Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ... మజులి !!

ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ... మజులి !!

సాంస్కృతిక వారసత్వంతో ముస్తాబైన ముగ్దమనోహర నదీ ద్వీపం ఈ మజిలి ద్వీపం!!. చరిత్ర, సంస్కృతితో నిండిన గొప్ప ప్రదేశం కావడంతో ఇది అస్సాం రాష్ట్ర ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. మజులి ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపమే కాక, నవీన వైష్ణవమతానికి అస్సాంలోనే పెద్ద పీట కల్గినది కూడా. మజులి పర్యాటకరంగం చిన్నదైనప్పటికి అది జీవంతో నిండి ఉంది. శక్తివంతమైన బ్రహ్మపుత్ర ఈ స్థలం సహజ సౌందర్యాన్ని పెంచుతుండగా, సత్రాలు దీనికి సాంస్కృతిక గుర్తింపును కల్గిస్తున్నాయి. ఇక్కడున్న ప్రదేశాలను వివరిస్తూ..

ఫ్రీ కూపన్లు : ఇప్పుడే త్వరపడండి అన్ని ఉచిత గోఐబిబో కూపన్ల కొరకు

మజులి గురించి ఒక్క మాటలో ..

మజులి గురించి ఒక్క మాటలో ..

ద్వీపం అనగానే ఎవరికైనా ఇట్టే గుర్తుకు వచ్చేది సముద్రం మధ్యలో ఉన్న భూమి. అయితే నదుల మధ్య కూడా కొన్ని ద్వీపాలు ఉంటాయి. అలాంటి అరుదైన ద్వీపమే ఈ మజులి ద్వీపం. ప్రపంచంలో ఇలా నదుల మధ్య ఉండే అరుదైన మంచినీటి ద్వీపాల్లో ఇదే పెద్ద ద్వీపం కావడం విశేషం. వాస్తవానికి ఈ ద్వీపం 1250 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నప్పటికీ భూమి కోత కారణంగా దాని పరిమాణం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం దాని పూర్తి వైశాల్యం 421.65 చదరపు కిలోమీటర్లు మాత్రమే. జోర్హాట్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మజులిని ఫెర్రీల ద్వారా చేరవచ్చు.ఈ ద్వీపం మధ్యలో నిర్మించిన కాటేజ్‌లలో నుండి సూర్యాస్తమయాన్ని చూడటం ఓ మరచిపోలేని మధురమైన అనుభూతి.

Photo Courtesy : Donatella Venturi

అనియతి సత్రం

అనియతి సత్రం

అనియతి సత్రం మజులి లోని మరొక ప్రసిద్ధ సత్రం. అనియతి సత్రం పాలనం, అప్సర నృత్యాలకు ప్రసిద్ధి. సత్రంలోని ఎంతో ప్రాముఖ్యత ఉన్న ధార్మిక పండుగలలో పాలనం ఒకటి. దీనిని నవంబర్ నెలలో జరుపుకొంటారు. సత్రంలోని ప్రధాన ప్రార్ధన మందిరంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్ధనలు జరుగుతుంటాయి. ఈ సంప్రదాయం గత 350 ఏళ్ళ కాలంగా అప్రతిహతంగా జరుగుతూనే ఉంది. ప్రధాన ప్రార్ధన మందిరంలో ఉన్న గోవింద దేవునికి ఇక్కడ ప్రదర్శించే సత్రియా నృత్యాన్ని అంకితం చేస్తారు. ఇక్కడ పాలనంతో బాటుగా, రాస్-లీలా, జన్మాష్టమి, హోలీ వంటి అనేక ఇతర ధార్మిక పండుగలు జరుగుతాయి. అనియతి సత్రం అస్సాం వంటపాత్రలు, హస్తకళలు, ఆభరణాల వంటి విస్తృతమైన సేకరణను కల్గి ఉంది.

Photo Courtesy: Bot

ఉత్సవాలు

ఉత్సవాలు

అలనాడు రాధాకృష్ణులు రాసక్రీడలాడిన ప్రదేశంగా చెప్పబడుతున్న ఈ ద్వీపంలో... ద్వీపవాసులు ఆ ఆనవాయితీని ఇప్పటికీ పాటిస్తుండడం విశేషం. ప్రతి ఏడాది మూడు రోజులపాటు ఎంతో అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాన్ని ‘రాస్‌లీలా' ఉత్సవం అంటారు. కన్నులపండువగా జరిగే ఈ ఉత్సవంలో శ్రీకృష్ణుడు, గోపికల రాసలీలలను కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు. మజులి ద్వీపంలో జరిగే ఓ రకమైన ఆధ్యాత్మిక ఉత్సవం ఇది. ఇక్కడి గిరిజనులు ధరించే రంగురంగుల దుస్తులు, పూసలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. యువతీయువకులు రాధామాధవుల వేషధారణలో వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటారు. ముఖ్యంగా గోపికల వేషధారణలో సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు ఒయలుపోతూ ప్రదర్శించే నృత్యాలు ఆద్యంతం విశేషంగా ఆకట్టుకుంటాయి. మొత్తంగా ఈ ఉత్సవం ద్వాపరయుగాన్ని తలపిస్తుంది.

Photo Courtesy:Sumantbarooah

కమలబరి సత్రం

కమలబరి సత్రం

కమలబరి సత్రం, మజులిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రసిద్ధ సత్రం. ‘ కమల ' అంటే ‘ కమలాపండు ' అని, ‘ బరి ' అంటే ‘ తోట ' అని అస్సాం భాషలో అర్ధం. కమలబరి సత్రాన్ని ప్రసిద్ధ మాధవదేవుని శిష్యుడు బాదాల అట 1595 లో స్థాపించాడు. కమలబరి సత్రం శతాబ్దాలుగా కళ, సంస్కృతి, సాహిత్యానికి కేంద్రంగా పరిగణించబడుతుంది. కమలబరి వలననే సత్రియా నృత్యం ప్రసిద్ది చెంది, తర్వాత ఒక శాస్త్రీయ నృత్య రూపం స్థాయిని పొందింది. కమలబరి సత్రం ఐతిహాసిక శిల్పాలను సృష్టించడంలో కూడా ఎంతో ప్రసిద్ది చెందింది. కమలబరి సత్రాన్ని సందర్శించడానికి ఉత్తమ కాలం వర్షాలు తగ్గుముఖం పట్టి, ద్వీపం వరదలతో నిండకపోతే. పర్యాటకులు సత్రాన్ని చేరడానికి జోర్హాట్ లోని నిమతి ఘాట్ నుండి ఫెర్రీలో వెళ్ళవలసి ఉంటుంది.

Photo Courtesy: Sumantbarooah

బెంగానాతి సత్రం

బెంగానాతి సత్రం

మజులి సత్రాలకు ప్రసిద్ధి. బెంగానాతి సత్రం అటువంటి ప్రసిద్ధ సత్రాలలో ఒకటి. ఇది సాంప్రదాయికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న విస్తృతమైన పురాతన వస్తువుల సేకరణకు నివాసం. ఈ ద్వీపంలోని ఇతర సత్రాలలానే బెంగానాతి సత్రం కూడా శ్రీమంత శంకరదేవ సంప్రదాయాన్ని, విలువలను పరిరక్షించడమే కాక, ప్రాచీన కళాకృతులను భద్రపరిచే మ్యూజియంగా కూడా ఉపయోగపడుతుంది. అహోం రాజు స్వర్గదియో గదాధర్ సింఘాకు చెందిన రాచరిక పొడవు అంగీ ఈ సత్రంలోని అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటి. ఈ బంగారపు పొడవాటి అంగీతో బాటుగా అహోం రాజుకు చెందిన ఇతర వస్తువులలో బంగారపు గొడుగు కూడా ఉంది. విలువైన ఈ రెండు వస్తువులను ఇక్కడ భద్రపరిచారు.

Photo Courtesy: বিতোপন গগৈ

దఖినపాట్ సత్రం

దఖినపాట్ సత్రం

అస్సాంలోని మజులిలో ఒక ద్వీపం దఖినపాట్ సత్రం ప్రసిద్ధ సామాజిక-ధార్మిక సంస్థలలో ఒకటి. అహోం వంశస్థులు పోషించిన అనేక రకాల సాంస్కృతిక శిల్పాలు, చిత్రాలు, నృత్యాలు ప్రదర్శించే కళా సంస్కృతికి ఇది ముఖ్య కేంద్రం. శ్రీ శంకరదేవ అందించిన అనేక వేర్వేరు రకాల నృత్యాలను అందించడం వలన నృత్యనిలయం అని కూడా పిలుస్తారు.సత్రం ద్వారమార్గం మత కళలు, పూలు, జంతువుల చెక్కిన చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది. అస్సాంలోని ప్రసిద్ధ జాతీయ పండుగ రాసలీలను ప్రతి ఏట సత్రంచే నిర్వహించబడుతుంది. ఈ సంస్థ సత్రాధికార్ పర్యవేక్షణలో ఉంది. శ్రీమంత శంకరదేవుని అవశేషాలు, లిఖిత ప్రతులను సత్రాధికార్ సంరక్షిస్తున్నారు. ఈ సత్రాలు మహాపురుక్సియ ధర్మాన్ని అనుసరిస్తాయి. ఈ సత్రాలలో జాదవరాయ మహాప్రభు విగ్రహాన్ని పూజిస్తారు.

Photo Courtesy: Sumantbarooah

కొత్త జంటల మజిలీ...

కొత్త జంటల మజిలీ...

మనిషి కాలుష్య కర్కషత్వం ఈ ప్రాంతంపై పడలేదు కాబట్టి ఇప్పటికీ. .. మజులి సౌందర్యం ఏ మాత్రం ధ్వంసం కాకుండా, స్వచ్ఛంగా, ఆహ్లాదాన్ని పంచుతోంది. ఏ రుతువులో చూసినా... తాజాదనం తొణకి సలాడే ఈ అద్భత ద్వీపంలో మానవ సంచారం గత ఐదు వందల ఏళ్ళ నుండి ఉన్నప్పటికీ... నేటికి పచ్చని సౌందర్యంతో ప్రకృతికాంత పరవశిస్తూనే వుంది. అందుకే కొత్తగా పెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం అని చెప్పవచ్చు. అస్సాం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా హనీమూన్‌ కపుల్‌ ఇక్కడ సందడి చేస్తారు. కొత్త వాతా వరణంలో, పూర్తి కొత్తదనంతో గడపాలను కునే జంటలకు ‘మజులి' ఓ అద్భుతమైన అనుభవాన్నిస్తుందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

Photo Courtesy: Random Explorer

మజులి ఎలా చేరాలి?

మజులి ఎలా చేరాలి?

మజులి రోడ్డు ,రైలు , వాయు, జల రవాణాల ద్వారా చేరుకోవచ్చు.
వాయు మార్గం

జోర్హాట్ మజులి కి చేరువలో ఉన్న విమానాశ్రయం. ఇక్కడి నుంచి ప్రతి రోజు గౌహతికి విమానాలు తిరుగుతుంటాయి. కలకత్తా నుంచి వారానికి 4 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

రైలు మార్గం

జోర్హాట్ రైల్వే స్టేషన్ మజులి కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ . ఇక్కడి నుంచి గౌహతికి నిరంతరం రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం

గౌహతి నుంచి జోర్హాట్ కి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. గౌహతి నుంచి ప్రతి రోజు ఉదయం ,సాయంత్రం బస్సులు తిరుగుతాయి. ప్రయాణ సమయం సుమారుగా 6 - 7 గంటల సమయం ఉంటుంది. జోర్హాట్ నుంచి నిమతిఘాట్ 14 కి. మీ. దూరంలో ఉంటుంది. కనుక ఇక్కడి నుంచి బస్సులు కానీ ఆటో కానీ పట్టుకొని చేరవచ్చు.

జల మార్గం

మజులి కి నిమతిఘాట్ నుంచి ప్రతి రోజు ఉదయం ,మధ్యానం ప్రభుత్వ ఫెర్రి సర్వీసులు ఉంటాయి.

Photo Courtesy: Suraj Kumar Das

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X