Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలో పచ్చదనంతో కూడిన పరిశుభ్రమైన 10 పచ్చని నగరాలు ఏవేవో మీకు తెలుసా ?

భారతదేశంలో పచ్చదనంతో కూడిన పరిశుభ్రమైన 10 పచ్చని నగరాలు ఏవేవో మీకు తెలుసా ?

ఈ నగరాలు ఎరుపు, నలుపు, నీలం మరియు ఆకుపచ్చ నాలుగు ప్రధాన రంగులు వర్గాలుగా వర్గీకరించబడ్డాయి. ఆకుపచ్చ వాటిలో ప్రధానమైనది.

By Venkatakarunasri

ఈ గ్రామంలో ఇక్కడ ఇంటికి, బ్యాంకులకు తలుపులు ఉండవు !ఈ గ్రామంలో ఇక్కడ ఇంటికి, బ్యాంకులకు తలుపులు ఉండవు !

ఈ నగరాలు ఎరుపు, నలుపు, నీలం మరియు ఆకుపచ్చ నాలుగు ప్రధాన రంగులు వర్గాలుగా వర్గీకరించబడ్డాయి. ఆకుపచ్చ వాటిలో ప్రధానమైనది.

భారతదేశంలోని క్లీన్ మరియు గ్రీన్ నగరాలలోని వారు చాలా ఆరోగ్యవంతంగా, పచ్చని పర్యావరణ పరిరక్షణలో జీవిస్తారని తెలుపుతుంది.

అంతేకాకుండా భారతదేశంలోని తిరువనంతపురం, రాజ్కోట్, రాయ్పూర్, మంగుళూరు, జంషెడ్పూర్ మరియు శ్రీనగర్లోని కొన్ని నగరాలు చాలా శుభ్రంగా ఉన్నాయి.

భారతదేశంలో పచ్చదనంతో కూడిన పరిశుభ్రమైన పది పచ్చని నగరాలు ఏవేవో మీకు తెలుసా ?

1. చండీగఢ్

1. చండీగఢ్

చండీగఢ్ భారతదేశంలోని మొట్టమొదటి పరిశుభ్రమైన మరియు పచ్చని నగరం.ఈ నగరం 2016లో దేశంలోనే మొట్టమొదటి "సోలార్ సిటీ" అని పేరు గాంచింది. ఇది భారతదేశంలోని ఒక నగరమే కాకుండా కేంద్ర పాలిత ప్రాంతం కూడా. పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలకు రాజధానిగా వుంది. హర్యానా, పంజాబ్ భారతదేశంలో అత్యుత్తమమైన నరాలు. చంఢీగఢ్ గురించి చెప్పాలంటే, చంఢీగఢ్ "చండీ మాత" యొక్క నివాస స్థలం. ఈ ప్రాంతం హిమాలయాలలోని శివాలిక్ పర్వత శ్రేణుల దగ్గర ఉంది.

2. మైసూర్

2. మైసూర్

భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద నగరం కూడా "ప్యాలెస్ సిటీ ఆఫ్ ఇండియా" అని పిలువబడుతుంది. కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ అత్యంత అందమైన నగరం. ఈ నగరంలో రాజభవనాలు, తోటలు, బృందావన్ గార్డెన్స్, పవిత్ర దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెందినవి. మైసూరు రాజ్యం పవిత్రమైన "చాముండి హిల్స్" వద్ద ఉంది. శక్తివంతమైన చాముండి టెంపుల్ ప్రసిద్ధమైనటువంటి మైసూర్ ప్యాలెస్ కి దగ్గరలో ఉంది. మైసూర్ నగరం కర్నాటక సాంస్కృతిక రాజధాని మరియు భారతదేశంలో మూడు అతిపెద్ద రాచరిక రాష్ట్రాలలో ఒకటి. కర్ణాటకలోని మరికొన్ని పచ్చని నగరాలు మంగళూరు మరియు బెంగుళూరు.

3. సూరత్

3. సూరత్

సూరత్ భారతదేశపు అత్యంత శక్తివంతమైన నగరం భారతదేశంలో గుజరాత్ బాగా అభివృద్ధి చెందిన వాణిజ్య నగరం. ఈ నగరం భారతదేశంలో మూడవ పవిత్రమైన మరియు పచ్చని నగరాలలో 3 వ క్లీన్ సిటీగా ఎంపికైంది. సూరత్ గుజరాత్ రాష్ట్రంలోని రెండవ పెద్ద నగరం మరియు ఆర్థిక సంపద పరంగా భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ఈ నగరం డైమండ్స్ మరియు టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రసిద్ధి చెందింది. గుజరాత్ లోని ఇతర గ్రీన్ సిటీస్ రాజ్కోట్ మరియు గాంధీనగర్.

4. న్యూఢిల్లీ

4. న్యూఢిల్లీ

రెండు చట్టబద్ధమైన పట్టణాలు: న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ మరియు ఢిల్లీ కంటోన్మెంట్ - ఢిల్లీ నేషనల్ కాపిటల్ టెరిటరీలో పచ్చని మరియు పరిశుభ్రమైన ప్రదేశంగా గుర్తించారు. ఢిల్లీ రాష్ట్రంలోని మూడు చట్టబద్దమైన పట్టణ ప్రాంతాలలో ఈ రెండు పట్టణాలు పరిశుభ్రమైనవి. ఢిల్లీ, భారతదేశం యొక్క రాజధాని మరియు ప్రపంచంలో అతిపెద్ద మరియు 2 వ అధిక జనాభా కలిగిన మెట్రోపాలిస్ మరియు ప్రపంచంలో 8 వ అత్యంత జనాభా కలిగిన మహానగరం. లక్షద్వీప్ మరియు చండీగఢ్ తరువాత అత్యధిక పచ్చదనతో కూడిన జాతీయ రాజధాని అయిన న్యూఢిల్లీ మూడవ స్థానంలో ఉంది.

 5. తిరుచిరాపల్లి

5. తిరుచిరాపల్లి

తిరుచ్చి అని పిలువబడే తిరుచిరాపల్లి తమిళనాడులో ప్రధాన ఇంజనీరింగ్ పరికరాల తయారీ కేంద్రంగా ఉంది. ఈ నగరం తమిళనాడు రాష్ట్రంలోని పచ్చని నగరం. ఈ నగరంలో అనేక చారిత్రక కట్టడాలు, ఆలయాలు వున్నాయి. తిరుచిరాపల్లి జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన రాక్ ఫోర్ట్ టెంపుల్ ఒకటి. వాటిలో ముఖ్యమైనవి తిరువానైకావల్ దేవాలయం. తిరుచిరాపల్లి పండుగలకు ప్రసిద్ధి చెందింది.
కావేరి నదిపై కల్లనై అనే ప్రపంచంలోని అతి పురాతన డ్యాం నిర్మించబడినది. తిరుచ్చిలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో కొన్ని పొంగల్, తమిళ న్యూ ఇయర్, ఆడి పెరుక్కు మరియు ప్రసిద్ధమైనటువంటి జల్లికాట్టు ఆట.

6. గౌహతి

6. గౌహతి

ఈ పచ్చని నగరం ఉత్తర-ఈశాన్య భాగంలో అతి పెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతం. మరియు ఉత్తర-ఈశాన్య భారతదేశంలో స్వర్గం యొక్క గేట్ వే అని అంటారు. గౌహతి భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. గౌహతి యొక్క ఈశాన్య ప్రాంతంలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు క్రీడలకు ప్రధాన కేంద్రంగా ఉంది. గోహతి నగరాన్ని "సిటీ ఆఫ్ ఈస్టర్న్ లైట్" అని అంటారు. తూర్పు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ​​రాక్ బాండ్స్, వన్యప్రాణుల అభయారణ్యం మరియు అనేక పురాతన హిందూ దేవాలయాలు కామాఖ్య, ఉమానంద, నవగ్రహ మరియు రుద్రేశ్వర్లకు ప్రసిద్ది చెందింది.

7. భువనేశ్వర్

7. భువనేశ్వర్

భువనేశ్వర్ ను ఇండియాలోని టెంపుల్ సిటీ అంటారు. భారతదేశంలోని పరిశుభ్రమైన నగరంలో ఇది ఒకటిగా నిలిచింది. భువనేశ్వర్ పూరి మరియు కోణార్క్ వంటి ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలు అతి పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ నగరం ఒరిస్సా రాష్ట్ర రాజధాని. ఈ నగరం శిల్పాలకు, ఒడిస్సీ డ్యాన్స్, చిల్క సరస్సు, హస్తకళలు, రాతి శిల్పాలు మరియు వన్యప్రాణులకి ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలో లోహాలు మరియు మెటల్ ప్రాసెసింగ్ పరిశ్రమలలో బూమ్ మరియు ఈశాన్య భారతదేశంలో సమాచార సాంకేతిక కేంద్రాలలో ఒకటైన భువనేశ్వర్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా పేరు గాంచింది.

8. సిమ్లా

8. సిమ్లా

సిమ్లా అందమైన హిల్ స్టేషన్ మరియు హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని నగరం. ఈ నగరాన్ని "భారతదేశం యొక్క ప్రణాళిక నగరం" అని అంటారు. 'ట్యూడోర్బెతన్' మరియు నియో-గోతిక్ నిర్మాణశైలిలో నిర్మించిన భవనాలకు ఈ నగరం బాగా ప్రసిద్ది చెందింది. భారతదేశం యొక్క పురాతన పురపాలక సంఘాలలో రుతుపవన మరియు వేసవి ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా కాంగ్రా వ్యాలీ ఒక అందమైన దృశ్యం మరియు ఇక్కడ చలికాలంలో మంచు బాగా కురుస్తుంది. సిమ్లా కొండల రాణిగా కూడా పిలువబడుతుంది. ఇక్కడ ప్రసిద్ధి పొందిన ఆలయాలు కంగ్రా జిల్లాలోని ప్రసిద్ధ జ్వాలాముఖి ఆలయం మరియు కోల్‌కాతాలోని కాళి మాత దేవాలయం. సిమ్లాలో దేవత అయిన శ్యామల దేవి వెలసియున్నందువలన దీనికి "సిమ్లా" అనే పేరు వచ్చిందని అంటారు. సిమ్లా భారతదేశంలో సుదీర్ఘ నారో గేజ్ రైల్వే మార్గాలలో కాల్కా-సిమ్లా రైల్వే ద్వారా కాల్కా నగరానికి అనుసంధానించబడి ఉంది.

9. డెహ్రాడూన్

9. డెహ్రాడూన్

డెహ్రాడూన్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రాజధాని నగరం. ఈ నగరం హిమాలయాల పర్వత శ్రేణుల వద్ద ఉంది. మరియు అందమైన డూన్ వాలీ మధ్య భారతదేశం యొక్క పవిత్ర నదులైనటువంటి గంగ మరియు యమునా మధ్య ఉంది. డెహ్రాడూన్ గర్హ్వాల్ హిమాలయాలలోని ఒక అందమైన హిల్ స్టేషన్. ఈ ప్రదేశం ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం మరియు ఎంతో అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ అందమైన లోయ, హరిద్వార్ మరియు రిషికేశ్ పవిత్ర నగరాలకు ప్రసిద్ది చెందిన విద్యా కేంద్రం మరియు చార్ ధామ్ తీర్థ యాత్రకు ప్రసిద్ధిచెందినది.

10. జైపూర్

10. జైపూర్

జైపూర్ ను భారతదేశం యొక్క "పింక్ సిటీ" అంటారు. రాయల్ స్టేట్ రాజస్థాన్ లో అత్యంత పరిశుభ్రమైన మరియు పచ్చదనం కలిగిన ఒకే ఒక్క నగరం జైపూర్. రాజస్థాన్ లోని సెమి - ఎడారి ప్రాంతంలో వున్న భారతదేశంలోని అత్యుత్తమ ప్రణాళిక నగరాలలో జైపూర్ ఒకటి. ఇక్కడ జొహరి బజార్, వస్త్రాలు, రత్నాలు, గ్రానైట్ పలకలు, చేతి మగ్గాలు, మరియు పట్టు తివాచీలు కోసం చౌరా రాస్తా వద్ద దుకాణదారులకు స్వర్గంగా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X