Search
  • Follow NativePlanet
Share
» »భక్తుల పాపాలను హరించే శ్రీకాకుళేశ్వరస్వామిగా శ్రీమహావిష్ణువు కొలువుదీరిన క్షేత్రం

భక్తుల పాపాలను హరించే శ్రీకాకుళేశ్వరస్వామిగా శ్రీమహావిష్ణువు కొలువుదీరిన క్షేత్రం

శ్రీకాకుళేశ్వరస్వామిగా శ్రీమహావిష్ణువు కొలువుదీరిన క్షేత్రం

శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం చాలా చరిత్ర గలది. ఈ ఆలయం కృష్ణాజిల్లాలోని ఘంటసాల మండలంలో శ్రీకాకుల గ్రామంలో కృష్ణా నదీ తీరంలో ఉంది. ఈ ఆలయం ప్రసిద్ది చెందిన 108 పుణ్యక్షేత్రాలతో ఇది 57వదిగా చెబుతారు. ఈ దేవాలయంలో స్వామి వారు స్వయంభువుగా వెలిసారు. ఈ ఆలయం బ్రహ్మదేవుని ప్రయత్నం మేరకు ఏర్పడినదని ఒక కథనం కూడా ఉంది.

ఈఆలయంలో ప్రధానంగా శ్రీమహావిష్ణువు కొలువుదీరి ఉన్నాడు. ఈ స్వామి ఆంధ్ర వల్లభుడు, ఆంధ్రనాయకుడు, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఇంకా మరెన్నో పేర్లతో భక్తుల పూజలు స్వీకరిస్తున్నాడు. కృష్ణాజిల్లాలోని ఈ ఆలయ క్షేత్రానికి చారిత్రకంగానూ, పౌరాణికంగానూ ఎంతో ప్రాధాన్యత ఉంది. కలియుగంలో పాపభారం తగ్గించేందుకు ఈ స్వామి ఆవిర్భవించాడని భక్తుల ఎక్కువగా విశ్వసిస్తారు.

Photo Courtesy: wikimedia.org

శ్రీకాకుళేశ్వరస్వామి...

శ్రీకాకుళేశ్వరస్వామి...

శ్రీకాకుళేశ్వరస్వామి... కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో కొలువై ఉన్నాడు. ప్రసిద్ధి చెందిన 108 పుణ్యక్షేత్రాల్లో ఇది 57వదిగా చెబుతారు. శ్రీకాకుళంలో స్వామివారు స్వయంభువుగా వెలసి పాపాలను హరిస్తున్నాడని భక్తుల నమ్మిక. ఈ శ్రీకాకుళ క్షేత్రం సాక్షాత్తూ బ్రహ్మదేవుని ప్రయత్నం మేరకే ఉద్భవించిందని ఒక పురాణ కథనం.

కలియుగంలో రోజురోజుకీ పాపాలు పెరిగిపోతున్నాయని

కలియుగంలో రోజురోజుకీ పాపాలు పెరిగిపోతున్నాయని

కలియుగంలో రోజురోజుకీ పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలంతా వ్యాకులత చెందారట. వాళ్లంతా చతుర్ముఖ బ్రహ్మతో సహా భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మహా విష్ణువు కోసం తపస్సు ప్రారంభించారు. ఆ తపస్సుకి మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షం కాగా... ‘భూలోకంలో ఈ ప్రాంతంలోనే మీరు కొలువై ఉండి భక్తుల పాపాలను హరించాలని'వారు కోరారట.

అందుకు నారాయణుడు సమ్మతించడంతో

అందుకు నారాయణుడు సమ్మతించడంతో

అందుకు నారాయణుడు సమ్మతించడంతో చతుర్ముఖ బ్రహ్మే స్వయంగా శ్రీమహావిష్ణువును అక్కడ ప్రతిష్ఠించాడట. బ్రహ్మకు ఆకులమైనందుకు కాకుళమని పేరు వచ్చిందనీ శ్రీహరి ఆచోటనే ప్రతిష్ఠితుడైనందుకు కాకుళేశ్వరుడిగా కీర్తినొందాడని పురాణ కథనం.

ఉపనిశత్తుల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేవ్వరులకు

ఉపనిశత్తుల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేవ్వరులకు

ఉపనిశత్తుల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేవ్వరులకు వరుసగా ఆంధ్ర, సంస్కృత, ప్రాకృత భాషలు అత్యంత ప్రియమైనవి. ఆంధ్రభాషపై ప్రీతిగల మహావిష్ణువే శ్రీకాకుళంలో కొలువుదీరాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రాచీనకాలంలో ఇక్కడికి సమీపంలోనున్న నదీమార్గాన వ్యాపారాలు జరుగుతుండేవి.

దారిన పోయే నావికులు ఈ ప్రాంతానికి వచ్చి

దారిన పోయే నావికులు ఈ ప్రాంతానికి వచ్చి

దారిన పోయే నావికులు ఈ ప్రాంతానికి వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్లేవారట. వాళ్లంతా ఈ ప్రాంతాన్ని సిరికొలను, సిరికికొలను అని పిలిచేవారట. అదే కాలక్రమేణా శ్రీకాకుళంగా మారిందని చెబుతారు.

 క్రీ.పూ. నాలుగో శతాబ్దంలోనే

క్రీ.పూ. నాలుగో శతాబ్దంలోనే

క్రీ.పూ. నాలుగో శతాబ్దంలోనే ఇక్కడ స్వామికి ఆలయం ఉండేదట. ఆపై ఇక్కడి స్వామి అదృశ్యమైపోయాడట. దాదాపు వెయ్యేళ్లపాటు ఎవ్వరికీ కనిపించలేదట. ఆ తర్వాత కొన్నాళ్లకి ఒరిస్సా పాలకుడైన అంగపాలుడి ప్రధానమంత్రి నరసింహవర్మ ఒకసారి కాంచీపురానికి బయలుదేరాడు.

 మార్గంమధ్యలో

మార్గంమధ్యలో

మార్గంమధ్యలో కృష్ణాతీరానున్న శ్రీకాకుళానికి వచ్చాడు. ఈ క్షేత్ర మహిమ తెలుసుకుని అదృశ్యమైన విగ్రహం ఎక్కడుందో కనిపెట్టి పునఃప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకున్నాడట.

దానికోసం ఎన్నో గ్రామాలు వెతికినా

దానికోసం ఎన్నో గ్రామాలు వెతికినా

దానికోసం ఎన్నో గ్రామాలు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడట. ఒక రోజు రాత్రి స్వామి ఆయన కలలో కనిపించి వేమ శర్మ అనే బ్రహ్మణుడి ఇంటి ఆవరణలోనే ఉన్నట్లు చెప్పాడు. వెంటనే నరసింహవర్మ ఆ ప్రాంతానికి వెళ్లి తవ్వకాలు జరపగా విగ్రహం బయటపడింది. దాన్ని శ్రీకాకుళానికి తీసుకొచ్చి పున: ప్రతిష్టించినట్లు చెబుతారు.

ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న

ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న

ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసి స్వామిని దర్శిస్తే పాపపరిహారమౌతుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీకాకుళేశ్వర స్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందనీ చెబుతారు.

 ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో

ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో

ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో బ్రహోత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో చుట్టు పక్కల జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. వైకుంఠ ఏకాదశినాడు స్వామి వారు ఉత్తర ద్వారం నుండి దర్శనం ఇస్తారు.

ఈ ఆలయానికి మరో ప్రత్యేతక

ఈ ఆలయానికి మరో ప్రత్యేతక

ఈ ఆలయానికి మరో ప్రత్యేతక ఏంటంటే శ్రీకాకుళాంథ్రదేవుని గుడిని చూసి కలత చెందిన కాసుల పురుషోత్తమ కవి అనన్య భక్తిభావంతో నిందాస్తుతి అలంకారంలో రాసిన శతకమిది. ఒకవైపు స్వామిని కీర్తిస్తూనే, నీగుడినే రక్షించుకోలేని వాడివంటూ ఆర్థ్రతతో నిందిస్తాడు. తెలుగు శతకాలన్నింటిలోకి ఈ శతకం ఒక అనర్ఘరత్నం.

 తెలుగు భాషలో భక్తి శతకాలు

తెలుగు భాషలో భక్తి శతకాలు

తెలుగు భాషలో భక్తి శతకాలు, నీతి శతకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వ్యాజస్తుతి శతకాలు అరుదు. నిందలో స్తుతిని, స్తుతిలో నిందను నిబంధించి భక్తి తత్త్వాన్ని ప్రబోధించిన శతకరాజమిది. కాసులకవి నవ్వమైన భవ్వమౌన వినుత్న పదాలతో ఎన్నెన్నో భావతరంగాలను వెలార్చే 108 సీస పద్యాలతో ఈ శతకాన్ని ఆంధ్రులకు ఉపాయనంగా అందించి ధన్యుడయ్యాడు.

Photo Courtesy:wikimedia.org

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X