Search
  • Follow NativePlanet
Share
» »ఉల్లాసపరిచే ఊటీ గార్డెన్లు !!

ఉల్లాసపరిచే ఊటీ గార్డెన్లు !!

ప్రకృతి ప్రియుల మనసును రంజింప చేసే టూరిస్ట్ స్పాట్ ఊటీ. మీరు కురుంజి పూవుల గురించి వినే వుంటారు. ఈ కురుంజి పూవులు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూస్తాయి.

By Mohammad

ఊటీలో చూడటానికి అనేక దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో బొటానికల్ గార్డెన్, పైకారా లేక్, ప్రభుత్వ మ్యూజియం, దొడ్డబెట్ట శిఖరం, ఊటీ బోట్‌హౌస్ మరియు లేక్, అందమైన కాఫీ తోటలు, ఆధ్యాత్మికతను పెంపొందించే హిందూ దేవాలయాలైన మురుగన్ కోయిల్, వెంకటేశ్వర స్వామి, మరియమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ముఖ్యమైనవి.

ప్రకృతి ప్రియులకు ఈ ప్రదేశం ఒక మనసును రంజింప చేసే టూరిస్ట్ స్పాట్. బహుశా !! మీరు కురుంజి పూవుల గురించి వినే వుంటారు. ఈ కురుంజి పూవులు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూస్తాయి. ఈ కొండలన్నీ ఇక్కడ కల ప్రత్యేక కురింజి పూవులు పూస్తే, కొండలు నీలపు రంగులోకి మారిపోతాయి. చూసే వారికి కన్నుల పండుగగా వుంటుంది. ఈ సమయంలో పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శనకు వస్తారు. ఊటీ లో సుందరమైన ప్రదేశాలే కాక కురుంజి పూల తోటలు కూడా కలవు. మరి అటువంటి అందమైన గార్డెన్ లు ఏవో పరిశీలిద్దాం !!

కురంజి పూలు

కురంజి పూలు

చిత్రకృప : Ashwin Kumar

కురంజి పూల తోటలు

సుమారు 22 హెక్టార్ల విస్తీర్ణం కల ఈ ప్రదేశం దోడబెట్ట శిఖర వాలులలో కలదు. ఈ గార్డెన్ లో ఎన్నో వెరైటీల వృక్షాలు కలవు. అరుదైన లిల్లీ మొక్కలు, పూల మొక్కలు, అరుదైన చెట్లు కలవు. వాటిలో మంకీ పజిల్ ట్రీ ఒకటి. గార్డెన్ వివిధ భాగాలుగా ఉన్నది. అవి దిగువ గార్డెన్, కొత్త గార్డెన్, ఇటాలియన్ గార్డెన్, ఫౌంటెన్ టెర్రస్ మరియు నర్సరీలు. విశాలమైన ఈ పచ్చటి ప్రదేశంలో కొత్త జంటలు తమ ప్రైవసీ కొరకు ఇక్కడకు వస్తారు.

రోజ్ గార్డెన్

ఊటీ లోని అందమైన ఈ గార్డెన్ ఇండియాలోనే అతి పెద్దది. సముద్ర మట్టానికి సుమారు 2200 మీటర్ల ఎత్తున కల ఈ ప్రదేశం రంగు రంగుల మొక్కలతో సుమారు నాలుగు హెక్టార్ల భూమిలో విస్తరించి వుంది. సుమారు 1900 వెరైటీలతో మొదలు పెట్టబడిన ఈ గార్డెన్ లో నేడు, సుందరమైన 20,000 గులాబీ రకాలు కలవు. ఇక్కడ రోజ్ ప్లాంట్ లు మాత్రమే కాక, అనేక రోజ్ క్రీపర్ లు, రోజ్ టన్నెల్స్, పెర్గోలాస్ బౌవార్స్ కూడా కలవు.

సందర్శన సమయం : 8. 30 am - 6 pm (ప్రతిరోజూ)
టికెట్ : రూ. 20/-, రూ. 30/- కెమెరాకు, రూ. 75/- వీడియో కెమెరాకు.

గార్డెన్లు

చిత్రకృప : Jeff Peterson

థ్రెడ్ గార్డెన్

రోజ్ గార్డెన్ ఇక్కడ ఒక సహజ వండర్ అనుకుంటే, ఊటీ లోని థ్రెడ్ గార్డెన్ ఒక మానవ నిర్మిత అద్భుతం. ఈ గార్డెన్ ప్రపంచంలోని ఒక ప్రత్యేకం. దీనిలో అనేక రకాల, పూవులు, మొక్కలు, లోటస్ కొలనులు, పాకే థీ పూల చెట్లు వంటివి థ్రెడ్, వైర్ మరియు కాన్వాస్ లతో చేయబడి వుంటాయి. అరుదైన ఈ హ్యాండ్ మేడ్ కళా వస్తువులను కొనటానికి సందర్శకులు ఆసక్తికనబరుస్తారు.

ఉల్లాస పరిచే ఊటీ రైలు ప్రయాణం !ఉల్లాస పరిచే ఊటీ రైలు ప్రయాణం !

సిమ్స్ పార్క్

సిమ్స్ పార్క్ ఊటీ సమీపాన కూనూర్ వెళ్ళే మార్గంలో ఉన్న మరో బొటానికల్ గార్డెన్. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించబడిన పూలు, మొక్కలు ఇక్కడ ప్రదర్శిస్తుంటారు. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ పార్క్ లో ప్రతి ఏడాది మే నెలలో ఫ్రూట్ షో, వెజిటేబుల్ షో నిర్వహిస్తారు.

సందర్శన సమయం : 8 am - 6: 30 pm (ప్రతిరోజూ)
టికెట్ : రూ. 5/-

సిక్స్త్ మైల్

సిక్స్త్ మైల్

చిత్రకృప : Big Eyed Sol

సిక్స్త్ మైల్

ఊటీకి 6 కిలోమీటర్ల దూరంలో పైకారా జలపాతానికి వెళ్ళే మార్గంలో ఈ అద్భుత ప్రదేశం కలదు. సినిమా షూటింగ్ స్పాట్ గా పేరుపొందిన ఈ పచ్చటి అడవి ప్రదేశంలో అన్ని భాషల భారతీయ సినిమాల తీసి ఘనవిజయం సాధించారు.

ఎం ఆర్ సి గోల్ఫ్ క్లబ్

గోల్ఫ్ క్లబ్ సముద్ర మట్టానికి 7200 మీటర్ల ఎత్తులో, 195 ఎకరాల విస్తీర్ణంలో పచ్చటి గడ్డి మైదానాలతో నిండి ఉన్నది. దీనిని జింఖానా క్లబ్ వారు నిర్వహిస్తున్నారు. గోల్ఫ్ ఆటలు ఆడేవారు, స్థానికులు ఇక్కడికి తరచూ వస్తుంటారు.

పైన్ ఫారెస్ట్

పైన్ ఫారెస్ట్

చిత్రకృప : Raghavan G

పైన్ ఫారెస్ట్

ఊటీ కి, తలకుండ కు మధ్యలో ఉన్న ఈ టూరిస్ట్ స్పాట్ లో పాపులర్ హిందీ సినిమా షూటింగ్లు చిత్రీకరించారు. పైన్ వృక్షాలు ఇక్కడి ప్రధాన ఆకర్షనైతే అందమైన దృశ్యాలు, ఆహ్లాదపరిచే వాతావరణం మనాలి మంత్రముగ్ధులను చేస్తాయి. కామరాజ - సాగర్ డ్యామ్ ను ఇక్కడి నుంచి చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X