Search
  • Follow NativePlanet
Share
» »వివాహ సమస్యల నుంచి దూరం చేసే అఘోర మూర్తి ఇక్కడే...

వివాహ సమస్యల నుంచి దూరం చేసే అఘోర మూర్తి ఇక్కడే...

శ్వేతరాయనేశ్వర దేవాలయానికి సంబంధించిన కథనం

వివాహం జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. సరైన వయస్సులో పిల్లలకు వివాహం కాకపోతే వారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఈ సమస్య నుంచి గట్టెక్కించమని కనిపించిన దేవుడిని వారు వేడుకొంటూ ఉంటారు. అయినా కూడా వారి సమస్య పరిష్కారమవుతుందని చెప్పలేము. అయితే భారత దేశంలో అఘోర మూర్తి రూపంలో ఆ పరమేశ్వరుడిని సందర్శిస్తే మాత్రం తప్పక సమస్య పరిష్కారమవుతుందని చెబుతారు. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం...

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

ఈ దేవాలయంలో ఆ పరమశివుడు శ్వేతరాయనేశ్వరుడిగా పూజలు అందుకొంటున్నారు. అంతేకాకుండా నవగ్రహాల్లో ఒకరైన బుధుడు కూడా ఈ దేవాలయంలో పూజలు అందుకోవడం విశేషంగా చెప్పవచ్చు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఈ రహస్యాలన్నీ మీకు తెలుసా?శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఈ రహస్యాలన్నీ మీకు తెలుసా?

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
సాధారణంగా నవగ్రహాలకు అన్నింటికీ కలిపి ఒకే చోట దేవాలయం ఉంటుంది. అయితే కేవలం కొన్ని స్థలాల్లో మాత్రమే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవాలయం ఉంటుంది.

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
అందులో ఈ శ్వేతేశ్వర దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం అత్యంత విశాలమైనది. ఈ దేవాలయ దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
ముఖ్యంగా వివాహం కాకుండా బాధపడుతున్న యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు వీరిలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇక్కడ ఉన్న శ్వేతరాయుడిని అఘెరమూర్తి అని కూడా పిలుస్తారు.

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
కావేరి నది ఒడ్డున ఉన్న ఆరు శైవ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా భారత దేశంలో కాశీ క్షేత్రంలో సమానమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ శివుడు ఉగ్రరూపంలో ఉంటారని ప్రతీతి.

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
సాధారణంగా వివాహం విళంబం కావడానికి కొన్ని దుష్టశక్తులే కారణమని భావిస్తారు. భూత, ప్రేతలకు అధినాయకుడైన ఆ పరమశివుడి ఆశీర్వాదం ఉంటే ఆ భూత, ప్రేతాల ప్రభావం తొలిగిపోతుందని హిందువులు భావిస్తారు.

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
అందువల్లే వివాహ సమస్యలతో బాధపడే వారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారని స్థానిక పూజారులు చెబుతుంటారు. ఈ దేవాలయంలో 3 తీర్థాలు, ముగ్గరు దేవతామూర్తులకు ఉపాలయాలు ఉన్నాయి.

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
పురాణ కథనాన్ని అనుసరించి ఇక్కడ మారుతువాసురన్ అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మగురించి ఘెర తపస్సు చేసి మిక్కిలి బలాన్ని సంపాదిస్తాడు. వరగర్వంతో అందరినీ హింసిస్తుంటాడు.

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
దీంతో మునులు పరమేశ్వరుడిని వేడుకోవడంతో ఆయన అఘోరమూర్తి రూపంలో వచ్చి ఆ అసురుడిని ఓ చెట్టుకింద సంహరిస్తాడు. ఆ చెట్టును మనం ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు.

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
అటు పై మునుల కోరిక పై ఆ పరమేశ్వరుడు ఆ అఘెరమూర్తి రూపంలో ఇక్కడ కొలువై ఉండిపోతాడు. ఇదిలా ఉండగా ఈ అఘెరమూర్తిని ఇంద్రుడు, బుధుడు, సూర్యుడు, చంద్రుడు కూడా ఆరాధించినట్లు చెప్పుతారు.

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
ప్రతి ఏడాది స్వామివారికి ఫిబ్రవరి నెలలో రథోత్సవం జరుగుతుంది. దీనిని చూడటానికి దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
అందుకు అనుగుణంగా వారికి కూడా ఇక్కడ ఉపాలయాలు ఉన్నాయి. గతంలో చోళులు ఈ ఆలయ అభివ`ద్ధికి ఎంతో సహాయ సహకారాలు అందించినట్లు ఇక్కడ దొరికిన శాసనాల వల్ల తెలుస్తోంది.

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
ఇక్కడ దుర్గాదేవి, కాళిమాతకు సంబంధించిన విగ్రాహాలు చాలా దొరికాయి. ఇక్కడ ఉన్న అఘెరమూర్తికి ప్రతి ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు జరుగుతాయి. తమిళనాడులోని తిరువెంకాడు అనే చిన్నపట్టణంలో ఈ దేవాలయం ఉంది.

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
ఇక్కడకు చెన్నై విమానాశ్రయం దగ్గర. ఈ రెండింటి మధ్య దూరం 246 కిలోమీటర్లు. చెన్నై నుంచి నేరుగా ఇక్కడికి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సౌకర్యం ఉంది. ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

శ్వేతరాయనేశ్వర దేవాలయం, తమిళనాడు

P.C: You Tube
ఇక ఈ దేవాలయానికి 60 కిలోమీటర్ల దూరంలోనే కుంభకోణం రైల్వేస్టేషన్ ఉంది. కుంభకోణం నుంచి ఈ దేవాలయానికి నిత్యం బస్సులు తిరుగుతూనే ఉంటాయి. వసతి సౌకర్యం బాగానే ఉంటుంది.

ఆమె చనిపోయిన తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి వెళ్లినవారు లేరుఆమె చనిపోయిన తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి వెళ్లినవారు లేరు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X