా పేరుగాంచింది. సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. అందుకే మంచి వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రదేశంలో సేదదీరేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు రెక్కలుగట్టుకుని వాలిపోతుంటారు. ముఖ్యంగా ఈ నీలగిరి పర్వాతాలపై నెలకొని ఉన్న నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ లో తెల్ల పులను కనుగొనడం జరిగింది. మొట్ట మొదట సారి ఇక్కడ తెల్లపులలను కనుగొన్నారు.

కాజిరంగా నేషనల్ పార్క్, అస్సాం

కాజిరంగా నేషనల్ పార్క్, అస్సాం

భారతదేశంలో అస్సాంలోని గోలాఘాట్ మరియు నాగోన్ జిల్లాలలో ఉన్న కాజిరంగా నేషనల్ పార్క్, దేశంలోని అత్యుత్తమ వన్యప్రాణి అభయారణ్యాలలో ఒకటి. ఒంటి కొమ్ము ఖడ్గమృగ జీవాల్లో 2/3వ వంతు భాగం ఇక్కడే ఉంది. అనేక అరుదైన జాతులకు భద్రత కల్పిస్తున్న కారణంగా, ఇది యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది.

కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాం కు గర్వకారణంగా ఉంటుంది. ఇది అంతరించిపోతున్న ఇండియన్ ఒక కొమ్ము గల ఖడ్గమృగాలకు నిలయంగా ఉంది. ప్రపంచంలోని పులులు ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉంటాయి. 2006 వ సంవత్సరంలో దీనిని ఒక టైగర్ రిజర్వ్గా గా ప్రకటించబడింది. ఈ జాతీయ పార్క్ కూడా UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రక్షింపబడుతోంది. ఈ పార్క్ సుమారు 429,93 sq కిలో మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇది అస్సాం రాష్ట్రంలోని గోలాఘాట్ మరియు నాగోన్ జిల్లాల పరిదిలోకి వస్తుంది.

బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనం

బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనం

బెంగళూరు నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే చాలు.. బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనాన్ని చేరుకోవచ్చు. వేసవి సెలవుల వేళ చల్లటి వనంలో విహరిస్తుంటే ఆ ఆనందమే వేరంటారు. ప్రస్తుతం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. బాలలతో కలిసి ఓసారి బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించడం ఉత్తమమంటూ అత్యధికులు ఇదే బాట పడుతున్నారు. ప్రకృతి ఒడిలో సంచరించే వన్యజీవుల్ని దగ్గర నుంచి తిలకించడం ఇక్కడ ప్రత్యేకత. ఆఫ్రికా అడవుల్లో తిరిగే తెల్ల పుల్లి బన్నేరుఘట్ట ఉద్యానవనంలో సేదదీరుతూ కానవస్తుంది. స్వేచ్ఛగా సంచరించే పులులు, మృగరాజు సింహం.. అందులోనూ తెల్ల సింహం, జింకలు, ఏనుగులు, జీరాఫీలు, అడవి పందులు, కోన బర్రెలు, తాబేళ్లు, వివిధ రకాల విషసర్పాలు, కొండ చిలువలు, జీబ్రాలు.. ఎన్నెనోన వన్యజీవుల్ని తిలకించి ఆనందించే వారు ఇక్కడ కానవస్తారు.

PC- Chi King

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X