» »సిక్కిం రాష్ట్ర సంక్షిప్త సందర్శన !

సిక్కిం రాష్ట్ర సంక్షిప్త సందర్శన !

Written By:

సిక్కిం ఒక విభిన్న పర్యాటక ప్రదేహ్సం. ఒకవైపు పూర్తిగా మంచుతో నిండిన శిఖిరాలు మరో వైపు ఆహ్లాదకర పచ్చని లోయలు. సిక్కిం అక్కడ కల విభిన్న ప్రదేశాలతో విశ్రాంతి కోరే వారికి, సాహస క్రీడలు ఆచరించే వారికి కూడా స్వాగతం పలుకుతుంది.

హిమాలయాలలో చిట్టా చివరి కనుమ శాంగ్రి లా లేదా సిక్కిం లోని సిగ్గరులైన స్నేహ పూరిత స్థానిక ప్రజలతో ముచ్చట్లు, లేదా ప్రపంచంలో మూడవ అతి ఎత్తైన శిఖరం కంచన్ జున్గా సందర్శన లేదా అక్కడ కల రంగు రంగుల ప్రార్థనా జెండాలు మిమ్మల్ని ఈ బుద్ధ భూమికి స్వాగతం పలుకుతాయి. రాజకుమారుల కధలలో వుండే అందమైన ప్రదేశాల సిక్కిం ప్రయానించండి. అక్కడి స్థానికులతో ఆనందాలు పంచుకోనండి.

 

సరిహద్దుల సరదాలు!

సరిహద్దుల సరదాలు!

సిక్కిం ఎలా చేరాలి ?
సిక్కిం రాష్ట్రంలో ప్రయాణం చాలా వరకూ బస్సు లేదా జీపు లలో చేయగల రోడ్ ప్రయాణం మాత్రమే. ట్రెక్కింగ్ కూడా ఎంపిక చేయడగినదే. ఇక్కడ ఎయిర్ పోర్ట్ లు, రైల్వే స్టేషన్ లు లేవు. వెస్ట్ బెంగాల్ నుండి రోడ్ జర్నీ లో సిక్కిం చేరాలి. సిలిగురి మరియు గాంగ్టక్ ల మధ్య నిర్ణయించిన వేళల లో బస్సు లు నడుస్తాయి. సమీప ఎయిర్ పోర్ట్ బాగ్డోగ్రా లో కలదు. సిక్కిం రాజధాని గాంగ్టక్ నుండినాలుగున్నర గంటల డ్రైవింగ్ లో చేరవచ్చు.
Photo Courtesy: proxygeek

సరిహద్దుల సరదాలు!

సరిహద్దుల సరదాలు!

రుంటెక్ మొనాస్టరీ
సిక్కిం లో కల కర్మ కాగ్యు స్కూల్ అఫ్ బుద్ధిజం కు ఇది ప్రధాన మొనాస్టరీ.దీనిని 1740 లో మొదటి సారిగా 9 వ కర్మపా వాంగ్ చక్ దోర్జీ నిర్మించాడు. కాని తర్వాతి కాలంలో ఇది శిధిలమైపోయింది. 1959 లో దీనిని తిరిగి నిర్మించారు.

Photo Courtesy: Vikramjit Kakati

సరిహద్దుల సరదాలు!

సరిహద్దుల సరదాలు!

టి సాన్గ్మో లేక్
ఈ సరస్సు గాంగ్టక్ నుండి 40 కి. మీ. ల దూరంలో కలదు. పెద్దదైన ఈ సరస్సు తూర్పు సిక్కిం జిల్లాలో కలదు. ఈ సరస్సును స్థానికులు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. చుట్టూ చెట్ల చే కప్పబడి వుంటుంది. ఇక్కడి పక్షులు ఒక్క ఆకు కూడా సరస్సు లో పడకుండా కాపాడతాయని చెపుతారు. ఈ సరస్సులో అందమైన బాతులు వివిధ వలస పక్షులు కలవు. ఇది నిషేధిత ప్రాంతం కావటం వలన, ముందస్తు అనుమతులు అవసరం. విదేశీయులను స్పెషల్ అనుమతి లేకుండా అనుమతించారు. Photo Courtesy: Ravinder Singh Gill

సరిహద్దుల సరదాలు!

సరిహద్దుల సరదాలు!

గురు దొంగ్మార్ సరస్సు
ఈ సరస్సు చైనా దేశ సరిహద్దుకు సమీపంలో వుండటం వలన సందర్శనకు ప్రభుత్వ అనుమతి అవసరం. ఈ ప్రదేశం పూర్తిగా భారత సైన్యం అధీనంలో వుంటుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పెను గాలులు వీస్తాయి కనుక విజిటర్లకు ఈ ప్రాంత పర్యటన కష్టంతో కూడుకున్నది కనుక అనుమతులు ఇవ్వరు.

Photo Courtesy: Sivakumar

సరిహద్దుల సరదాలు!

సరిహద్దుల సరదాలు!

జొన్గ్రి ట్రెక్
జొన్గ్రి ట్రెక్ మార్గం చిన్నది. ట్రెక్కింగ్ కు అనుకూలం సిక్కిం లో ట్రెక్కింగ్ ఒక ప్రధాన ఆకర్షణ. మార్గంలో ఎన్నో అద్భుత దృశ్యాలను చూసి ఆనందించ వచ్చు.

Photo Courtesy: carol mitchell

సరిహద్దుల సరదాలు!

సరిహద్దుల సరదాలు!

బాబా మందిర్
ఈ మందిరాన్ని మేజర్ హర్భజన్ సింగ్ అనే ఒక భారత సైనికుడి జ్ఞాపకార్ధం నిర్మించారు. ఈయన ఇండో చైనీస్ యుద్ధం లో నాథులా పాస్ వద్ద మరణించాడు. ఈయను సైనికులు హీరో అఫ్ నాతుల గా గుర్తించి గౌరవిస్తారు.

Photo Courtesy: Ambuj Saxena

సరిహద్దుల సరదాలు!

సరిహద్దుల సరదాలు!

నాథులా పాస్
ఈ మార్గాన్ని వింటర్ లో మూసివేసి, మే లో తెరుస్తారు. ఈ ప్రదేశం ఇండియా - చైనా సరిహద్దులో కలదు. విదేశీ పర్యాటకులకు ప్రవేశం అనుమతి లేదు. భారతీయులను ఒక రోజు అడ్వాన్సు అనుమతి తో పంపుతారు. ఈ మార్గం సోమవారాలు, మంగళ వారాలు మూసి వుంటుంది. ఇక్కడ మీరు రాఫ్టింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్, యాక్ సఫారి, మౌంటెన్ బైకింగ్ వంటివి చేయవచ్చు.

Photo Courtesy: Giridhar Appaji Nag Y

సరిహద్దుల సరదాలు!

సరిహద్దుల సరదాలు!

తినటం ...తాగటం
మాంసాహారులకు ఒక స్వర్గంగా వుంటుంది. కోరిన రుచులు దొరుకుతాయి. వెజ్ మామోలు కూడా లభ్యంగా వుంటాయి. స్థానికంగా తయారు అయ్యే బీరు బ్రహ్మాండమైన కిక్కు ఇస్తుంది.
Photo Courtesy: kushal goyal

మరిన్ని సిక్కిం రాష్ట్ర ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

సిక్కింలో హోటల్ వసతులకు ఇక్కడ చూడండి

Please Wait while comments are loading...