Search
  • Follow NativePlanet
Share
» »దోసకాయ అంటే ఈ గణపతికి ఎందుకంత ఇష్టం?

దోసకాయ అంటే ఈ గణపతికి ఎందుకంత ఇష్టం?

సౌతట్కా మహాగణపతి దేవాలయం హిందువుల పుణ్యక్షేత్రం. ఇది ఇది దక్షిణ కన్నడలోని బెత్లంగడిలో ఉంది. ఈ దేవలయం సమయం, చరిత్రతో పాటు అక్కడికి ఎలా చేరుకోవానే విషయాలు మీ కోసం.

భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అందులో కర్నాటకలోలని దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా కొక్కడలో ఉన్న గణేశ దేవాలయం విశిష్టమైనది. ఈ దేవాలయం అత్యంత మహిమాన్వితమైన గణపతి దేవాలయంగా పేర్కొంటారు. అదే సౌతడ్క మహాగణపతి దేవాయం. ఇది ధార్మిక క్షేత్రంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది.

సౌతడ్క మహాగణపతి దేవాలయం

సౌతడ్క మహాగణపతి దేవాలయం

P.C: You Tube

పూర్వం ఇక్కడ గోవులు కాసేవారికి ఒక రాతి గణపతి విగ్రహం దొరికింది. దీంతో వారు ఒక ఎత్తైన అరుగు పై ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించడం మొదలు పెట్టారు. ఆ స్థలమే నేడు సౌతడ్క క్షేత్రమని ప్రసిద్ధి చెందింది.

సౌతడ్క మహాగణపతి దేవాలయం

సౌతడ్క మహాగణపతి దేవాలయం

P.C: You Tube

గోవులు కాసేవారు మొదట ఈ గణపతికి నైవేద్యంగా సౌతేకాయి (తెలుగులో దోసకాయి)ని సమర్పించారు. అందుల్లే ఈ ప్రాంతానికి సౌతడ్కే అని పేరు వచ్చింది. ఇప్పటికీ ఇక్కడ దోసకాయిని నైవేద్యంగా సమర్పించే ఆచారం కొనసాగుతూనే ఉంది.

సౌతడ్క మహాగణపతి దేవాలయం

సౌతడ్క మహాగణపతి దేవాలయం

P.C: You Tube

మిగిలిన దేవాలయాల వలే ఇక్కడ విగ్రహానికి గర్భగుడి ఉండదు. గోపురం ఉండదు. మండపం కూడా అండదూ. అదే ఇక్కడ విశిష్టత. ప్రక`తి మధ్య ఆ దేవదేవుడు కొలువై ఉంటాడు.

సౌతడ్క మహాగణపతి దేవాలయం

సౌతడ్క మహాగణపతి దేవాలయం

P.C: You Tube

ఎవరైనా ఇక్కడికి వచ్చి తమ కోరికలను విన్నవించుకొంటే వారి కోర్కెలు మూడు నెలల్లోపు ఖచ్చితంగా నెరవేరుతాయని చెబుతారు. అటు పై వెంటనే ఇక్కడికి వచ్చి ముడుపులుగా గంటను ఇక్కడ చెల్లిస్తారు. ఇలా వేల గంటలను ఇక్కడ మనం చూడొచ్చు.

సౌతడ్క మహాగణపతి దేవాలయం

సౌతడ్క మహాగణపతి దేవాలయం

P.C: You Tube

ముఖ్యంగా సంతానం కోసం, రుణ విముక్తి కోసం ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి దేవదేవుడికి కోరికలను విన్నవించుకొంటూ ఉంటారు. అంతేకాకుండా చాలా మంది భక్తులు తమ సంతానానికి అన్నప్రాస కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహిస్తుంటారు.

సౌతడ్క మహాగణపతి దేవాలయం

సౌతడ్క మహాగణపతి దేవాలయం

P.C: You Tube

ఈ క్షేత్రంలో దాదాపు 150 నుంచి 200 ఆవులు ఉన్నాయి. వాటికి అటుకులు, బెళ్లంతో చేసిన తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ప్రతి రోజూ 24 గంటలూ ఈ క్షేత్రాన్ని సందర్శించుకోవచ్చు.

సౌతడ్క మహాగణపతి దేవాలయం

సౌతడ్క మహాగణపతి దేవాలయం

P.C: You Tube

ప్రముఖ ధార్మిక క్షేత్రం ధర్మస్థలం నుంచి కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఈ క్షేత్రం ఉంది. ధర్మస్థలం నుంచి ఈ క్షేత్రానికి నిత్యం బస్సులు వెలుతూ ఉంటాయి. అదే విధంగా మంగళూరు నుంచి 82 కిలోమీటర్ల దూరం ప్రయాణంతో ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X