• Follow NativePlanet
Share
» »దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి ఇది ఒక మంచి నిదర్శనం.....

దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి ఇది ఒక మంచి నిదర్శనం.....

విశ్వమంతా ఓంకారంతో నిండిపోయి వుంది, నిరాకారంగా వున్న శివుడు దేశంలోని మూలమూలలా పూజించబడుతున్నాడు. శివుడు ఒకే విధమైన ఆకారంలో లేదా వివిధ ఆకారాలలో కలిగిన స్వామి అనేక పవిత్రమైన స్థలాలలో వెలసియున్నాడు.శివుని విగ్రహం అనేకవిధాలైన వింతలను చేయటం మనం ప్రతి నిత్యం వింటూ, చూస్తూనే వున్నాం.

శివుడు తన పరిమాణాన్ని మరింత పెంచుకుని తన రంగును మార్చుకుంటాడు. కొన్ని నెలలు మాత్రమే దర్శనమివ్వటం, అనేక రూపాల్లో దర్శనములు ఇవ్వడం వంటి అనేక అద్భుతాలు మహాదేవుడు ప్రదర్శించటం చూసాం.

ప్రస్తుత వ్యాసంలో చెప్పబోతున్నది ఏమిటంటే ఈ మహిమాన్విత దేవాలయంలో శివలింగం యొక్క రంగు మారటం.దేవుడు ఉన్నాడు అనేదానికి ఇది ఒక ఉత్తమమైన ఉదాహరణ. ఈ విధంగా వివిధ రూపాలలో వుండే శివలింగాల గురించి తెలుసుకుందాం.

కోటేశ్వర శివలింగం

కోటేశ్వర శివలింగం

కొన్ని శివలింగాలు స్థల పురాణాల ప్రకారం ప్రాముఖ్యత వహిస్తాయి. చిన్న శివలింగం, పెద్ద శివలింగం. రంగుల శివలింగం, విభిన్న ఆకారాలు కలిగిన శివలింగం ఈవిధంగా అనేక రీతులలో వుంటాయి.ప్రస్తుతం అతి చిన్నదైన శివలింగం ఎక్కడ వుంది?దీని విశిష్టత ఏమిటి?అనే దాని గురించి తెలుసుకుందాం.

pc:yotube

కోటేశ్వర శివలింగం

కోటేశ్వర శివలింగం

తూర్పుగోదావరిలోని ద్రాక్షారామానికి 10 కిమీ ల దూరంలో వుండే కోటి పల్లి అనే గ్రామంలో అత్యంత చిన్నదైన శివలింగం వుంది. ఇక్కడ వెలసిన స్వామిని సోమేశ్వరుడు మరియు కోటేశ్వరుడు అని భక్తులు పిలుస్తారు.ఈ దేవాలయంలో వున్న శివలింగం యొక్క విశిష్టత ఏమంటే ఇక్కడి కోటేశ్వర శివలింగం ఎప్పుడూ నీటిలోనే వుంటుందట.

pc:yotube

భీమరామ క్షేత్రం

భీమరామ క్షేత్రం

పంచారామ క్షేత్రాల విషయానికొస్తే భీమరామ క్షేత్రంలో ఈ శివలింగం తన రంగుని మార్చుకుంటుందంట. అందులోనూ అమావాస్యరోజులో గోధుమ రంగులో, పౌర్ణమి రోజులో తెలుపురంగులో రంగులు మారుతుంది.

pc:yotube

భీమరామ క్షేత్రం

భీమరామ క్షేత్రం

అయితే స్వామికి కవచం, పుష్పాల అలంకారాలు చేయటం వలన శివలింగం రంగు సాధారణంగా కంటికి కనిపించదు. ఈ ఆశ్చర్యాన్ని చూడాలంటే అమావాస్యరోజున, పౌర్ణమి రోజున దర్శించుకుంటే మనం ఈ అద్భుతాన్ని కనులారా చూసి పునీతులవ్వొచ్చు.

pc:yotube

పరమశివుడు పార్వతి దేవి తొడమీద పవళించిన శివలింగం

పరమశివుడు పార్వతి దేవి తొడమీద పవళించిన శివలింగం

సాధారణంగా శివాలయం అంటే పరమశివుడు లింగ రూపంలో కనిపిస్తాడు. అయితే తిరుపతినుంచి చెన్నైకి వెళ్ళే మార్గంలో సురుటిపల్లి అనే వూరిలో పరమ శివుడు పార్వతీదేవి తొడమీద పవళించివున్న విభిన్నమైన శివలింగాన్ని దర్శించుకోవచ్చును.

pc:yotube

తంజావూర్

తంజావూర్

తంజావూర్ లో వున్న శివలింగం అత్యంత పెద్దదైన శివలింగం.ఈ దేవాలయం విశేషం ఏంటంటే దేవాలయం లోపలిభాగంలో ప్రతిధ్వని అనేదే లేదు. ప్రతిధ్వని రాకుండా శివలింగాన్ని దర్శించుటకు లోపలి వెళ్ళే విధంగా నిర్మించారు.

pc:yotube

తంజావూర్

తంజావూర్

ఈ దేవాలయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇదొక ప్రసిద్ధమైన దేవాలయం.అత్యంత పెద్ద శివలింగం, శివలింగానికి ఎదురుగా పెద్ద నందిని కూడా ఈ పుణ్యక్షేత్రంలో చూడవచ్చును.

pc:yotube

తలక్రిందులుగా వున్న శివలింగం

తలక్రిందులుగా వున్న శివలింగం

దేశంలోని ఎక్కడా చూడని విధంగా విభిన్నమైన శివలింగం ఏదంటే అది పశ్చిమగోదావరి జిల్లాలోని పరమేశ్వరుడు తలక్రిందులుగా వున్న శివ లింగం ఇది. అంటే ఇక్కడి స్వామి తపస్సు చేస్తున్న భంగిమలో వెలసియున్నాడు అని చెప్పవచ్చును.

pc:yotube

శ్రీ కాళ హస్తి

శ్రీ కాళ హస్తి

ఈ దేవాలయంలోని పరమశివుడు వాయురూపంలో పూజలందుకుంటున్నాడు. దేవాలయంలోని గర్భగుడిలోని కుడిభాగంలోని దీపం గాలిలో అల్లాడుతున్నట్లు కనిపిస్తుంది.ఎందుకంటే ఈ దేవాలయంలో గాలిఆడటానికి ఎటువంటి అవకాశం లేకుండానే దీపం గాలిలో తెలాడుతుండటం ఆశ్చర్యమే మరి.

pc:yotube

జంబుకేశ్వర శివలింగం

జంబుకేశ్వర శివలింగం

ఈ శివలింగం నుండి నీరు ప్రవహిస్తూ వుంటుంది. అదే విధంగా జంబుకేశ్వర శివలింగం పంచభూతాలలో ఒక్కటైన నీటిశివలింగం అని భక్తులు పూజిస్తారు.

pc:yotube

అచలేశ్వర్ మహదేవ్ ఆలయం

అచలేశ్వర్ మహదేవ్ ఆలయం

రాజస్థాన్ లోని అచలేశ్వర్ మహదేవ్ దేవాలయంలోని శివలింగం రోజుకు మూడు సార్లు రంగులు మారుతూవుంటుందంట. ప్రొద్దున సమయాలలో కుంకుమ రంగులో, రాత్రి సమయాల్లో నలుపు రంగులలో మారుతూవుంటుంది.

pc:yotube

అచలేశ్వర్ మహదేవ్ ఆలయం

అచలేశ్వర్ మహదేవ్ ఆలయం

భక్తులు ఈ మూడు సమయాలలో శివలింగాన్ని దర్శించుకుంటే వారి కోరికలన్నీ శివుడు పూర్తిచేస్తాడని నమ్ముతారు. అదే విధంగా అక్కడ వున్న భక్తులు ఉదయం నుండి రాత్రి వరకు శివలింగం యొక్క రంగులు చూచుటకు అక్కడే వేచి యుంటారంట. శాస్త్రవేత్తల ప్రకారం సూర్యకిరణాల కారణంగా శివలింగం యొక్క రంగులు మారుతూవుంటాయని చెప్పవచ్చును. అయితే రంగులు మారటానికి ఇదే ఖచ్చితమైన కారణం అని చెప్పలేము.

pc:yotube

పశుపతినాథ దేవాలయం

పశుపతినాథ దేవాలయం

ఈ పశుపతినాథ దేవాలయంలో శివుడు లింగాకారంలో లేకుండా ముఖాన్ని కలిగివున్న ప్రత్యేకమైన దేవాలయం ఇది.శివరాత్రిరోజున అనేకమంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించటానికి వస్తూవుంటారు.

pc:yotube

గుడిమల్లం

గుడిమల్లం

ఈ దేవాలయం తిరుపతికి వెళ్ళే మార్గంలో వుంది. ఇక్కడి శివలింగం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా వుంది. అదేంటంటే ఇక్కడి మహా శివుడు వేటగానివేషంలో వుండటం విశేషం.ఈ దేవాలయాన్ని 1 వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పబడింది.

pc:yotube

అమరనాథ దేవాలయం

అమరనాథ దేవాలయం

మంచుతో కూడిన శివలింగాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చును. విశేషమేమంటే ఇటువంటి శివలింగం వేరే ఏ దేశంలో కూడా చూడటానికి సాధ్యం కాదని చెప్పవచ్చును. ఇదేవిధంగా అనేకములైన విభిన్నమైన శివలింగాలను మన దేశంలో వుండటం మన భాగ్యం.ఒక్కసారి ఈ ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించండి.

pc:yotube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి