Search
  • Follow NativePlanet
Share
» »ఈ అత్త - కోడలు దేవాలయంలో అద్భుత కామదాహమైన శిల్పకళలు

ఈ అత్త - కోడలు దేవాలయంలో అద్భుత కామదాహమైన శిల్పకళలు

ఈ దేవాలయంలో శృంగార రసాన్ని కలిగివున్న అనేక కామదాహమైన శిల్పకళలను చూడవచ్చును. కర్ణాటకలో ఇలాంటి సుందర శిల్పకళలను చూడవచ్చును. ఈ ఐతిహాసికమైన ప్రదేశం ప్రపంచాన్నంతా ఆకర్షిస్తున్నది.

By Venkatakarunasri

మన దేశంలో అనేక విభిన్నమైన దేవాలయాల గురించి తెలుసుకోబోతున్నాము. ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క రీతిలో విశిష్టతను పొందినవి. విచిత్రం ఏమంటే ఈ దేవాలయం పేరు అత్త - కోడలు దేవాలయం. ఏంటి? అత్త - కోడలు దేవాలయం అని నవ్వుకోకండి. నిజంగానే ఇదొక అద్భుతమైన దేవాలయం.

ఈ దేవాలయంలో శృంగార రసాన్ని కలిగివున్న అనేక కామదాహమైన శిల్పకళలను చూడవచ్చును. కర్ణాటకలో ఇలాంటి సుందర శిల్పకళలను చూడవచ్చును. ఈ ఐతిహాసికమైన ప్రదేశం ప్రపంచాన్నంతా ఆకర్షిస్తున్నది.

భారతదేశంలో చిత్ర-విచిత్రమైన పేర్లుకలిగిన అనేక దేవాలయాలు వున్నాయి. అలాంటివాటిలో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం యొక్క శిల్పకళలు అత్యంత రమణీయమైన మన పురాతన శిల్ప కళా నైపుణ్యాన్ని తెలియచేస్తుంది.

ఈ అత్త - కోడలు దేవాలయంలో అద్భుత కామదాహమైన శిల్పకళలు

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు దేవాలయం

ఈ విచిత్రమైన దేవాలయముండేది నగ్డా అంటే రాజస్థాన్ లోని ఉదయపూర్ జిల్లాలో గల ఒక చిన్నగ్రామంలో. ఈ దేవాలయాన్ని మేవార సామ్రాజ్యంలోని 4వ రాజనాద నగరాదిత్య నగ్డా చేత 6 వ శతాబ్దంలో నిర్మించబడినది.

PC:Dennis Jarvis

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు దేవాలయం

ఒకానొక కాలంలో నగ్డా మేవారాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రదేశం ఇది. అందువలన ఇక్కడ అనేక అందమైన దేవాలయాలను చూడవచ్చును. ఈ దేవాలయాలన్నీ అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి.

PC:Dennis Jarvis

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు దేవాలయం

ఇక్కడున్న అనేక దేవాలయాలలో ప్రఖ్యాతిగాంచిన దేవాలయమేదంటే అది అత్త - కోడలు దేవాలయం. ఈ దేవాలయం పేరు కొంచెం విభిన్నంగా వున్నా కూడ దేవాలయాన్ని చూసినవారు మాత్రం మంత్రముగ్దులు కాకతప్పదు.

PC:Dennis Jarvis

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు దేవాలయం

ఈ దేవాలయం చుట్టుపక్కలా ఎంతో మనోహరమైన వాతావరణాన్ని కలిగివుంటుంది. ఈ వాతావరణం ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు ఆ మనోహరాన్ని మరొకసారి చూసి ఆనందించాలనిపిస్తుంది.

PC:Dennis Jarvis

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు అనే పేరు ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నారా? ఆ పేరు ఎలా వచ్చింది అనేది చెప్తాను వినండి. అదేమంటే స్థల పురాణ కథ ప్రకారం ఒక దేవాలయాన్ని అత్త నిర్మించినది మరొక దేవాలయాన్ని కోడలు నిర్మాణం చేసిందంట.

PC:TeshTesh

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు దేవాలయం

ఈ దేవాలయాలు ఒకే రాతి మీద రెండు దేవాలయాలైనా కూడా అత్త దేవాలయం కొంచెం పెద్దగా వుంటుంది,కోడలు దేవాలయం కొంచెం చిన్నగా వుంటుంది. ఈ దేవాలయం గర్భగుడిలో శ్రీ మహావిష్ణువు కొలువైవున్నాడు.

PC:Dennis Jarvis

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు దేవాలయం

ఈ దేవాలయంలో కామసూత్రాలకు చెందిన అనేక భంగిమలతో కూడిన అద్భుతమైన చెక్కిన శిల్పాలను కూడా ఇక్కడ చూడవచ్చును. ఈ చెక్కిన శిల్పాలు అతిచిన్న శిల్పాలైనప్పటికీ అద్భుతంగా వున్నాయి.అందువల్ల ఈ దేవాలయానికి అనేకమంది పర్యాటకులు తరలి వస్తున్నారు.

PC:Paul Asman and Jill Lenoble

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు దేవాలయం

నగ్డా పట్టణం రాజస్థాన్ లోని ఉదయపూర్ నుంచి సుమారు 23 కిమీల దూరంలో వున్నది. ఉదయపూర్ నుంచి ఈ దేవాలయాన్ని చేరుటకు అనేకమైన ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సుల సౌకర్యం వుంది.

PC:ArnoldBetten

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు దేవాలయం

ఒకే రాతి మీద ప్రత్యేకంగా నిర్మాణం గావించిన అత్త - కోడలు దేవాలయం ఇది. ఇక్కడ వున్న అందమైన స్థంభాలు, పెద్ద పెద్ద మంటపాలు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

PC: Cosimo Roams

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు దేవాలయం

ఈ నగ్డాలోని అత్త - కోడలు దేవాలయసమీపంలో బగేలా అనే అందమైన చెరువు వుంది. ఈ చెరువు ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో కూడి వుంటుంది.

PC:Cosimo Roams

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు దేవాలయం

శృంగార రసాన్ని ఉత్తేజింపచేసే అద్భుతమైన అనేక శిల్పకళలను ఇక్కడ చూడవచ్చును.ఇక్కడి అందమైన శిల్పాలు కళ్ళకు పండుగ చేస్తూవుంటాయి.ఈ దేవాలయంలోని విశేషమైన ఈ శిల్పాలు.

PC:Nagarjun Kandukuru

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు దేవాలయం

ఇటువంటి అద్భుతమైన మరియు ఇతిహాసం కలిగిన దేవాలయానికి స్వాగతం పలికే స్వాగత ద్వారాన్ని కూడా చూసి ఆనందించవచ్చును. ఈ స్వాగత ద్వారం 4 స్థంభాలను కలిగివుంది.ఇదొక అద్భుతమైన నిర్మాణం అని చెప్పవచ్చును.

PC:Nagarjun Kandukuru

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు దేవాలయం

దేవాలయ శిల్పాలే కాకుండా దేవాలయం చుట్టు పక్కల గల ప్రకృతి సౌందర్యాన్ని చూడటానికి రెండుకళ్ళూ సరిపోవు. సంపదను కలిగిన ఈ స్థలం పర్యాటకులకు వారి జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుందనేది నిజం.

PC:Nagarjun Kandukuru

అత్త - కోడలు దేవాలయం

అత్త - కోడలు దేవాలయం

దేవాలయం లోపలివైపున మనస్సుకు హత్తుకునే అద్భుతమైన శిల్పకళా సంపదను కలిగివున్నది. అదక్కడుంచండి అత్త - కోడలు అనే దేవాలయం కూడా మన దేశంలో ఉంది అని ఊహించివుండరు కదా? రాజస్థాన్ ను సందర్శించినప్పుడు ఈ ప్రదేశం సందర్శించండి.

PC:Zen Skillicorn

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X