» »ఆది శంకరాచార్యులు ప్రతిష్టించిన ఆంజనేయస్వామి దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా ?

ఆది శంకరాచార్యులు ప్రతిష్టించిన ఆంజనేయస్వామి దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా ?

Written By: Venkatakarunasri

LATEST: ఫేస్ బుక్ ఇంత బాగా అభివృద్ది చెందటానికి కారణమేమిటో మీకు తెలుసా ?

శివన్ మలై ఆలయం 3 వ ప్రపంచ యుధ్ధంలో భూమి నాశనం అవుతుందని హెచ్చరిస్తోంది !

ఆది శంకరాచార్యులు ప్రతిష్టించిన వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆలయం శ్రీ ఆంజనేయ దేవాలయం. ఇది కర్ణాటకలోని శృంగేరి లో కలదు.

దక్షిణ భారతదేశంలో పడమటి కర్నాటక రాష్ట్రంలో పడమటి కనుమల్లో మల్నాడు ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు, లోయలు, అరణ్యాలతో ఆకర్షించే పవిత్ర శృంగేరిలో ఆది శంకరరాచార్యుల వారు ప్రతిష్టించిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. దీన్ని కేరే ఆంజనేయ దేవాలయం అంటారు.

కేరే అంటే కన్నడలో సరస్సు అని అర్ధం.

1. ఆది శంకరాచార్య

1. ఆది శంకరాచార్య

ఆది శంకరాచార్య హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథముడు. ఈయన గురువు, సిద్ధాంతవేత్త, మహాకవి.

pc: sringeri.net

2. అద్వైతం

2. అద్వైతం

ఈయన ప్రతిపాదించిన సిద్దాంతం అద్వైతం. శంకరాచార్యుల వారు కేరళ రాష్ట్రంలోని కాలడి ప్రాంతంలో పుట్టారు.

pc: Vikas149r

3. జమ్మూకాశ్మీర్

3. జమ్మూకాశ్మీర్

దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుండి మొదలు ఉత్తరాన ఉన్న జమ్మూకాశ్మీర్ వరకు ఆయిన హిందూ మతాన్ని వ్యాప్తి చేయటంలో కృషి చేశారు.

pc: Naveenbm

4. సరైన ఆధారాలు

4. సరైన ఆధారాలు

ఆయన జన్మ వివరాలకు సంబంధించి సరైన ఆధారాలు లేవుకానీ క్రీ.శ. 7- 8 వ శతాబ్దంలో మధ్యలో జన్మించి ఉంటారని నమ్మకం.

pc: wikimedia.org

 5. 'శివుని' అవతారంగా

5. 'శివుని' అవతారంగా

శంకరులవారు సాక్షాత్తు ఆ 'శివుని' అవతారంగా భావిస్తారు భక్తులు. భారతదేశం అంతటా కాలినడకన తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ శంకరులు అనేక దేవాలయాలను దర్శించారు.

pc: wikimedia.org

6. జ్యోతిర్మఠం

6. జ్యోతిర్మఠం

శృంగేరి, ద్వారకా, పూరీ, జ్యోతిర్మఠం మఠాలను స్థాపించి, ఇవి హిందూమతానికి నాలుగు దీపస్తంభంలా పనిచేస్తాయని చెప్పారు.

pc: wikimedia.org

7. కేరే ఆంజనేయ దేవాలయం

7. కేరే ఆంజనేయ దేవాలయం

సరస్సు ఒడ్డునే ఆంజనేయస్వామి దేవాలయం ఉంది కనుక కేరే ఆంజనేయ దేవాలయం అన్న పేరు వచ్చింది.

pc: wikimedia.org

8. శ్రీ ఆంజనేయస్వామి

8. శ్రీ ఆంజనేయస్వామి

శ్రీ శంకరాచార్యులు భారత దేశం మొత్తం మీదిక్కడ శృంగేరిలో ఒక్కచోటే శ్రీ ఆంజనేయస్వామిని ప్రతిష్టించారు. ఇంత ప్రత్యేకం కనుకనే దేవాలయానికి అంతటి పేరు, ప్రఖ్యాతలు వచ్చాయి.

pc: wikimedia.org

9. చదువుల తల్లి శారదాదేవి ఆలయం

9. చదువుల తల్లి శారదాదేవి ఆలయం

శృంగేరిలో జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్య ప్రతిష్టించిన చదువుల తల్లి శారదాదేవి ఆలయం భారతదేశమంతా ప్రసిద్ధి చెందింది.

pc: wikimedia.org

10. తపస్సు చేసిన క్షేత్రం

10. తపస్సు చేసిన క్షేత్రం

కాల భైరవ, వన దుర్గ, కాళికాంబ దేవాలయాలు దర్శించతగినవి. ఋష్య శ్రుంగ మహర్షి తపస్సు చేసిన క్షేత్రం కనుక ఇది శృంగేరి అని ప్రసిద్ధి చెందింది.

pc: wikimedia.org

11. శృంగేరి లో చూడవలసిన ఇతర దేవాలయాలు

11. శృంగేరి లో చూడవలసిన ఇతర దేవాలయాలు

శృంగేరి లో ఆదిశంకర దేవాలయం, శారదా దేవి ఆలయం, శృంగేరి మఠం, కిగ్గా, మళయాళ బ్రహ్మ దేవాలయం, సిరిమనే జలపాతాలు, మల్లికార్జున దేవాలయం, తోరణ గణపతి దేవాలయం, శ్రీ విద్యాశంకర దేవాలయం, పార్శ్వనాథ తీర్థంకర దేవాలయం మరియు చప్పర ఆంజనేయ దేవాలయం మొదలగునవి చూడవచ్చు.

pc: wikimedia.org

12. శృంగేరి సమీప పర్యాటక స్థలాలు

12. శృంగేరి సమీప పర్యాటక స్థలాలు

అగుంబే - 28 కిలోమీటర్లు, కుద్రేముఖ్ - 52 కిలోమీటర్లు, కర్కల - 60 కిలోమీటర్లు, భద్ర - 75 కిలోమీటర్లు, హొరనాడు - 78 కిలోమీటర్లు, చిక్కమగళూరు - 86 కిలోమీటర్లు.

pc: wikimedia.org

13. వసతి సదుపాయాలు

13. వసతి సదుపాయాలు

శృంగేరి లో ధార్మిక సత్రాలు అధికం. వీటితో పాటు లాడ్జీలు, హోటళ్ళు కూడా యాత్రికులకు అందుబాటులో ఉంటాయి

pc: wikimedia.org

14. శృంగేరి ఎలా చేరుకోవాలి ?

14. శృంగేరి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : శృంగేరికి దగరలో మంగళూరు విమానాశ్రయం 100 కిలోమీటర్ల దూరంలో కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ ద్వారా శృంగేరి చేరుకోవచ్చు.

రైలు మార్గం : శృంగేరి కి దగ్గరలో ఉడుపి, చిక్కమగళూరు రైల్వే స్టేషన్లు కలవు. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సులలో ప్రయాణించి శృంగేరి చేరుకోవచ్చు.

pc: wikimedia.org

15. బస్సు మార్గం

15. బస్సు మార్గం

బెంగళూరు, ఉడుపి, చిక్కమగళూరు, మంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల నుండి శృంగేరి క్షేత్రానికి ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు లభిస్తాయి.

pc: wikimedia.org