Search
  • Follow NativePlanet
Share
» »వినాయకుడు కాదు వినాయకి ఉన్న దేవాలయం చూశారా?

వినాయకుడు కాదు వినాయకి ఉన్న దేవాలయం చూశారా?

వినాయకి విగ్రమం ఉన్న తనుమలయాన్ దేవాలయం గురించిన కథనం.

గణపతి, లంబోధరుడు ఇలా ఎన్నో పేర్లు. ఇవన్నీ ఎవరి గురించి అంటే ఆ పరమశివుడి కుమారుడైన ఆ వినాయకుడి గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రూపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే స్త్రీ రూపంలో ఉన్న వినాయకుడి గురించి మీకు తెలుసా అని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం మనలో వందకు 90 శాతం మంది తెల్లమొహం వేస్తాం. అయితే వినాయకుడు స్త్రీ మూర్తి రూపంలో కూడా దర్శనమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక దేవాలయాలు లేకపోయినా కొన్ని దేవాలయాల్లోని రాతి గోడలు, స్తంభాల పై ఆ వినాయకి రూపం మనం చూడవచ్చు. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం...

వైద్యులకు ముచ్చెమటలు పట్టించే వ్యాధి ఇక్కడ నయమవుతోంది?వైద్యులకు ముచ్చెమటలు పట్టించే వ్యాధి ఇక్కడ నయమవుతోంది?

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

వినాయకి గురించి జన బాహుళ్యంలో పెద్దగా ప్రచారం లేకపోయినప్పటికీ పురాణాల్లో మాత్రం ఈ వినాయకి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. స్కాంద, మత్స్య, వాయు తదితర పురాణాల్లో వినాయకి గురించి మనకు అక్కడక్కడ కథనాలు వినిపిస్తాయి.

కొత్త దంపతులు ఆ కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటాకొత్త దంపతులు ఆ కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటా

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

కొన్ని కథల ప్రకారం వినాయకి తొమ్మిది మంది మాత`కల్లో ఒకరు. మరికొన్ని కథల ప్రకారం వినాయకి 64 మంది యోగినిల్లో ఒకరు. వినాయకికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన, స్పష్టమైన కథనం అంధకాసురుని వధ సందర్భంగా మనకు వినిపిస్తుంది.

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

పూర్వం అందకాసురుడనే రాక్షసరాజు ఉండేవాడు. అతను వరగర్వంతో పార్వతీ దేవిని వివాహం చేసుకోవాలనుకొంటాడు. అయితే పార్వతీదేవి తనను రక్షించమని పరమశివుడిని వేడుకొంటుంది. పరమశివుడికి అంధకాసురుడిని సంహరించే శక్తి ఉంటుంది.

ముక్కంటి ముక్కోపిగా మారిన ప్రాంతం చూశారా? ఇక్కడ నుంచి ఆకాశం చూస్తే స్వర్గ ప్రాప్తిముక్కంటి ముక్కోపిగా మారిన ప్రాంతం చూశారా? ఇక్కడ నుంచి ఆకాశం చూస్తే స్వర్గ ప్రాప్తి

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

అయితే పరమశివుడితో యుద్ధం చేసే సమయంలో ఆ అంధకాసురుడి రక్తం నేలను తాకకూడదరు. ఒక వేళ రక్తం నేల పై చిందితే ఒక్కొక్క రక్తపు బొట్టు నుంచి మరో అంధకాసురుడు పుట్టుకు వస్తాడు. దీంతో పార్వతి పరమేశ్వరులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు.

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

దీంతో పార్వతీ దేవి, పరమశివుడు సూచన మేరకు మిగిలిన దేవతల నుంచి స్త్రీ రూపం వెలుపలికి వచ్చి ఆ అంధకాసురుడి రక్తం నేల పై చిందకుండా అడ్డుపడ్డారు. ఈ క్రమంలో వినాయకుడి నుంచి వెలుపలికి వచ్చిన స్త్రీ రూపమే వినాయకి.

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

ఈ వినాయకి రూపాలు మనకు అక్కడక్కడ కనిపిస్తాయి. ముఖ్యంగా తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా శుచీంద్రం పట్టణంలో ఉన్న తనుమలయన్ ఆలయంలో ఇటువంటి విగ్రహాలను చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఒక విగ్రహం సుఖాసనంలో కూర్చొని ఉంటుంది.

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

అందులో ఈ విగ్రహానికి నాలుగు చేతులు ఉంటాయి. పై ఎడమచేతిలో గొడ్డలి, కింది ఎడమ చేతిలో శంఖువు ఉంటుంది. అలాగే కుడి వైపున పై చేతిలో కలశం, మరో చేతిలో దండం ఉంటుంది. అటు పక్కన మరో విగ్రహం నిలబడి ఉంటుంది.

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

దానికి రెండు చేతులు విరిగిపోయి ఉన్నాయి. దాదాపు 1300 ఏళ్లనాటి ఈ ఆలయంలో ఇలా వినాయకి విగ్రహాలు ఉండటం చాలా అరుదైన విషయంగా చెబుతారు. ఆలయం ఈ శాన్య దిశలో ఈ వినాయక విగ్రహాలు ఉన్నాయి.

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

ఇలా ఈ శాన్య దిశలో వినాయక విగ్రహాలు ఉండటం చాలా అరుదైన విషయం. అందువల్ల క్షుద్ర విద్యలను ఉపాశన చేసేవారు కూడా ఈ వినాయకి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారని చెబుతారు. మశ్చ్య పురాణంలో కూడా ఈ వినాయకి విగ్రహాల ప్రస్తావన మనకు కనిపిస్తుంది.

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

ఇక రాజస్థాన్ లోని రైరావ్, ఒరిస్సాలోని హీరాపూర్, మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ దగ్గర ఉన్న భారాఘాట్ వద్ద ఇటువంటి వినాయకి విగ్రహాలను మనం చూడవచ్చు. కేవలం ఇక్కడే కాకుండా క్షుద్ర దేవతల ఉపాసన జరిగే కొన్ని దేవాలయాల్లో కూడా ఈ వినాయకి విగ్రహాలు ఉన్నాయని చెబుతారు.

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

ఇక వినాయకి విగ్రహాలు ప్రధానంగా కనిపించిన శుచీంద్రంలోని ధనుమలయన్ ఆలయం ఎంతో విశిష్టమైనది. ఎంతో దూరం నుంచి ఈ ఆలయ ముఖ ద్వారాన్ని మనం చూడవచ్చు. ఈ ఆలయ గోపురం 134 అడుగుల ఎత్తు ఉంటుంది.

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

ఈ గోపురం హిందూ దేవుళ్లు, దేవతల బొమ్మలతో ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం 24 అడుగుల ఎత్తుగా, వెడల్పైన తలుపులతో ఉంటుంది. శివుడు, విష్ణువుతో సహా మొత్తం 30 మంది దేవతలకు ఉపాలయాలు ఈ దేవాలయంలో ఉన్నాయి.

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

ఇక ముఖ్యమైన గర్భగుడిలో ఒక పెద్ద శివలింగం ఉంంది. దీనికి కుడి వైపున విష్ణువు విగ్రహం కూడా మనం చూడవచ్చు. అదే విధంగా ఈ దేవాలయం లోని మంటపంలో సంగీత స్వరాలు వినిపించే రాతి స్తంభాలను కూడా మనం చూడవచ్చు.

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

అదే విధంగా ఒక వైపు పురుషాకృతి, వెనుక స్త్రీ రూపం వుండటం మరో వింత. ఇక శుచీంద్రం పట్టణానికి చేరువలో కన్యాకుమారి నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో కొలచెల్ అనే చారిత్రాత్మక ప్రదేశం కలదు. ఇక్కడ డచ్ వారికి, భారత రాజులకు మధ్య భీకర యుద్ధం జరిగింది.

వినాయకి రూపం, శుచీంద్రం

వినాయకి రూపం, శుచీంద్రం

P.C: You Tube

డచ్ సైన్యం ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టాలన్న దురుద్దేశంతో ఈ నేల మీద కాలుమోపితే మార్తాండ వర్మ, ట్రావెన్కోర్ రాజులు తీవ్రంగా ప్రతిఘటించి వారిని ఓడించారు. అదే విధంగా శుచీంద్రం చుట్టు పక్కల అనేక చూడదగిన ఎన్నో దేవాలయాలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X