Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలో ఇటువంటి విగ్రహాలు మీరు చూపించలేరు?

ప్రపంచంలో ఇటువంటి విగ్రహాలు మీరు చూపించలేరు?

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విశిష్ట దేవాలయాలకు సంబంధించిన కథనం.

భారత దేశం ఆలయాల నిలయమన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోని అనేక ఆలయాల్లో కొన్ని విశిష్ట ఆలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాల్లో ఉన్నటువంటి మూలవిరాట్టు ప్రపంచంలో మరెక్కడా చూడలేమని చెబుతుంటారు. మరొకొన్నింటిలో ఆలయంలోని ఏదో ఒక పూజా విధానం కాని విగ్రహం కాని ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఉదాహరణకు యాగంటిలోని బసవన్న విగ్రహం రోజురోజుకూ పెరుగుతుండటం, ఏడు నదులు కలిసే చోట రూపాల సంగేశ్వరాలయం ఉండటం. ఇటువంటి విశిష్ట ఆలయాల సమహారమే ఈ కథనం. మరెందుకు ఆలస్యం చదివి మీకు రానున్న వీకెండ్ లో అక్కడికి వెళ్లి ఆ విశిష్టతను మీరు చూడండి.

స్తంభాద్రి నారసింహాలయము

స్తంభాద్రి నారసింహాలయము

P.C: You Tube

ఖమ్మం జిల్లా ముఖ్యకేంద్రమైన ఖమ్మం పట్టం మధ్యలో ఈ క్షేత్రం ఉంది. మూలవిరాట్ అయిన నారసింహుడు దక్షిణాభిముఖంగా ఉంటాడు. ఆలయ ఆవరంలోని కోనేరులో నీరు ఎక్కువైతే గర్భగుడిలోని స్వామి వారి నాభి వరకూ చేరుతుంది. ఇక్కడ మరోవిశేషం నల్లరాతితో చేసిన సాయిబాబా విగ్రహం. రాష్ట్రంలో నల్లరాతితో చేసిన సాయిబాబా విగ్రహం ఇదొక్కటే.

ఈరన్న ఆలయం.

ఈరన్న ఆలయం.

P.C: You Tube

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈరన్న ఆలయం ఉంది. హిందూ మతంలో శైవ సంప్రదాయం, వైష్ణవ సంప్రదాయం వేర్వేరు. ఇక్కడ ప్రధాన దైవం నారసింహుడు. విష్ణు రూపమైన ఈ స్వామికి శైవ సంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతాయి.

రూపాల సంగమేశ్వరాలయం

రూపాల సంగమేశ్వరాలయం

P.C: You Tube

ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం రూపాల సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి వద్ద తంగ, భద్ర, క`ష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలుస్తాయి. అక్కడే రూపాల సంగమేశ్వరాలయం ఉంది. ఈ నదులన్నీ ఇక్కడ కలిసి ఒకే నదిగా మారి శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి.

యాగంటి

యాగంటి

P.C: You Tube

కర్నూలు జిల్లాలోని బనాగాన పల్లి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో యాగంటి ఉంది. ఇక్కడ శివపార్వతులు విగ్రహ రూపంలో కనిపిస్తారు. ముఖ్యంగా ఈ ఆలయంలో ప్రతి రోజూ పెరుగుతున్న రాతి బసవన్నను చూడవచ్చు. కలియుగాంతంలో ఈ బసవన్న రంకేస్తాడని చెబుతారు.

 శ్రీ కూర్మం

శ్రీ కూర్మం

P.C: You Tube

విష్ణువుకు కూర్మం రూపంలో ఆలయం ప్రపంచం మొత్తం మీద శ్రీ కాకుళం జిల్లాలోని శ్రీ కూర్మంలో మాత్రమే ఉంది. ఇక ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉండటం కూడా విశిష్టమే. ఆలయంలోని మూలవిరాట్టు పశ్చిమాభిముఖంగా ఉండటం కూడా ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత.

ర్యాలీ

ర్యాలీ

P.C: You Tube

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ర్యాలీ గ్రామం ఉంది. ఇక్కడ ఒకే విగ్రహంలో విష్ణవు ముందు వైపు ఉండగా అదే విగ్రహం వెనుకవైపున క్షీరసాగర మధనం సమయంలో అమ`తాన్ని పంచిన జగన్మోహిని రూపం ఉంటుంది. ఇటువంటి విగ్రహం ప్రపంచంలో ఇదొక్కటే. అదే విధంగా ఇది హరిహర క్షేత్రం కావడం కూడా ఒక విశిష్టతగా చెబుతారు. అంటే ఇక్కడ పరమేశ్వరుడితో పాటు విష్ణువు కూడా పూజలందుకొంటాడు.

హేమావతి సిద్దేశ్వరాలయం

హేమావతి సిద్దేశ్వరాలయం

P.C: You Tube

అనంతపురం జిల్లా అమరాపురం మండలం హేమావతిలో సిద్దేశ్వరాయం ఉంది. ఇక్కడ శివుడు లింగం రూపంలో కాకుండా మనవ రూపంలో దర్శనమిస్తాడు. గంగమ్మను తలదాల్చి చతుర్భుజాలతో కొలువై ఉండటమే కాకుండా జటాజూటంలో సూర్య, చంద్రులు ఇద్దరూ కనిపిస్తారు. సాధారణంగా శివుడి జటాజూటంలో చంద్రుడు మాత్రమే దర్శనమిస్తాడు.

కదిరి నరసింహాలయం

కదిరి నరసింహాలయం

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని కదిరి పట్టణంలో నరసింహాలయం ఉంది. ఇక్కడ స్వామి వారి విగ్రహం నుంచి నిత్యం చమట వస్తుంది. అంతేకాకుండా స్వామి వారి ఉత్సవాల్లో ముస్లీం సోదరులు కూడా పాల్గొటారు.

చెన్నకేశవస్వామి ఆలయం, మార్కాపురం

చెన్నకేశవస్వామి ఆలయం, మార్కాపురం

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురంలో చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. సాధారణంగా స్వామివారి కుడి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం స్వామి వారి ఎడమచేతిలో స్వామివారి విగ్రమం మనకు కనిపిస్తుంది. మూల విరాట్టు చుట్టూ మకర తోరణం ఉండటం ఇక్కడ మరో విశిష్టత.

దేవుని కడప

దేవుని కడప

P.C: You Tube

కడపలో ఉన్న శ్రీ వేంకటేశ్వరాాలయాన్నే దేవుడి కడప అని అంటారు. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్లడానికి, ఉత్తర భారత దేశ యాత్రికులు రామేశ్వరం వెళ్లడానికి, అదేవిధంగా తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి కాలిబాటన వెళ్లేవారికి కడపే ప్రధాన మార్గం.

ఇది హనుమ క్షేత్రం

ఇది హనుమ క్షేత్రం

P.C: You Tube

ఈ కారణంగా మూడు చోట్లకు వెళ్లేవారు మొదట ఇక్కడి శ్రీ లక్ష్మీ ప్రసన్న వేంకటేశ్వరుడిని దర్శించుకొని తమ యాత్రను ప్రారంభించేవారు. అందువల్లే దీనిని దేవుడి కడప అంటారు. ఇక ఆలయ విశిష్టతకు వస్తే తిరువమ వరాహ క్షేత్రం కాగా, ఇది హనుమ క్షేత్రం. అందుకు చిహ్నంగా ఇక్కడ స్వామి వారి వెనక భాగాన నిలువెత్తు విగ్రహ రూపం కనిపిస్తుంది.

ఒంటిమిట్ట కోదండరామ దేవాలయం

ఒంటిమిట్ట కోదండరామ దేవాలయం

P.C: You Tube

కడప జిల్లాలో ఒంటిమిట్ట అనే చిన్న పట్టణంలో కోదండరామ దేవాలయం ఉంది. ఇక్కడ మాత్రమే హనుమంతుడు లేని రామాలయాన్ని మనం చూడవచ్చు. అదే విధంగా ఒకే శిలలో సీతారాములతో పాటు లక్ష్మణుడిని కూడా మనం చూడవచ్చు.

రుద్రకోటేశ్వరాలయం

రుద్రకోటేశ్వరాలయం

P.C: You Tube

తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ ఒకే విగ్రహంలో విష్ణువు, శివుడు ఉంటాడు. ఇటువంటి విగ్రహం ప్రపంచంలో ఇది ఒక్కటే. ఒక వైపు నుంచి చూస్తే శివుడు, మరోవైపునుంచి చూస్తే విష్ణువు కనిపిస్తాడు.

గుడిమల్లం అనే గ్రామంలో

గుడిమల్లం అనే గ్రామంలో

P.C: You Tube

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం అనే చిన్న గ్రామంలో ఉన్న శివాలయంలోని మూల విరాట్టు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. పరమ శివుడు పురుషాంగం రూపంలో లింగ రూపంలో ఉంటాడు. ఆ పురుషాంగం పై భాగంలోనే ఒక పురుషుడు కూడా ఉంటాడు. గర్భాలయం భూ మట్టానికి కంటే లోతుగా ఉంటుంది.

వేదనారాయణస్వామి

వేదనారాయణస్వామి

P.C: You Tube

తిరుపతికి సుమారు 70 కిలోమీటర్ల దూంలో వేదనారాయణ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ విష్ణువు చేప ఆకారంలో మనకు దర్శనమిస్తాడు. ఇటువంటి రూపం ప్రపంచంలో మనకు ఎక్కడా కనిపించదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X