» »భారత దీపకల్పములోని ఒక ప్రముఖమైన గిరిదుర్గము - గండికోట

భారత దీపకల్పములోని ఒక ప్రముఖమైన గిరిదుర్గము - గండికోట

అక్కడి ప్రాంతంలో చిన్న దొంగతనానికి కాలు, చేయి తొలగించేవారు.

రాజద్రోహానికి పాల్పడితే కళ్లు పీకేసి సూదులు చెక్కిన కర్రతో చంపేవారు.పెద్ద దొంగతనాలకు గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడదీసి చంపేవారు.

ఇంతకీ ఇంత క్రూరమైన శిక్షలు విధించిన ఆ పాలన ఎవరిది?

ఆ పాలన ఎక్కడ సాగింది?

ఇప్పుడు మనం తెలుసుకుందాం.అందరూ చెప్పుకునేది గండి కోట రహస్యం

అసలు గండి కోటలో ఏముంది? ఎందుకు అందరూ రహస్యంగా చెబుతూవుంటారు.

గండి కోట రహస్యం ఏమిటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..పూర్తి వివరాలతో

ఎక్కడ ఉంది?

ఎక్కడ ఉంది?

గండికోట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం. ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని కూడా అంటారు.

గండికోట అనే పేరు ఎలా వచ్చింది?

గండికోట అనే పేరు ఎలా వచ్చింది?

ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టమవుతున్నది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు.

వర్ణనాతీతమైన సుందర దృశ్యం

వర్ణనాతీతమైన సుందర దృశ్యం

ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవుదాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది.

రక్షణ కవచం

రక్షణ కవచం

చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచమేర్పడింది.

చరిత్ర లోకి చూస్తే

చరిత్ర లోకి చూస్తే

గండికోట భారత దీపకల్పములోని ఒక ప్రముఖమైన గిరిదుర్గము, దీని చరిత్ర 13వ శతాబ్దము యొక్క రెండవ అర్థభాగములో మొదలవుతుంది. గండికోట కైఫియత్ లో పశ్చిమ కళ్యాణీ చాళుక్య రాజైన ఆహవమల్ల సోమేశ్వర చే మలికినాడు సీమకు సంరక్షకునిగా నియమించబడిన కాకరాజు శా.1044 శుభకృతు నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి (1123 జనవరి 9) నాడు ఈ కోటను కట్టించెను అని పేర్కొనబడింది.

చారిత్రక ఆధారాలు

చారిత్రక ఆధారాలు

ఐతే ఇదినిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలూ లేవు. త్రిపురాంతకము వద్ద గల శా.1212 (1290) నాటి ఒక శాసనం ప్రకారం, అంబదేవ అనే ఒక కాయస్త నాయకుడు, తన రాజధానిని వల్లూరు నుంచి గండికోట కు మార్చాడని భావిస్తున్నారు.

శాసనం

శాసనం

ఉప్పరపల్లె దగ్గర గల శా.1236కు చెందిన ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామంతుడు ఒకరు ఈ కోటను జయించాడని, ప్రతాపరుద్రుడు జుట్టయలెంక గొంక రెడ్డిని గండికోటని పాలించడానికి నియమించాడని తెలుస్తోంది.

విజయనగర సామ్రాజ్యం

విజయనగర సామ్రాజ్యం

గండికోట విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలము (ప్రాంతము)లోని ఒక సీమకు రాజధానిగా ఉండేది.

విజయనగర రాజుల సామంతులు

విజయనగర రాజుల సామంతులు

16వ శతాబ్దపు రెండవ అర్ధభాగములో గండికోటను పెమ్మసాని నాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయుడు విజయనగర రాజుల సామంతులుగా పాలించారు.

అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా

అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా

విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనపుడు, పదిహేడవ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా కుమార తిమ్మానాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు.

3 విధాలైన గ్రామాలు

3 విధాలైన గ్రామాలు

వీరి పాలనలో గ్రామాలని మూడు విధాలుగా విభజించారు. బండారువాడ, అమర మరియు మాన్య విభాగాలుగా విభజించారు.

బ్రాహ్మణుల ఆధీనంలో

బ్రాహ్మణుల ఆధీనంలో

ఇందులో బండారువాడ గ్రామాలు చక్రవర్తుల ఆధీనంలో ఉండేవి. మాన్య గ్రామాలు దేవాలయాల , బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి.

అబ్బురపరిచే కమనీయ దృశ్యాలు

అబ్బురపరిచే కమనీయ దృశ్యాలు

అమర గ్రామాలు అమరులైన కోట అధ్యక్షుల ఆధీనంలో ఉండేవి.అందమైన లోయలు, ఎటు చూసినా అబ్బురపరిచే కమనీయ దృశ్యాలే ఇక్కడ కన్పిస్తాయి.

ఘన చరిత్ర

ఘన చరిత్ర

ఎంతో ఘన చరిత్ర ఈ కోట సొంతం. ఎందరో రాజులు, రాజవంశాల పరాక్రమానికి, నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులకు ఇది నిలువుటద్దం.

గిరి దుర్గం

గిరి దుర్గం

ఈ కోటను సందర్శిస్తే ఆనాటి రాజుల పౌరుషాలు, యుద్ధాలు, నాటి రాజుల పరిపాలన గుర్తుకు వస్తుంది. జమ్మలమడుగు నుంచి 14 కి.మీ. దూరంలో పెన్నా ఒడ్డున వెలసిన గండికోట ఉన్న ప్రాంతాన్ని గిరి దుర్గం అని పిలిచేవారు.

గండికోట కైఫియత్‌

గండికోట కైఫియత్‌

క్రీ.శ. 1123లో ఈ కోటను మొదటి సోమేశ్వర మహారాజుకు సామంతరాజుగా ఉన్న కాకరాజు నిర్మించినట్టు ‘గండికోట కైఫియత్‌' తెలుపుతోంది.

21 దేవాలయాలు

21 దేవాలయాలు

దీని పరిసర ప్రాంతాల్లో 21 దేవాలయాలున్నాయి. పడమర, ఉత్తర దిక్కుల్లో పెన్నానది ప్రవహిస్తోంది. కోట నుంచి చూస్తే దాదాపు 300 అడుగుల లోతులో 250 అడుగుల వెడల్పుతో పెన్నానది కన్పిస్తుండడం విశేషం.

కౄరమైన శిక్షలు

కౄరమైన శిక్షలు

ఎలాంటి నేరాలకైనా కౄరమైన శిక్షలు ఉండేవి. చిన్న దొంగతనానికి కాలు, చేయి తొలగించేవారు. రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రతో చంపేసేవారు. పెద్ద దొంగతనాలకు గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడదీసి చంపేసేవారు.ఇలాంటి ఘోరమైన శిక్షలుండేవట గండికోట రాజ్యంలో.

 గండికోట లోయ

గండికోట లోయ

గండికోట ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. ఎర్రటి గ్రానైట్ శిలలు, లోయలో నదీ ప్రవాహం, పక్షుల సవ్వడులు లోయ యొక్క అదనపు ఆకర్షణలు.

గండికోట కోట

గండికోట కోట

వృత్తాకారంలో ఉండే గండికోట కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవుదాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది.

చూడదగిన ప్రదేశాలు

చూడదగిన ప్రదేశాలు

గండికోటలోని మాధవరాయ ఆలయం.

ప్రస్తుతము ఇది శిధిలమైపోయింది

రంగనాథాలయం

రంగనాథాలయం

ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన శా.1479 (క్రీ.శ.1557) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోట లోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది.

రంగనాథాలయం

రంగనాథాలయం

ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమౌతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహైదవ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు.

మాధవరాయ ఆలయం

మాధవరాయ ఆలయం

ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ.పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయనిర్మాణశైలిని బట్టి చూసినా ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు తోస్తుంది.

మాధవరాయ ఆలయం

మాధవరాయ ఆలయం

ఆలయనిర్మాణాన్నీ, అందలి శిల్పకళారీతుల్నీ, వాటి లక్షణాలనూ విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో(దాదాపుగా 1501-1525 మధ్యకాలంలో) నిర్మించినట్లు చెప్పవచ్చు.

జామా మసీదు

జామా మసీదు

మీర్ జుమ్లా గండికోట లో జామా మసీదును సుందరంగా నిర్మించాడు. ప్రాచీన శైవక్షేత్రం అయిన కన్య తీర్థం, ఆరవ శతాబ్దం నాటి దానవులపాడు, గురప్పనికోన, అగస్తీశ్వర కోన, పీర్ గైబుసాకొండ చూడదగినవి. గండికోట లో వసతికై హరిత రిసార్ట్ కలదు.

కోట లోని ఇతర ఆకర్షణలు

కోట లోని ఇతర ఆకర్షణలు

కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. ఇంతే గాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి.

కోట లోని ఇతర ఆకర్షణలు

కోట లోని ఇతర ఆకర్షణలు

నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత.

కత్తులకోనేరు

కత్తులకోనేరు

గండికోట లో కత్తుల కోనేరును పర్యాటకులు తప్పక వీక్షించాలి. పూర్వం యుద్ధం ముగిసిన తరువాత కత్తులను ఈ కోనేరులోనే కడిగేవారట. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇప్పటికీ నీరు ఎరుపు రంగులోనే ఉండటం విశేషం

ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చినది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి.

రైలు మార్గం

రైలు మార్గం

గండికోటకు 15 కిలోమీటర్ల దూరంలో జమ్మల మడుగు రైల్వే స్టేషన్ కలదు.

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం

హైదరాబాద్ నుండి సొంత వాహనం మీద వచ్చేవారు ఎన్ హెచ్ 7 మీదుగా కర్నూల్ చేరుకొని, అక్కడి నుండి బనగానపల్లె -->కోవెలకుంట్ల --> జమ్మలమడుగు -->గండికోట చేరుకోవచ్చు.