• Follow NativePlanet
Share
» »ప్రపంచంలో అతి పెద్ద....పిరమిడ్, రెండో బిగ్ బెన్ క్లాక్ ఇలా ఇంకా మరెన్నో...‘మెట్రో’ నగరంలో

ప్రపంచంలో అతి పెద్ద....పిరమిడ్, రెండో బిగ్ బెన్ క్లాక్ ఇలా ఇంకా మరెన్నో...‘మెట్రో’ నగరంలో

Written By: Beldaru Sajjendrakishore

బెంగుళూరు ను 'సిలికాన్ వాలీ అఫ్ ఇండియా' అంటారు. ఇది కర్ణాటక రాష్ట్ర రాజధాని. ఇక్కడ ప్రపంచంలో నలుమూల నుండి ప్రజలు వచ్చి ఐ.టి. రంగంలో, వ్యాపార రంగంలో మరియు ఇతర రంగాలలో ఉపాధిని సంపాదించుకొని జీవిస్తూ ఉన్నారు. ఈ నగర సౌకర్యాలు, సుఖాలు, ప్రదేశాలు ఎటువంటి వారినైనా సరే యిట్టె కట్టిపడేస్తాయి. పర్యాటకులు సైతం కర్ణాటకలోని  బెంగుళూరు నగర పర్యటనకు మరలా మరలా రావటానికి ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఈ కథనంలో బెంగళూరు, ఈ పట్టణానికి దగ్గరగా ఉన్న ముఖ్య పర్యాటక ప్రాంతాల గురించి చెబుతున్నా. ఈ వీక్ ఎండ్ లేదా మరో వీకెండ్ రోజున మీరు ఒకసారి ఇటు వైపు చూడండి...

బ్రహ్మదేవుడే జ్ఞానం పొందిన చోటు...సందర్శిస్తే అపరజ్ఞానంమన సొంతం

1. బిగ్ బెన్ క్లాక్ తర్వాత పెద్దది..

1. బిగ్ బెన్ క్లాక్ తర్వాత పెద్దది..

Image source:


నగరంలో ఇంత ఎత్తులో కల ఈ ఓంకార్ కొండలు చాలా మందికి తెలియవు. ఈ ప్రదేశంలో సూర్యోదయం, సూర్యాస్తమయంలు అద్భుతంగా వుంటాయి. ఇంత అద్భుత దృశ్యాలే కాక ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కలదు. దీని కింద అనేకమంది భారతీయ ఋషుల విగ్రహాలు కలవు. మరో ఆకర్షణగా ఇక్కడ పెద్ద గడియారం కలదు. ప్రతి గంటకు గంటలు కొడుతుంది. ప్రపంచంలోని అతి పెద్ద బిగ్ బెన్ క్లాక్ తర్వాత ఈ క్లాక్ పెద్దదని చెపుతారు. ఇటీవలే ఇక్కడ నిర్మించబడిన జ్యోతిర్లింగ దేవాలయం మహాశివరాత్రి రోజు వేలాది భక్తులను ఆకర్షిస్తుంది.

2. పిరమిడ్ వాలీ

2. పిరమిడ్ వాలీ

Image source:


పిరమిడ్ వాలీ కనకపుర తాలుక హరోహళ్లి లో కలదు. బెంగుళూరు నగర సరిహద్దులలో వుంటుంది. దీనిని మొదటగా మైత్రేయ - బుద్ధ విశ్వాలయం అనేవారు. వాడుకలో ఇపుడు పిరమిడ్ వాలీ అంటున్నారు. ప్రపంచంలోని అతి పెద్ద ధ్యాన పిరమిడ్ ఇక్కడ కలదు. ఇది ఒక అంతర్జాతీయ ధ్యాన కేంద్రం. ఏ సమయంలో అయినా సరే, సుమారు 5,000 మంది ధ్యానులు ఒకేసారే ఈ పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేయవచ్చు.

3. విశ్వశాంతి వ్యాప్తికి...

3. విశ్వశాంతి వ్యాప్తికి...

Image source:


విశ్వశాంతి వ్యాప్తికి ప్రతి ఒక్కరూ ఒక సారి ఈ ప్రదేశం లో కూర్చుని ధ్యానం చేయవచ్చు. ఇక్కడి నిశ్శబ్దత, ప్రశాన్తతలు మీ మనస్సుకు ప్రశాంతతను చేకూర్చి, మరువలేని తాజా అనుభూతులను ఇస్తాయి. చల్లని నీడనిచ్చే వృక్షాలు, వివిధ రకాల రాళ్ళు, నీటి ప్రవాహాలు, చక్కని గాలులు కల ఈ వాతావరణం మిమ్మల్ని ధ్యాన లోకాలకు తీసుకు వెళుతుంది. వీకెండ్ రోజున ఇక్కడ గడపడం మరిచిపోలేని అనుభూతి అని చెప్పవచ్చు.

4. బిగ్ బనయాన్ ట్రీ...

4. బిగ్ బనయాన్ ట్రీ...

Image source:


పెద్ద మర్రి చెట్టు. దీనిని కన్నడ భాషలో దొడ్డ ఆలద మర అంటారు. ఈ ప్రదేశం మీరు బెంగుళూరులో వుంటే వారాంతపు విహారాలకు అనువుగా వుంటుంది. బెంగుళూరు వెస్ట్ లోని రామోహళ్లి గ్రామంలో కల ఈ అతి పెద్ద వృక్షం మూడు ఎకరాల భూమిలో విస్తరించి వున్నది. ఈ చెట్టు 400 సంవత్సరాల నాటిదిగా చెపుతారు. నిర్వహణ సరిగా లేకపోయినప్పటికీ ఈ చెట్టు అనేకమందికి నీడ నిచ్చి పర్యాటకులకు ఆహ్లాదత కలిగిస్తోంది.

5.. అత్యంత ప్రశాంతమైనది...

5.. అత్యంత ప్రశాంతమైనది...

Image source:


సొసైటీ బెంగుళూరు లోని గాంధీనగర్ లో ఉంది. . ఒక్కసారి ప్రవేశిస్తే చాలు, మీ బిజి లైఫ్ టెన్షన్ లు అన్నీ మాయం అయినట్లే. ఈ భవనంలో ఒక పెద్ద సమావేశపు హాలు, ఒక స్తూపం, ఒక బోధి చెట్టు వుంటాయి. బోధి చెట్టు కింద అందమైన బుద్ధ విగ్రహం ఒకటి వుంటుంది. ఈ ప్రదేశం మీకు బిజి లైఫ్ నుండి ప్రశాంతతకు జీవం పోస్తాయి. అక్కడ కల బౌద్ధ సన్యాసులు, చిరునవ్వులు చిందించే విద్యార్ధులు, ఆత్మ జ్ఞానం కోరే భక్తులు, ప్రశాంత కొరకు వచ్చే సందర్శకులు, అంతా కలిపి మరో ప్రపంచంగా వుంటుంది.

6. నగరం నడిబొడ్డున కోట

6. నగరం నడిబొడ్డున కోట

Image source:


బెంగుళూరు ఫోర్ట్ నగర నడిబొడ్డున కలదు. దీనికి చారిత్రక ప్రాధాన్యత ఉన్నప్పటికీ, పర్యాటకులు అరుదుగా వస్తారు. బెంగుళూరు వ్యవస్థాపకుడైన కెంపే గౌడా, ఈ ఫోర్ట్ ను బురద మట్టితో 1537 సంవత్సరంలో నిర్మించాడు. దీనిని తర్వాత హైదర్ ఆలి 1761 సంవత్సరంలో రాతి కోటగా మార్పు చేసాడు. బ్రిటిష్ వారు ఈ కోటలో కొంత భాగాన్ని పడగొట్టారు. అయితే ప్రభుత్వం ఈ కోట సంరక్షణకు ఇప్పుడిప్పుడే చర్యలు తీసుకుంటోంది.

7. వారాంతాల్లో...

7. వారాంతాల్లో...

Image source:


నేటికి అక్కడ ఒక గేటు , రెండు కోట బురుజులు మిగిలాయి. కోటలో చాలా భాగం ధ్వంసం అయినప్పటికీ, మిగిలిన అవశేషాలు చరిత్ర ప్రాధాన్యతను గుర్తు చేస్తాయి. అతి పురాతనమైన ఈ చారిత్రక కోటను బెంగుళూరు వారాంతపు సెలవులలో చూడవచ్చు. ప్రభుత్వ దీనిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి వీలుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్జానంతో లేజర్ లైట్ సౌకర్యం కల్పించాలని భావిస్తోంది.

8. మెట్రో నగరంలో సరస్సులు

8. మెట్రో నగరంలో సరస్సులు

Image source:


మీలో చాలా మంది ప్రక`తి ప్రేమికులు ఉంటారు. అలాంటి వారికి హలసూర్ లేక్ సరైన ప్రాంతం. కనుచూపుమేరలో నీరు, ఆ నీటి ఒడ్డున ప్రియుడు, లేదా ప్రియురాలుతో నడుచుకుంటూ పోవడం మరుపురాని అనుభూతే కదు. ఇక్కడ ఉదయం సాయంత్రం సమయాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం మరిచిపోలేము. స్థానికులతో పాటు ప్రభుత్వం కూడా సాంకీ ట్యాంక్ ను బాగా అభివ`ద్ధి చేసింది. ఇక్కడ బర్డ్ వాచ్ సదుపాయం కూడా ఉంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో వాటర్ స్పోర్ట్ ను కూడా నిర్వహిస్తుంటారు. వీకెండ్ రోజున నగర యువత ఎక్కువగా వెళ్లే ప్రాంతాల్లో సాంకీ ట్యాంకీ కూడా ముందు వరుసలో ఉంటుంది.

9. కళాపోషకులు అయితే

9. కళాపోషకులు అయితే

Image source:


వినూత్నమైన కానుక ఇవ్వాలన్న వారికి నగరంలోని చిత్రకళ పరిషత్ సరైన చోటు. శివాజీ నగర్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నిత్యం వివిధ రాష్ట్రాలకు చెందిన చిత్రకారులు, కళాకారులు తమ చిత్రాలను, శిల్పాలను ప్రదర్శనకు ఉంచుతుంటారు. నచ్చిన వాటిని ఖరీదు చేసే సదుపాయం కూడా ఉంటుంది. మరింకెందుకు మన భవిష్యత్తు నిత్యం ఇంద్ర ధనుస్సు వలే రంగుల మయం కావాలని కోరుకుంటూ ఓ మంచి పెయింటింగ్ ను ఇంటికి తీసుకువెళ్లండి అందించండి.

10. ఫైవ్ స్టార్ హోటల్సే కాదు స్ట్రీట్ ఫుడ్

10. ఫైవ్ స్టార్ హోటల్సే కాదు స్ట్రీట్ ఫుడ్

Image source:


అంతర్జాతీయంగా పేరు గాంచిన బెంగళూరులో ఫైవ్ స్టార్ హోటల్సే కాదు మంచి రుచి, సుచితో దేశలోని వివిధ రాష్ట్రాల వంటకాలను అతి తక్కువ రేటుకు అందించే పలు ప్రాంతాలు ఉన్నాయి. అందులో వీవీపురం, మల్లేశ్వరం, బసవనగుడి, జయగనగర, ఇందిరానగర్, మారత్ హల్లీ, కోరమంగళ తదితర ప్రాంతాలు ముందు వరుసలో ఉంటాయి. మీకు దగ్గర్లోని ప్రాంతానికి వెళ్లి తాజా, రుచికరమైన ఆహారాన్ని లాగించేయండి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి