Search
  • Follow NativePlanet
Share
» »ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

By Venkatakarunasri

నెల్లూరు నగరం ఆంధ్రప్రదేశ్ లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. రాష్ట్రం లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలోఒకటి. ఈ పట్టణం పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాకు రాజధాని కూడాను. అది వరలో ఈ జిల్లాను నెల్లూరు జిల్లా అని మాత్రమే పిలిచేవారు. ఈ పట్టణం వివిధ ప్రసిద్ధ దేవాలయాలు మరియు వ్యవసాయ పరంగా ఒక ప్రసిద్ధ కేంద్రంగా కూడా వుంది. నెల్లూరు నగరం పెన్నా నది ఒడ్డున కలదు. ఈ ప్రాంతం లో ఎన్నో రకాల పంటలు పండుతాయి. ఈ నగరం విజయవాడ, తమిళనాడు రాజధాని అయిన చెన్నై ల రహదారి లో వుండటం వలన వ్యాపారం, వాణిజ్యంలకు సంబంధించి ఎంతో ప్రధానమైనది. నగరంలో మౌలిక వసతులు కూడా అభివృద్ధి చెందటం చేత, ఇది ఒక మంచి నగరంగా తయారు అవుతోంది.

ఉసిరి చెట్టు మూలంగా అక్కడ ఆలయం ఎందుకు వెలసింది?పరమేశ్వరుడు కొలువైవున్న ఈ ఆలయాన్ని శ్రీ మూలస్థానేశ్వరస్వామి ఆలయం అంటారు.మరి ఇక్కడ శివలింగం ఉసిరి చెట్టుమూలం ఎందుకు వెలసింది?ఈ ఆలయం ఎక్కడుంది? అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

నెల్లూరుని అనేక రాజ వంశాలు పాలించాయి. అన్నిటికంటే మొదటిది, మౌర్య వంశ పాలన. క్రీ. పూ. ౩ వ శతాబ్దం లో ఇది అశోకుడి సామ్రాజ్యంలో భాగంగా వుండేది. కాలక్రమేణా, ఇది పల్లవులు, తెలుగు చోళులు, శాతవాహనులు ఇంకా ఇతర రాజ వంశాలచే పాలించబడింది. ఈ రాజ వంశాల సంస్కృతి అంతా ఇక్కడి దేవాలయాలు ఇతర ప్రాచీన కట్టడాల శిల్ప శైలి లో కనపడుతుంది. వర్తక, వాణిజ్యాలకు, వ్యవసాయానికి కేంద్రం అవటం మాత్రమే కాక, ఈ నగరం బ్రిటిష్ కాలం నాటి అనేక ప్రాచీన దేవాలయాలు, ఇతర కట్టడాలు కూడా కలిగి వుంది.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఈ నగరం ఎలా ఏర్పడింది?

నెల్లూరు పట్టణం బ్రిటిష్ పాలనలో చాల ప్రశాంతంగా వుండేది. ఆనాటి స్వాతంత్ర పోరాట ఉద్యమాల నుండి దూరంగా ఉండేది. ఇండియా కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ప్రధాన రాజకీయ కేంద్రంగా మారింది. అక్టోబర్ 1 వ తేది, 1953 వరకు ఇది మద్రాస్ రాష్ట్రం లో భాగంగా వుండేది. దీనిని 1 నవంబర్, 1956 నాడు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చేర్చారు.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

రాష్ట్రావతరణలో ఈ ప్రదేశం విశేషమైన పాత్ర పోషించింది. తెలుగు వాడు, ప్రఖ్యాత దేశభక్తుడు పొట్టి శ్రీరాములు చేసిన ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. కనుకనే ఈ జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లా అని నామకరణం చేసారు .

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

పట్టణం లోని ప్రధాన ఆకర్షణలు

నగరంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయం ప్రధాన ఆకర్షణ. నగర సరిహద్దుల్లోనే కల ఈ దేవాలయం సుమారు 600 ఏళ్ల నాటిది. ఈ దేవాలయ గోపురం సుమారు 70 అడుగుల ఎత్తులో వుంది. దీనిని గాలి గోపురం అంటారు. గాలిగోపురం పై భాగంలో ఏడు బంగారు తాపడం కలశాలు వుంటాయి. ఇవి ఈ దేవాలయ ఐశ్వర్యాన్ని చాటి చెపుతాయి.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

నెల్లూరు లో ఇతర విహార ప్రదేశాలు అంటే మైపాడు బీచ్, పులికాట్ లేక్ కలవు. ఇది వివిధ పక్షి జాతులు కల నేలపట్టు బర్డ్ సాన్క్చురి కి సమీపం. ఈ నగరంలో పురాతన దేవాలయాలు అనేకం కలవు. నగరం మధ్య నుండి సుమారు 13 కి. మీ. ల దూరంలో నరసింహస్వామి టెంపుల్ కలదు.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

నెల్లూరుకి సమీపం లోని సోమశిల ఒక పిక్నిక్ ప్రదేశం. ఎంతో ప్రశాంతంగా వుంటుంది. చుట్టుపక్కల అడవులు మాయం అవుతూండటంతో నా నాటికి నగర వాతావరణం వేడి అధికమై పోతోంది. మే నెలలో సుమారు 41 డిగ్రీలు గరిష్టంగా వుంటుంది.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఏప్రిల్, మే నెలలలో వేడి గాలులు వీస్తాయి. నెల్లూరు సందర్శనకు చలికాలం అనువైనది. ఈ ప్రదేశం చెన్నైకి సమీపం గా సుమారు 200 కి. మీ.ల దూరంలో కలదు. నెల్లూరుకు హైదరాబాద్ నగరం సుమారు 450 కి. మీ. ల దూరంలో కలదు.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

నెల్లూరుజిల్లా జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణ మందు శ్రీ మూలస్థానేశ్వర ఆలయం కలదు.ఇది చాలా ప్రాచీనమైన ఆలయం.దీనిని ఆంధ్రరెడ్డిపాలకుడైన ముక్కంటి రెడ్డిరాజుగారు కట్టించెరని ఒక కధద్వారా తెలియుచున్నది.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

స్థల పురాణం విషయానికొస్తే ఆ రాజుకి ఒక నాడు కలలో పరమశివుడు కనిపించి రాజా!నేను ఈ ప్రాంతమున వున్న ఉసిరిక చెట్టుమూలమున వెలసివున్నాను. నేను ఇప్పుడు భక్తకోటిని రక్షించుటకు రాదలచాను. కనుక అచట నాకొక ఆలయమును కట్టించు అని ఆజ్ఞాపించాడట.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

మరుసటి రోజు ఉదయమే ఆ రాజు ఉసిరిచెట్టు దగ్గరకు వెళ్లి పరిశీలించిచూడగా అచట లింగాకృతిలో వృక్షమూలమున పరమేశ్వరుడు కనపడగానే ఆనందంతో ఆ రాజు వెంటనే ఆలయాన్ని కట్టించి అందులో ఆ శివలింగమును ప్రతిష్టింపచేసి భక్తిప్రపత్తులతో ఆరాధించారు.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఈ ఆలయంలోని శివలింగం ఉసిరిచెట్టు మూలమున వెలసింది. ఉసిరిచెట్టును తమిళమున నెల్లి అని అందురు. ఆనాడు తమిళభాషా ప్రభావం ఎక్కువగా వున్నందున ఆ ప్రదేశంలో ఉసిరిచెట్టు నెల్లి అని పిలిచేవారు.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఆ నెల్లిపేరు మీదుగానే అచ్చట వెలసిన గ్రామం నెల్లూరుగా ప్రఖ్యాతిగాంచిందని ప్రతీతి.ఈ మూలస్థానేశ్వరఆలయం సుమారు 1400 ల సంవత్సరముల క్రితం వెలసిందని పురాణాలు చెపుతున్నాయి.తిక్కన సోమయాజులు గారు ఈ క్షేత్రాన్ని దర్శించినతరువాతనే మహా భారతాన్ని తెలుగులో రచించారని ప్రతీతి.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఈ ఆలయం నెల్లూరు పట్టణంలో వెలసిన ప్రాచీనఆలయాలలో మొదటి ఆలయమని స్థానికులు చెప్తారు.ఇచ్చట నిత్యం అర్చనలు ప్రత్యేక పూజలు కాకుండా పండుగలు,పర్వ దినాలలో

విశేషపూజలు,వుత్సవాలు జరుగును. ప్రతీ సంవత్సరం మహాశివరాత్రిన ఉత్సవాలు ఈ ఆలయంలో అతి వైభవంగా జరుగుతాయి.ఈ వుత్సవాలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొంటారు.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

చుట్టు పక్కల ప్రదేశాలు

పులికాట్ లేక్, నెల్లూరు

నెల్లూరు సమీపంలో ప్రసిద్ధి చెందినా పులికాట్ సరస్సు సుమారు 350 కి. మీ. ల విస్తీర్ణం లో వ్యాపించి ఉంది. అరుదైన వలస పక్షి జాతులకు నిలయంగా వుంటుంది. ఒరిస్సా లోని చిలకా లేక్ తర్వాత ఇది రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు. ఈ ప్రదేశం శ్రీ హరి కోట ద్వీపం అనే పేరుతో బంగాళాఖాతం నుండి వేరుపడినది. పులికాట్ సరస్సు పర్యాటకులకు చక్కటి పిక్నిక్ ప్రదేశం.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఈ ప్రదేశం పక్షి సందర్శకులకు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. సంవత్సరంలో చాలా భాగం పక్షి సందర్శకులు ఇక్కడకు వస్తారు. లేక్ లో బోటు విహారం కూడా చేయవచ్చు. ఇక్కడి మత్స్య కారుల వద్దనుండి రూ.500 కు ఒక బోటు అద్దెకు తీసుకొని, సరస్సు అంతా చుట్టి రావచ్చు. ఇక్కడ వాటర్ ఫౌల్, పెలికన్లు, హేరన్లు, ఫ్లమింగోలు వంటి పక్షులు తరచుగా కనపడతాయి.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

పాటూరు, నెల్లూరు

పాటూరు అనేది ఒక గ్రామం పేరు. ఇక్కడ హ్యాండ్ లూం చీరలు, ఇతర చేతి పనుల వస్తువులు తయారవుతాయి. ఈ గ్రామం కోవూరు, దామరమడుగు ల మధ్య కలదు. పాతూరు ప్రసిద్ధ తెలుగు కవి తిక్కన్న సోమయాజి జన్మస్థలం. ఆయన ఇక్కడ అనేక ఏళ్ళు జీవించి మరణించాడు.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

పాటూరు కోవూరు నుండి 4 కి. మీ. ల దూరం వుంటుంది. దూరం నెల్లూరు నుండి 10 కి. మీ. లు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సుమారు 354 కి. మీ. లు. దూరంలో వుంటుంది. ఆకర్షణీయంగా వుండే ఈ చిన్న గ్రామాన్ని నెల్లూరు వచ్చే పర్యాటకులు తప్పక చూసి ఆనందిస్తారు.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

మైపాడ్ బీచ్, నెల్లూరు

మైపాడు బీచ్ నెల్లూరుకు 22 కి. మీ. ల దూరంలో కలదు. రోడ్డు మార్గం అనుకూలమే. నెల్లూరు నుండి తేలికగా ప్రయాణించవచ్చు. బీచ్ ప్రాంతం పొడవుగా వుండి అనేక రిసార్ట్ లు మరియు హోటళ్ళు వుంటాయి. బీచ్ ప్రశాంతంగా వుండి సాయంకాలం 6 గం. వరకు తెరచి వుంటుంది. బీచ్ లో సూర్యాస్తమయం చాలా బాగుంటుంది. నెల్లూరు నుండి మైపాడుకు బస్సులు తరచుగా నడుస్తాయి. బీచ్ ప్రాంతం ఎంతో అందంగా వుండి, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

నేలపట్టు బర్డ్ సంక్చురి, నెల్లూరు

నేలపట్టు బర్డ్ సంక్చురి పులికాట్ సరస్సు కు 20 కి. మీ.ల దూరంలో నెల్లూరు జిల్లాలో తూర్పు కోస్తా ప్రాంతంలో కలదు. దీనికి చెన్నై మరియు, నెల్లూరుల నుండి చేరవచ్చు. ఇక్కడకు చెన్నై 50 కి. మీ.ల దూరం మాత్రమె వుంటుంది. ఈ శాంక్చురి ఎన్నో రకాల అరుదైన పక్షులకు జన్మస్థలంగా కలదు.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

లిటిల్ కర్మోరంట్, పెయింటెడ్ స్తోర్క్, వైట్ ఇబిస్, స్పాటే డ్ బిల్లెద్ పెలికన్ వంటివి చూడవచ్చు. ఈ సంక్చురిని చూచేందుకు అక్టోబర్ మరియు మార్చ్ నెలలు అనుకూలం. ఈ సమయాలలో చాలా జాతుల పక్షులు వచ్చి నివాసాలు ఏర్పరచుకుంటాయి.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

అద్దాల మంటపం, నెల్లూరు

అద్దాల మంటపం రంగనాథ స్వామి టెంపుల్ లోపల కలదు. ఇది చాల ప్రసిద్ధి చెందినది. చక్కటి పనితనం తో నిర్మించారు. భక్తులకు ఈ మిర్రర్ హాల్ ఆసక్తి కరంగా వుంటుంది. పని వారి అద్దాల పని నైపున్యతకు ఆశ్చర్య పడవలసిందే. అనేక అద్దాలలో భక్తులు ప్రధాన దైవం అయిన శ్రీ రంగనాధుని చూసి పూజించి ఆనందిస్తారు.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

నెల్లూరు సందర్శన

నెల్లూరు సందర్శనకు శీతాకాలం అనువైనది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు తక్కువగా వుండి పర్యాటకులు తేలికగా సంచరించేలా వుంటుంది. పర్యటనకు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలలు సూచించ దగినది.

PC:youtube

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం

నెల్లూరు నగరం తమిళ నాడు రాజధాని అయిన చెన్నై నుండి నాలుగు రోడ్ల మార్గంలో కలుపబడింది. సుమారు రెండున్నర గంటల రోడ్డు ప్రయాణం మాత్రమే. కారులు, బసు లు తరచుగా తిరుగుతూంటాయి. హైదరాబాద్ లేదా వివిధ ఇతర ప్రదేశాల నుండి కూడా బస్సు లు తరచుగా లభ్యంగా వుంటాయి.

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

రైలు ప్రయాణం

నెల్లూరు కు స్వంత రైలు స్టేషన్ కలదు. ఈ రైలు స్టేషన్ కు ప్రతి రోజూ దేశం లోని వివిధ ప్రాంతాలనుండి రైళ్ళు వస్తాయి. చెన్నై నుండి, నెల్లూరు కు ట్రైన్ లో మూడు గంటల సమయం మాత్రమే పడుతుంది. హైదరాబాద్ నుండి సుమారు 10 గంటల ప్రయాణం లో నెల్లూరు చేరవచ్చు.

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

ఉసిరి చెట్టు మూలంలో వెలసిన శివలింగం గురించి మీకు తెలుసా?

విమాన ప్రయాణం

నెల్లూరుకు చెన్నై లోని అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 177 కి. మీ. ల దూరం లో కలదు. విమానాశ్రయం నుండి నెల్లూరు కు టాక్సీ ల లో తేలికగా చేరవచ్చు. తిరుపతి లోని విమానాశ్రయం సుమారు 130 కి. మీ. ఐ. కలదు. ఈ విమానాశ్రయం నుండి, హైదరాబాద్, విశాఖపట్నం మరియు ఇతర నగరాలకు విమానాలు కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more