Search
  • Follow NativePlanet
Share
» »ఇవి గుహలు కాదు మీ ‘కోర్కెలు’ తీర్చే కామధేనువులు

ఇవి గుహలు కాదు మీ ‘కోర్కెలు’ తీర్చే కామధేనువులు

భారతదేశంలో గుహాలయాలకు సంబంధించిన కథనం.

By Kishore

భారత దేశంలో అనేక గుహాలయాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకూ శివుడిని లింగరూపంలో పూజిస్తారు. ఇటువంటి గుహల్లో కొన్ని పురాణ ప్రాధ్యాన్యత కూడా ఉన్నాయి. ఇక్కడ లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుడిని సందర్శించుకొంటే వివాహ సంబంధ బాధలు తీరుతాయని భక్తులు నమ్ముతున్నారు. అంతే కాకుండా అక్కడి ఉన్న తీర్థాల్లో అంటే చిన్న నీటి కుంటల్లో స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు ఇట్టే నయమవుతాయని భక్తుల విశ్వాసం. అటు వంటి దేవాలయాల్లో డెహరడూన్ లోని తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం, ఒరిస్సాలోని గుప్తేశ్వర్ మహాదేవ ఆలయం ముఖ్యమైనవి. వీటితో పాటు మరికొన్ని దేవాలయాల చరిత్ర మీ కోసం....

తాజా కథనాల కోసం బ్రహ్మచారులు ఇటు రాకండి.

ప్రాణాలు పొగొట్టుకోకూడదనుకుంటే అటు వైపు చూడకండిప్రాణాలు పొగొట్టుకోకూడదనుకుంటే అటు వైపు చూడకండి

1. తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం

1. తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం

Image Source:

తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం డెహరాడూన్ లో ఉంది. పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని ఈ దేవాలయానికి ప్రతి రోజూ వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన ఓ రాతి గుహలో శివలింగం ఉంటుంది. ఈ శివలింగం కూడా సహజ సిద్ధంగా ఏర్పడినదే. ఇక ఈ శివలింగం పై గుహ పై కప్పు నుంచి నీటి బిందువులు నిరంతరం పడుతూనే ఉంటాయి. దగ్గర్లోని నదీ నుంచి ఈ నీరు వస్తుందని చెబుతారే కాని అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం దొరకడం లేదు. ఇక ఇక్కడే ద్రోణాచార్యుడు కురు పాండవులకు అస్త్ర, శస్త్ర విద్యలు నేర్పించారని చెబుతాడు. అందువల్లే దీనిని ద్రోణాచార్య గుహ అని కూడా పిలుస్తారు.

2. గుప్తేశ్వర్ మహాదేవ ఆలయం

2. గుప్తేశ్వర్ మహాదేవ ఆలయం

Image Source:

ఇది ఒరిస్సాలోని కొర్పాట్ జిల్లాలో జోయ్ పూర్ కు 55 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అరణ్యాల మధ్య ఉంది. ఓ సున్నపురాయి గుహలో దాదాపు 2 మీటర్ల ఎతైన భారీ శివలింగాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. దీనిని మొదట అరణ్యవాసంలోని శ్రీ రామ చంద్రుడు కనుగొన్నట్లు చెబుతారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వేలాది మంది భక్తులు ఈ దేవదేవుడిని సందర్శింస్తుంటారు. ఈ గుహలో ఉన్నటు వంటి ఒక రాతి సరస్సులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు సమిసిపోతాయని భక్తుల నమ్మకం.

3. శివకోహ్రీ గుహాలయం

3. శివకోహ్రీ గుహాలయం

Image Source:

ఇది ప్రపంచంలో అత్యంత పురాతన దేవాలయాల్లో మొదటి స్థానంలో నిలుస్తుంది. జమ్ము కాశ్మీర్ లోని రియాసీ జిల్లా, రాన్ సో అనే గ్రామం సమీపంలో ఈ గుహాలయం ఉంది. ఇక్కడ కూడా అతి పెద్దదైన శివ లింగం ఉంది. ఇక్కడ నుంచి అమర్నాథ్ గుహకు స్వరంగ మార్గం ఉందని చెబుతారు. అయితే ప్రస్తుతం ఈ స్వరంగ మార్గాన్ని మూసివేశారు. అమర్నాథ్ గుహలో మాదిరి ఇక్కడ కూడా రెండు పావురాలు ఈ స`ష్టి మొదలయినప్పటి నుంచి ఉన్నాయని చెబుతారు. వాటిని దర్శనం చేసుకొంటే చాలా ఏళ్లుగా తీరని కోర్కెలన్నీ తీరుతాయని భక్తులు నమ్ముతారు. గత ఏడాది ఈ గుహాలయాన్ని దాదాపు 20 లక్షల మంది దర్శించుకొన్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

4.దండేలి లింగేశ్వరుడు

4.దండేలి లింగేశ్వరుడు

Image Source:

సహజ అందాలకు నిలయమైన కర్నాటకలోని దండేలి అనే ప్రాంతంలో ఒక పెద్ద గుహాలయం ఉంది. ఈ గుహలను కావ్లా కేవ్స్ అని అంటారు. ఇక్కడ శివలింగం స్వయంభువుగా చెబుతారు. అయితే ఈ శివలింగం దర్శనం చేసుకోవడానికి భూమి నుంచి దాదాపు 376 మెట్లు దిగి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటే త్వరగా పెళ్లి అవుతుందని స్థానికుల నమ్మకం అందువల్లే యుక్త వయస్సు వచ్చిన స్థానికులు అటు అమ్మయిలు కాని అబ్బాయిలు కాని తప్పక ఈ గుహాలయాన్ని సందర్శిస్తుంటారు.

5. మాజీమ్ ఈశ్వరుడు

5. మాజీమ్ ఈశ్వరుడు

Image Source

మేఘాలయలోని మాజిమ్ అనే గ్రామం సమీపంలో మాస్మాయి గుహలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత తడిగా ఉన్న గుహలు. ఈ గుహలు సముద్ర మట్టానికి 209 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇక్కడ శివలింగాన్ని స్వయంభువుగా చెబుతారు. ఈ గుహలోని దైవాన్ని దర్శించడం వల్ల వివాహ సంబంధమైన ఇబ్బందులు తొలిగిపోతాయని స్థానికులు చెబుతుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X