» »చిత్రమైన కాళి ఆలయం - ఈ గుళ్ళో తాళం వేస్తే ఎటువంటి కోరిక అయిన తీరుతుంది !

చిత్రమైన కాళి ఆలయం - ఈ గుళ్ళో తాళం వేస్తే ఎటువంటి కోరిక అయిన తీరుతుంది !

Posted By: Venkatakarunasri

LATEST: మన దేశంలో వెలకట్టలేని నిధి, నిక్షేపాలు ఉన్న 5 ప్రాంతాలు ఇవే !

భగవంతుడికి ఏదో ఒక కానుక సమర్పించుకుంటే మనసులోని కోర్కెలు నెరవేరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఒక్కో ఆలయంలో ఒక్కో వింత ఆచారాన్ని పాటిస్తారు. అయితే ఓ ఆలయంలో అమ్మవారికి ఎలాంటి కానుకలు సమర్పించాల్సిన అవసరంలేదు, అక్కడ ఓ తాళంకప్ప తెచ్చి లాక్ వేస్తే సరిపోతుంది. ఇది కాన్పూర్‌లో బెంగాలీ మొహల్లాలోని పురాతన కాళీమాత ఆలయంలోని సంప్రదాయం. ఈ దేవాలయంలోని అమ్మవారిని తాలే వాలీ దేవి పేరుతో పిలుస్తారు.

ఇది కూడా చదవండి: కాన్పూర్ - చదువుల సరస్వతి కొలువు !

కాన్పూర్ నగర్ జిల్లా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వుంది. కాన్పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. కాళికాదేవి అనంత శక్తిదాయిని అయిన హిందూ దేవత. కాళిక పేరుకు కాల అనగా నలుపు, కాలం, మరణం, శివుడు మొదలైన అర్ధాలున్నాయి.

ఇది కూడా చదవండి: కన్నౌజ్ - భారత 'పెర్ఫ్యూమ్' రాజధాని !

శాక్తీయులు ఈమెను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేదిగా ఆరాధిస్తారు. ఈమెను కొందరు భవతారిణిగా కొలుస్తారు. రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళీమాతగా పూజించారు. కాళికాదేవిని శివుని భార్యగా అతని శరీరం మీద నిలబడినట్లుగా చూపుతారు. ఈమె దశమహావిద్యలు లో ముఖ్యమైనది.

ఈ గుళ్ళో తాళం వేస్తే ఎటువంటి కోరిక అయిన తీరుతుంది !

టాప్ ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. తాళం

1. తాళం

భక్తులు తమ కోర్కెలు నెరవేరాలంటే తాళం కప్పలను తీసుకొచ్చి ఆ గుడిలో తాళం వేస్తారు.

pc:youtube

2. వందలాంది తాళం కప్పలు

2. వందలాంది తాళం కప్పలు

భక్తులు సమర్పించిన వందలాంది తాళం కప్పలు కాళీ మాత మందిరం దగ్గర దర్శనిమిస్తాయి.

pc:youtube

3. ఆలయం

3. ఆలయం

భక్తులు ఆలయానికి వచ్చి తమ కోర్కెలకు తాళం వేస్తారని పుజారి రవీంద్రనాథ్ బెనర్జీ తెలిపారు.

pc:youtube

4. మహిళా భక్తులు

4. మహిళా భక్తులు

శతాబ్దాలు కొనసాగుతున్న ఈ ఆచారాన్ని మహిళా భక్తులు కొనసాగిస్తున్నారు.

pc:youtube

5. భక్తురాలు

5. భక్తురాలు

కొన్ని శతాబ్దాల క్రితం అమ్మవారి దర్శనానికి ఓ భక్తురాలు రోజూ ఉదయాన్నే వచ్చేది.

pc:youtube

6. తాళంకప్ప

6. తాళంకప్ప

ఒకరోజు ఆలయ ప్రాంగణంలో ఆమె తాళంకప్పను ఉంచి లాక్ వేసింది.

pc:youtube

7. కలలో కనిపించి

7. కలలో కనిపించి

దీన్ని గమనించిన అప్పటి ఆలయ పూజారిని ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నిస్తే కాళీమాత తన కలలో కనిపించి గుడి ప్రాంగణంలో తాళంకప్పను ఉంచితే ఏం కోరుకుంటే అవి నెరవేరుతాయందని ఆమె పూజారికి తెలిపింది.

pc:youtube

8. భక్తురాలు

8. భక్తురాలు

ఇది జరిగిన తర్వాత ఆ భక్తురాలు మళ్లీ ఆలయానికి రాలేదు.

pc:youtube

9. ఆలయ గోడలు

9. ఆలయ గోడలు

కానీ ఓ రోజు అకస్మాత్తుగా వచ్చి నా కోర్కె నెరవేడంతో ఈ తాళం తెరుస్తున్నానని ఆమె ఆలయ గోడలపై రాసింది.

pc:youtube

10. నైవేద్యం

10. నైవేద్యం

మనసులో తమ అభీష్టాన్ని కోరుకుంటూ భక్తులు ఇక్కడ తాళం వేస్తారు. తమ కోర్కెలు నెరవేరినవాళ్లు నవమి రోజున అమ్మవారికి మేకను నైవేద్యంగా సమర్పిస్తారు.

pc:youtube

11. భక్తులకు అన్నదానం

11. భక్తులకు అన్నదానం

ఆ మరుసటి రోజు ఉదయం ఆలయంలో భక్తులకు అన్నదానం చేస్తారు.

pc:youtube


Please Wait while comments are loading...