Search
  • Follow NativePlanet
Share
» »అరుణాచలేశ్వరుని ఆలయ మహత్యం !

అరుణాచలేశ్వరుని ఆలయ మహత్యం !

అసలు ఎవరు చెప్పారండి ... భారతదేశంలో ఏమీ లేవని ..! మన భారత దేశం వింతలు, విడ్డూరాలకు పుట్టినిల్లు. ఇక్కడ లెక్కకు మించిన వింతలు, అద్భుతాలు ఉన్నాయి. మరి అలాంటి అద్భుతాలలో ఒకటి అరుణాచలం మరియు నందిశ్వరుడు. పంచభూతాలు అంటే మీకు తెలిసిందే గాలి, నీరు, అగ్ని, భూమి మరియు ఆకాశం కరెక్టేనా ..! పొరపాటున ఇందులో ఏదో ఒకటి కోప్పడి మూడోకన్ను తెరిస్తే మానవుడు బ్రతకగలడా ... అమ్మో ..! తలుచుకుంటేనే భయమేస్తుంది కదూ .. 2004 సునామీ మల్లొసారి హాయ్ అని చెప్పినట్లుంటుంది.

ఇలా ప్రకృతిలో మమేకమైన ఈ ఐదు భూతాలలో పరమాత్ముని తత్వం ఉట్టిపడేలా పంచభూత లింగ క్షేత్రాలు మనకు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినది అరుణాచలం(తిరువన్నమలై) అగ్ని లింగం.

అరుణాచల ఆలయం

అరుణాచల ఆలయం

అగ్ని లింగం అంటే ఇక్కడున్న అరుణాచల పర్వతమే శివుని ప్రతిరూపమని చెప్పాలి. ఇక్కడ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తూ పరమేశ్వరున్ని ప్రదక్షిణ చేసినట్లే..! అందుకే ఇక్కడ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేయటం చాలా ప్రధానమైనది.

Photo Courtesy: Swaminathan M

అరుణాచల ఆలయం

అరుణాచల ఆలయం

ఈ అరుణాచల క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు తప్పకుండా కొండ చుట్టూ చెప్పులు లేకుండా ప్రదక్షిణలు చేయటం ప్లాన్ చేసుకొనే వస్తారు. ఇక కొండ విషయానికి వస్తే ఈ అరుణాచల కొండ పరిధి 14 కి.మీ. వరకు ఉంటుంది. ఈ కొండచుట్టూ ఔషద మొక్కలు అనేకం ఉన్నాయి కనుకనే కాలినడకన చేసే ప్రదక్షిణాల వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం, విశ్వాసం.

Photo Courtesy: s.srikrishnan

అరుణాచల ఆలయం

అరుణాచల ఆలయం

ఇక్కడ అయ్యవారు(శివుడు) 2,665 అడుగుల ఎత్తున్న పర్వతం మీద, అమ్మవారు(పార్వతి దేవి) మరొక పర్వతం మీద నెలకొని ఉంటారు. ఆగస్తీశ్వర మఠం నుండి గనక ఈ కొండలను చూస్తే, అర్ధనారీశ్వరుని దర్శనంలా రెండు కొండలు కూడా ఒకే కొండగా కనిపించడం ఒక అద్భుతమనే చెప్పుకోవాలి.

Photo Courtesy: Manfred Sommer

అరుణాచల ఆలయం

అరుణాచల ఆలయం

పర్వతమే శివుడు అనుకుంటే, మరి శివుని వాహనం నంది ఎలా ఉండాలి. పక్కనే మరో కొండయై ఉండాలి అవునా.. ఖచ్చితంగా ఇక్కడ అలాంటి సన్నివేశమే కనిపిస్తుంది. మామూలుగా నందీశ్వరుడిని చూడాలంటే దగ్గరికి వెళితే ముఖ దర్శన భాగ్యం కలుగుతుంది. కానీ ఇక్కడి ప్రత్యేకం ఏమిటంటే మీరు ఆ కొండను నానా ప్రయాసలు పడి ఎక్కితే అక్కడ నంది కనపడదు. కేవలం ఒక ప్రదేశం నుండి మాత్రమే నందిని చూసే భాగ్యం కలుగుతుంది. ఎంత విచిత్రమో కదూ ..!

Photo Courtesy: s.srikrishnan

అరుణాచల ఆలయం

అరుణాచల ఆలయం

ఎవరెన్ని నమ్మినా నమ్మకపోయినా సాక్షాత్తూ పర్వతాన్నే శివుడిగా భావించే మనకు ఇంకొక పర్వత రూపంలో నందీశ్వరుడు కనిపించడం అద్భుతమే ..!

Photo Courtesy: Hanneke4

ఆలయ విశేషాలు

ఆలయ విశేషాలు

నిజానికి దేశంలో ఉన్న పెద్ద దేవాలయాలలో అరుణాచలేశ్వర ఆలయం ఒకటి. ఇది 10 హెక్టార్ల స్థలం వరకు విస్తరించినది.

Photo Courtesy: thiruvannamalai temples

ఆలయ విశేషాలు

ఆలయ విశేషాలు

అరుణాచలేశ్వర ఆలయం నాలుగు ముఖద్వారపు గోపురాలతో అందంగా నిర్మించబడినది. తూర్పు వైపు ఉన్న గోపురం ఎత్తు 66 మీటర్లు మరియు ఇది అక్కడున్న నాలుగు గోపురాలలో పొడవైనది. అంతేకాక దేశంలో కెల్లా పొడవైన గోపురంగా ఖ్యాతి గడించినది. ఈ గోపురం 11 అంతస్తుల వరకు ఉంటుందట ..!

Photo Courtesy: Trevor Thompson

రమణ ఆశ్రమం

రమణ ఆశ్రమం

రమణ ఆశ్రమం, రమణ మహర్షి నివాస స్థలం లో నిర్మితమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఈ ఆలయం అరుణాచలేశ్వర ఆలయానికి 2 కి.మీ .దూరంలో ఉన్నది. ఈ ఆశ్రమంలో స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడ కోతులు, నెమాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. సాయంత్రం పూట రమణ మహర్షి సమాధి వద్ద భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు.

Photo Courtesy: Rajachandraa

శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం

శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం

రమణ ఆశ్రమానికి కూత వేటు దూరంలో శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం తిరువన్నమలై జిల్లాలో ఉన్నది. ఇక్కడ శేషాద్రి స్వామి సమాధి ఉన్నది. ఇక్కడ ఉండటానికి వసతి సదుపాయం నామమాత్రపు ధరలతో ఉంటుంది. ఆది కూడా కట్టలేనివారికి మినహాయింపు ఉంటుంది.

Photo Courtesy: Rajachandraa

అన్నామలై కొండలు

అన్నామలై కొండలు

కేరళ, కర్నాటక మరియు తమిళనాడులో విస్తరించిన పశ్చిమ కనుమలలో అన్నా మలై కొండలు ఉన్నాయి. అన్నా అంటే ఏనుగు అని, మలై అంటే కొండ అని అర్థం. ఒక్కమాటలో చెప్పాలంటే ఏనుగుకొండ అని అర్థం. ఇక్కడ ఉన్న వన్యమృగ సంపద అపారం.

Photo Courtesy: Poetseer

స్యాంక్చురీ లు, నేషనల్ పార్కులు

స్యాంక్చురీ లు, నేషనల్ పార్కులు

ఏర్వైకులుం నేషనల్ పార్క్, పరంబికులుం వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ , ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ అండ్ నేషనల్ పార్క్, చిన్నర్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ మరియు అనమలాస్ టైగర్ రిజర్వు ఈ అన్నామలై కొండలలో ఉన్నాయి . ఈ అన్ని పార్క్ లు, స్యాంక్చురీ లు పెద్ద పెద్ద ఏనుగు దంతాలకు ప్రసిద్ది చెందినవిగా ఉన్నాయి. అంతేకాక ఇక్కడ గౌర్, టైగర్, పాంథర్, సివెట్ కాట్స్, సాంబార్, దోలె, స్లోత్ బెర్స్ మరియు వాటర్ బుఫ్ఫెలో వంటి ఇతర జంతువు కూడా కలవు.

Photo Courtesy: Marcus334

అరుణాచల క్షేత్రానికి ఎలా చేరుకోవాలి??

అరుణాచల క్షేత్రానికి ఎలా చేరుకోవాలి??

వాయు మార్గం

అరుణాచలం కి దగ్గరలో ఉన్న విమానాశ్రయం చెన్నై విమానాశ్రయం. ఇది 185 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడి నుండి క్యాబ్, ప్రవేట్ వాహనాల ద్వారా ఈ క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు.

రైల్వే స్టేషన్

అరుణాచల క్షేత్రానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ తిరువన్నమలై రైల్వే స్టేషన్. ఇది క్షేత్రానికి 1 .2 కిలోమీటర్ల దూరంలో, కేవలం 5 - 10 నిమిషాలలో చేరుకొనే విధంగా ఉంటుంది. స్టేషన్ లో దిగి ఆటో ల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.

Photo Courtesy: dillibabu k

రోడ్డు మార్గం

అరుణాచల క్షేత్రానికి సమీప పట్టణాల నుండి, నగరాల నుండి ప్రభుత్వ బస్సులు ఉన్నాయి. పండుగలు మరియు వేడుకల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు కనుక అప్పుడు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతారు. చెన్నై లోని కోయంబేడ్ బస్ - స్టాండ్ నుండి అరుణాచల క్షేత్రానికి నిత్యం బస్సులు ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవడానికి 4 - 5 గంటల సమయం పడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X