Search
  • Follow NativePlanet
Share
» »‘దక్షిణ అయోధ్య’లో ‘ఆ’ అరుదైన విగ్రహం చూశారా?

‘దక్షిణ అయోధ్య’లో ‘ఆ’ అరుదైన విగ్రహం చూశారా?

కుంభకోణంలోని రామస్వామి దేవాలయం గురించి కథనం.

దేవాలయాల రాష్ట్రంగా పేరుగాంచిన తమిళనాడులోని కుంభకోణంలోని రామస్వామి దేవాలయానికి దక్షిణ అయోధ్య అని పేరు. ఆ దేవాలయంలోని మూలవిరాట్టు విగ్రహాలే ఇందుకు కారణం. ఇకకుంభకోణంలోని ఐదు వైష్ణవాలయాల్లో ముఖ్యంగా 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహామహం ఉత్సవంతో సంబంధమున్న దేవాలయల్లో రామస్వామి దేవాలయం కూడా ఒకటి. ఆలయంలోని మండపంలో 62 స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాల పై ఉన్న శిల్ప సౌదర్యం భారతీయ శిల్పకళకు అద్దం పడుతుందడంలో అతిశయోక్తి లేదు. ప్రదక్షిణ మార్గంలోని గోడమీద మూడు వరుసల్లో రామాయణంలోని ఘట్టాకు సంబంధించి 219 కుడ్య చిత్రాలను చూడవచ్చు. మొత్తం రామయణ గాధను ఈ 219 చిత్రాల్లో చెప్పిన తీరును మెచ్చుకోకుండా ఉండలేము. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ ఆలయం చిరత్రతో పాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ కథనంలో.

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

P.C: You Tube

కుంభకోణంలోని ఐదు వైష్ణవాలయాల్లో ముఖ్యంగా 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహామహం ఉత్సవంతో సంబంధమున్న దేవాలయల్లో రామస్వామి దేవాలయం కూడా ఒకటి.

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

P.C: You Tube

మిగిలినవి వరుసగా సారంగపాణి ఆలయం, చక్రపాణి ఆలయం, రాజగోపాల స్వామి ఆలయం, వరాహ పెరుమాల్ ఆలయం.

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

P.C: You Tube

రామస్వామి ఆలయాన్ని రఘునాయకుడు నిర్మించాడు. తంజావూరు రాజ్యాన్ని క్రీస్తు శకం 1614 నుంచి 40 వరకూ పరిపాలించిన రఘునాయకుడు గొప్ప రామ భక్తుడు.

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

P.C: You Tube

ఆయన మంత్రి గోవింద దీక్షితార్ కూడా రాముడి భక్తుడే. రాజు ఆదేశం మేరకు గోవింద దీక్షితార్ అన్నీ తానై నిర్మించిన ఆలయమే రామస్వామి ఆలయం.

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం


P.C: You Tube

రామభక్తుడైన రఘునాయకుడైన రఘునాయకుడు ఆస్థాన విద్వాంసుల సూచనమేరకు కుంభకోణం పట్టణం మధ్యలో రామస్వామి ఆలయాన్ని నిర్మించారు.

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

P.C: You Tube

దాదాపు 400 ఏళ్ల క్రితం నిర్మించబడిన ఈ ఆలయాల్లోని విగ్రమాలు సాలిగ్రామ శిలతో చేయబడినవి. ఒక్కొక్క విగ్రహం ఎత్తు 8 అడుగుల పైనే ఉంటూ చూడముచ్చటగా అగుపిస్తాయి.

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

P.C: You Tube

రాముడు, సీత ఒకే పీఠం పై ఉంటారు. ఒక పక్క శత్రుఘ్నడు వీరికి చామరం వీస్తూ కనిపిస్తాడు. మరోవైపు భరతుడు ఛత్రం పట్టుకొని నిలబడి ఉంటాడు. లక్ష్మణుడు విల్లంభులు ధరించి వీరికి రక్షణ అన్నట్టు నిలబడిన స్థితిలో ఉంటారు.

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

P.C: You Tube

సాధారణంగా మన రామాలయాల్లో సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలు ఉంటాయి. అయితే ఈ దేవాలయంలో అన్నదమ్ములు నలుగురూ ఉంటారు.

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

P.C: You Tube

ఇలా నలుగురు అన్నదమ్ములు, సీత, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్న దేవాలయాలు చాలా అరుదు. నల్లొండలోని రామాలయంలో ఇటువంటి విగ్రహాలు ఉన్నాయి. అయితే ఆ దేవాలయం కంటే ఇక్కడ విగ్రహాలు ముమ్మూర్తులా అయోధ్యను పోలి ఉంటాయి. అందువల్లే కుంభకోణాన్ని దక్షిణ అయోధ్య అని కూడా కొన్ని సార్లు పిలుస్తారు.

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

P.C: You Tube

ఇక రాముడి బంటుగా పేరుగాంచిన ఆంజనేయుడు ఆ రఘురాముడి పాదల చెంత ఉంటాడు. ఇక్కడ ఆంజనేయుడి ఒక చేతిలో వీణను, మరో చేతిలో రామాయణం ఉంటుంది. ఇటువంటి విగ్రమం మనకు మరే ఇతర దేవాలయంలోనూ కనిపించదు.

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

P.C: You Tube

ఆలయంలోని మండపంలో 62 స్తంభాలు ఉంటాయి. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రాతిలో చెక్కబడి ఉండటమే కాకుండా ఒకదానికొకటి పోలికే ఉండదు. విగ్రహాలను మలిచిన తీరు అప్పటి శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది.

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

P.C: You Tube

ఈ స్తంభాల పై సుగ్రీవ పట్టాభిషేకం, విభీషణ పట్టాభిషేకం, అహల్యా భాప విమోచనం మొదలైన రామాయణ ఘట్టాలను అతి సుందరంగా చెక్కించబడ్డాయి. ఇక్కడి శిల్ప సౌదర్యం భారతీయ శిల్పకళకు అద్దం పడుతుందడంలో అతిశయోక్తి లేదు.

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

P.C: You Tube

ప్రదక్షిణ మార్గంలోని గోడమీద మూడు వరుసల్లో రామాయణంలోని ఘట్టాకు సంబంధించి 219 కుడ్య చిత్రాలను చూడవచ్చు. వాటి కింద వాఖ్యానాలు కూడా ఉంటాయి. ఈ చిత్రాలన్నీ సహజ రంగులతో చిత్రించబడినవి. అంటే ఇక్కడ పర్యవరణ పరిరక్షణ కూడా ప్రధాన అంశమన్న విషయాన్ని మనం గుర్తించాలి.

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

దక్షిణ అయోధ్య, రామస్వామి దేవాలయం

P.C: You Tube

మొత్తం రామయణ గాధను ఈ 219 చిత్రాల్లో చెప్పిన తీరును మెచ్చుకోకుండా ఉండలేము. అందువల్లే స్థానక పాఠశాలలే కాకుండా చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు తమ విద్యార్థులను ఇక్కడకు తీసుకువచ్చి ఈ చిత్రాలను, శిల్పాలను చూపిస్తూ మన ఇతిహాసాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X