» » ప్రళయం కూడా ఈ ప్రాంతాన్ని ఏమి చేయలేదట !

ప్రళయం కూడా ఈ ప్రాంతాన్ని ఏమి చేయలేదట !

ప్రళయం అందులోను జలప్రళయం అనేది సంభవిస్తే మన భూమి పైన ఏమీ మిగలదు. సమస్త జీవరాశి ఆ జలప్రళయంలో కొట్టుకుపోవల్సిందే. మరి అంతటి జలప్రళయాన్ని కూడా తట్టుకుని నిలబడే శక్తి కేవలం ఈ ఒక్క ప్రాంతానికే వుందని హిందూ పురాణాలు చెప్తున్నాయి.

మరి అంతటి మహిమాన్విత ప్రాంతం ఏంటంటే సృష్టి, స్థితి, లయకారుడైన పరమశివుడు కొలువై వున్న పుణ్యక్షేత్రం కాశీక్షేత్రం. స్వయంగా కైలాసనాధుడే వారణాశిని సృష్టించాడని అంతటి పవిత్ర స్థలం మన భారతదేశంలో వుండటం మన యొక్క అదృష్టం.

సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం సీతా సమాహిత్ స్థల్ !

బ్రహ్మదేవుడు సృష్టించిన సకల చరాచర జీవకోటి ప్రళయంలో కల్పాంతంలో అంతం అవుతుంది. కానీ వారణాశిని ఆ పరమశివుడు సృష్టించాడు కావున ఆ ప్రాంతాన్ని ఆ పరమశివుడే రక్షిస్తాడని పండితుల యొక్క విశ్వాసం. ఇప్పుడు మనం పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాశి గురించి తెలుసుకుందాం.

ప్రళయాన్ని తప్పించే ప్రాంతం !

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. మోక్షాన్ని కలిగించే క్షేత్రం

1. మోక్షాన్ని కలిగించే క్షేత్రం

హిందువులకు అత్యంత పవిత్ర క్షేత్రంగా మోక్షాన్ని కలిగించే క్షేత్రంగా కాశీని చెప్పుకోవచ్చు.

ఉత్తరకాశిలో వినాయకుడు జన్మించిన పుణ్య స్థలం !

 2. హిందువుల యొక్క నమ్మకం

2. హిందువుల యొక్క నమ్మకం

మరి కాశీలో గనక మరణిస్తే ఆ పరమశివుడ్ని చేరుకుంటామని, మోక్షం లభిస్తుందని హిందువుల యొక్క నమ్మకం.

తెహ్రి - గర్వాల్ - ఒక విభిన్న పర్యాటక ప్రదేశం !

3. వారణాశి

3. వారణాశి

ఇక్కడ ప్రవహించే గంగా నదిలో వరణా, ఆశీ అనే రెండు పవిత్రనదులు కలుస్తాయ్.అందుకే ఈ ప్రాంతానికి వారణాశి అనే పేరు వచ్చింది.

దీపావళి జరుపుకొనే ప్రదేశాలు !!

4. గంగ

4. గంగ

ఒక్కసారైనా జీవితకాలంలో ఈ పవిత్ర కాశీ పుణ్యక్షేత్రంలో గంగలో గనక స్నానం ఆచరిస్తే సకల పాపాలు హరించిపోతాయని భక్తుల విశ్వాసం.

5. విశ్వేశ్వర లింగం

5. విశ్వేశ్వర లింగం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన విశ్వేశ్వర లింగం ఎక్కడ వుంది. వారనాశిని మందిరాల నగరం, దీపాల నగరం, దేశపు ఆధ్యాత్మిక రాజధాని, సంస్కృతిక రాజధాని, విద్యానగరం అనే రకరకాల పేర్లతో వర్ణిస్తారు.

6. పురాతనమైనది

6. పురాతనమైనది

అమెరికన్ రచయిత వారణాశి చరిత్రకన్నా పురాతనమైనదిగా పేర్కొనటం జరిగింది.

7. 5000ల సంవత్సరాలకు పూర్వం

7. 5000ల సంవత్సరాలకు పూర్వం

సుమారు 5000ల సంవత్సరాలకు పూర్వం శివుడు వారణాశి నగరాన్ని స్థాపించాడని ఇది హిందువుల యొక్క 7 పవిత్ర నగరాలలో ముఖ్యమైనది.

8. కాశీ నగరం

8. కాశీ నగరం

ఋగ్వేదం, స్కందపురాణం, ఇతిహాసాలలో కాశీ నగరం యొక్క ప్రస్థావన వుంది. 18వ శతాబ్దంలో వారణాశి ప్రత్యేక రాజ్యంగా మారింది.

వారణాసి - పవిత్ర పుణ్య క్షేత్రం !!

9. రాంనగర్ కోట

9. రాంనగర్ కోట

కానీ బ్రిటీష్ వారి పాలనలో 1910లో రాంనగర్ రాజధానిగా బ్రిటీష్ వారు రాజ్యంగా మార్చారు.అప్పటి రాచరిక వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ అక్కడే రాంనగర్ కోటలో వుంటాడట.

వారణాసి : ఆధ్యాత్మిక రాజధానికి ఒక తీర్థ యాత్ర !

10. పురాతత్త్వ అవశేషాలు

10. పురాతత్త్వ అవశేషాలు

సప్త ముక్తి నగరాలలో అయోధ్య, గయ, కాశీ, అవంతిక,కంచి, ద్వారక నగరాలుగా చెప్పుకుంటారు. పురాతత్త్వ అవశేషాలు వారణాశి, వేద కాల ప్రజల ఆవాసంగా గుర్తించారు.

11. త్రివేణీసంగమం

11. త్రివేణీసంగమం

వారణాశిలోనే 1389లో రామభక్తుడైన కబీర్ దాస్ జన్మించాడు. ఇక్కడ గంగ, యమున, సరస్వతి నదులతో త్రివేణీసంగమంగా చెప్పుకోవచ్చును.

సెలబ్రెటీలు - దత్తత గ్రామాలు !

12. మణికర్ణి ఘాట్

12. మణికర్ణి ఘాట్

వారణాశిలో సుమారు 84స్నానపు ఘట్టాలు వుంటాయి. స్నానాల కోసం ఏర్పాటుచేసుకున్న ఇక్కడ వున్న ఘాట్ లలో మణికర్ణి ఘాట్ కి పురాణాల ప్రకారం సత్యహరిశ్చంద్ర మహారాజు కాటిపనికి నియమించబడ్డాడట.

వారణాసి నగరంలో దేవ దీపావళి వెలుగులు !

13. మహాస్మాశానం

13. మహాస్మాశానం

ఇక్కడ అధికంగా దహనసంస్కారాలు జరుగుతాయి. మరి దీనికి మహాస్మాశానం అని పేరు.

14. తారకేశవరం ఆలయం

14. తారకేశవరం ఆలయం

ఈ ఘాట్ కి దగ్గరలో వున్న తారకేశవరం ఆలయం నుండి పరమ శివుడు మరణిస్తున్న వారి చెవిలో తారక నామం జపిస్తాడని అందుకే ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని చెప్తారు.

15. కాశీ

15. కాశీ

అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా కూడా కాశీని చెప్పుకోవచ్చును.

సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం సీతా సమాహిత్ స్థల్ !