Search
  • Follow NativePlanet
Share
» »ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారి రూపం పరమశివుడి యొక్క భార్య పార్వతీదేవి.అయితే పార్వతీదేవికి దేశంలో ఎన్నో ఆలయాలు అనేవి వున్నాయి. అందులో ఈ ఆలయం చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు.

By Venkatakarunasri

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారి రూపం పరమశివుడి యొక్క భార్య పార్వతీదేవి.అయితే పార్వతీదేవికి దేశంలో ఎన్నో ఆలయాలు అనేవి వున్నాయి.అందులో ఈ ఆలయం చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఆలయంలో అమ్మవారు ఒక్కొసమయంలో ఒక్కోరూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు.మరి ఈ ఆలయం ఎక్కడుంది? అమ్మవారి రూపం అలా మారటానికి కారణంఏమిటి?అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఎక్కడుంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంజిల్లా సాల్లూరు ప్రాంతంలో శ్రీ పారమ్మకొండ క్షేత్రం వుంది. ఒక ఎత్తైనకొండ మీద ఈ ఆలయం వెలసింది. ఈ కొండదిగువనుండి అమ్మవారి ఆలయాన్ని చేరుకోటానికి సుమారు 2800ల మెట్లుంటాయి. ఇక్కడి కొండకి విశేషంఏంటంటే ఈ శిఖరం శివలింగఆకారంలో వుంటుంది.

PC:youtube

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఇంకా ఈ ఆలయంలో అమ్మవారివిగ్రహంపై శివుడు ధ్యానం చేస్తూ కనిపిస్తాడు. అయితే ప్రపంచంమొత్తంలో శివ పార్వతులు ధ్యానంలో వుండే ఇటువంటి విగ్రహం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. జైనులకాలంలో అమ్మవారిని ప్రతిష్టించినట్లు చెబుతారు. అయితే పూర్వము దేవతలు ఇక్కడ నిత్యం ధ్యానం చేసేవారట.

PC:youtube

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

మహిమలగల అమ్మవారి విగ్రహం, 36చేతులు, శిరస్సుపై శివుడు కలిగి ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనది.జైనులకు సంబంధించిన పురాతనగ్రంథాలలో కూడా మన అమ్మవారి చరిత్రవుంది. అమ్మవారి రూపం ఒక్కోసమయంలో ఒక్కోలా వుంటుంది.

PC:youtube

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఒక్కసారి నవ్వుతూ, ఒక్కసారి చిన్నపిల్లలా, ఒక్కసారి మౌనంగా,ఒకసారి పెద్దమ్మలా, ఇలా చాలా రకాలుగా అమ్మవారి విగ్రహం మారుతూ మనకు కనిపిస్తుంది. కొన్ని విశిష్టమైన రోజులలో మరియు అమావాస్యరోజులలో కొండపై వెలుగులతో కూడిన జ్యోతులుకనిపిస్తాయి అని ప్రత్యక్షంగా చూసిన కొండక్రింది గ్రామాలలో నివసించే గిరిజనులు చెప్తారు.

PC:youtube

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఇందుకు నిదర్శనంగా ఇప్పుడుకూడా అమ్మవారి దేవతలు, శక్తులు, జ్యోతిరూపంలో దర్శించి పూజిస్తారని ఇక్కడ ప్రజలనమ్మకం. ఇక్కడ కొండమధ్యలో ఒక గుహవుంది.అయితే పాండవులు వనవాససమయంలో కొద్దిరోజులు ఇక్కడే వున్నారట.అందుకే ఈ గుహకు పాండవులగుహ అని పేరు.

PC:youtube

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఆ గుహలో చాలాపురాతన శివలింగం ఒకటి వుంది. కొండపై హనుమంతుడు అనే కోతిజాతి గుంపు ఒకటి వుంటుంది.ఇది 3నుండి 5అడుగులఎత్తు వుంటుంది. ఈ మహిమగల కొండపై ధ్యానం చేసేవారికి త్వరగా సిద్ధులు వస్తాయి అనినమ్మకం.

PC:youtube

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

సిద్ధులు ప్రసాదిస్తుందిగనుక తల్లిని సిద్దేశ్వరీఅని చేతులకు చక్రాలు వున్నాయిగనుక, చక్రీశ్వరి అని పార్వతీదేవి గనుక పారమ్మతల్లి అని వనదుర్గ అని అమ్మవారిపేర్లు రకరకాలుగా పిలుస్తారు.కానీ స్థానికులు మాత్రం పారమ్మతల్లిగానే కొలుస్తారు.

PC:youtube

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో కనిపించే అమ్మవారు

గతకొన్ని సంలుగా ప్రతీ పౌర్ణమిరోజు క్రమం తప్పకుండా అమ్మను సనాతనధర్మ పరిషత్ భక్తులు దర్శించి పూజలుచేస్తున్నారు.మిగతా రోజుల్లో ఈ కొండకి ఎక్కడం చాలాకష్టం. ఒక వేళ కొండ ఎక్కి అమ్మవారిని దర్శించాలిఅంటే స్థానిక గిరిజనుల సహాయం తీసుకోవలసిందేఅని చెప్తున్నారు.ఈ విధంగా కొండప్రాంతంలో ఎన్నో విశేషాలనడుమన వెలసిన ఈ శ్రీపారమ్మకొండ క్షేత్రం గిరిజనులఆరాధ్యదైవంగా విరాజిల్లుతుంది.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X