Search
  • Follow NativePlanet
Share
» »నీటిలోపల దోబూచులాట ఆడాలంటే సింధుదుర్గ్ వెళ్ళాల్సిందే..

నీటిలోపల దోబూచులాట ఆడాలంటే సింధుదుర్గ్ వెళ్ళాల్సిందే..

పూర్వం మన భారతదేశాన్ని అనేకమంది రాజులు పరిపాలించారు. అలా పరిపాలన కొనసాగించే సమయంలో వారికి నచ్చినట్లు తమ అభిరుచికి తగినట్లుగా కొన్ని కోటలను నిర్మించుకున్నారు. అలా నిర్మించుకున్న కోటల్లో కొన్ని వారు నివాసముడటానికైతే, మరికొన్ని ఆడవారికి రక్షణ కల్పించడానికి నిర్మింపబడ్డాయి. ఇలా పూర్వకాలంలో నిర్మింపబడిన కోటల నిర్మాణాలు వారి రాజసాన్ని, అభిరుచిని తెలియజేస్తాయి.

అప్పట్లో సాంకేతిక పరిజ్జానం, సరైన పరికరాలు లేకపోయినా వారు కోటలను తీర్చిదిద్దిన విధాన్ని , వారి నైపుణ్యాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే , ఇలా భారతదేశం మొత్తం నిర్మింపబడిన వేలకొద్ది కోటల్లో ఏ ఒక్క కోట ఒకేలా ఉండదు. వేటికవి భిన్నంగా ఉంటూ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

Sindhudurg fort in Maharashtra- A place for History, Tourism and Sightseeing,

పర్యాటకులుగా ఎప్పుడూ మంచుకొండల ముచ్చట్లు, పర్వాతాల ప్రక్రుతిసోయగాలు, ఆధ్యాత్మిక చారిత్రిక విషయాలే కాదు అప్పుడప్పుడు సముద్రపు అలల సంభాషణలు కూడా కావాలి. కొంత మంది పర్యాటకులకు రోజంతా ఏ బీచ్ లోనే గడపాలనిపిస్తుంది. అలలతో కబుర్లు చెప్పాలనిపిస్తుంది. గాలిలో ఎగిరిపోవాలనిపిస్తుంది. అందుకోసం ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. పక్కన మహారాష్ట్రాలో మైమరపించే అందాలతో పలకరిస్తోంది మాల్వాన్. ఇక్కడ ప్రకృతి అందాలే కాదు..చారిత్రక కట్టడాలు..సాహస క్రీడలు ఇలా ఎన్నెన్నో అద్భుతాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.. మరి ఆముచ్చట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అలల నడుమ అద్భుతం.

అలల నడుమ అద్భుతం.

అలల నడుమ అద్భుతం. సముద్రం మధ్యన ఓ అద్భుత కనిపిస్తుంది. అదే సింధుదుర్గ్ కోట. అరేబియా సముద్ర నడిబొడ్డున ఉన్న సింధుదుర్గ్ కోట మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా, మాల్వాన్ తాలుకా , తర్కక్లిలో చాలా ప్రసిద్ది చెందిన కోట.

Photo Courtesy: Nilesh2 str

నడి సంద్రంలో ఉన్న ఈ కోట

నడి సంద్రంలో ఉన్న ఈ కోట

నడి సంద్రంలో ఉన్న ఈ కోటను ఛత్రపతి శివాజీ హీరోజీ ఇందుల్కర్ పర్యవేక్షణలో నిర్మించారు.. నీటి మధ్యలో కోట గోడలు 30అడుగుల ఎత్తు, 12 అడుగుల మందంతో నిర్మించారు. సముద్రపు అలల తాకిడికి కోటగోడలు దెబ్బతినకుండా ప్రత్యేకమైన నిర్మాణ జాగ్రత్తలు తీసుకున్నారు. 1664లో ప్రారంభించిన నిర్మాణం 1667లో పూర్తైనది. సింధుదుర్గ్ ఎన్నో చారిత్రక గాథల్ని వినిపిస్తుంది.

కోట మొత్తము 50 ఎకరాలు విస్తరించి ఉంది

కోట మొత్తము 50 ఎకరాలు విస్తరించి ఉంది

కోట మొత్తము 50 ఎకరాలు విస్తరించి ఉంది, ఒక 9.2 మీటర్ ఎత్తులో 4 మీటర్ల పొడవు కోట గొడతో మరియు 42 కోట బురుజులతొ నిండి ఉన్నది . రాజ భవన కోట యందు హనుమాన్, జరిమారి మరియు 'భవానీ' మత దేవాలయాలు ప్రధానంగా సందర్శించవల్సిన ప్రదేశాలు.

Image Courtesy: Sanndesh

ఛత్రపతి శివాజీ విదేశీ శక్తులను ఎదుర్కోవడానికి

ఛత్రపతి శివాజీ విదేశీ శక్తులను ఎదుర్కోవడానికి

ఛత్రపతి శివాజీ విదేశీ శక్తులను ఎదుర్కోవడానికి తన వ్యూహాత్మక ప్రయోజనం సరిపోయేందుకు, మరియు శత్రువులను ఏదుర్కోవడానికి సిద్దిస్ యొక్క మురుద్-జంజీర ఉంచడానికి ఈ రాతి ద్వీప నిర్మానాన్ని ఎంచుకున్నాడు.

Image Courtesy: Ankur P

శత్రువులకు కనిపించకుండా

శత్రువులకు కనిపించకుండా

ఈ కోట యొక్క అందం సహజసిద్ధంగా అరేబియా సముద్రం నుండి వచ్చినది, శత్రువులకు కనిపించడానికి వీలు లేని పరిజ్ఞానంతో నిర్మించబండింది.

Image Courtesy: Saurabhsurve

ఇక్కడ ప్రధాన ఆకర్షణలు

ఇక్కడ ప్రధాన ఆకర్షణలు

ఇక్కడ ప్రధాన ఆకర్షణలు సముద్రతీరాలు లేదా బీచ్ లు అని ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరంలేదు, అనేక సంఖ్యల్లో కోటలు ఉన్నాయి. అవి సుమరు 17 వ శాతాబ్దం నాటివని చరిత్రలు చెబుతున్నాయి.

Image Courtesy: Sballal

ఒక విచిత్రమైన కోట గొడతో నిర్మించబడి ఉంది

ఒక విచిత్రమైన కోట గొడతో నిర్మించబడి ఉంది

సింధుదుర్గ్ మహారాష్ట్ర యొక్క అత్యంత ముఖ్యమైన సముద్రతీరపు కోటలలో ఒకటి.. సింధుదుర్గ్ కోట 42 కోట బురుజులతొ ఒక విచిత్రమైన కోట గొడతో నిర్మించబడి ఉంది. ఈ కోట యొక్క నిర్మాణ పదార్థం కూడా సుమారు 73.000 కిలోల ఇనుము కలిగి ఉంటుంది.

Image Courtesy: Elroy Serrao

నీటి అలలపైనే మాత్రమే కాదు..

నీటి అలలపైనే మాత్రమే కాదు..

నీటి అలలపైనే మాత్రమే కాదు..నీటిలోపలా దోబూచులాట ఆడాలంటే సింధుదుర్గ్ వెళ్ళాల్సిందే. అదే నండి స్కూబా డైవింగ్. అండర్ వాటర్ స్పోర్ట్స్. ఈ అద్భుతమైన సింధుదుర్గ్ సముద్రంలో స్కూబా డైవింగ్ తో పాటు వాటర్ స్పోర్ట్స్ ఆడవచ్చు. సముద్రంలోపల శ్వాసతీసుకునేందుకు అనువైన సెల్ఫ్ కంటెయిన్డ్ బ్రీతింగ్ మిషన్ తో జలచరాలను పలకరించి రావచ్చు.

సముద్రపు లోతు కాదు, ఆకాశపు అంచులు చూసి రావచ్చు

సముద్రపు లోతు కాదు, ఆకాశపు అంచులు చూసి రావచ్చు

ఈ సింధుదుర్గ్ సముద్రంలోపల సముద్రపు లోతు కాదు, ఆకాశపు అంచులు చూసి రావచ్చు. రెక్కలు కట్టుకున్నట్లు గాలిలో విహరించవచ్చు, సాయంత్రం బీచ్ లో వాలీబాల్ ఆడుతూ సరదాగా గడపవచ్చు. సముద్రం మధ్యలో బోట్ నుండి లేదా నేల మీద వాహనం నుండి పారాసైలింగ్ లో గాలిలో తేలిపోవచ్చు,. సింధుదుర్గ్ విహారయాత్రకు వెళ్ళే పర్యాటలకు విహారయాత్ర ఆసాంతం అద్భుతం మహా అద్భుతం అనిపించేలా చేస్తుంది.

Photo Courtesy : Nilesh.shintre

ఎలా వెళ్లాలి:

ఎలా వెళ్లాలి:

ముంబాయికి సుమారు 400కి.మీ దూరంలో మాల్వాన్ ఉంది. ఇక్కడి రోడ్, రైలు మరియు వాయు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. అధిక సంఖ్యలో బస్సులు మహారాష్ట్ర లోని నగరాల నుండి అలాగే మహారాష్ట్ర బయట నుండి అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారి 17 ఈ ప్రాంతం గుండా వెళుతుంది. సింధుదుర్గ్ కు ముంబై, గోవా మరియు మంగుళూర్ వంటి ప్రధాన ప్రదేశాల నుండి రైలు లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు. గోవా విమానాశ్రయం , 80కి.మీ దూరంలో ఉంది. ఇది సింధు దుర్గ్ చేరుకోవడానికి దగ్గరి దారి.

Photo Courtesy : Shoukatalli

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more