» »లక్ష్మీ నృసింహ క్షేత్రంలో రక్తం ప్రవహించిన నది ఎక్కడో తెలుసా?

లక్ష్మీ నృసింహ క్షేత్రంలో రక్తం ప్రవహించిన నది ఎక్కడో తెలుసా?

Written By: Venkatakarunasri

LATEST:వజ్రాల వానా అదీ మన తెలుగు గడ్డ పైనా - ఎక్కడో తెలుసుకోవాలని ఉందా

32,000 సం||ల పురాతనమైన నరసింహస్వామి విగ్రహం ఎక్కడుందో తెలుసా?

అక్కడ వర్షం పడితే చాలు వర్షంతో పాటు వజ్రాలు పడతాయి వెళతారా ?

శ్రీ మహా విష్ణువు ధరించిన దశావతారాల్లో 4వది శ్రీ నృసింహావతారం. నరుడు మరియు సింహము కలసి ఏర్పడిన రూపమే నరసింహావతారం. ఈ స్వామినే నరహరి అని కూడా పిలుస్తారు. శ్రీ మహా విష్ణువు నరసింహ రూపాన్ని ధరించి హిరణ్యకశికునితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు.

అందువలన శత్రుభయం వున్న వారు,శని మరియు కుజదోషం వున్న వారు ముందు నరసింహస్వామిని ఆరాధించాలని శాస్త్రాలలో చెప్పబడినది. జీవితంలో కష్టాలు విపరీతంగా వున్నప్పుడు క్రూరజంతువులు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు దుష్టగ్రహ నివారణకు నరసింహుని పేరు చెబితే చాలు ఆ బాధలు వెంటనే తొలగిపోతాయి అంటారు.

మయ మతం అనే శాస్త్రగ్రంథాలలో నరసింహ స్వామిని పర్వతాల మీద, గుహలలో,అడవులలో శత్రువుల దేశ సరిహద్దులలో ప్రతిష్టించాలని తెలుపుచున్నది. అందువలననే సాధారణంగా లక్ష్మీ నరసింహ ఆలయాలలో కొండ మీద, గుహలలో వుంటాయి. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో నృసింహ ఆలయాలు వున్నాయి. అటువంటి వాటిలో ముఖ్యమైనది అంతర్వేది.

1. ఎక్కడ వున్నది?

1. ఎక్కడ వున్నది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం వెలసి వున్నది.

PC: youtube

2. అంతర్వేదికి గల మరియొక పేరు

2. అంతర్వేదికి గల మరియొక పేరు

ఈ క్షేత్రంలో వెలసిన నృసింహస్వామి మహా శక్తివంతుదని,ఏ విధమైన బాధలనైనాగూడ తొలిగించగలడని ఆయన భక్తులు విశ్వసిస్తారు.ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని ఇంకొక పేరు కూడా వున్నది.

PC: youtube

3. బ్రహ్మదేవుడు శివదోషాన్ని ఎలా పోగొట్టుకున్నాడు ?

3. బ్రహ్మదేవుడు శివదోషాన్ని ఎలా పోగొట్టుకున్నాడు ?

పురాణకాలంలో బ్రహ్మదేవుడు పరమశివుని పట్ల తాను చేసిన పాపాన్ని పోగొట్టుకొనుటకు అంతర్వేది ప్రాంతానికి వచ్చి ఇక్కడ నీలకంఠేశ్వరుడు అనే పేరుగల శివ లింగాన్ని స్థాపించి ఆ తరువాత ఒక వేదికను నిర్మించి యజ్ఞం చేసి ఆపై నీలకంఠేశ్వరుడ్ని కొంతకాలం పూజించి తన శివదోషాన్ని పోగొట్టుకున్నాడు.

PC: youtube

 4. అంతర్వేది అనే పేరు ఎలా వచ్చింది?

4. అంతర్వేది అనే పేరు ఎలా వచ్చింది?

బ్రహ్మదేవుని చేత ఇక్కడ యజ్ఞ వేదిక స్థాపింపబడినది కనుక ఈ క్షేత్రానికి అంతర్వేది అనే పేరు వచ్చింది.

PC: youtube

5. ముక్తి క్షేత్రం అనే పేరు ఎలా వచ్చింది?

5. ముక్తి క్షేత్రం అనే పేరు ఎలా వచ్చింది?

ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది గనుక ఈ క్షేత్రానికి ముక్తి క్షేత్రం అనే పేరు వచ్చింది.

PC: youtube

6. కోరిక కోరికలు తప్పకుండా నెరవేరుతుందా?

6. కోరిక కోరికలు తప్పకుండా నెరవేరుతుందా?

ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించి ఏ కోరిక కోరుకున్నా అది తప్పక తీరుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.

PC: youtube

7. 108నృసింహాక్షేత్రాలలో ఒకటి

7. 108నృసింహాక్షేత్రాలలో ఒకటి

అంతర్వేది ఒక గ్రామం.దీని విస్తీర్ణం 4 చదరపు మైళ్ళు వుంటుంది. భారతదేశంలోని 108నృసింహాక్షేత్రాలలో అంతర్వేది కూడా ఒకటని చెబుతారు.

PC: youtube

8. నదులు

8. నదులు

ఈ క్షేత్రానికి తూర్పు,మరియు దక్షిణ దిక్కులలో బంగాళాఖాతం, పశ్చిమ దిక్కులో వశిష్ట గౌతమీ నది మరియు ఉత్తర దిక్కులో రక్త కుల్యానది ప్రవహిస్తున్నాయి.

PC: youtube

9. అంతర్వేది క్షేత్రం

9. అంతర్వేది క్షేత్రం

తూర్పు గోదావరి జిల్లాలో సకినేటి పల్లి మండలంలో ఈ అంతర్వేది క్షేత్రం వున్నది. అమలాపురం నుండి 65కి.మీ ల దూరంలోను, రాజమండ్రి నుండి 100కి.మీ ల దూరంలోను, కాకినాడ నుండి 130కి.మీ ల దూరంలోను ఈ క్షేత్రం వున్నది.

PC: youtube

10. శౌనకాది మహర్షులు

10. శౌనకాది మహర్షులు

కృత యుగములోని మాట ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది నిగురించి బ్రహ్మ, నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు.

PC: youtube

11. వశిష్ఠ గోదావరి

11. వశిష్ఠ గోదావరి

ఒకానొక సమయంలో రక్తావలోచనుడు (హిరణ్యాక్షుని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు.

PC: youtube

12. రక్తావలోచనులు

12. రక్తావలోచనులు

ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు.

PC: youtube

13. రక్తావలోచనులు

13. రక్తావలోచనులు

ఈ వరగర్వంతో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడుకి వశిష్ఠుడుకి ఆసమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు.

PC: youtube

14. సుదర్శనము

14. సుదర్శనము

వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృష్టిస్తారు.

PC: youtube

15. రక్తకుల్య

15. రక్తకుల్య

నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తిని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు.

PC: youtube

16. చక్రాయుధము

16. చక్రాయుధము

ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధమును శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి.

PC: youtube

17. అంతర్వేదిలో తీసిన సినిమాలు

17. అంతర్వేదిలో తీసిన సినిమాలు

ఈ రక్తకుల్యలో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు. అంతర్వేది గ్రామములో చాలా సినిమాలు చిత్రీకరించారు. ఇక్కడ అలనాటి నలుపు తెలుపుల చిత్రాలైన మూగమనసులు లాంటి చిత్రాలనుండి సరిగమలు, అప్పుడప్పుడు, పెళ్ళైనకొత్తలో లాంటి సినిమాల చిత్రీకరణ జరిగింది.

PC: youtube

18. రవాణా సౌకర్యాలు

18. రవాణా సౌకర్యాలు

బస్సు సౌకర్యం

అంతర్వేదికి పశ్చిమగోదావరి జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లా నుండి చేరవచ్చు. రాజమండ్రి, కాకినాడల నుండి రావులపాలెం, రాజోలు మీదుగా సకినేటిపల్లి చేరవచ్చు. విజయవాడ, ఏలూరుల నుండి నరసాపురం మీదుగా సఖినేటిపల్లి చేరవచ్చు. సఖినేటిపల్లి నుండి ఆటోలు, బస్సులు అంతర్వేదికి ఉన్నాయి.

PC: youtube

19. రైలు సౌకర్యం

19. రైలు సౌకర్యం

హైదరాబాదు నుండి నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా నరసాపురం చేరవచ్చు.

PC: youtube

20. వసతి సౌకర్యాలు

20. వసతి సౌకర్యాలు

అంతర్వేదిలో వసతి కొరకు దేవస్థాన సత్రం ఉంది. కుల ప్రాతిపదికన బయటి వారి ద్వారా నడుపబడు ఇతర సత్రాలు పది వరకూ ఉన్నాయి. రెండు ప్రైవేటు లాడ్జిలు ఉన్నాయి. ఇంకనూ మంచి వసతుల కొరకు నరసాపురం, రాజోలు పట్టణాలకు వెళ్ళవచ్చు.

PC: youtube