Search
  • Follow NativePlanet
Share
» »అతిశక్తివంతమైన నాగ దోష పరిహారం గుడి !

అతిశక్తివంతమైన నాగ దోష పరిహారం గుడి !

By Venkatakarunasri

ఈ వ్యాసంలో మనం కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామి వారి విశిష్టత, ఆయన యొక్క మహిమలగురించి తెలుసుకుందాం. కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామిగుడిలో నాగ దేవత ఎప్పుడూ కొలువైవుంటుందిఅని ప్రగాఢ విశ్వాసం. నాగదేవత పరిహారం చేయించుకోవాలని అనుకుంటున్నారా?అయితే మీ అనుకూలాన్ని బట్టి ఈ ఆలయాన్ని తప్పక సందర్శించండి. మహిమాన్వితమైన కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామివారి అనుగ్రహాన్ని పొందండి. కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామి వారి గుడి నాగదోషపరిహారములకు చాలా ప్రసిద్ధమైనది.ఇక్కడ ప్రధానంగా సర్పహత్యాదోషం, ఆశ్లేష బలి పూజ మరియు నాగప్రతిష్టపూజలు చాలా నిష్టగా నిర్వహిస్తారు.

 నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

ఎక్కడ వుంది?

కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని సుల్లియా అనే వూర్లో కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయం వుంది. ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యాలు వెలువరించే కర్ణాటకరాష్ట్రం దక్షిణ కన్నడజిల్లాలో మంగళూరుకి 100కిమీ ల దూరంలో కుమారపర్వత శ్రేణులమధ్య ధారా నది ఒడ్డున వున్న గ్రామం 'సుబ్రహ్మణ్యం'లో వుంది. సుబ్రమణ్యస్వామిని ఇక్కడ నాగదేవతగా ఆరాధించటం విశేషం. ఇది ఒక ప్రసిద్ధయాత్రా స్థలం. యాత్రికులను బాగా ఆకర్షిస్తుంది.

 నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

పూర్వం ఈ గ్రామాన్ని 'కుక్కె పట్నం' అని పిలిచేవారు.క్రమంగా ఇది కుక్కె సుబ్రహ్మణ్య'గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ గుడిలో నాగదోషపరిహారములు చేసుకుంటే వారికి జీవితంలో ఎటువంటి బాధలులూలేకుండా మంచి సంతానం కలిగి సుఖసంతోషాలతో జీవిస్తారని పురాణ గాధల్లో వుంది.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

కుక్కే సుబ్రమణ్యస్వామివారి ఆలయస్థల పురాణం

ఎన్నో వేల సంవత్సరాల చరిత్రకలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలు వెలిసాయి.వాటిలో కొన్ని ఆలయాలను భక్తులు, రాజులు, వంశస్థుల వారు దేవుడిపై భక్తిని చాటిచేప్పెందుకు నిర్మించగా మరి కొన్ని దేవాలయాల్లో దేవతలు స్వయంభూలుగా వెలిసారు.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

అలా వెలిసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రమణ్యస్వామిఆలయం ఒకటి.కుమారస్వామి అంటే సుబ్రమణ్యస్వామి. కార్తికేయుడికి నిలయమైన ఈ క్షేత్రాలలో పరశురామక్షేత్రం ఒకటి. సుబ్రమణ్యఆలయం గురించి 'స్కాందపురాణం'లో సనత్ కుమారసంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్ర మహామణి పురాణంలో తెలుపబడింది.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

స్థలపురాణం

పూర్వం తారకుడు, సూర్పర్మాసురా అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడి ధారానదిలో శుభ్రపరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత కుమారధార పర్వతశ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో కుమారస్వామి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని కోరగా ఆయన అంగీకరిస్తాడు. ఆ తరువాత వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెలియడానికి అంగీకరించటం వల్ల ఈ క్షేత్రం వెలసింది.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

సుబ్రమణ్యస్వామి ముఖద్వారం తూర్పుముఖమై ఉన్నా, భక్తులు మాత్రం పృష్టభాగం నుండి ముందుకు వెళ్లి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గర్భగుడికి, ఈమధ్య నిర్మించబడ్డ వసారాకు మధ్యన వెండితాపడాలతో అలంకరింపబడ్డ స్తంభం ఉంటుంది.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

వాసుకి విషపు బుసలనుండి రక్షింపపడడానికి ఈ స్తంభాన్ని నిర్మించారు అని ప్రతీతి.ఈ స్తంభాన్ని దాటిన తరువాత లోపలి మంటపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు సాక్షాత్కరిస్తాడు. పైభాగంలో సుబ్రమణ్యస్వామి,మధ్య భాగంలో వాసుకి, క్రిందిభాగంలో ఆదిశేషుడు వుంటారు.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

కుమారధారా నది మీద వున్న సుబ్రమణ్యస్వామి వూళ్ళో వున్న సుబ్రమణ్య దేవాలయం లేక కుక్కే సుబ్రమణ్య దేవాలయం చూసితీరవలసిన వాటిలో ఒకటి. ఈ గుడి చుట్టూ నదులు, పర్వతాలు, అడవులు ముఖ్యంగా కుమారపర్వతం పరుచుకుని వుంటాయి. ఈ గుడి శివుడి రెండో కుమారుడు, కార్తికేయుడుగా పిలవబడే సుబ్రమణ్యస్వామికి, నాగరాజు వాసుకి కి నిలయం.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

సుబ్రమణ్య దేవాలయంలో బయట లోపల వున్న హాళ్ళు గర్భాలయానికి దారితీస్తాయి. ఒక ఎత్తైన వేదికమీద సుబ్రమణ్యస్వామి తో పాటు వాసుకి విగ్రహాలు వున్నాయి.హిందూ పురాణాల ప్రకారం మరో నాగరాజు ఆదిశేషుడి విగ్రహం కూడా గర్భాలయంలో చూడవచ్చును. గర్భాలయానికి, మండపద్వారానికి మధ్య వెండితో కప్పబడిన గరుడస్థంభం వుంది.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

కుమారధారా నది మీద వున్న సుబ్రహ్మణ్య స్వామి వూళ్ళో వున్న సుబ్రహ్మణ్య దేవాలయం లేక కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం చూసి తీరవలసిన వాటి లో ఒకటి. ఈ గుడి చుట్టూ నదులు, పర్వతాలు, అడవులు. ముఖ్యంగా కుమార పర్వత౦ పరుచుకుని వుంటాయి. ఈ గుడి శివుడి రెండో కుమారుడు, కార్తికేయుడు గా పిలవబడే సుబ్రహ్మణ్య స్వామికి, నాగ రాజు వాసుకి కి నిలయం. సుబ్రహ్మణ్య దేవాలయంలో బయట లోపల వున్న హాళ్ళు గర్భాలయానికి దారి తీస్తాయి.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

ఒక ఎత్తైన వేదిక మీద సుబ్రహ్మణ్య స్వామి తో పాటు వాసుకి విగ్రహాలు వున్నాయి. హిందూ పురాణాల ప్రకారం మరో నాగ రాజు ఆది శేషుడి విగ్రహం కూడా గర్భాలయం లో చూడవచ్చు. గర్భాలయానికి, మండప ద్వారానికి మధ్య వెండి తో కప్పబడిన గరుడ స్థంభం వుంది. స్థానికుల ప్రకారం యాత్రికులను ఈ స్తంభంలో నివసించే వాసుకి నుంచి వచ్చే విషం నుంచి కాపాడడానికి ఈ స్తంభానికి తాపడం చేశారు.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

సర్ప దోష శాంతికి చేసే ప్రక్రియలకు ఈ పవిత్ర దేవాలయం ప్రసిద్ది. ఈ గుడిలోని ప్రధాన పర్వ దినం తిపూయం నాడు అనేకమంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. దీంతో పాటు ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కారం అనే మరో రెండు ప్రధానమైన సర్ప దోష పూజలు కూడా ఈ గుడిలో చేస్తారు.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని సుల్లియా అనే ఊళ్ళో కుక్కే సుబ్రమణ్య దేవాలయం వుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగ దేవతగా ఆరాధించడం విశేషం. ఇది ఒక ప్రసిద్ధ యాత్రా స్థల౦ - ఇక్కడి క్షేత్ర గాధ కూడా యాత్రికుల్ని ఇక్కడికి ఆకర్షిస్తుంది. పురాణ గాధ వాసుకి శివుడిని ప్రార్ధించి, గరుత్మంతుడి నుంచి నాగ జాతి ని కాపాడమని వేడుకున్న ప్రదేశం లో ఈ గుడి నిర్మించారని పురాణ గాధ చెప్తుంది.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

ఈ తపస్సుకు మెచ్చిన శివుడు సుబ్రహ్మణ్య స్వామి ని నాగజాతిని రక్షించ డానికి పంపాడు, అప్పటి నుంచి ఆయన్ను నాగ జాతి రక్షకుడిగా కొలుస్తున్నారు. గరుత్మంతుడి గోపురం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ వెండి గోపురాన్ని వాసుకి బుసల్లోంచి వచ్చే విష వాయువుల నుంచి భక్తులను కాపాడడానికి నిర్మించారు. వాసుకి ఈ గుళ్ళో వుంటాడని నమ్ముతారు. ఆశ్లేష బలి, సర్ప సంస్కారం ఈ గుళ్ళో జరిగే ప్రధాన పూజలు. ఈ గుడిలో దీంతోపాటు ఆశ్లేష బలిపూజ, సర్పసంస్కారం అనే మరో రెండు ప్రధానమైన సర్పదోష పూజలు కూడా ఈ గుడిలో చేస్తారు.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

స్థానికుల ప్రకారం

స్థానికుల ప్రకారం యాత్రికులను ఈ స్తంభంలో నివసించే వాసుకి నుంచి వచ్చే విషం నుంచి కాపాడడానికి ఈ స్తంభానికి తాపడం చేసారు. సర్పదోష శాంతికి చేసే ప్రక్రియలకు ఈ పవిత్ర దేవాలయం ప్రసిద్ధి. ఈ గుడిలోని ప్రధాన పర్వదినం తిపూయం నాడు అనేకమంది యాత్రికులు ఇక్కడకి వస్తారు.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశనలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తారు.పూర్వం 'ఆది శంకాచార్యులు' తన ధర్మప్రచార పర్యటనలో భాగంగా సుబ్రమణ్యను దర్శించారు. ఆయన విరచించిన సుబ్రమణ్య భుజంగ స్తోత్రంలో 'నమస్తే సదా కుక్కుటేశాగ్ని కేతాస్స్మస్తాపరాధం విభోమే క్షమస్వ' అని పేర్కొన్నారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయని కొందరి భక్తుల నమ్మకం.

Photo Courtesy : www.itslife.in

నాగ దోష పరిహారం గుడి !

నాగ దోష పరిహారం గుడి !

ఎలా వెళ్ళాలి?

వాయు, రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

విమానాశ్రయం

ఇక్కడకు దగ్గరలో వున్న విమానాశ్రయం ఏదంటే అది మంగళూరు విమానాశ్రయం

రైల్వేస్టేషన్

గుడి నుంచి 7కిమీ ల దూరంలో రైల్వేస్టేషన్ వుంది.

రోడ్డుమార్గం

బెంగుళూరు, మంగళూరు నుంచి సుబ్రమణ్యదేవాలయం వరకూ చాలా ప్రభుత్వ బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి.

భయం భయంగా సమాధులలో సందర్శన !!

సైంటిస్టులకు కూడా కనిపించిన దేవుడు - 12 దేవాలయాల మిస్టరీ !

భూమిని తవ్వుతుంటే వందల్లో బయటకొస్తున్న అస్థిపంజరాలు..ఎవరివో తెలుసుకున్న సైంటిస్ట్ కు

గుహలో దాగి వున్న కైలాసం - శివుని మహాద్బుతలింగం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more