» »శ్రీ చక్ర మహాయంత్ర ఆలయం - దేవీపురం

శ్రీ చక్ర మహాయంత్ర ఆలయం - దేవీపురం

Written By: Venkatakarunasri

వైజాగ్ నగరానికి సరిగ్గా 30 కి. మీ ల దూరంలో, చుట్టూ పచ్చదనంతో విరాజిల్లుతున్న 'దేవిపురం' ఒక గొప్ప ఆలయాల సముదాయం. శ్రీ చక్ర మహాయంత్ర ఆలయం గా ఖ్యాతికెక్కిన ఈ ఆలయ సముదాయం హిందూ మతానికి సంబంధించిన శక్తీ పాఠశాలకు అనుబంధంగా ఉన్నది. ఆది దేవత స్వరూపమైన సహ్రక్షి (సహ్రక్షి అంటే 'వెయ్యి కళ్ళు కలిగినదని' అర్థం) మరియు కామేశ్వరుడు (శివుడు) ఇక్కడి రెండు ప్రధాన దైవాలు.

ముంబై లోని టాటా ఫండమెంటల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ప్రహ్లాద శాస్త్రి (అమృతానంద సరస్వతి స్వామి)కి ఒకనాడు రాత్రి నిద్రపోతుండగా దేవి కలలో కనపడి, తనకు ఆలయం కట్టించమని కోరుతుందని కథనం. అందుకోసమై ఆయన అనేక అనువైన ప్రాంతాలను వెతికి, చివరకు ఒకనాడు వైజాగ్ లో జరిగే దేవి యాగానికి హాజరవుతారు. చుట్టూ ఉన్న ప్రకృతి, అక్కడ జరిగిన ప్రత్యేక సంఘటనల ద్వారా ఆయన ఎలాగైనా ఆలయాన్ని ఇక్కడే నిర్మించాలనుకొని నిశ్చయించుకుంటాడు.

దేవిపురం లో సహ్రక్షి మేరు ఆలయ నిర్మాణం 1985 వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ దేవాలయం పూర్తయి మొదటి కుంభాభిషేకం 1994 లో, పన్నెండవ వార్షికోత్సవం 2007 ఫిబ్రవరి లో జరిగింది.

ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

విమానాల్లో వెళ్ళేవారు వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దిగి, అక్కడి నుంచి 20 కి. మి. ల దూరంలో ఉన్న దేవిపురం కు క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించవచ్చు.

ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

దేవిపురం సమీపాన వైజాగ్ రైల్వే స్టేషన్ ఉన్నది. దేశంలోని అన్ని ప్రదేశాల నుండి ఇక్కడికి రైళ్ళు వస్తుంటాయి. ఈ స్టేషన్ కు దేవిపురం 28 కి. మి. ల దూరంలో కలదు. అనకాపల్లి ఐతే దీనికి దగ్గరలో ఉన్నది. ఇది కేవలం 18 కిలోమీటర్ల దూరమే .. !

ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

బస్సులో వచ్చేవారు ముందుగా వైజాగ్ లోని ద్వారకా బస్సు స్టాండ్ చేరుకోవాలి. అక్కడి నుండి తెలుగువెలుగు బస్సులు, ఎక్స్ ప్రెస్ బస్సులు ఎక్కి సరిగ్గా 30 కి. మీ ల దూరంలో దేవిపురం చేరుకోవచ్చు.

ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

సొంతవాహనాల్లో వచ్చే వారు వైజాగ్ సమీపంలోని సబ్బవరం నుంచి 6 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే దేవిపురం వెళ్ళవచ్చు. ఇది సబ్బవరం - అనకాపల్లి సరిహద్దు లో ఉన్నది. నర్సీపట్నం - ఆనందపురం బైపాస్ రోడ్డు ద్వారా కూడా దేవిపురం చేరుకోవచ్చు.

ఆలయ నిర్మాణం

ఆలయ నిర్మాణం

దేవిపురం యొక్క ప్రధాన ఆకర్షణ సహ్రక్షి మేరు ఆలయం. ఆలయాన్ని 3 ఎకరాల విస్తీర్ణంలో, 3 అంతస్తుల్లో నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వరి ఆలయమో తో పాటు, 108 దేవతామూర్తుల ప్రతిమలను ఏర్పాటు చేసారు. ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న కొండలపై కామాఖ్య పీఠం , శివాలయం లు ఉన్నాయి.

దేవాలయ ఖ్యాతి

దేవాలయ ఖ్యాతి

అమ్మవారు గర్భాగుడి లో నిండైన వస్త్రధారణలంకరణ లో, బిందు స్థానంలో సృష్టికార్యంలో ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ అభిషేకాలను నేరుగా భక్తులే పంచామృతాలను (నీరు, పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు) ఉపయోగించి జరుపుతారు.

ఇగ్లూని తలపించే ఇళ్ళులు

ఇగ్లూని తలపించే ఇళ్ళులు

పీఠం లోని శివలింగాల సమూహం, దక్షిణ వాటిలో ద్వి సహస్ర లింగాల ఏర్పాటు, ఇగ్లూని తలపించే ఇళ్ళులు ఇక్కడి మరిన్ని ఆకర్షణలు. అమ్మవారి రథం, అమృతానంద స్వామి విగ్రహ ప్రతిష్ట చెప్పుకోదగ్గవి గా ఉన్నాయి.