Search
  • Follow NativePlanet
Share
» »ప్రకృతి రమణీయతకు-దక్షిణ భారత చిత్రపరిశ్రమకు ఫేవరెట్ షూటింగ్ స్పాట్ : పొల్లాచి

ప్రకృతి రమణీయతకు-దక్షిణ భారత చిత్రపరిశ్రమకు ఫేవరెట్ షూటింగ్ స్పాట్ : పొల్లాచి

ఉరుకుల పరుగుల దైనందిన జీవితంలో కొంచెం విశ్రాంతి తీసుకోవలని కోరిక కలుగుతుంది. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఎక్కడికైనా టూర్ వెళ్ళిరావాలని కోరుకుంటారు. ఫ్యామిలీతో కలిసి ానందంగా గడిపే కొద్దిరోజులు ఆ ఏడాదికి కావాల్సిన ఎనర్జీని ఇస్తాయి. అలా కొత్తగా కావల్సినంత ఎనర్జీని పొందాలంటే తమిళనాడులోని పొల్లాచికి వెళ్ళాల్సిందే. తమిళనాడులోని కోయంబత్తూర్ లోని పొల్లాచి. ఎన్నో సినిమాల్లో చూసిన పొల్లాచి అందాలను ప్రత్యక్షంగా చూసి ఆనందించాలి.

సినిమా షూటింగ్ లకు మారుపేరు. ప్రకృతి అందాలకు నెలవు తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో ఉన్న పొల్లాచి. పర్యాటక పరంగా పొల్లాచికి ఉన్న పేరుప్రఖ్యాతులు అన్నీఇన్నీ కాదు. ఇటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఒకటేమిటి...ఇండియాలో ఉన్న అన్ని భాషల్లోని చిత్రాల షూటింగ్స్ ఇక్కడ జరుగుతాయి. ప్రకృతి సోయగాలకు, దేవాలయయాలకు ప్రసిద్ధి. చుట్టూ పచ్చని పచ్చిక బయళ్ళు, సెలయేళ్ళు, డ్యాములు, దేవాలయాలతో ప్రకృతి రమణీయతకు చిరునామాగా అలరారుతున్న పొల్లాచిలో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు... టూరిజం స్పాట్స్‌ ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుదాం..

టాప్ స్లిప్:

టాప్ స్లిప్:

పొల్లాచిలో అన్నామలై హిల్స్ కు 800అడుగుల ఎత్తులో ఉంది. పొల్లాచిలో సందర్శించడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన టాప్ స్లిప్ ఒక ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశం. ఇది ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ పార్క్ లో ఉన్న ఒక ప్రాంతం. ఇది పొల్లాచి నగరానికి 37కిలోమీటర్ల దూరంలో ఉంది . ఈ ప్రదేశానికి ప్రైవేటు లేదా ప్రజా రవాణా ద్వారా సులభంగా చేరుకోచ్చు. ఇక్కడ ఎలిఫెంట్ ట్రైనింగ్ క్యాంప్ ఉంది. ఈ టాప్ స్లిప్ లో ట్రెక్కింగ్, ఏనుగు సఫారి మరియు ఫోటో గ్రఫీ వంటి కార్యకలాపాలను టాప్ స్లిప్ అన్వేషించవచ్చు.

Photo Courtesy: Thangaraj Kumaravel

పొల్లాచి అయ్యప్ప దేవాయం:

పొల్లాచి అయ్యప్ప దేవాయం:

1970 సంవత్సరంలో నిర్మించబడిన పొల్లాచ్చి అయ్యప టెంపుల్ శబరిమల అయ్యప్ప టెంపుల్ తో అనేక పోలికలు కలిగివుంది. ఈ టెంపుల్ లో అనేక మంది దేవతల విగ్రహాలు కలవు. ప్రధానంగా అయ్యప్ప విగ్రహం కలదు. అనేక మంది భక్తులు ప్రతి రోజూ గుడికి వచ్చి హోమం, పూజ వంటి క్రతువులు చేస్తారు.

PC: jalahalliayyappatemple.org

సుబ్రమణ్య స్వామి దేవస్థానం:

సుబ్రమణ్య స్వామి దేవస్థానం:

సుబ్రమణ్య స్వామి తిరుకొయిల్ సుమారు 700 సంవత్సరాల కిందట కొంగ చొళులు నిర్మించారు. ఇక్కడ శివుడి విగ్రహం వుంటుంది. ఈ టెంపుల్ ను తిరువహతేస్వర ముదయర్ టెంపుల్ అంటారు. పురాతన శిల్ప శైలి అభిమానించే భక్తులకు ఇది ప్రసిద్ధి. ఇపుడు ఈ టెంపుల్ సుబ్రమనియన్ కోవిల్ గా పిలువబడుతోంది. ఈ టెంపుల్ లో లార్డ్ సుబ్రమణ్య విగ్రహం వుంటుంది.

త్రిమూర్తి హిల్స్:

త్రిమూర్తి హిల్స్:

త్రిమూర్తి హిల్స్ త్రిమూర్తి డాం పక్కనే కలదు. ఈ కొండలపై త్రిమూర్తి టెంపుల్ కలదు. ఇక్కడే అమరలింగేశ్వర టెంపుల్ మరియు త్రిమూర్తి జలపాతాలు కూడా కలవు. ఈ కొండలపై ఒకప్పుడు అథారి మహర్షి , ఆయన భార్య అనసూయ నివసించారు. వారి భక్తి కి మెచ్చి త్రిమూర్తులు ఇక్కడ వారికి ప్రత్యక్షం అయ్యాయారు. ప్రత్యక్షం అయిన త్రిమూర్తులు అనసూయను నగ్నం గా తమ కు ఆహారం ఇవ్వమని కోరగా ఆమె ఆ త్రిమూర్తులను పసి పిల్లలను చేసి వారికి నగ్నంగా పాలను అందించింది. అపుడు త్రిమూర్తులు ఆమెను, ఆమె భర్తను ఆశీర్వదించి వెళ్ళిపోయారు.

Photo Courtesy: Hayathkhan.h

మాసాని అమ్మన్ టెంపుల్ :

మాసాని అమ్మన్ టెంపుల్ :

ఈ గుడి లో మాసాని అమ్మన్ దేవత వుంటుంది. ఈ దేవత సర్ప శరీరం కలిగి వుంటుంది. ఈ టెంపుల్ పోల్లచికి 24 కి.మీ.ల దూరంలో కలదు. ఈ టెంపుల్ కు వచ్చే భక్తులకు దేముడు సరిగ్గా మూడు వారాల లో తమ కోరికలు విని తీరుస్తాడనే నమ్మకం కలదు. మంగళ మరియు శుక్ర వారాలు ప్రధానం. టెంపుల్ మధ్య భాగంలో మాసాని అమ్మన్ పెయింటింగ్ వుంటుంది. ఈ టెంపుల్, రాజు మాసాన్ కు చెందిన ఒక మామిడి చెట్టు నుండి ఒక మామిడి పండు తినిన ఒక బాలిక పేరు పై నిర్మించబడింది. స్థానికులు తర్వాత ఆ బాలికను మాసాని అమ్మన్ గా పూజించారు.

Photo Courtesy: Masani Amman Temple

అజియార్ డ్యాం:

అజియార్ డ్యాం:

పొల్లాచికి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అజియర్‌ డ్యాం. అజియార్‌ నది పై 1959-69 మధ్య కాలంలో సాగు నీటి కొరకు నిర్మించిన ఈ డ్యాం ఎత్తు 81 మీటర్లు. అద్భుతమైన ఇంజనీరింగ్‌ పనితనంతో నిర్మించిన ఈ డ్యాం చుట్టూ పర్యాటకులను విశేషంగా ఆకట్టు కునేలా ఎన్నో అందాలున్నాయి. ఇటీవలికాలంలో ప్రధాన పిక్నిక్‌ స్పాట్‌గా మారిన అజియార్‌ డ్యాం ను తప్పక చూడాల్సిందే. దీనితో పాటు పొల్లాచికి జంటనగరంగా పిలువబడే ఉడుమాల్‌ పేట్‌ సమీపంలో ఉన్న అమరావతి డ్యాం, కాడంబరి డ్యాం తప్పక చూడాల్సిందే.

మాసని అమ్మన్ టెంపుల్

Photo Courtesy: Raghavan Prabhu

అమరావతి డ్యాం:

అమరావతి డ్యాం:

అమరావతి డ్యాం ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ సమీపంలో కనుగొనబడినది. ఈ డ్యాంను ఇరిగేషన్ మరిు వరదలను కంట్రోల్ చేయడానికి 1957లో నిర్మించబడినది. అయితే ప్రస్తుతం ఇది ఒక పాపులర్ టూరిస్ట్ ప్లేస్ అయింది. పొల్లాచికి దగ్గరలో ఉన్న ఈ డ్యాంను చాలా అందంగా నిర్మించారు. అద్భుతంగా నిర్వహిస్తున్నారి ఇక్కడ అద్భుతమైన వ్యూ మరియు బోటింగ్ ఫెసిలిటి ఉంది.

Photo Courtesy: Dhruvaraj S

మనస్సాక్షి ధ్యానకేంద్రం..

మనస్సాక్షి ధ్యానకేంద్రం..

పొల్లాచికి 25 కి.మీ.ల దూరంలో వున్న అరివు తిరుకోయిల్‌ ఆలయాన్ని మనస్సాక్షి టెంపుల్‌గా పిలుస్తారు. దీన్ని ఒక ధ్యానం కేంద్రంగా నిర్మించారు. అలాగే 16వ శతాబ్దంలో నిర్మించబడిన అద్భుత ఆలయం అలగునాచి అమ్మన్‌ దేవాలయం. పొల్లాచికి 80 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ దేవాలయాన్ని వల్లియరాచల్‌ ప్రాంతానికి చెందినవారు కట్టించారు. పొల్లాచి నగరంలో మూడువందల సంవత్సరాల చరిత్ర ఉన్న మరియమ్మన్‌ దేవాలయం ఉంటుంది. పొల్లాచికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో దేవాలయం మాసాని అమ్మన్‌ దేవాలయం. ఇక్కడ దేవత సర్పశరీరం కలిగి ఉంటుంది.

PC: Divyacskn1289

నేషనల్ పార్క్:

నేషనల్ పార్క్:

సముద్రమట్టానికి 1400 మీటర్ల ఎత్తులో.. దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఇక్కడి ఇందిరాగాంధీ లైల్డ్లైఫ్ శాంక్చురి అండ్ నేషనల్పార్క్ ప్రధాన ఆకర్షణ. ఎన్నో రకాల వన్యజీవులకు ఆవాసమైన ఈ వనం ప్రకృతి రమణీయతకు తార్కాణం అని చెప్పాలి. ఇక్కడ పులులు చిరుతల జింకలు. ఏనుగులు.. విభిన్న జాతుల పక్షలు ఉంటాయి. ఇలా జంతువృక్షజాలంతో కూడుకొన్న ప్రకృతి రమణీయతను దర్శించుకోవడానికి ప్రతియేటా వేల మంది పర్యాటకులు వస్తుంటారు. సినిమాల చిత్రీకరణకు కూడా ఈ పరసిరాలు అత్యంత అనువైనవి. అందమైనవి. అందుకే కోలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్, మల్లూవుడ్, పరిశ్రమల వారు పొల్లాచిపై పడిపోతుంటారు!

Photo Courtesy: Bikash Das

మంకీ ఫాల్స్:

మంకీ ఫాల్స్:

మంకీ ఫాల్స్ సహజ జలపాతాలు. ఇది అన్నామలై కొండల కు 30 కి.మీ.ల దూరంలో కలదు. ఈ జలపాతాలు పొల్లాచి - వాల్ పరాయి రోడ్ మార్గంలో కలవు. ఇక్కడ సుందరమైన ప్రకృతి అందాలు చూడవచ్చు. మంకీ ఫాల్స్ కు ప్రవేశ రుసుము రూ.15 గా కలదు.

Photo Courtesy: Dilli2040

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

రోడ్డు: పొల్లాచి జాతీయ మరియు రాష్ట్రీయ రహదారుల సముదాయం. దేశంలోని ప్రధాన నగరాల నుండి బస్సు సర్వీస్ లు కలవు

రైలు మార్గం: పొల్లాచి రైలు మార్గం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. మీరు కొయంబత్తూర్ జంక్షన్ కు ప్రయాణించవచ్చు. అక్కడ నుండి 40కిలోమీటర్ల దూరంలో పొల్లాచి ఉంది.

విమాన మార్గం: పొల్లాచికి దగ్గరి విమానాశ్రయం కోయంబత్తూర్. ఎయిర్ పోర్ట్ నుండి 60కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానశ్రాయానికి డిమస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి.

Photo Courtesy: Dhruvaraj S COIMBATORE OverviewHow to

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X