Search
  • Follow NativePlanet
Share
» »స్వయంభూవు గణపతి ఆలయాలు - ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ !

స్వయంభూవు గణపతి ఆలయాలు - ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ !

వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. ఈయనకు గల ఇతర పేర్లు గణపతి, బొజ్జ గణపయ్య, గణేశుడు, గణనాయకుడు, గణనాధుడు, విఘ్నేశ్వరుడు. శివ పార్వతులు పెద్ద కుమారుడు ఈయన. ఈయన తమ్ముడు కుమార స్వామి. ఈయన వాహనం మూషికం లేదా ఎలుక. వినాయకుడు నాలుగు చేతులు(ఒక చేతిలో పాశం, మరో చేతిలో అంకుశం, ఇంకో చేతిలో లడ్డు లేదా ఘంటము, మరొక చేతిలో అభయహస్తం ) కలిగి ఉంటాడు.

వినాయకునికి హిందూమత సంప్రదాయంలో ఒక విశిష్ట స్థానం కలదు. అడ్డంకులను తొలగించు వాడు(విఘ్నేశ్వరుడు), అన్ని కార్యాలకు, శుభములకు, పూజలకు ప్రప్రధముగా పూజింపవలసినవాడు వినాయకుడు. హిందూ మతంలో గణేశ చతుర్థి ఒక ముఖ్య పండగ. తెలుగువారు ఈ పండుగను వినాయక చవితి అంటారు. భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి నాడు ప్రారంభమై అనంత చతుర్థిన ముగుస్తుంది.

తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి పండగ వైభవంగా జరుగుతుంది. కొన్ని చోట్ల 3 రోజులకు, 5 రోజులకు, 9 రోజులకు, 11 రోజులకు నిమర్జనం చేస్తారు.

తెలుగు రాష్ట్రాలలో(ఆంధ్రా, తెలంగాణ) వినాయ చవితి సందర్బంగా, వినాయకుడు స్వయంభూవుగా వెలసిన క్షేత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

వరసిద్ధి వినాయ స్వామి, కాణిపాకం, చిత్తూర్ జిల్లా

వరసిద్ధి వినాయ స్వామి, కాణిపాకం, చిత్తూర్ జిల్లా

వక్రతుండ మహాకాయుడైన వినాయకుడు స్వయంభూవుగా వెలసిన క్షేత్రం కాణిపాకం. ఏదేవుడు మీద ఒట్టు వేసినా నమ్మనివారు కాణిపాకం దేవుడు మీద ఒట్టేస్తే మాత్రం నమ్ముడతారు. అంత సత్యప్రమాన దేవుడు ఈ స్వామి. ఆలయ ప్రాంగంలో వీరాంజనేయ స్వామి, మనికంఠే శ్వరస్వామి ,వరదరాజ స్వామి ఆలయాలను చూడవచ్చు.

చిత్రకృప : Adityamadhav83

వరసిద్ధి వినాయ స్వామి, కాణిపాకం, చిత్తూర్ జిల్లా

వరసిద్ధి వినాయ స్వామి, కాణిపాకం, చిత్తూర్ జిల్లా

విశిష్టత

సజీవ మూర్తిగా వెలసిన స్వామి విగ్రహం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది అనటానికి సాక్ష్యం స్వామి వారికి తొడిగే వెండికవచాలు సరిపోకపోవడమే. స్వామి వారు స్వయంభూగా ఆవిర్భవించినపుడు కనిపించని పొట్ట ఇప్పుడు కనిపిస్తుంది. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో లక్షల సంఖ్యలో ఆలయాన్ని దర్శిస్తారు.

చిత్రకృప : Ravikumar Vaddepati

వరసిద్ధి వినాయ స్వామి, కాణిపాకం, చిత్తూర్ జిల్లా

వరసిద్ధి వినాయ స్వామి, కాణిపాకం, చిత్తూర్ జిల్లా

ఆలయాన్ని తెరిచే సమయం

దేవాలయం ఉదయం 4 గంటల నుండి రాత్రి 9:30 వరకు తెరిచే ఉంటుంది. పూజ, సేవలు, వసతి కొరకు దేవాలయ అధికారిక వెబ్సైట్ లో చూడగలరు.

http://www.kanipakam.com/home.html

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

వరసిద్ధి వినాయ స్వామి, కాణిపాకం, చిత్తూర్ జిల్లా

వరసిద్ధి వినాయ స్వామి, కాణిపాకం, చిత్తూర్ జిల్లా

రవాణా సౌకర్యాలు

చిత్తూర్ కు 12 కిలోమీటర్ల దూరంలో ఐరాల మండలంలో బాహుదా నదీతీరాన కాణిపాకం కలదు. ఇక్కడకు వెళ్ళటానికి ప్రతిరోజూ చిత్తూరు నుండి 15 నిమిషాలకొకసారి మరియు తిరుపతి నుండి అరగంటకోసారి ప్రభుత్వ బస్సులు కలవు. ప్రవేట్ వాహనాలు నిత్యం చిత్తూరు/ తిరుపతి నుండి తిరుగుతాయి.

చిత్రకృప : Ravikumar Vaddepati

శ్రీ శ్వేతార్క మూలగణపతి, కాజీపేట్, వరంగల్ జిల్లా

శ్రీ శ్వేతార్క మూలగణపతి, కాజీపేట్, వరంగల్ జిల్లా

శ్రీ శ్వేతార్క మూలగణపతి దేవాలయం వరంగల్ లోని కాజీపేట్ లో గల విష్ణుపురి లో ఉన్నది. ఇందులో దేవుడు స్వయంభూవుగా వెలిశాడు. భక్తుల కోర్కెలను తీర్చే దైవంగా, ఇంటి ఇలవేల్పుగా ఇక్కడి స్వామీ వారు ప్రసిద్ధి. ఇక్కడ స్వామివారు స్పష్టమైన ఆకృతిని పొంది దర్శనం ఇస్తుంటాడు.

చిత్రకృప : swetharka.org

శ్రీ శ్వేతార్క మూలగణపతి, కాజీపేట్, వరంగల్ జిల్లా

శ్రీ శ్వేతార్క మూలగణపతి, కాజీపేట్, వరంగల్ జిల్లా

విశిష్టత

ప్రతి మంగళవారం దర్శనం, ప్రదక్షణలు చేయటం ఇక్కడి విశిష్టత. గణపతి తూర్పు ముఖంగా ఉండి ఈశాన్యం వైపు కైలాస స్థానాన్ని చూస్తున్నట్లు ఉండటం కూడా ఇక్కడ ఇంకో ప్రత్యేకత.

చిత్రకృప : swetharka.org

శ్రీ శ్వేతార్క మూలగణపతి, కాజీపేట్, వరంగల్ జిల్లా

శ్రీ శ్వేతార్క మూలగణపతి, కాజీపేట్, వరంగల్ జిల్లా

ఆలయ సందర్శన సమయాలు

ఉదయం 6 గంటల నుండి 11:30 వరకు తిరిగి 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు దేవాలయాన్ని తెరుస్తారు. మంగళవారాలలో 5:30 am నుడ్ని 1:30 pm వరకు తిరిగి 4:00 pm నుండి 9:30 pm వరకు తెరుస్తారు. పూజ/ సేవల కొరకు అధికారిక వెబ్సైట్ చూడండి.

http://swetharka.org/

చిత్రకృప : swetharka.org

శ్రీ శ్వేతార్క మూలగణపతి, కాజీపేట్, వరంగల్ జిల్లా

శ్రీ శ్వేతార్క మూలగణపతి, కాజీపేట్, వరంగల్ జిల్లా

రవాణా సౌకర్యాలు

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో కాజీపేట్ రైల్వే స్టేషన్ కలదు. హైదరాబాద్, వరంగల్ నుండి ప్రతిరోజూ కాజీపేట్ కు బస్సులు తిరుగుతుంటాయి.

చిత్రకృప : UjjawalTM

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి, తూర్పుగోదావరి జిల్లా

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి, తూర్పుగోదావరి జిల్లా

అయినవిల్లి తూర్పుగోదావరి జిల్లాలో కలదు. ఇక్కడ దేవతలే స్వయంగా నిర్మించారని చెబుతున్న విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఉత్తర ఆంధ్రా లో ప్రసిద్ధి చెందినది ఈ దేవాలయం. వినాయకుడు దక్షిణాముఖుడై ఉంటాడు. స్వామి ని అర్చిస్తే కోర్కెలతో పాటు బుద్ది వికసిస్తుందని నమ్మకం.

చిత్రకృప : కాసుబాబు

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి, తూర్పుగోదావరి జిల్లా

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి, తూర్పుగోదావరి జిల్లా

ఆలయ ప్రాంగణంలోని ఇతర దేవాలయాలు

అన్నపూర్ణాదేవి ఆలయం, విశ్వేశ్వరాలయం, కాలభైరవ ఆలయం, శ్రీ భూ సమేత కేశవ స్వామి ఆలయం మొదలైనవి. కృష్ణాష్టమి, వినాయకచవితి, సంక్రాంతి వైభవంగా జరుగుతుంది.

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి, తూర్పుగోదావరి జిల్లా

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి, తూర్పుగోదావరి జిల్లా

ఆలయ సందర్శన సమయాలు

ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంటారు. పూజ/ సేవల కొరకు అధికారిక వెబ్సైట్ చూడండి.

http://www.ainavillivighneswara.com/

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి, తూర్పుగోదావరి జిల్లా

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి, తూర్పుగోదావరి జిల్లా

ఎలా చేరుకోవాలి ?

విజయవాడ నుండి వెళ్లేవారు రాజమండ్రికి వెళ్లి, అక్కడి నుంచి వెళ్ళవచ్చు. విశాఖ నుండి వచ్చేవారు కాకినాడ చేరుకొని వెళ్ళవచ్చు. రాజమండ్రి నుండి 42 కి. మీ దూరం, కాకినాడ నుండి 45 కిలోమీటర్ల దూరం లో అయినవిల్లి కలదు.

చిత్రకృప : Praneeth Medukonduru

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more