Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ అమ్మవారు స్వామిని కౌగలించుకొన్నారు, సందర్శిస్తే మీ భాగస్వామితో మీరు కూడా

ఇక్కడ అమ్మవారు స్వామిని కౌగలించుకొన్నారు, సందర్శిస్తే మీ భాగస్వామితో మీరు కూడా

తిరుశక్తిముత్రంలోని పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

తమిళనాడులోని కుంభకోణానికి టెంపుల్ సిటీ అని పేరు. ఇక్కడ ఉన్నన్ని దేవాలయాలు మరెక్కాడా కనిపించవు. ఇక ప్రతి దేవాలయం పురాణ ప్రాధాన్యత కలిగినదే. ఆ దేవాలయాలకు సంబంధించిన కథనాలు కొన్ని చాలా విచిత్రంగా కూడా ఉంటాయి. అయితే స్థానికులు మాత్రం ఆ కథలను నమ్ముతూ అక్కడి దైవాన్ని భక్తితో కొలుస్తున్నారు. అంతేకాకుండా ఆలా పూజించడం వల్ల తమ జీవితాల్లో ఎన్నో మంచి ఉదయాలు చవిచూశామని చెబుతున్నారు. అటు వంటి కోవకు చెందిన ఈ కథనం.

ఈ దేవాలయాన్ని భక్తితో భార్య భర్తలు శుభ్రం చేస్తే ఉద్యోగ రీత్య దూరంగా ఉన్న భార్య, భర్తలు ఒకే చోట పనిచేయడానికి వీలవుంతుందని నమ్ముతారు. అంతేకాకుండా త్వరగా పెళ్లి కావాలని, మంచి జీవిత భాగస్వామి దొరకాలని పూజలు చేయడానికి ఇక్కడికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అమ్మవారిని పూజిస్తే మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయని స్థానికులతో పాటు ఆలయ పూజారులు చెబుతున్నారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ దేవాలయం పూర్తి వివరాలు మీ కోసం...

స్థానిక పురాణాలను అనుసరించి

స్థానిక పురాణాలను అనుసరించి

P.C: You Tube

పార్వతీదేవి ఆ పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ ఘెర తపస్సు చేసింది. అయినా పరమేశ్వరుడు ఆమెను కరుణించలేదు. దీంతో పార్వతి దేవి తన తపస్సు తీవ్రతను పెంచింది.కేవలం ఒంటిపూట మాత్రం భోజనం చేస్తే స్వామిని పూజించేది. అటు పై పూర్తిగా భోజనం కూడా వదిలేసి కేవలం నీళ్లు మత్రం తాగుతూ తపస్సును కొనసాగించింది.

 ఒంటి కాలు పై

ఒంటి కాలు పై

P.C: You Tube

ఒంటికాలు పై నిలబడి రెండు చేతులూ పైకెత్తి తన తపస్సును కొనసాగింది. అయినా కూడా ఆ పరమశివుడు ప్రసన్నం కలేదు. దీంతో చివరి ప్రయత్నంగా అగ్ని గుండం మధ్యలో నిలబడి ఆ త్రినేత్రుడి గురించి తపస్సు కొనసాగించిది.ఇలా దాదాపు కొన్ని పదుల సంవత్సరాలు పట్టువిడువ కుండా పార్వతీ దేవి పరమేశ్వరుడి గురించి తపస్సు చేసింది.

అగ్ని జ్వాల రూపంలో

అగ్ని జ్వాల రూపంలో

P.C: You Tube

దీంతో పార్వతీ దేవి పట్టుదలకు ముగ్దుడైన ఆ పరమశివుడు అగ్ని జ్వాల రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. దీంతో పార్వతి దేవి తన ఎదుట ఉన్నది ఆ పరమశివుడేనని గ్రహించి ఆయనను చల్లబరచడానికి ఆ అగ్ని జ్వాలను కౌగలించుకొని ముద్దు పెట్టుకొంది.

భంగిమను మనం ఇక్కడ చూడవచ్చు

భంగిమను మనం ఇక్కడ చూడవచ్చు

P.C: You Tube

దీంతో వెంటనే పరమశివుడు చల్లబడి శివలింగం రూపం దాలుస్తాడు. ఆ భంగిమను మనం ఇప్పటికీ ఈ దేవాలయంలో చూడవచ్చు. మూల విరాట్టు కూడా ఇదే స్థితిలో మానకు కనిపిస్తాడు. ఇక ఇక్కడ స్వామిని వనేశ్వర్ అని పిలుస్తారు. అమ్మవారు స్వామి వారిని కౌగలించుకున్న ప్రదేశం కావడం వల్ల దీనిని తిరుశక్తిముత్రం అని పిలుస్తారు.

సెంబియన్ మాదేవి

సెంబియన్ మాదేవి

P.C: You Tube

క్రీస్తుశకం 1000లో ఉత్తమ చోళుడి తల్లి సెంబియన్ మాదేవి ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. ఆలయం కుంభకోణంలోని మిగిలిన దేవాలయాలయాలతో పోలిస్తే పరిమాణంలో కొంత చిన్నదిగా ఉంటుంది. అయినా కూడా చూడ ముచ్చటగా ఉంటుంది. ఈ దేవాలయం చూడటానికి ఇక్కడి స్థల పురాణం పూర్తిగా తెలుసుకోవడానికి కనీసం గంటన్నర పడుతుంది.

రెండు ప్రాకారాలు

రెండు ప్రాకారాలు

P.C: You Tube

ఆలయానికి రెండు ప్రాకారాలు ఉన్నాయి. మొదటి ప్రాకారంలో వల్లభ గణపతి, వసంత మండపం, నందీశ్వరుడి విగ్రహాలను చూడవచ్చు. అదే విధంగా రెండవ ప్రాకారంలో వినాయకుడు, మురుగన్, సోమస్కందార్ మొదలైన ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఉపాలయాల్లో అమ్మ పెరియనాయకి ఉపలయం కొంత పెద్దదిగా ఉంటుంది.

రాతి, రాగి శాసనాలు

రాతి, రాగి శాసనాలు

P.C: You Tube

రాజరాజ చోళుడు 2, కుళోత్తుంగ చోళుడు 3, విజయనగర రాజులు ఈ దేవాలయం అభివ`ద్ధికి చాలా పాటుపడ్డారు. ఈ వివరాలన్నీ దేవాలయంలో ఉన్న రాతి, రాగి శాసనల్లో మనం ఇప్పటికీ చూడవచ్చు.

మంచి భాగస్వామి దొరకాలని

మంచి భాగస్వామి దొరకాలని

P.C: You Tube

పెళ్లికాని అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా తమకు మంచి భాగస్వామి దొరకాలని ఈ దేవాలయంలో పూజలు చేస్తారు. అంతేకాకుండా మనస్పర్థలు వచ్చి విడిపోయిన భార్యభర్తలు, విడాకులు తీసుకున్న భార్యా భర్తలు కూడా ఇక్కడ స్వామివారిని కొలుస్తారు.

ఉద్యోగ రీత్య వేర్వేరు చోట్ల

ఉద్యోగ రీత్య వేర్వేరు చోట్ల

P.C: You Tube

ముఖ్యంగా ఉద్యోగరీత్య వేర్వేరు చోట ఉన్న భార్యభర్తల్లో ఇద్దరూ కాని లేదా ఒక్కరు కాని ఈ దేవాలయం ప్రాగణాన్ని శుభ్రం చేసి స్వామికి అభిషేకం చేస్తే వారి ఇబ్బందులన్నీ తొలిగిపోతాయని చెబుతారు. అందువల్లే ఇక్కడకు వచ్చే భక్తుల్లో ఇటువంటి వారే ఎక్కువ మంది కనిపిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X