Search
  • Follow NativePlanet
Share
» »శ్రీరాముడు తన తండ్రికి పితృ కార్యం నిర్వహించిన దేవాలయ రహస్యం..

శ్రీరాముడు తన తండ్రికి పితృ కార్యం నిర్వహించిన దేవాలయ రహస్యం..

పితృదోషమనేది ఈతిబాధలను కలిగింపజేస్తాయి. ఇంట్లో వున్నవారికి ఆర్థిక ఇబ్బందులు, యాక్సిడెంట్లు జరగడం, అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం, పిల్లల్లో అప్రవర్తన, దుర్గుణం, మానసిక వ్యాధులు, వివాహాల్లో జాప్యం, విడాకులు, సంతానలేమి, కెరీర్‌లో ఉన్నత స్థితికి చేరుకోకపోవడం, అనుకున్న కార్యాలు జరగకపోవడం వంటి కారణాలు పితృదోషానికి సంబంధించినవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇలాంటి కారణాలతో మీరూ ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లైతే వెంటనే పితృదోష నివారణ చేయించండి. పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వడం మంచిది.

ఎవరైతే పిత్రుదోషాలతో బాధపడుతున్నారో వారు దర్శించి పితృదోషాలను పోగొట్టుకోవలసిన ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం యొక్క పేరు తిలతర్పణపురి అనే గ్రామంలో వున్న స్వర్నవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయం. ఈ ఆలయంలో సాక్షాత్తూ రాములవారు తన తండ్రి అయిన దశరథుడికి పితృకార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు.

తిలతర్పణపురి

తిలతర్పణపురి

తమిళనాడులో "తిలతర్పణపురి" అనే గ్రామంలో ‘స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారార్' ఆలయంను పితృదోషంతో బాధపడుతున్నవారు దర్శిస్తే.. దోషాన్ని పోగొట్టుకోవచ్చుఅట. ఈ ఆలయంలో స్వయంగా శ్రీరామ చంద్రుడు తన తండ్రి దశరథుడికి పితృకార్యక్రమాలు నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

PC:youtube

రాముడు.. శివుడిని ప్రార్ధించగా..

రాముడు.. శివుడిని ప్రార్ధించగా..

తన తండ్రికి ఎన్నో చోట్ల పిండప్రధానం చేసినా ముక్తి లభించకపోవడంతో... రాముడు.. శివుడిని ప్రార్ధించగా.. శివుడు ప్రత్యక్షమై.. ఈ ఊరులో ఉన్న కొలనులో స్నానం చేసి.. దశరథుడికి పితృతర్పణం వదిలి పెట్టమని చెప్పిన స్థలం.

PC:youtube

ఎక్కడైతే రాముడు తిలలు వదిలాడో ఆ ఊరు

ఎక్కడైతే రాముడు తిలలు వదిలాడో ఆ ఊరు

అందుకనే అప్పటి నుంచి ఆ ఊరుని తిలతర్పణపురి అని అంటారు. తిలలు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థలం ఎక్కడైతే రాముడు తిలలు వదిలాడో ఆ ఊరు తిలతర్పణపురిగా ప్రసిద్ధి పొందింది.

PC:youtube

దోషం నుంచి విముక్తి

దోషం నుంచి విముక్తి

రాముల వారు తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలో వారు లింగాల రూపంలో మారడం జరిగింది. అందుకనే ఎవరైతే పెద్దలకు పితృతర్పణం నిర్వహించలేక బాధలు ఇబ్బందులు పడుతుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణలు వదలడం తో దోషం నుంచి విముక్తి లభిస్తుంది అట.

PC:youtube

త్రివేణి సంగమం

త్రివేణి సంగమం

భారతదేశంలో ముఖ్యమైన ఏడు స్థలాలుగా చెప్పబడే కాశీ, రామేశ్వరం, శ్రీవాణ్యం, తిరువెంకాడు, గయ, త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా ఈ ఆలయం చెప్పబడుతోంది.

PC:youtube

దోషాల నుంచి విముక్తి..

దోషాల నుంచి విముక్తి..

అందువలన ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతూవుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందగలరు.

PC:youtube

ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉన్నది

ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉన్నది

అది ఏమిటంటే.. నరముఖంతో ఉన్న గణపతి ఉన్నారు. గణపతి తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో వుంటారు. ఇటువంటి గణపతి ఆలయం చాలా అరుదుగా ఉంటుంది.

PC:youtube

నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతి గా

నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతి గా

అందుకనే ఈ ఆలయం నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతి గా ప్రసిద్ధిపొందింది. తమిళనాడులోని తిరునాల్లార్శని భగవానుని ఆలయంకు 25 కి.మీ దూరంలో, కూతనూరు సరస్వతీ ఆలయం కు 3 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.

PC:youtube

ఆలయం ఎలా చేరుకోవాలి

ఆలయం ఎలా చేరుకోవాలి

ఈ ఆలయం కూతనూరు సరస్వతీ ఆలయానికి 3 కి. మీల దూరంలోను, తమిళనాడులోని తిరునల్లార్ శనిభగవానుని ఆలయానికి 25కి.మీ ల దూరంలోను కలదు.
PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X