Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ ఇప్పటికీ రత్నాలు, వజ్రాలు దొరుకుతాయంటా? అందుకే,

ఇక్కడ ఇప్పటికీ రత్నాలు, వజ్రాలు దొరుకుతాయంటా? అందుకే,

మొథెరాలోని సూర్య దేవాలయంలో ప్రధాన దైవం సూర్యుడు. దీని చరిత్ర తదితర వివరాలు తెలుసుకోండి.

గుజరాత్ రాష్ట్రంలో మెథెరాలో ఉన్న సూర్యదేవాలయం అనేక విశిష్టతలు కలిగినది. ఈ దేవాలయాన్ని సోలంకి రాజులు నిర్మించారు. సోలంకి రాజుల కాలంలో బంగారు, ముత్యాలు, రత్నాలు మొదలైనవి రోడ్డు మీద రాశులుగా పోసుకొని అమ్మేవారని చెబుతారు. ఇక ఇక్కడ నిర్మించిన సూర్యదేవాలయం క్రీస్తుశకం 11వ శతాబ్దంలో సోలంకి రాజైన రెండవ భీందేవ్ నిర్మించాడు. ఆ సమయంలో తన ఖజానాలోని అనేక విలువైన రత్నాలను, వజ్రలను ఈ దేవాలయం పునాది కింద దాచిపెట్టారని స్థానిక కథనం. అందువల్లే ఇప్పటికీ అక్కడక్కడ ఆ విలువైన వజ్రాలు, రత్నాలు దొరుకుతుంటాయని చెబుతారు.

సూర్య దేవాలయం, మొథెరా

సూర్య దేవాలయం, మొథెరా

P.C: You Tube

సోలంకి రాజుల కాలంలో పాటన్ ప్రాంతానికి చెందిన కొంతమంది బ్రహ్మణులకు ధర్మారణ్యంలోని కొంత భాగం బాగుచేయించి వసతులు కల్పించారు. ఈ బ్రహణులను మోథ్ బ్రాహ్మణులు అనేవారు.

సూర్య దేవాలయం, మొథెరా

సూర్య దేవాలయం, మొథెరా

P.C: You Tube

వారు నివసించిన ప్రాంతం కాబట్టే దీనికి మొథెరా అని పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ మొథెర గుజరాత్‌లో ఉంది. ఈ పల్లెకు కొద్ది దూరంలోనే పుష్పవతి నది ప్రవహిస్తోంది.

సూర్య దేవాలయం, మొథెరా

సూర్య దేవాలయం, మొథెరా

P.C: You Tube

ఈ నది ఉత్తర గుజరాత్‌లో ఉన్న సరస్వతీ నదితో కలిసి పడమరగా ప్రవహించి రాణ్ ఆఫ్ కచ్‌లోకి వెళ్లి కలిసి పోతుంది.

సూర్య దేవాలయం, మొథెరా

సూర్య దేవాలయం, మొథెరా

P.C: You Tube

ఇక సోలంకి రాజుల కాలంలో బంగారు, ముత్యాలు, రత్నాలు మొదలైనవి రోడ్డు మీద రాశులుగా పోసుకొని అమ్మేవారని చెబుతారు. ఇక ఇక్కడ నిర్మించిన సూర్యదేవాలయం క్రీస్తుశకం 11వ శతాబ్దంలో సోలంకి రాజైన రెండవ భీందేవ్ నిర్మించాడు.

సూర్య దేవాలయం, మొథెరా

సూర్య దేవాలయం, మొథెరా

P.C: You Tube

ఈ దేవాలయ నిర్మాణం అనేక ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. ఈ దేవాలయం నిర్మాణానికి వాడిన రాయి ఈ చుట్టు పక్కల ఎక్కడా ఉండదూ. సుదూర ప్రాంతం నుంచి ఈ రాయిని ఇక్కడికి తీసుకువచ్చారు.

సూర్య దేవాలయం, మొథెరా

సూర్య దేవాలయం, మొథెరా

P.C: You Tube

ఈ దేవాలయం ఎక్కడ సున్నం వాడలేదు. ఒక రాయిలోకి మరో రాయిని అమర్చి ఈ దేవాలయాన్ని కట్టారు. ఇక పునాది నిర్మాణం ప్రత్యేకమైనది. నది ఒడ్డున పది అడుగుల మేర ఇటుకలతో పునాది నిర్మించి దాని పై దేవాలయం నిర్మాణం చేపట్టారు.

సూర్య దేవాలయం, మొథెరా

సూర్య దేవాలయం, మొథెరా

P.C: You Tube

ఈ దేవాలయం గోడల పై రామాయణ, మహాభారత కథలను అందమైన శిల్పాలుగా చెక్కారు. ఈ దేవాలయం ప్రధానంగా మూడు భాగాలుగా ఉంటుంది. గూడ మంటపం, రంగ మంటపం, సూర్యకుండ్.

సూర్య దేవాలయం, మొథెరా

సూర్య దేవాలయం, మొథెరా

P.C: You Tube

ఈ సూర్యకుండ్ ఒక కొలను. ఈ మూడు తూర్పు పడమరులుగా ఒకే వరుసలో నిర్మించబడ్డాయి. గూడ మంటపం ప్రవేశ ద్వారం వద్ద ఒక మకర తోరణం ఉంటుంది. లతలు, తీగలతో ఇది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.

సూర్య దేవాలయం, మొథెరా

సూర్య దేవాలయం, మొథెరా

P.C: You Tube

అదే విధంగా ఈ రాతి మంటపంలో గణపతి విగ్రహం చూపరులను ఇట్టే ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా మేళతాళాలతో ముందుకు పోతున్న ఓ బ`ందం శిల్పం ఆనాటి భారతీయ శిల్పకళావైభవానికి చిహ్నంగా నిలుస్తుంది.

సూర్య దేవాలయం, మొథెరా

సూర్య దేవాలయం, మొథెరా

P.C: You Tube

ఇక రంగమంటపంలో ఏనుగులు, కోతులు వంటి జంతువుల శిల్పాలను మనం ఎక్కువగా చూడొచ్చు. సూర్యకుండ్ ఒక కొలను. దీనికి నాలుగు వైపులా మెట్ల వరుస ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ శయనించిన స్థితిలో ఉన్న విష్ణువు విగ్రహంతో పాటు చిన్న చిన్న దేవాలయాలు ఈ సూర్య కుండ్ చుట్టూ ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X