Search
  • Follow NativePlanet
Share
» »వంకనేర్ - మంత్ర ముగ్ధులను చేసే ఆకర్షణ !

వంకనేర్ - మంత్ర ముగ్ధులను చేసే ఆకర్షణ !

By Mohammad

వంకనేర్ ... గుజరాత్ రాష్రంలోని రాచరిక పట్టణం. ఒకప్పుడు దీనిని 'ఝూలా' రాజపుత్రులు పాలించేవారు. వంకనేర్ ప్రదేశం మహారాణా అమరసింహ జి కాలంలో బాగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. ఈయన అప్పటివరకున్న కట్టడాలకు నూతన శోభను తీసుకొచ్చారు. అలాగే తన చేతుల మీద మరెన్నో కట్టడాలకు శ్రీకారం చుట్టారు. అమరసింహ జి కీ శిల్పాలన్నా, కళలన్నా ఎంతో ఇష్టం.

వంకనేర్ అనే పేరు ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చిందంటే ఈ ప్రదేశం ఒక వంపులో ఉండటం వల్ల వచ్చింది. మచ్చు (మచు) నది నీరు ఇక్కడ ఒక వంపులో ప్రవహిస్తుంది. వంకనేర్ ఆ రాష్ట్ర రాజధానైన గాంధీనగర్ కు 230 కి. మీ దూరంలో, అహ్మదాబాద్ నుండి 208 కి. మీ దూరంలో ఉన్నది. దీనికి సమీప పట్టణాలుగా రాజ్ కోట్ (48 కి. మీ), గొండాల్ (87 కి. మీ) లు కలవు. వంకనేర్ రాజులకాలంలో వేసవి విడిది గా ఉండేదట ..!

ఇది కూడా చదవండి : గుజరాత్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు !

రంజిత్ విలాస్ ప్యాలెస్

వంకనేర్ రాజులకు కళాభిరుచి, శిల్పాల పట్ల ఎంత మక్కువ ఉందో రంజిత్ విలాస్ ప్యాలస్ చూస్తే అర్థమవుతుంది. క్రీ.శ.1907 అమర్ సిన్హా జి ఒక కొండపై రంజిత్ ప్యాలెస్ ను నిర్మించారు. దీని నిర్మాణంలో గోతిక్ ఆర్చీలు, మొఘల్ డోమ్ కల ఒక పెద్ద క్లాక్ టవర్, ఫ్రాంకో ఇటాలియన్ విండో కిటికీలు, బల్కనీలు, ఇంకా అనేక ఇతర ఆకర్షణలు కలవు. ప్యాలెస్ లో కొంత భాగాన్ని ఒక మ్యూజియంగా మార్చి అనేక కలాక్రుతులను ప్రదర్శిస్తూ ప్రజల సందర్శనార్థం ఉంచారు.

రంజిత్ విలాస్ ప్యాలెస్

రంజిత్ విలాస్ ప్యాలస్

చిత్ర కృప : Dmp mech

రాయల్ ఒయాసిస్

మచ్చు (మచు) సరస్సు ఒడ్డున ఉన్న రాయల్ ఒయాసిస్ ఒకప్పుడు రాజుల వేసవి విడిది గా ఉండేది. దీనిని ఇప్పుడు హెరిటేజ్ హోటల్ గా మార్చారు. రాజభవనం లోని మెట్ల బావి దీనికి మరింత అందాన్ని చేకూర్చింది. పెద్ద పెద్ద వృక్షాలు, ఉదయాన్నే లేస్తే అందమైన పక్షుల రాగాలు, ధ్వనులు గమనించవచ్చు.

రాయల్ ఒయాసిస్

రాయల్ ఒయాసిస్

చిత్ర కృప : telugu native planet

రాయల్ రెసిడెన్సి

రంజిత్ విలాస్ ప్యాలెస్ పక్కనే ఉన్న రాయల్ రెసిడెన్సి ని కూడా ఒకప్పుడు వంకనేర్ రాజులు వేసవి విడిది గా వినియోగించేవారు. ప్రస్తుతం ఇది హెరిటేజ్ హోటల్ గా సేవలందిస్తున్నది.

వంకనేర్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

రాజ్ కోట్ (62 కి.మీ), వంకనేర్ కు సమీప విమానాశ్రయం. అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, జైపూర్ ప్రాంతాల నుండి ఇక్కడికి నిత్యం విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి వంకనేర్ సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం

అహ్మదాబాద్ - రాజ్ కోట్ మార్గంలో వంకనేర్ రైల్వే స్టేషన్ కలదు. దీనికి సమీపాన ఉన్న రైల్వే జంక్షన్ 'రాజ్ కోట్'. కోల్కతా, చెన్నై, ముంబై, పూణే నగరాల నుండి రాజ్ కోట్ కు ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్ళు తిరుగుతుంటాయి.

బస్సు / రోడ్డు మార్గం

వంకనేర్ కు సమీపాన రాజ్ కోట్ ఉన్నది. ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు, వాహనాలు అందుబాటులో దొరుకుతాయి.

వంకనేర్ కు ఎలా వెళ్ళాలి ?

వంకనేర్ కు ఎలా వెళ్ళాలి ?

చిత్ర కృప : UjjawalTM

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X