Search
  • Follow NativePlanet
Share
» »365 రోజులూ నీటిలోనే ఈ దేవాలయం

365 రోజులూ నీటిలోనే ఈ దేవాలయం

హంపీలోని ప్రసన్న విరూపాక్ష దేవాలయానికి సంబంధించిన కథనం.

విజయనగర వైభవాన్ని ఇప్పటికీ కళ్లకు కట్టినట్లు చూపించే పర్యాటక ప్రాంతాల్లో హంపిది తిరుగులోని స్థానం అన్న విషయం మనం ఒప్పుకోవాల్సిందే. ఇక్కడ ఉన్న దేవాలయాలు పురాణ ప్రాధాన్యత కలిగినవి కూడా ఉన్నాయి. ఇక ఇందులో ఉన్నటు వంటి శిల్ప సౌదర్యాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే భారతీయ శిల్ప సౌదర్యం పై పరిశోధన చేయాలనుకొనేవారికి మొదట గుర్తుకు వచ్చేది హంపినే. ఇంతటి ప్రాధాన్యత కలిగి హంపిలో అతి పురాతనమైన దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం....

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

P.C: You Tube

విజయనగర సామ్రాజ్య రాజధానిగా హంపి ఉన్నత శిఖరాలను అధిరోహించిన విషయం తెలిసిందే. ఈ దేవాలయంలో అత్యంత పురాతన దేవాలయం ప్రసన్న విరూపాక్ష దేవాలయం.

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ఈ దేవాలయంలోని విగ్రహం అత్యంత పురాతనమైనా ఇక్కడి దేవాలయాన్ని విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించినట్లు చెబుతారు. హంపిలోని బస్ స్టాండ్ కు సమీపంలోనే ఈ దేవాలయం ఉంది.

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

క్రీస్తుశకం 1980లో ఈ దేవాలయం అక్కడి తవ్వకాల్లో బయటపడింది. అంతకు ముందు దాదాపు 400 ఏళ్లు భూమిలో కూరుకుపోయినట్లు పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ఈ ప్రసన్న విరూపాక్ష దేవాలయం నిర్మాణం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. భూమికి కొన్ని లోతులో గర్భగుడి ఉంటుంది. గర్భగుడి పై భాగం భూ మట్టానికంటే కాస్త ఎత్తులో ఉంటుంది.

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

అంతేకాకుండా గర్భగుడి కింది భాగంలో కూడా దేవాలయం ఉంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యవిషయం కూడా ఉంది. ఈ దేవాలయం గర్భగుడి ఏడాది మొత్తం నీటిలో మునిగి ఉంటుంది.

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

వర్షాకాలంలో అంటే జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఈ దేవాలయంలో నీటి మట్టం పెరిగిపోతుంది. మహామంటపంతో పాటు శిఖర భాగం, ఇతర మంటపాలు నీటిలో మునిగిపోతాయి.

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

అందువల్లే వర్షాకాలంలో ఈ దేవాలయంలోని కొన్ని ప్రాంతాల్లోకి పర్యాటకుల ప్రవేశాన్ని నిషేదిస్తారు. ఈ దేవాలయంలోకి నీరు వచ్చే నీరు తుంగభద్ర నదీ నీరుగా చెబుతారు. తుంగభద్ర డ్యాంను వర్షాకాలంలో తెరుస్తారు.

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

దీంతో ఆ డ్యాం నుంచి నీరు భూ గర్భం నుంచి ఈ దేవాలయంలోకి చేరుతుందని చెబుతారు. ఇక ఈ దేవాలయం వాస్తుశైలి విభిన్నంగా ఉంటుంది. ఈ దేవాలయంలో మహామంటపం, అర్థమంటపం, గర్భగుడి, ఈ గర్భగుడిలో లోపల మరో చిన్న మంటపం ఉంటుంది.

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ఈ దేవాలయం గోడలు, స్తంభాల పై అనేక శిల్పాలను మనం చూడవచ్చు. ఈ శిల్ప విన్యాసాలను చూడటానికే చాలా మంది ఈ దేవాలయానికి వస్తుంటారు. హంపి ప్రముఖ ధార్మిక ప్రాంతమే కాకుండా పర్యాటక ప్రాంతమే.

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

అందువల్లే దేశ, విదేశాలకు చెందిన అనేకమంది పర్యాటకులు వస్తుంటారు. ఇందులో చాలా మంది ఇక్కడి శిల్పకళా విన్యాసాలను చూడటానికే వస్తుంటారు. హంపికి సమీపంలో బళ్లారీ విమానాశ్రయం ఉంది.

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ప్రసన్న విరూపాక్ష దేవాలయం, హంపి

ఈ రెండు నగరాల మధ్య దూరం 60 కిలోమీటర్లు. అక్కడి నుంచి ట్యాక్సీలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. హంపికి దగ్గర్లో హొసపేట రైల్వేస్టేషన్ ఉంది. ఇది హంపి నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. కర్నాటకలోని ప్రధాన నగరాల నుంచి హంపికి నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X