Search
  • Follow NativePlanet
Share
» »సూర్యుడి మొదటి కిరణాలు తాకిన శిఖరం !

సూర్యుడి మొదటి కిరణాలు తాకిన శిఖరం !

తవాంగ్ పట్టణప్రాంత పశ్చిమ భాగం నుండి నడుస్తున్న శిఖరం అంచుమీదకెక్కి తవాంగ్ ఆశ్రమం నుండి దానిపేరు తీసుకోబడిందని నమ్ముతారు. "త" అంటే గుర్రం అని, "వాంగ్" అంటే ఎంపిక అని అర్ధం. ప్రస్తుత ఆశ్రమ స్థలం మేరగ్ లామా లోడ్రే గ్యంత్సో పెంచుకున్న గుర్రం ద్వారా ఈ స్థలం క్రి.శ.1680-81 లలో ఎంపిక చేయబడిందని పురాణాల కధనం.

ఈ ఆశ్రమ స్థాపనకు మేర లామా లోడ్రే గ్యంత్సో సరైన ప్రదేశం కోసం ఎంత వెతికినా గుర్తించడం సాధ్యంకాలేదు, చివరకు దైవశక్తి మార్గదర్శకత్వం కోసం ప్రార్ధన చేద్దామని నిర్ణయించుకున్నాడు. ప్రార్ధన చేసిన తరువాత కళ్ళు తెరిచి చూస్తే తన గుర్రం కనిపించలేదు.అందువల్ల, అలసటతో అతను తన గుర్రాన్ని వెతకడానికి వెళ్ళగా, కొండపైన దానిని గుర్తించాడు.

అది అక్కడ మంచి శకునంగా కనిపించించి, ఆ ప్రదేశానికి తవాంగ్ గా వాడుకలోకి వచ్చింది. ప్రశాంతమైన నీటి సరస్సులు, నదులు, ఆకాశంలో నీలంరంగును ప్రతిబింబింప చేసే అనేక ఎత్తైన జలపాతాలు, కొన్నిసార్లు మేఘాలు భార౦గా తేలుతున్నట్లు సందర్శకులకు మంత్రముగ్ధుల్ని చేసే అనుభూతిని కలిగిస్తాయి. ప్రకృతిని ఆనందించాలి అనుకునే నిజమైన ప్రేమికులను ఈ రహస్య స్వర్గం స్వాగతిస్తుంది. ఇక్కడ 27 అడుగుల ఎత్తు కల బంగారు బుద్ధ విగ్రహం కలదు.

అరుణాచల్ ప్రదేశ్ హోటళ్లకు క్లిక్ చేయండి

యుద్ధ స్మారకం

యుద్ధ స్మారకం

చైనా - ఇండియా యుద్ధంలో మరణించిన భారత సైనికుల గౌరవార్ధం నిర్మించిన తవాంగ్ వార్ మెమోరియల్ ముందు దృశ్యం

ప్రవేశ ద్వారం

ప్రవేశ ద్వారం

అరుణాచల్ ప్రదేశ్ లోని సెలా పాస్ శిఖర పైభాగం లో పర్యాటకులను స్వాగతిస్తున్న తవాంగ్ ప్రవేశ ద్వారం

అతి ఎత్తైన వాహన సంచాలన మార్గం

అతి ఎత్తైన వాహన సంచాలన మార్గం

తవాంగ్ లో మంచుతో పూర్తిగా కప్పబడిన సెలా పాస్. ఇది ప్రపంచంలో అతి ఎత్తైన వాహన కదలికల మార్గం గా గుర్తించబడింది.

శోన్గా సర్ సరస్సు

శోన్గా సర్ సరస్సు

అరుణాచల్ ప్రదేశ్ లో కల అద్భుత పర్యాటక ప్రదేశం తవాంగ్ లోని అందమైన శోన్గా సర్ సరస్సు దృశ్యం

తాకట్ సంగ్ మొనాస్టరీ

తాకట్ సంగ్ మొనాస్టరీ

పైన్ వృక్షాల మధ్య ఒక కొండ పై భాగాన, ప్రశాంత వాతావరణంలో పర్యాటకులను ఆహ్వానిస్తున్నట్లు కల తాకట్ సంగ్ మొనాస్టరీ

దలైలామా జన్మ స్థలం

దలైలామా జన్మ స్థలం

తవాంగ్ లో ఆరవ దలైలామా జన్మించిన భవనం. ఈ భావనాని ఊర్జేల్లింగ్ మొనాస్టరీ అని పిలుస్తారు.

పవిత్ర బౌద్ధ మత గ్రంధాలు

పవిత్ర బౌద్ధ మత గ్రంధాలు

తవాంగ్ మొనాస్టరీ లో నేటికీ పరి రక్షించబడుతున్న పవిత్ర గ్రంధాలు

తవాంగ్ పట్టణం

తవాంగ్ పట్టణం

అరుణాచల్ ప్రదేశ లోని తవాంగ్ కొండలలో కల తవాంగ్ పట్టణ మరియు మొనాస్టరీ ల దూర దృశ్యం

బుద్ధుడి విగ్రహం

బుద్ధుడి విగ్రహం

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ మొనాస్టరీ లో కల టిబెట్ దేశీయుల దైవం ఎనిమిది మీటర్ల ఎత్తు కల సాక్యముని బుద్ధుడి విగ్రహం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X