Search
  • Follow NativePlanet
Share
» » శ్రీనివాసుడు ఇక్కడ ఇళ్లరికపు అల్లుడు అందుకే మొదటిపూజ ఆమెకు

శ్రీనివాసుడు ఇక్కడ ఇళ్లరికపు అల్లుడు అందుకే మొదటిపూజ ఆమెకు

By Kishore

భారత దేశం ఆలయాల నిలయం. ఇక్కడ ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో ఉన్నన్ని దేవాలయాలు మరెక్కడా ఉండవు. అందులోనూ కుంభకోణంలో ప్రతి వీధికి ఒక్కొక్క దేవాలయం ఉంటుంది. ప్రతి దేవాలయం కూడా పురాణాల్లోని ఏదో ఒక ఘట్టంతో ముడిపడి ఉంటుంది. ఆ కథలు వినడానికి చదవడానికి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

తీర్థయాత్రలు చేసేవారు. ఆయా దేవాలయానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రత్యేతక, స్థలపురాణాన్ని తప్పక తెలుసుకొంటూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇప్పుడంతా టెక్ యుగం. ఇంట్లోనే కుర్చొని ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగిందో, ఏమి జరగబోతోందో కూడా తెలుసుకోవచ్చు.

ఈ క్రమంలోనే ఎక్కడ దూరంలో ఉన్న దేవాలయాలు, వాటి చరిత్రను మీ కోసం నేటివ్ ప్లానెట్ తీసుకువస్తోంది. అందులో భాగంగా ఈ రోజు శ్రీనివాసులు ఇళ్లరికపు అల్లుడైన ప్రాంతం అక్కడి స్థలపురాణం, ఆలయ ప్రాధాన్యత మీ కోసం. అన్నట్టు ఆ దేవాలయం తమిళనాడులోని ప్రముఖ ధార్మిక పట్టణంగా పేరుగాంచిన కుంభకోణంలోనే ఉంది.

 మూడవది సారంగపాణి ఆలయం

మూడవది సారంగపాణి ఆలయం

P.C: YouTube

ఆళ్వారులు సందర్శించిన 108 వైష్ణవాలయాలు గొప్ప పుణ్యక్షేత్రాలుగా ఇప్పటికీ విరాజిల్లుతున్నాయి. వాటిలో మొదటిది శ్రీరంగంలోని శ్రీరంగనాథ ఆలయం దీనిని 12 మంది ఆళ్లారుల్లో 11 మంది సందర్శించారు. రెండవది తొమ్మిదిమంది ఆళ్వారులు సందర్శించిన తిరుమల. కాగా, మూడవది సారంగపాణి ఆలయం ఈ దేవాలయాన్ని 9 మంది ఆళ్వారులు సందర్శించి స్తుతించారు.

 భృగు మహర్షి

భృగు మహర్షి

P.C: YouTube

భృగు మహర్షి ఒక సారి త్రిమూర్తుల సందర్శనార్థం మొదట సత్యలోకానికి వెళ్లి భంగపడుతాడు. దీనితో బ్రహ్మకు దేవాలయాలు ఉండకూడదని శపిస్తాడు. అటు పై కైలాసానికి వెళ్లి అక్కడ కూడా భంగపడుతాడు. దీంతో శివుడికి కేవలం లింగ రూపంలో మాత్రమే పూజలు ఉండాలని శాపం పెడుతాడు.

 విష్ణువు వక్షస్థలాన్ని తంతాడు

విష్ణువు వక్షస్థలాన్ని తంతాడు

P.C: YouTube

చివరిగా భృగు మహర్షి వైకుంఠానికి వెళ్లి అక్కడ కూడా అవమానం పాలవుతాడు. దీంతో కోపం పట్టలేక విష్ణువు వక్షస్థలాన్ని తంతాడు. ఈ ఘటనతో లక్ష్మీదేవికి తీవ్ర కోపం వస్తుంది. తాను కొలువై ఉన్న విష్ణువు వక్షస్థలాన్ని తన్ని ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేశాడని భృగు మహర్షి పై లక్ష్మీదేవి తీవ్ర కోపంతో ఉంటుంది.

అరికాలిలో ఉన్న కంటిని

అరికాలిలో ఉన్న కంటిని

P.C: YouTube

విష్ణువు ఆ భృగు మహర్షి కాళ్లు ఒత్తే నెపంతో ఆయన అరికాలిలో ఉన్న కంటిని చిదిమేస్తాడు. దీంతో ఆ మహర్షి ఆగ్రహం తగ్గిపోయి చేసిన తప్పుకు తీవ్రంగా కుమిలిపోతాడు. లక్ష్మీదేవి తన కూతురుగా జన్మించాలని ఆమెకు సేవలు చేసి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకొంటానని వేడుకొంటాడు.

 హేమ బుుషిగా జన్మిస్తాడు

హేమ బుుషిగా జన్మిస్తాడు

P.C: YouTube

ఇందుకు లక్ష్మీదేవి కూడా అంగీకరిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ భృగు మహర్షి భూలోకంలో హేమ బుుషిగా జన్మిస్తాడు. ఆయన కుంభకోణం దగ్గర్లోని పొట్రుమరి తటాకం వద్ద తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి తటాకంలో తామర పూల మధ్య నుంచి ఉద్భవిస్తుంది.

కోమలాంబాళ్ అని పేరుపెడుతాడు

కోమలాంబాళ్ అని పేరుపెడుతాడు

P.C: YouTube

దీంతో హేమబుషి రూపంలోని భృగు మహర్షి ఆమెను స్వీకరించి కోమలాంబాళ్ అని పేరుపెడుతాడు. తండ్రివలే అన్ని సేవలు చేస్తాడు. ఇక యుక్తవయస్సురాగానే ఆమెకు వరుడిని వెదకడం ప్రారంభిస్తాడు.

భూ పొరల్లో కొద్దిసేపు దాక్కొంటాడు

భూ పొరల్లో కొద్దిసేపు దాక్కొంటాడు

P.C: YouTube

ఇదిలా ఉండగా లక్ష్మీదేవిని వెదుక్కొంటూ వచ్చిన శ్రీనివాసుడికి ప్రస్తుతం సారంగపాణి దేవాలయం ఉన్న చోట కోమలాంబాళ్ కనిపిస్తుంది. ఆమె లక్ష్మీదేవిగా గుర్తించిన శ్రీనివాసుడు ఆమెను ఉడికించాలనే ఉద్దేశంతో భూ పొరల్లో కొద్దిసేపు దాక్కొంటాడు.

పాతాళ శ్రీనివాసుడు

పాతాళ శ్రీనివాసుడు

P.C: YouTube

అలా దాక్కొన్న శ్రీనివాసుడిని ప్రస్తుతం పాతాళ శ్రీనివాసుడు పేరుతో కొలుస్తున్నారు. ఆ పైన ఉన్నదే సారంగపాణి ఆలయం. ఇక అమ్మవారు ఇక్కడ తటాకంలో పుట్టింది కాబట్టి లక్ష్మదేవి పుట్టినిల్లు ఇదే. ఈయన్ను భక్తులు ఆలయం నుంచి కొంచెం కిందికి వెళ్లి చూడాల్సి ఉంటుంది.

ఇల్లరికపు అల్లుడన్నమాట

ఇల్లరికపు అల్లుడన్నమాట

P.C: YouTube

అయితే వైకుంఠం నుంచి విష్ణవు ఇక్కడికి వచ్చి అమ్మవారిని వివాహం చేసుకొన్నాడు. అటు తర్వాత స్వామి వారు ఇక్కడే ఉండిపోయాడు. అంటే ఇల్లరికపు అల్లుడన్నమాట. అందుకే ఇక్కడ అమ్మవారిదే పై చెయ్యి. మొదటి పూజ ఆవిడకే చేస్తారు. ఇక ఇల్లరికపు అల్లుడిని తమిళంలో వీట్టోడు మాపిళ్ళై అని అంటారు. అందువల్లే సారంగపాణిని తమిళ భక్తులు వీట్టోడు మాపిళ్ళై అని పిలుస్తుంటారు.

ఉద్దాన శయన భంగిమ

ఉద్దాన శయన భంగిమ

P.C: YouTube

ఇక్కడ స్వామివారు పడుకొన్న స్థితిలో నుంచి కొంచెం పైకి లేచిన స్థితిలో ఉంటారు. దీనిని ఉద్దాన శయన భంగిమ అని అంటారు. ఇటువంటి స్థితిలో విష్ణువు విగ్రహం ప్రపంచంలో ఇదొక్కటే. ఇందుకు సంబంధించిన పురాణ కథనం ఒకటి ఉంది.

 తిరుమలేశాళ్వార్

తిరుమలేశాళ్వార్

P.C: YouTube

ఆళ్వారుల్లో ఒకరైన తిరుమలేశాళ్వార్ స్వామిని సందర్శించి స్తుతిస్తాడు. భక్తుడిని ఆదరించడానికి అన్నట్లు పవళించిన స్థితిలో ఉన్న స్వామి కొంచెం పైకి లేస్తాడు. ఆ భంగిమలో స్వామిని చూసి మై మరిచిపోయిన తిరుమలేశాళ్వార్ ఆ స్థితిలోనే భక్తులను కరుణించమని కోరుతాడు. అందువల్లే ఇక్కడ స్వామివారు ఉద్దాన శయన భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడని చెబుతారు.

ఏనుగులు, గుర్రాలు కట్టిన రథంలో

ఏనుగులు, గుర్రాలు కట్టిన రథంలో

P.C: YouTube

స్వామివారు వైకుంఠం నుంచి భూ లోకంలోకి వచ్చే సమయంలో ఏనుగులు, గుర్రాలు కట్టిన రథంలో వచ్చాడు. అందువల్లే సారంగపాణి ఆలయం ఏనుగులు, గుర్రాలు లాగుతున్న రథం అకారంలో ఉంటుంది. ఇక రథానికి రెండు ద్వారాలు ఉంటాయి కాబట్టి ఈ ఆలయానికి కూడా రెండు ద్వారాలు ఉన్నాయి.

థనుర్భాణాలు ధరించి

థనుర్భాణాలు ధరించి

P.C: YouTube

అదే విధంగా వైకుంఠం నుంచి స్వామి వారు భూలోకానికి వచ్చే సమయంలో థనుర్భాణాలు ధరించి వచ్చాడు. దీంతో ఆ ఆలయంలోని మూలవిరాట్టుతో పాటు ఉత్సవ మూర్తి విగ్రహానికి కూడా ధనుర్భాణాలు ఉంటాయి. అందువల్లే అందువల్లే ఇక్కడ ఉన్న స్వామివారిని సారంగపాణి అని అంటారు.

మొదట అమ్మవారిని దర్శనం చేసుకోవాలి

మొదట అమ్మవారిని దర్శనం చేసుకోవాలి

P.C: YouTube

రాజగోపురం 11 అంతస్తులతో 150 అడుగులు ఉంటుంది. మరో నాలుగు గోపురాలు కూడా సారంగపాణి ఆలయానికి ఉన్నాయి. అదే విధంగా హేమబుుషి ఆలయం విగ్రహం ఆలయంలో ఉంది. ఇక్కడే అమ్మవారికి ప్రత్యేక ఆలయం కూడా ఉంది. మొదట అమ్మవారిని దర్శనం చేసుకొన్న తర్వాతనే అయ్యవారిని పూజించాలనేది ఇక్కడ నియమం. అమ్మవారి ఆలయం కూడా ప్రదక్షిణ మార్గంలో మొదట్లోనే ఉంటుంది.

అటువంటి ఏర్పాటు ఉండదు

అటువంటి ఏర్పాటు ఉండదు

P.C: YouTube

సాధారణంగా వైకుంఠ ఏకాదశి రోజున అన్ని వైష్ణవాలయాల్లో స్వర్గద్వారమని ఉత్తర ద్వారం తెరుస్తారు. అయితే ఈ సారంగపాణి ఆలయంలో అటువంటి ఏర్పాట్లు ఏమీ ఉండవు. స్వామి వారు సాక్షాత్తు వైకుంఠం నుంచి భూమి పైకి వచ్చినది ఈ ప్రాంతమే అందువల్లే ఇక్కడ అటువంటి ఏర్పాట్లు చేయరు. అయితే ఇక్కడ ఉన్న రెండు ద్వారాల్లో ఏ ద్వారం గుండా వెళ్లిన ఇక్కడ స్వామివారు కరుణిస్తారని స్థానక పూజారులు చెబుతుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X