Search
  • Follow NativePlanet
Share
» »ఓ మినీ కాశ్మీర్ గా పిలుబడే తపోలా అందాలు తిలకించాలంటే తహతహలాడాల్సిందే..!

ఓ మినీ కాశ్మీర్ గా పిలుబడే తపోలా అందాలు తిలకించాలంటే తహతహలాడాల్సిందే..!

చుట్టూ పచ్చదనం పరుచుకున్న కొండలు, ఆకాశంలో నుంచి జాలువారుతున్నట్టుగా జలపాతాలు, చరిత్రను కళ్లముందుంచే కోట... ఇవన్నీ మహాబలేశ్వరంలో కనిపిస్తాయి. మహాబలేశ్వరానికి ఘనమైన చరిత్రే ఉంది. ఇక్కడి ప్రదేశాలు అత్యంత రమణీయంగా, సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి వాటర్‌ఫాల్స్‌ను చూసి తరించాల్సిందే. ఇండియాలోని హిల్‌స్టేషన్‌లలో ఇది ప్రముఖమైనదిగా పేరుగాంచింది. హాలీడే స్పాట్‌గా, హానీమూన్‌ ప్లేస్‌గా మహాబలేశ్వరానికి గుర్తింపు ఉంది. మహాబలేశ్వరంకు 25కిలోమీటర్ల దూరంలో మరో అద్భుతమైన ప్రదేశం తపోలా .

తపోలా మహాబలేశ్వర్ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. ఈ ప్రదేశం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ చిన్న పట్టణాన్ని మినీ కశ్మీర్‌ అని పిలుస్తారు. మినీ కాశ్మీర్ గా కూడా పిలువబడే తపోలా ప్రకృతి అనుభవించడానికి సరైన ప్రదేశం. పచ్చని పకృతి, సెలయేళ్ళ మద్య ఎలాంటి కాలుష్యం లేని ప్రశాతమైన వాతావరణం ఇక్కడ మనకు కనబడుతుంది.

ఈ లేక్‌లో మోటర్‌ బోట్స్‌, స్పీడ్‌బోట్స్‌ నడపొచ్చు. వాటర్‌లో స్కూటర్‌రైడ్‌ చేయాలనుకునే వారికి ఇది మంచి ప్రదేశం. అడవిలో ట్రెక్కింగ్ చేయడానికి ఇది ప్రసిద్ది చెందిన ప్రదేశం. తపోలా ఫారెస్ట్ చుట్టూ కోటలు కూడా ఉన్నాయి. వాటితో పాటు మరికొన్ని చూడగ్గ ప్రదేశాలు ...

వసోతా, జయగడ్

వసోతా, జయగడ్

శివసాగర్ సరస్సు దగ్గర కొయినా అభయారణ్యం లోని హరిత వనాల లోపల నెలకొని వుంది .ఒకప్పుడు ధృడంగా వున్న వసోతా, జయగడ్ కోటలు ఇప్పుడు శిదిలావస్థకు చేరుకున్నాయి. శివసాగర్ సరస్సు దగ్గర కొయినా అభయారణ్యం లోని హరిత వనాల లోపల నెలకొని వుంది వసోతా కోట. దీన్ని శిలాహర రాజు రెండో భోజరాజు నిర్మించగా తర్వాత శివాజీ మహారాజు చేతికి వచ్చింది. ఈ కోటను పూర్వం వ్యాఘ్రగడ కోటగా పిలిచేవారు - దీన్ని మూడు ప్రధాన కోటలుగా విభజించారు - జునా వసోతా, నవీన్ వసోతా, నాగేశ్వర్. సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తున వున్న ఈ కోటకు నాలుగింట మూడు వైపులా నీరు వుంటుంది. ఈ కోటలు ఇప్పుడు ప్రమాదకరమైన స్ధలాలుగా మార్పు చెందాయి.

తోసేఘర్ జలపాతం

తోసేఘర్ జలపాతం

తోసే ఘర్ జలపాతం ప్రఖ్యాత యాత్రికుల విహార కేంద్రం. సతారా నుంచి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ ప్రాంతం వర్షాకాలం లో అందమైన దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ఇక్కడి జలపాతం చాలా రమణీయంగా వుంటుంది. ఈ ప్రదేశంలో వుండే చల్లని వాతావరణం కోసం, నీటి జల్లుల కోసం యాత్రికులు ఇక్కడికి విరివిగా వస్తారు.

PC:VikasHegde

ప్రతాప్ గడ్ ఫోర్ట్

ప్రతాప్ గడ్ ఫోర్ట్

ఈ కోట మహాబలేశ్వరానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1656లో శివాజీ దీనిని నిర్మించారు. ఇక్కడ రెండు కోటలు కనిపిస్తాయి. ఒకటి కొండపైన ఉంటే, మరొకటి కొండ కింది భాగంలో ఉంటుంది. కోటలో భవానీమాత ఆలయం, మహదేవ్‌ టెంపుల్‌, అఫ్జల్‌ఖాన్‌ సమాధి చూడొచ్చు. కొండ పైభాగం నుంచి చూస్తే కొంకణ్‌వ్యాలీ అద్భుతాలు కనువిందు చేస్తాయి. హిస్టారిక్‌ లవర్స్‌, టూరిస్టులు ప్రతిఏడాది సందర్శిస్తుంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోటను సందర్శించవచ్చు.

PC:Neeraj Rane

కాస్ పతార్

కాస్ పతార్

నిజానికి మహారాష్ట్ర లోని తపోలా లో వున్న ఆశ్చర్య పరిచే పూల లోయ.వర్షాకాలం తర్వాత ఆగస్ట్ నుంచి నవంబర్ దాకా పూల పాన్పులా వుండే ఈ విశాలమైన మైదానాన్ని సందర్శించడానికి మంచి సమయం. ఆ సమయంలో ఇక్కడ 150 కన్నా ఎక్కువ రకాల పూలు ఇక్కడ కనబడతాయి.దగ్గరలోని కాస్ సరస్సు వర్షాకాలం తర్వాతి సమయంలో తనదైన మనోహర దృశ్యాలను కలిగి వుంటుంది.

PC:Parabsachin

ఎలిఫెంట్‌ హెడ్‌పాయింట్‌

ఎలిఫెంట్‌ హెడ్‌పాయింట్‌

కొండ శిఖర భాగంలో ఏనుగు తల మాదిరిగా బయటకు వచ్చి ఉంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ ప్రదేశాన్ని చూడటానికి టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఏనుగు తల, తొండం మాదిరిగా కనిపిస్తుండటంతో దానికి ఎలిఫెంట్‌ హెడ్‌పాయింట్‌గా పేరు స్థిరపడింది. ఇక్కడి నుంచి సహ్యాద్రి పర్వత శ్రేణుల అందాలు వీక్షించవచ్చు. హిల్స్‌ అందాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు. సూర్యోదయం, సూర్యాస్తమయం అయ్యే దృశ్యాలను చూడటానికి అనేక మంది వేచి చూస్తుంటారు. ప్రకృతిని ప్రేమించే వారికి, ఫొటోగ్రాఫర్స్‌కు, ట్రావెల్‌లో మధురానుభూతులను కోరుకునే వారికి ఇది మంచి ప్లేస్‌.

PC:Rishabh Tatiraju

పంచగని

పంచగని

ప్రకృతి రమణియత తో శోభిల్లే జంట పర్యాటక కేంద్రాలు మహారాష్ట్ర లోని పంచగని, మహాబలేశ్వర్ లు. పంచగని బ్రిటీషు వారిచే కనుగొనబడిన వేసవి విడిది. ఇది సముద్రమట్టానికి 1,350 మీటర్ల ఎత్తులో ఉంది. పంచగని అంటే అయిదు కొండల ప్రాంతం అని అర్ధం. పంచగని లోయల అందాలు దేశ విదేశ పర్యాటకులకు కనువిందు చేస్తూ వారిని ఆకర్షిస్తున్నాయి.

PC:Akhilesh Dasgupta

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X