» »శ్రీదేవి పుట్టిన ప్రాంతం...ప్రముఖ పర్యాటక ప్రాంతం

శ్రీదేవి పుట్టిన ప్రాంతం...ప్రముఖ పర్యాటక ప్రాంతం

Written By: Beldaru Sajjendrakishore

భారత దేశంలోనే కాక ప్రంపంచ సినీ రంగంలో ప్రస్తుతం అదరి నోట వినిపిస్తున్న పదం శ్రీదేవి. చలనచిత్ర జగతిలో అతిలోక సుందరిగా పేరు గాంచిన వెండితెర రాణి అటు తమిళనాడులోని శివకాశీలో జన్మించింది. శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్ పేరుతో బాలనటిగా సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈ తార అటు పై ఇంతింతై వటుడింతై అన్న చందంగా తెలుగు, తమిళ, కన్నడ సినీ రంగంలోనే కాకుండా బాలివుడ్ లో కూడా దాదాపు రెండు దశాబ్దాల పాటు శ్రీదేవిగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఇటువంటి తార జన్మస్థలమైన శివకాశి ప్రముఖ పుణ్యక్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగానే కాకుండా టపాసులు, అగ్గిపెట్టల తయారీ రంగంలో దేశరాజధానిగా మారింది. శ్రీదేవి ఆకస్మిక మరణం నేపథ్యంలో ఆమె జన్మస్థానమైన శివకాశి గురించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. 600 ఏళ్ల చరిత్ర...

1. 600 ఏళ్ల చరిత్ర...

Image source

శివకాశికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. 14 శతాబ్దం నుంచే ఈ నగరం ఉంది. హిందువుల పవిత్ర క్షేత్రం కాశీ ఉత్తరాదిన ఉండగా.. దక్షిణాదిన రెండు కాశీలు ఏర్పాటయ్యాయి. వాటిలో ఒకటి తెన్ కాశీ కాగా మరోటి శివకాశి.
ఇవి రెండూ తమిళనాడులోనే ఉన్నాయి.

2. పరాక్రమ పాండియన్ పాలనలో

2. పరాక్రమ పాండియన్ పాలనలో

Image source

శివకాశి మదురైకి దక్షిణాన ఉంది. 14వ శతాబ్దంలో హరికేసరి పరాక్రమ పాండియన్ తెన్ కాశిని రాజధానిగా చేసుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలను పాలించేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు ఈక్రమంలో తాను ఉంటున్న తెన్ కాశిలో వారణాశి నుంచి ఒక శివలింగాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించాలని భావించాడు.

3. వారణాశి నుంచి లింగం

3. వారణాశి నుంచి లింగం

Image source

అనుకున్నదే తడవుగా వారణాసి వెళ్లి అక్కడ నుంచి హరికేసరి పాండియన్ ఒక లింగాన్ని తీసుకువచ్చాడు. ప్రస్తుతం శివకాశిగా పిలవబడే ప్రాంతానికి రాగానే ప్రయాణబడలిక తీర్చుకోవడానికి ఒక చెట్టు క్రింత విశ్రమించాడు.

4. గోవు కదలక పోవడంతో

4. గోవు కదలక పోవడంతో

Image source

కొద్ది సేపు తర్వాత తెన్ కాశికి వెళ్లడానికి బయలు దేరడానికి ఉపక్రమించాడు. అయితే ఈ లింగాన్ని తీసుకొస్తున్న గోవు అక్కడ నుంచి కదలనని మొండికేసింది. దీంతో ఆయన ఆ లింగాన్ని తన స్వస్థలం తెన్ కాశికి తీసుకెళ్లలేమని భావించి దాన్ని ఇక్కడే ప్రతిష్ఠించాడు.

5.ప్రాచీన దేవాలయల్లో ఒకటి

5.ప్రాచీన దేవాలయల్లో ఒకటి

Image source

అప్పటి నుంచి ఈ ప్రాంతానికి శివకాశిగా పేరు వచ్చింది. ఇక ఇక్కడే తమిళనాడులో అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన కాశి విశ్వేశ్వరనాథ స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ శివరాత్రి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి.

6 బంగారు విగ్రహం

6 బంగారు విగ్రహం

Image source

ఇదే శివకాశి నగరంలో భద్రకాళి అమ్మాన్ ఆలయం ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇక్కడి గర్భగుడిలో అమ్మవారు బంగారు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. రాష్ర్టంలో ఎతైన రాజగోపురాల్లో ఇది కూడా ఒకటి.

7. పంగుని ఉత్తిరమ్ వేడుకలు

7. పంగుని ఉత్తిరమ్ వేడుకలు

Image source

అదే విధంగా ఇక్కడ ఉన్న మారియమ్మన్ దేవాలయంలో ఏడాది పాటు ఏదో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా పంగుని ఉత్తిరమ్ వేడుకలకు ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.

8. ఇక్కడే జననం

8. ఇక్కడే జననం

Image source

ఇంతటి పురాణ, ధార్మిక ప్రాధన్యం కలిగిన ఈ పుణ్యక్షేత్రంలోనే శ్రీదేవి అయ్యప్పన్, రాజేశ్వరిలకు జన్మించింది. తండ్రి తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా, తల్లి తెలుగు సిని ప్రపంచంలో మంచి నాట్యకారిణిగా పేరు తెచ్చెకుంది.

9. ప్రకృతి ప్రేమికులకు

9. ప్రకృతి ప్రేమికులకు

Image source

శివకాశికి 9 కిలోమీటర్ల దూరంలో నేన్మేని గ్రమం ఉంది. ఇక్కడ ఉన్న వైప్పారు నది నిత్యం ప్రవహిస్తుంటుంది. ఇది వలస పక్షులకు ఆలవాలం. దీంతో ఇక్కడకు ఒక్క తమిళనాడు నుంచే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు పక్షి ప్రేమికులు వస్తూ ఉంటారు.

10. బోటు షికారు...

10. బోటు షికారు...

Image source

ఇక శివకాశికి దగ్గర్లో పిలవక్కల్ ఆనకట్ట కూడా ఉంది. ఇక్కడ పిల్లల పార్కు కూడా ఉంది. ఇక్కడ బోటు షికారుకు అనుమతి ఉండటం వల్ల ఇది వీకెండ్ టూరిస్ట్ స్పాట్ ప్రాచుర్యం పొందింది.

11. అయ్యార్ జలపాతం

11. అయ్యార్ జలపాతం

Image source

శివకాశికి సమీపంలో ఉన్న రాజపాలయం కు దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో అయ్యార్ జలపాతం ఉంటుంది. దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి పడే అయ్యార్ జలపాతం అందాలు చూడటానికి చాలా మంది పర్యాటకులు ఇక్కడకు వస్తూ ఉంటారు. దీని సమీపంలో అయ్యార్ దేవాలయం కూడా ఉంది.

12.తిరుచులి

12.తిరుచులి

Image source

శివకాశికి సమీపంలో తిరుచులి అనే ప్రాంతం ఉంది. ప్రముఖ ఆద్వాత్మిక గురువు రమణ మహర్షి ఉన్న ప్రాంతం ఇదే. ఇక్కడి తిరుమేథిన స్వామి దేవాలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది.

13. వెంబైకొట్టై

13. వెంబైకొట్టై

Image source

వెంబైకొట్టై శివకాశి సరిహద్దుల్లో ఉన్న ప్రముఖ జలాశయం ఇక్కడ కూడా ఉద్యానవనాలు పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకర్షిస్తుంటాయి. బోటింగ్ సదుపాయం కూడా ఉంది.

14. ఇతర ఆకర్షణీయ ప్రాంతాలు

14. ఇతర ఆకర్షణీయ ప్రాంతాలు

Image source

వెంకటాచలపతి ఆలయం, కుల్లూర్ సందూర్ రిజర్వాయర్, ముథిలియార్ ఒత్తు, కచకర అమ్మన్ కోయిల్, పెరుమాల్ కోయల్ తదితర ప్రాంతాలు చూడదగినవి.

15. పారిశ్రామిక రంగంలో కూడా

15. పారిశ్రామిక రంగంలో కూడా

Image source

శివకాశి ఆధ్యాత్మికంగా, పర్యాటకకంగానే కాకుండా పారిశ్రమిక రంగంలో కూడా ముందుంది. బాణాసంచార తయారీలో శివకాశిని దేశ రాజధానిగా పిలుస్తారు. దేశం మొత్తం మీద తయారయ్యే టపాసుల్లో దాదాపు 85 శాతం ఇదే నగరంలో ఉత్పత్తి అవుతున్నాయి.

16. అగ్గిపెట్టులు

16. అగ్గిపెట్టులు

Image source

ఇక శివకాశి నగరం అగ్గి పెట్టెల తయారీకి కూడా ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ తయారయ్యే అగ్గిపెట్టులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. పట్టణ పరిసర ప్రాంతాల్లోని వాతావరణం తో పాటు భూగోళ స్వరూపం కూడా బాణాసంచా, అగ్గిపెట్టల తయారికి అనుకూలంగా ఉండి వేల మందికి ఉపాధి కల్పిస్తోంది.

17. తమిళసంప్రదాయ వంటలు

17. తమిళసంప్రదాయ వంటలు

Image source

శివకాశిలో పర్యాటకులు ఉండటానికి వసతి హోటళ్లు, లాడ్డీజలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అచ్చు తమిళనాడు సంప్రదాయ వంటకాల రుచులను ఆస్వాధించవచ్చు.

18 ఎలా వెళ్లాలి...

18 ఎలా వెళ్లాలి...

Image source

శివకాశికి దగ్గరగా అంటే 70 కిలోమీటర్ల దూరంలో మధురై విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి క్యాబ్ లేదా ట్యాక్సీల ద్వారా శివకాశిని చేరుకోవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మధురైకు విమానయాన సర్వీసులు ఉన్నాయి.

19 రైలు మార్గం ద్వారా కూడా

19 రైలు మార్గం ద్వారా కూడా

Image source

శివకాశిలో రైల్వే స్టేషన్ కలదు. చెన్నై, తిరునల్వేలి, కన్యాకుమారి తదితర ప్రాంతల నుంచి ఇక్కడికి నేరుగా రైలు సౌకర్యం కలదు. అదే విధంగా తమిళనాడులోని ప్రముఖ పట్టణాల నుంచి కూడా శివకాశికి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు కలవు.

20. ఎంత దూరంలో

20. ఎంత దూరంలో

Image source

చెన్నై నుంచి శివకాశికి 540 కిలోమీటర్ల దూరం కాగా, 9 గంటల ప్రయాణం. అదే విధంగా బెంగళూరు నుంచి శివకాశికి 497 కిలోమీటర్ల దూరం. ఇక హైదరాబాద్ నుంచి 1073 కిలోమీటర్ల దూరం.